ఇర్ఫాన్, లోహిత
శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ముఖ్య పాత్రలు చేస్తున్న చిత్రం ‘రా’. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని ‘రా’ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ‘రా’ సినిమాలో కంటెంట్ హారర్ కామెడీ, లవ్‌స్టోరీ ఉందని అర్థమవుతోంది. రాజ్ డొక్కర దర్శకత్వం వహిస్తూ, సినిమాని నిర్మించటం గ్రేట్ ’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇంట్రవెల్‌లో తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఉంటు ంది. 2 పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment