Chanti
-
చంటి సినిమా నటి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా?
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ కలల ప్రపంచం. ఇందులో గుర్తింపు రావడమంటే ఆషామాషీ కాదు. కొందరికీ స్టార్డమ్ వచ్చినా అది ఎక్కువకాలం నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాములాంటిదే. అలా కొందరు నటీమణులు వెండితెరపై కనిపించి కనుమరుగవడం చూస్తుంటాం. వారు చేసింది కొంతకాలమే అయినా.. వారి నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుజా రెడ్డి . తెలుగమ్మాయి అయినప్పటికీ.. మలయాళం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మాతృభాషతో పాటు ఇతర భాషల్లో నటిగా, హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో) అనూజ రెడ్డి అంటే ఇప్పటి వారికి చాలామందికి పరిచయం లేకపోవచ్చు. ఆమెను ప్రస్తుతం సినీ ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ 1980లో హీరోయిన్గా, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. బ్రహ్మానందం-అనూజ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లకు చాలా క్రేజ్ ఉంది. చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తనదై నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనూజ రెడ్డి 2004 వరకు ఆమె సినిమాల్లో నటించారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఇప్పుడేం చేస్తోంది. ఎలా ఉందో తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో జన్మించిన అనూజ రెడ్డి 14 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమెకు మూడేళ్ల వయసులోనే వారి కుటుంబం చెన్నైలోని కోడంబాక్కంలో సెటిలైంది. ఓ సినిమా కోసం తెలుగు అమ్మాయి కోసం అనూజ రెడ్డి ఉండే ఏరియాకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఓ మలయాళ సినిమాకు సెలెక్ట్ అయింది. చిన్న వయసులో తనకు సినిమాలు చేయటం ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పారట. (ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి) అయినప్పటికీ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావటంతో తప్పలేదని తెలిపింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అనూజ కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. అప్పట్లో సినిమాల్లో కామెడీతో అందరినీ నవ్వించిన అనూజ రెడ్డిని ఇప్పుడు చూస్తి ఇంతలా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
అన్నప్రాసన పార్టీ అడిగి.. క్యారీ బ్యాగ్‌తో ముఖానికి ముసుగు వేసి..
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్: పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన ఓ వ్యక్తిని హతమార్చి కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చోరీ ముఠాలో సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన జంగం చంటి (28), గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాయపాటి వెంకన్న, తుమ్మా సుబ్రహ్మణ్యం, షేక్ సుభాని అలియాస్ సిద్ధు, ముత్యాల నవీన్, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ నాగుల్ మీరా అలియాస్ బిల్లాతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో గతేడాది కేరళలో దొంగతనం చేసిన ఈ ముఠా సభ్యులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు అపహరించారు. దీనిలో కొంత బంగారం విక్రయించేందుకు జంగం చంటికి ఇవ్వగా, విక్రయించిన మొత్తాన్ని తిరిగి ముఠా సభ్యులకు చెల్లించకపోవటంతో వీరి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో చంటిని హతమార్చేందుకు పథకం రచించిన రాయపాటి వెంకన్న, ఇతర ముఠా సభ్యులు గత ఏడాది నవంబర్ 16వ తేదీన నమ్మకంగా అతనిని ఇంటి నుంచి తీసుకువెళ్లారు. అదే రోజు చంటి కుమారుడి అన్నప్రాసన కావటంతో పార్టీ ఇవ్వమని కోరటంతో మిత్రులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత విజయవాడలోని ఓ హోటల్లో రూం తీసుకుని చంటిని ఇతర ముఠా సభ్యులు చితకబాదారు. అనంతరం కారులో ఎక్కించుకుని క్యారీ బ్యాగ్‌తో ముఖానికి ముసుగు వేసి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని పూడ్చివేసేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ జాతీయ రహాదారి పక్కన బొమ్ములూరులో శ్మశాన వాటిక కనిపించటంతో అక్కడ రాత్రి వేళలో పూడ్చిపెట్టి పరారయ్యారు. జంగం చంటి కనిపించటం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వ్యక్తి అదృశ్యం కేసు నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. చదవండి: (పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. భార్యపై అనుమానంతో...) పోలీసుల విచారణలో భాగంగా చంటిని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లిన తోటి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించటంతో క్రమంగా వాస్తవాలు బయటకు వచ్చాయి. జంగం చంటిని హత్యచేసి బాపులపాడు మండలం బొమ్ములూరులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పటంతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, చిలకలూరిపేట సీఐ వై.అచ్చయ్య సోమవారం సంఘటనాస్థలికి చేరుకున్నారు. బాపులపాడు తహసీల్దార్ టి.మల్లికార్జునరావు, హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ టి.సూర్య శ్రీనివాస్ సమక్షంలో సమాధిని తవ్వి జంగం చంటి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. మృతుని సోదరుడు జంగం బాజీ, ఇతర కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి, కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు. -
కర్రసాము: ‘చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుంది’
సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఎవరైనా జీవనోపాధి కోసం వృత్తిని, ఆత్మసంతృప్తి కోసం ప్రవృత్తిని ఎంచుకోవడం సహజం. అయితే, ప్రవృత్తినే ప్రధాన వృత్తిగా చేసుకుని ఆ రంగంలో రాణించడం కొందరికే సాధ్యపడుతుంది. అటువంటి కోవలోకే వస్తాడు ఖరీదు సాంబయ్య అలియాస్ చంటి. మరుగున పడిపోతున్న మన సంప్రదాయ కళ కర్రసాము (సిలంబం)లో అనేక విన్యాసాలు చేయడంతోపాటు జాతీయ పోటీల్లో ప్రతిభకనబరిచాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు సైతం ఎంపికయ్యాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన చంటికి నిత్యం ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నా సాధన, శిక్షణ మాత్రం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటాయి. సాధనతో పట్టు గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం చంటి స్వగ్రామం. అయితే, జీవనోపాధిని వెదుక్కుంటూ భార్యతోపాటు ఇద్దరు ఆడపిల్లలు చాలా కాలం కిందట గుంటూరుకు మకాం మార్చాడు. కర్రసాము సాధన చేస్తూనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉన్నదాంట్లోనే జీవించేవాడు. అయితే, పెరుగుతున్న సంసారం, చాలని సంపాదన, మరో పక్క ప్రాణంగా ప్రేమించే కర్రసాము.. అన్నిటికి న్యాయం చేయడం కష్టంగానే ఉండేది. భార్య సలహా తీసుకుని పూర్తిగా కర్రసాము పైనే దృష్టి సారించి తక్కువ సమయంలోనే దానిపై పట్టు సాధించాడు. చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుందని ఆయన అభిమానులంటారు. పోటీల్లో పాల్గొంటూ పేద పిల్లలకు గ్రామ గ్రామాలు తిరిగి ఉచితంగా కర్రసామును నేర్పిస్తుంటాడు. కొన్ని పాఠశాలల్లో పార్ట్‌టైమ్ శిక్షణనిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చంటి మాత్రమే కాదు ఆయన శిష్యులు కూడా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్నారు. (చదవండి: సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!) చంటి సాధించిన విజయాలివి ► ఈ ఏడాది నవంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం ► నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ అసోసియేషన్ మేజర్ ధ్యాన్‌చంద్ సర్టిఫికెట్, యూనివర్సల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్ బహూకరణ ► కర్నూలులో జరిగిన ఏపీ కర్రసాము పోటీలో కాంస్య పతకం ► ఈ నెలలో కృష్ణాజిల్లాలో జరిగిన స్టేట్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం, ట్రైనింగ్ సర్టిఫికెట్ బహూకరణ ► గోవాలో జరిగిన జాతీయ పోటీల్లో చంటికి 21.7 పాయింట్లు సాధించి బంగారు పతకం గెలుపొందినా అక్కడ స్థానిక రాజకీయాలతో ఐదో స్థానం స్థానం ఇచ్చారు.తర్వాత తప్పు తెలుసుకున్న అసోసియేషన్ సభ్యులు ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసి గౌరవించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో కర్నూలులో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) కర్రసాము ప్రాణం నాకు కర్రసామంటే ప్రాణం. దాన్నే జీవనోపాధిగా చేసుకున్నాను. మన దేశ ప్రాచీన క్రీడల్లో కర్రసాముకు ప్రత్యేక స్థానముంది. దీనిని యువతరం తప్పకుండా నేర్చుకోవాలి. ముఖ్యంగా యువతులకు ఆత్మరక్షణతోపాటు మనోధైర్యం వస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ముందుకెళుతున్నా. దాతలు సహకరిస్తే అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొంటా. కర్రసామును జీవనోపాదిగా చేసుకోవడాన్ని అదృష్టంగా బావిస్తాను. నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది – చంటి -
తాగి వాహనాలు నడిపితే..
శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ముఖ్య పాత్రలు చేస్తున్న చిత్రం ‘రా’. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని ‘రా’ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ‘రా’ సినిమాలో కంటెంట్ హారర్ కామెడీ, లవ్‌స్టోరీ ఉందని అర్థమవుతోంది. రాజ్ డొక్కర దర్శకత్వం వహిస్తూ, సినిమాని నిర్మించటం గ్రేట్ ’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇంట్రవెల్లో తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఉంటు ంది. 2 పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. -
చంటి పెసరట్టు
భోజనాలు పెట్టే అరిటాకుల్లో టిఫిన్ పెడతాడు చంటి. రెండు ఇడ్లీలు అని అడిగితే, ఇవి కూడా ఒకసారి తిని చూడండి సర్ అని రెండు ఇడ్లీలు, రెండు పెసరట్లు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, నల్లకారం పొడి, పచ్చడిలో నెయ్యి వేసి ఇస్తారు. ఇడ్లీల మీద వేసుకోవడానికి చిన్న గిన్నెలో నెయ్యి విడిగా ఇస్తారు. ఇడ్లీల మీద చెర్రీ పండుని గుచ్చిన టూత్ పిక్, పక్కనే నిమ్మకాయముక్క ఇస్తారు చంటి. ఇంతా చేసి రెండు ఇడ్లీలు, రెండు పెసరట్లు, నెయ్యి, పచ్చళ్లు, కార ప్పొడి, అంతటి అరిటాకు అంతా కలిసి 30 రూపాయలే. చంటి ఆత్మీయ వడ్డనకు మాత్రం వెలకట్టలేం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో ‘కానూరు’ ఒక మారుమూల పల్లె. నిడదవోలు నరసాపురం ఆర్ అండ్ బి రహదారి మీదుగా ఉంది కానూరు. ఊరి మొదట్లో కొండాలమ్మ అమ్మవారి ఆలయం... ఆ ఆలయం సమీపిస్తుంటే, గుడి గంటల గణగణలతో పాటు, పెసరట్ల ఘుమఘుమలు ప్రయాణికులను ఆకర్షిస్తాయి. పచ్చటి పొలాల సమీపంలో నిత్యం రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతం. అది స్టార్ హోటల్ కాదు. అతి చిన్న కాకా హోటల్. అందరూ ముద్దుగా ‘చంటిహోటల్’ అని పిలుచుకుంటారు. కానూరు చంటిహోటల్లో టిఫిన్ తిన్నాక టీ, కాఫీలు తాగడం మరచిపోకండి.... అని ప్రత్యేకంగా చెబుతారు. ఉన్న ఊళ్లోనే హోటల్ పెట్టుకుని నాణ్యమైన టిఫిన్స్ చేసి అందిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. వ్యాపారం చేయాలంటే కస్టమర్స్ అభిమానం పొందాలని తెలిసిన చంటి కస్టమర్స్‌ని గౌరవిస్తూ హోటల్ పెట్టిన కొద్దిరోజుల్లోనే చంటి హోటల్లో టిఫిన్స్ బావుంటాయి అనే నమ్మకం కలిగించారు. 1967 ప్రాంతంలో సాదా తాతారావు కుటుంబం కానూరులో పేదరికంతో ఉండేది. పొట్ట నింపుకోవడం కోసం కానూరులోనే చిన్న కాఫీ హోటల్ ప్రారంభించారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ‘బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని, ఒక్కోసారి గుడి దగ్గర ఉండే కొబ్బరి చెక్కలను తిని బతికిన రోజులు కూడా ఉన్నాయని, నెమ్మదిగా నిలదొక్కుకుని తన తండ్రి రెండు ఎకరాల పొలం కొన్నారని, నాన్నగారు కాలం చేశాక, ఊరి శివారులో చంటి హోటల్ ప్రారంభించాన ’ని చెబుతారు రెండో అబ్బాయి సూర్యారావు ఉరఫ్ చంటి. చిన్న పెసరట్టు... ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ హోటల్ పనిచేస్తుంది. ‘‘మొదట్లో పెద్ద పెసరట్టు వేసేవాడిని. కాని రుచిగా అనిపించలేదు. చిన్న పెసరట్టు వేసి, పైన ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కమ్మని నేతితో వేస్తే బాగా నచ్చింది. అప్పటి నుంచి చిన్న పెసరట్లు వేయడం ప్రారంభించాను’’ అంటారు చంటి. కారప్పొడితో పాటు నాలుగురకాల చట్నీలు జత చేసి, అరటి ఆకులలో మాత్రమే వడ్డిస్తారు. ‘వేడి వేడి పెసరట్లు అరటి ఆకు మీద పడగానే, అరటి ఆకు నుంచి కమ్మటి వాసన బయటకు వస్తుంది. ఆ రుచి కోసం అందరూ ఎగబడతారు. ఇక వండి వడ్డించడంలో, సర్వీస్ అందించడంలో గోదావరి వారికి ఉన్న పేరు తెలిసిందేగా’ అంటున్న చంటి, స్వయంగా పెసరట్లు తయారు వేస్తారు. ఎవ్వరినీ వెయ్యనివ్వరు. ప్రముఖులు రుచి చూశారు... కానూరుకి సమీపంలో ఉన్న చాగల్లుకి చెందిన ప్రముఖ సినీ దర్శకులు వి. వి. వినాయక్‌కి ఈ పెసరట్టు అంటే ప్రీతని, అటు వచ్చినప్పుడు తప్పనిసరిగా పెసరట్టు రుచి చూసి వెళ్తారని, అటుగా వెళ్లే ప్రతి రాజకీయనాయకుడు తప్పనిసరిగా పార్సిల్ తెప్పించుకుంటారని సంతోషంగా చెబుతారు చంటి. పువ్వుల్లో కాఫీ... కాఫీ, టీలు ప్రత్యేకంగా అందిస్తారు. అల్లం టీ, మిరియాల టీ, ఏలకుల టీలతో పాటు కొత్తరకమైన కాఫీని కనిపెట్టారు చంటి. కాఫీని అటు ఇటు గ్లాసులతో తిరగబోశాక, పైన వచ్చిన నురుగు మీద బూస్ట్ వేసి నిండుగా గులాబీ రేకులు చల్లిన ఒక ప్లేటు మధ్యలో గ్లాసు ఉంచి అందిస్తారు. ఇక్కడి కాఫీ, టీ, టిఫిన్లు రుచి చూడటానికి దూరాల నుంచి కూడా వస్తుంటారు. ‘రాజమండ్రి నుంచి ప్రతి వారం స్టూడెంట్స్ గ్రూప్‌గా వచ్చి, çకడుపు నిండా తినేసి లెక్క పెట్టకుండా రెండు లేదా మూడు వేలు ఇచ్చి వెళ్లిపోతార’ని ఎంతో సంతోషంగా చెబుతారు చంటి. తండ్రి దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల క్రితం సొంతంగా ప్రారంభించి, అందరి అభిమానం పొందుతూ, విజయవంతంగా నడుపుతున్నారు చంటి హోటల్ని. పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఎంతో దూరాల నుంచి తన పెసరట్టు కోసం వస్తున్న కస్టమర్లను దేవుళ్లుగా భావిస్తూ, ప్రేమతో కలిపిన పెసరట్లను అందిస్తున్నారు చంటి. కానూరుకి చెందిన చంటి హోటల్ అతిథ్యానికి మారుపేరు అనే పేరు తెచ్చుకుంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ – ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, సాక్షి, పెరవలి మండలం -
రామానుజుని శిష్యరికంలో గోవిందుడు
శ్రీశైల పూర్ణులు ముందే వెళ్లి, ఎదురువచ్చి రామానుజుడికి మర్యాదలతో స్వాగతం చెప్పారు. ఈ వయసులో ఆయన ఉరుకులు పరుగులతో పనులు చేస్తూ ఉంటే అయ్యా ఈ వయసులో ఇంత శ్రమా? ఎవరైనా మీకన్న చిన్నవాడిని యువకులను పంపవచ్చుగదా అంటే ‘‘మొత్తం ఈ తిరుమలలో నాకన్న చిన్నవాడెవరూ నాకు కనిపించలేదయ్యా’’ అన్నారట. శ్రీశైలపూర్ణుల వినయం అది. వారు తెచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ముందుకు నడిచి మాడవీధులలో ప్రదక్షిణగా వెళ్లి, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, పుష్కరిణి తీర్థం స్వీకరించి అక్కడ చింతచెట్టును చుట్టి, పుష్కరిణీ తీరంలో ఉన్న శ్రీ వరాహ స్వామిని సేవించుకున్నారు. మహాద్వారం గుండా కలియుగ వైకుంఠమైన ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం, బలిపీఠం దగ్గర సాగిల పడి, వంటశాల, యాగశాల పరిశీలించి, తిరుమామణి మండపంలో తిరిగి, విష్వక్సేనుడిని సేవించుకుని యోగనరసింహస్వామిని దర్శించుకుని, దేదీప్యమానంగా ఆకాశంలో నిలబడి ఉన్న ఆనందనిలయ విమానాన్ని చూసి నమస్కరించి గర్భాలయంలో ప్రవేశించి, గరుడునికి మొక్కి, జయవిజయుల మధ్య నుంచి శ్రీనివాసుని చూస్తూ కులశేఖర పడి దాటిన రామానుజుడు ఆ దివ్యమంగళ రూపుని తన్మయుడై చూస్తూ ఆనంద పరవశుడై ‘శ్రీ శ్రీనివాస చరణౌ శరణం ప్రపద్యే’ అన్నారు. చేతులు కట్టుకుని స్వామి దివ్య తిరుముఖ మండలాన్ని సేవిస్తూ కాసేపు నిలిచిపోయారు. మంగళం పాడారు. స్థానాచార్యులు తీర్థం, శఠారి ఇచ్చారు. వేంకటేశ్వరస్వామివారి తిరుమంజనసేవ (అభిషేకం) చేసుకున్నారాయన. ‘‘ఆహా ఇది సాక్షాత్తూ వైకుంఠమే, సందేహం లేదు. ఇది నిత్యసూరులకు నిత్య నివాసమే. ఇది పరమ పావన క్షేత్రం. ఇది నా వలన అపవిత్రం కారాదు అనుకున్నారు’’. శ్రీశైలపూర్ణుల వారు కనీసం మూడురోజులు నిద్ర చేయాలని సూచించారు. సరేనన్నారు. మూడురోజులు ఉండి మూడోరోజున కూడా స్వామిని దర్శించారు. తిరుమలేశుని అనుమతిని, శ్రీశైలపూర్ణుల అనుమతిని తీసుకొని కిందికి బయలుదేరారు. తిరుపతిలో రామానుజుడు శ్రీశైలపూర్ణుల ఇంటిలోనే ఒక ఏడాది పాటు ఉన్నారు. గోవింద రాజులు కోవెలలో శ్రీశైలపూర్ణుల శ్రీమద్రామాయణ ప్రసంగాలను విన్నారు. శ్రీ రామాయణం సంపూర్ణంగా శ్రీశైల పూర్ణుల నుంచి ఏడాది పాటు నేర్చుకున్నారు. రామానుజాచార్యులకు అనువైన శిష్యుడిగా గోవిందుడు దొరికింది ఇక్కడే. గోవిందుడిని విశిష్టాద్వైతంలోకి మళ్లించి తీసుకువచ్చింది శ్రీశైల పూర్ణులే. వచ్చినప్పటి నుంచి గోవిందుని రామానుజులు గమనిస్తున్నారు. ఒకసారి శ్రీశైలపూర్ణుల శయ్యను సరిచేస్తున్నాడు. కాసేపటి తరువాత శయ్యమీద పడి దొర్లాడు. ‘‘గోవిందా ఏమిటిది..’’ అంటున్న రామానుజుని చూసి లేచి నిలబడ్డాడు. ‘‘నేను శయ్యసరిగా ఉందా లేదా అని చూసానంతే. ఒకవేళ ఎక్కడైనా ముడతలు పడితే గురువుగారు నొచ్చుకుంటారు. నిద్రాభంగమవుతుంది కదా. సరిచూడటం నా బాధ్యత అనుకున్నాను’’ అన్నాడు గోవిందుడు. మరో సందర్భంలో గోవిందుడు ఒక పామును పట్టుకుని దాని నోట్లో వేలు పెడుతున్నాడు. ఈ వింత చర్య చూసి ఆశ్చర్యపోయాడు. పాము మీదే దృష్టి అంతా. పాము నోట్లోనుంచి ఒక ముల్లు పీకి బయట పడేశాడు. ‘‘పాముతో ఆడుకుంటున్నావా’’ అని అడిగారు రామానుజుడు. ‘‘కాదు ఆచార్యా, పాపం దాని నోట్లో ముల్లు ఇరుక్కుని బాధపడుతున్నది. ఏదీ తినలేదు, నోరు మూయలేదు. ముల్లు తీయడం తప్ప మరో మార్గం లేదు... కనుక ఈ సాహసం చేశాను’’ అన్నాడు గోవిందుడు. ‘‘మరి అది పాము కదా... కాటేస్తే...’’ అన్నారు రామానుజులు. వేయలేదు కదా స్వామీ అని గోవిందుడి జవాబు. గోవిందుని గురుభక్తి, మంచి మనసు, అన్ని జీవుల పట్ల అనురాగం, భూత దయ అర్థమయింది. గోవిందుడిని తనతో పంపమని శ్రీశైల పూర్ణులను అభ్యర్థించారు. ఆయన వెంటనే అంగీకరించాడు. రామానుజునితో వెళ్లాలని, రామానుజుని ప్రియమైన శిష్యుడిగా మెలగాలని, ఆయనకు నిత్యం సేవలు చేసి మంచి శిష్యుడనిపించుకోవాలని బోధించి పంపించారు. గోవిందుడు రామానుజుని వెంటవెళ్లాడు గాని అతని మనసంతా శ్రీశైల పూర్ణుని మీదే ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలించలేదు. ఆకలి, నిద్రలేవు. ఇదంతా గమనించిన రామానుజుడు శ్రీశైలపూర్ణులు దూరం కావడం వల్లనే గోవిందుడు బాధపడుతున్నాడని, గురువును విడిచి ఉండలేని శిష్యుడని అర్థం చేసుకున్నారు. ఆచార్యుల వారి దగ్గరకు పంపడం ఒక్కటే మార్గమని నిర్ణయించి, కొందరిని తోడు ఇచ్చి తిరుపతికి తిరిగి పంపించారు. వారు వెళ్లి గోవిందుని పరిస్థితి వివరించారు. శ్రీశైలపూర్ణులు ‘‘ఒక ఆచార్యుడికి నిన్ను సమర్పించిన తరువాత తిరిగి వెనక్కి తీసుకోవడం తగనిపని. ఇప్పుడు నీవు ఆతని సొత్తువు నాయనా. నేను నిన్ను మళ్లీ స్వీకరించలేను. నీకు ఆచార్యభక్తి ఎక్కువ కనుకనే నిన్ను నేను ఆయనకు అప్పగించాను. నీవు నన్ను సేవించినట్టే శ్రీమద్రామానుజుడిని సేవించు గోవిందా. ఇది నీ భాగ్యం అని అర్థం చేసుకో. నీవు రామానుజులవారి వెంట ఉండి సేవిస్తే , ఆ ప్రతిసేవా నాకు అందుతుందని తెలుసుకో. నాకన్న రామానుజుడికి నీవంటి మంచి శిష్యుల అవసరం ఉంది. ఆయన జగద్గురువు. ఆయనను రక్షించుకునే బాధ్యత మనందరి మీదా ఉంది. కనుకనే నిన్ను ఆయనకిచ్చి పంపుతున్నాను. బాధపడకు. మనసు నిర్మలం చేసుకో. వెళ్లు. నీకు గురువైనా దేవుడైనా నేనైనా రామానుజుడే’’ అని బోధించారు. గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, కన్నీళ్లతో కాళ్లు కడిగి, గురువుగారి కుటుంబంలో ఒక్కొక్కరిని కళ్లారా చూసి. నమస్కరించి, సెలవు తీసుకుని గోవిందుడు మనసు రాయిచేసుకుని బయలుదేరాడు. గురువుగారి మాటలు మనసులో నాటుకున్నాయి. తనకు ఇక శ్రీశైల పూర్ణుడైనా రామానుజుడైనా ఒకరే. రామానుజుడిలోనే శ్రీశైలపూర్ణుల వారిని చూసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. గోవిందుడు మళ్లీ తన దగ్గరికే రావడం చూసి రామానుజులు ఆశ్చర్యపోయారు. జరిగింది తెలుసుకున్నారు. గురువుగారి ఉపదేశం విన్నారు. మౌనంగా తన పాదాలకు నమస్కరిస్తున్న గోవిందుడిని చూశారు. శ్రీశైల పూర్ణుడి ధర్మనిరతి, తనపై ఆయనకున్న ఆప్యాయత తలుచుకుని ఆయనకు నమస్కరించారు. గురువు ఆజ్ఞను మీరకుండా గోవిందుడు రామానుజుని సేవించసాగాడు. క్రమంగా స్వస్థత చెందాడు. గురువుకు ఏ అసౌకర్యమూ కలగకుండా చూసుకుంటూ రామానుజుని ప్రేమానురాగాలను గోవిందుడు సాధించాడు. శ్రీభాష్యం రచన– రామానుజ జైత్ర యాత్ర యామునాచార్యుల వారికిచ్చిన తొలి వాగ్దానం బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరమైన శ్రీభాష్యరచన. అందుకోసం కావలసినది బోధాయన వృత్తి. బాదరాయణ రుషి రచించిన రెండు లక్షల శ్లోకాల గ్రంథానికి సంక్షిప్తరూపమైన 25 వేల శ్లోకాల పుస్తకం కాశ్మీరంలోని శ్రీనగరంలో సరస్వతీ భాండాగారంలో ఉంది. కాశ్మీరానికి వెళ్లవలసిందే. మఠాన్ని నిర్వహించే బాధ్యత కొందరు శిష్యులకు అప్పగించి, శ్రీరంగనాథుడికి ప్రణమిల్లి పెరుమాళ్ అనుమతి తీసుకుని కురేశుడి (ఆళ్వన్, శ్రీవత్స పేర్లు కూడా ఆయనవే) వరద విష్ణు ఆచార్య, ఎంబార్ వంటి ప్రధాన శిష్యులతో కలసి మూడునెలల పాటు కాలినడకన ప్రయాణించి కాశ్మీరం చేరుకున్నారు. దారిలో అనేక నగరాలలో పండితులతో చర్చా సమరంలో పాల్గొన్నారు. తర్కంతో అందరినీ జయించారు. వాదనలో ఉద్దండులే అయినా సత్యశోధన శూన్యం కావడం, పాండిత్యంతోపాటు మూఢత్వం కూడా ఉండటం వారి పరాజయానికి కారణాలు. రామానుజుడు సత్యం వైపు వారి దృష్టిని మళ్లించారు. అక్కడి రాజాస్థాన పండితులతో వాదించి వారిని జయించారు. రాజు కూడా రామానుజుని ప్రతిభావిశేషాలను విజ్ఞానవిశేష వాదనా పటిమను చూసి ముగ్ధుడైనాడు. ‘‘మహారాజా, నేను నా గురువైన యామునాచార్యుల ఆజ్ఞ మేరకు బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని రచించేందుకు సంకల్పించాను. ఇదివరలో బోధాయనుడనే పండితుడు దానిపై వృత్తి గ్రంథాన్ని రచించినారు. అది మీ సరస్వతీ భాండాగారంలో ఉంది. మాకు ఆ ‘బోధాయన వృత్తి’ గ్రంథం చాలా అవసరం. మేం కొంతకాలం అధ్యయనం చేసిన తరువాత మీకు తిరిగి ఇవ్వగలం, దయచేసి ఆ పవిత్ర గ్రంథాన్ని కొద్ది రోజుల కోసం మాకు ఇవ్వవలసిందని అభ్యర్థన’’ అన్నారు. దక్షిణం నుంచి వచ్చిన రామానుజాచార్యులకు ఇవ్వడం కాశ్మీరు పండితులకు ఏమాత్రం నచ్చలేదు. ఇవ్వరాదని రాజుకు విన్నవించారు. ‘‘సరే, ఒకసారి చదువుకొనడానికయినా అనుమతించండి రాజా అని కోరారు. వేలశ్లోకాల గ్రంథాన్ని ఒక్కసారి చదివితే ఏమాత్రం సరిపోదని మొత్తం తెలిసే అవకాశమే లేదని భావించి పండితులు అంగీకరించారు. రాజుగారు ఆ గ్రంథాన్ని రామానుజునికి సమర్పించారు. రామానుజులు రాత్రింబవళ్లు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని కురేశుని ఆదేశించారు. కొద్ది రోజుల్లో ఆయన అధ్యయనం ముగిసింది. శ్రీరంగం వెళ్లేముందు రాజసభలోనే రామానుజుడు తొలి సూత్రం ‘‘అధాతో బ్రహ్మజిజ్ఞాస’’ పై వ్యాఖ్యను చదివి, దానికి మరింత వివరమైన వ్యాఖ్యానం చేసి రాజును, అక్కడి సభాసదులను మెప్పించారు. బోధాయనుడి అన్వయాన్ని చదివిన వెంటనే ఒక్కసూత్రంపైన అంతగొప్ప భాష్యాన్ని చెప్పినందుకు రాజు ఆ గ్రంథాన్ని పూర్తిగా తీసుకుపోవచ్చునని రామానుజుడికి ఇచ్చేశారు. ఒక్కసారి చదివితేనే అద్భుత వ్యాఖ్యానం చేసిన రామానుజుడు ఇంకా కొన్నాళ్లపాటు ఈ పుస్తకం సమగ్రంగా అధ్యయనం చేసి శ్రీ భాష్యం రచిస్తే ఇంకే అద్భుతం చేస్తారో అని అక్కడ పండితులు ఈర‡్ష్య చెందారు. ఇతర మతాలనన్నీ జయించి వైష్ణవాన్ని సుస్థాపితం చేస్తారని అసూయపడ్డారు. విశిష్టాద్వైతం ముందు ఇక ఏమతాలు మిగలబోవని భయపడ్డారు. ఆయనకు గ్రంథం దక్కకుండా చేయాలనే దురుద్దేశంతో కొందరిని వెంట పంపించారు. కొన్ని రోజులపాటు వారు రామానుజుని బృందాన్ని అనుసరించి ఒక రాత్రి ఏమరుపాటుగా ఉన్నప్పుడు బోధాయన వృత్తిని వారు తస్కరించారు. మరునాడు లేచి చూసేసరికి ఆ గ్రంథం లేదు. లక్ష్యం విఫలమైందనీ. ఇంత శ్రమా వృథా అయిందనీ కలత చెందారు రామానుజులు. కాశ్మీరం వెళ్లి రాజుకు ఫిర్యాదు చేయాలని కొందరు, రాజు శిక్షించినంత మాత్రాన పుస్తకం దొరుకుతుందా అని మరికొందరు అనుకున్నారు. అంతలో అక్కడికి కురేశుడు వచ్చారు. ఏం జరిగిందని అడిగారు. బోధాయన వృత్తి గ్రంథం పోయిందని చెప్పారు సహచరులు. ‘‘ఆచార్యవర్యా మీరేమాత్రం చింతించే అవసరం లేదు. నేను ఆ గ్రంథాన్ని కూలంకషంగా చదివినాను. మీకు కావలసిన విధంగా బోధాయనుడి వ్యాఖ్యాన వివరణలను నేను ఇవ్వగలను. మీరు నిశ్చింతగా ఉండండి స్వామీ.’ అన్న కురేశుని చూసిన రామానుజుని ముఖంలో వెలుగు కనిపించింది. ఏదీ రెండోసూత్రం గురించి బోధాయనుడు వ్రాసిన వాక్యాలు వినిపించు’’ అని పరీక్షించారు. కురేశుడు యథాతథంగా వినిపించాడు. రామానుజుని ఆశ్చర్యానందాలకు అంతులేదు. కురేశుని కౌగిలించుకుని, ‘నీ ఏకసంథాగ్రాహిత్వం నాకు తెలుసు కురేశా. ఇటువంటి కీడు శంకించే వృత్తి గ్రంథాన్ని నిన్ను అధ్యయనం చేయమని కోరాను. నా చింత దీర్చగలవనే నమ్మకం ఉంది కనుకనే. ఇక్కడున్న వీరందరికీ నీ విశిష్టత తెలియడం కోసమే నిన్ను పరీక్షించాను. నీ వల్ల నేను వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతాను. కురేశా నీవే దానికి లేఖకుడిగా ఉందువుగాని. శ్రీరంగనాథుడి సన్నిధిలో మనం శ్రీభాష్య రచనాయజ్ఞాన్ని ప్రారంభిద్దాం’’ అన్నారు. ‘‘మహాభాగ్యం స్వామీ, నా జన్మధన్యం’’ అని కురేశుడు ఆనందంగా ఒప్పుకున్నాడు. వ్యాసుడు రచయిత గణేశుడు లేఖకుడు వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరని ప్రశ్నించాడు. అందుకు సమర్థుడు వినాయకుడే అని తెలిసి, ఆయనను ప్రార్థించాడు. గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ధన్యోస్మి వినాయకా అని నమస్కరించగా, ‘‘వేదనారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతినమస్కారం చేశాడు. అయితే వ్యాసమహర్షీ, నాదొక విన్నపం అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడ ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంటవెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థంచేసుకున్న తరువాతనే వ్రాయాలి సుమా..’’అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడని తెలుసుకున్నాడు. సరే ననక తప్పదు. ‘‘నాకూ మంచిదే ఆ మహాగ్రంథమైన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’’ అనుకుని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహమై సాగిపోతున్నది. వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని గమనిస్తూ ప్రశంసిస్తూ ఆనందిస్తూ వ్రాస్తున్నాడు. ఇంకా సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవారట. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ ఆయన నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
ఎక్కడ అమ్మాయిలు కనబడితే అక్కడ వాలిపోయే వాళ్లం
చలాకీ చంటి అంటే తెలియని హాస్యాభిమాని ఉండరు. అతడు మాట్లాడే తీరు, నడిచే పద్దతి చూస్తేనే నవ్వు తెప్పించక మానదు. చిన్నతనం నుంచి ప్రతి వేసవిలో తాను గడిపిన క్షణాలను, మరిచిపోలేని రోజులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే.. స్కూలింగ్ చైతన్యపురిలో.. కాలేజ్ రాంకోఠి. వేసవి వచ్చిందంటే చాలు తొమ్మిది మంది బ్యాచ్‌తో సైకిల్ వేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంచక్కా తిరిగేవాళ్లం. మధ్యాహ్నం 12 దాకా తిరిగి ఇంటికొచ్చి అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకునేవాళ్లం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మారుతీనగర్‌లోని కొండగట్టు లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద ఉన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపేవాళ్లం. శని, ఆదివారాలొస్తే మా షెడ్యూల్ పూర్తిగా మారుతుంది. సైకిల్ వేసుకొని ఎక్కడ అమ్మాయిలు కనబడితే అక్కడ వాలిపోయేవాళ్లం. అమ్మాయిల పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అన్నీ షరామామూలే. చాలా వరకు హైదరాబాద్‌లోనే వేసవి సెలవులను గడిపేవాడిని. అప్పుడప్పుడు విజయవాడలో ఉన్న నానమ్మ వాళ్ల ఇంటికి వె ళ్లేవాడిని. అక్కడి దుర్గ గుడి, గాంధీనగర్‌లో తిరుగుతూ సరదాగా గడిపేవాడిని. చాట్ బండికి వెళ్లామంటే చాలు ఒక అరగంటపాటు బండి వాడిని ఇబ్బంది పెట్టందే వదిలేవాళ్లం కాదు. ఐదుగురు స్నేహితులం వెళ్లి రూ. 150 నుండి రూ. 200దాకా తినేవాళ్లం. ఒక్కొక్కరం 30 పానీపూరీలు, మూడు చాట్లు లాగించే వాళ్లం. ఆర్జే, హాస్యనటుడిగా మారిన తర్వాత ఖాళీ లేకపోవడంతో ఫ్రెండ్స్‌తో చిట్చాట్లు, ఓషన్ పార్కుకి వెళ్తుంటాను. ఎప్పుడైనా సమ్మర్ క్యాంప్ అని బ్యానర్ కనబడితే అలనాటి మధుర జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. -
కవ్వింత: నాతో పెట్టుకోకు
బంటి: నీకు టెన్నిస్ ఆడటం వచ్చా? చంటి: టెన్నిస్ ఆడటం ఒక్కటే ఏంటి... టెన్నిస్ గురించి నాకు తెలియనిది ఏమీ లేదు. బంటి: సరే..అయితే టెన్నిస్ నెట్లో ఎన్ని గళ్లు ఉంటాయో చెప్పు?!! అబ్బాయిలు నిరాడంబరులు అమ్మాయి పడాలంటే... ప్రేమించాలి, నవ్వించాలి, కవ్వించాలి, ఖర్చుపెట్టాలి, వేచిచూడాలి. అబ్బాయి పడాలంటే... నవ్వాలి! తెలివైన భర్త-అతి తెలివి భార్య భార్య: నాతో పదేళ్ల జీవితం గడపటం అంటే భర్త: ఒక సెకెను గడిచిపోయినంత భార్య: నాకు పది వేలు చీర కొనివ్వడం అంటే భర్త: ఒక రూపాయితో సమానం భార్య: అయితే ఒక రూపాయి ఇవ్వు భర్త: ఒక సెకెను ఆగు. అసలు విషయం చందు: జిమ్‌కు వెళ్తున్నావట కదా ఈ మధ్య ! రాము: అమ్మాయిలకు నచ్చేలా తయారవుదామని. చందు: నువ్వు ఉత్త అమాయకుడిలా ఉన్నావే, నువ్వెళ్లాల్సింది జిమ్‌కు కాదు, ఏటీఎంకు!! ప్రేమ-పెళ్లి తేడా! ప్రేమిస్తే...పెళ్లి చేసుకోవాలనిపిస్తుందట పెళ్లి చేసుకుంటే ప్రేమించడమే తప్పనిపిస్తుందట. వెయిటింగ్ రూం ప్రయాణికుడు: ప్రతి రైలు లేటుగా వస్తోంది. ఆ మాత్రానికి ఈ టైంటేబుల్ ఎందుకు? స్టేషన్ మాస్టర్: ప్రతి రైలు టైంకు వస్తే ఇక ఈ వెయిటింగ్ రూం మాత్రం ఎందుకు? -
‘కొత్తొక వింత’ సినిమా స్టిల్స్