RAW
-
వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత నిఘా విభాగం ‘రా’మాజీ అధికారి అని అమెరికా ఆరోపిస్తున్న వికాస్ యాదవ్(39) వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను అమెరికా గడ్డపై హత్య చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్‌పై అమెరికా దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్‌ను సహ కుట్రదారుడిగా చేర్చారు. అయితే, ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో గత ఏడాది డిసెంబర్ 18న వికాస్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడికి బెయిల్ లభించిందని వెల్లడించాయి. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఓ వ్యాపారిని అపహరించి, డబ్బులు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట వికాస్ బెదిరించాడని వివరించాయి. స్పెషల్ సెల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో 2023 డిసెంబర్ 11న తనను కలవాలని వ్యాపారవేత్తకు వికాస్ సూచించాడు. కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దాంతో బాధితుడు తన మిత్రుడితో కలిసి వికాస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వికాస్ వెంట అబ్దుల్లా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వికాస్, అబ్దుల్లా కలిసి వ్యాపారవేత్తను ఓ కారులోకి బలవంతంగా ఎక్కించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులమని చెప్పారు. ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకున్నారు. తర్వాత వదిలేశారు. ఈ విషయం బయట చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉంచిన రూ.50 వేల నగదును వికాస్, అబ్దుల్లా తీసుకున్నట్లు బాధితుడు గుర్తించాడు. సీసీటీవీ రికార్డింగ్‌లు సైతం తొలగించినట్లు గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వికాస్ యాదవ్, అబ్దుల్లాపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న వికాస్‌పై చార్జిïÙట్ దాఖలు చేశారు. కోర్టు అతడికి మార్చి 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 22న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. వికాస్ యాదవ్ మాజీ ప్రభుత్వ అధికారి అని బెయిల్ ఆర్డర్లో కోర్టు పేర్కొంది. అయితే, అమెరికా దర్యాప్తు అధికారులు తమ అభియోగాల్లో వికాస్‌ను భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రెటేరియట్‌లో పనిచేసే అధికారిగా ప్రస్తావించారు. వికాస్ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ, అతడు ప్రభుత్వ అధికారి కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ స్పష్టంచేశారు. ఖలిస్తాన్ ఉద్యమం ఆగదు: పన్నూ వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపడంపై గురు పత్వంత్‌సింగ్ పన్నూ తాజాగా ‘ఎక్స్’వేదికగా స్పందించాడు. అమెరికా పౌరుడి జీవితాన్ని, స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలన్న ప్రాథమిక రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో అమెరికా ప్రభుత్వం మరోసారి అంకితభావం చూపిందని ప్రశంసించాడు. స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ అమెరికా పౌరుడి ప్రాణాలను అమెరికా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పాడు. వికాస్ యాదవ్ ఒక మధ్యశ్రేణి సైనికుడు అని వెల్లడించాడు. పన్నూను హత్య చేయాలంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు ‘రా’చీఫ్ సామంత్ గోయెల్ నుంచి వికాస్ యాదవ్‌కు ఆదేశాలు అందాయని ఆరోపించాడు. ఖలిస్తాన్ రెఫరెండమ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే తనను అంతం చేయాలని కుట్ర పన్నారని విమర్శించాడు. తనపై ఎన్ని హత్యాయత్నాలు జరిగినా ఖలిస్తాన్ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పాడు. భారత్‌లో ప్రత్యేక సిక్కు దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడతానని, ఇందులో భాగంగా నవంబర్ 17న న్యూజిలాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు. భారత్‌కు ఇబ్బందులేనా? ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే కెనడా, భారత్ మధ్య దూరం పెరుగుతోంది. తమ దేశ పౌరుడైన నిజ్జర్‌ను ఇండియా ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. మరో ఉగ్రవాది పన్నూ హత్యకు జరిగిన కుట్ర కేసులో భారతీయుడైన వికాస్ యాదవ్‌పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం మున్ముందు భారత ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వికాస్ యాదవ్‌న తమకు అప్పగించాలని అమెరికా అధికారులు ఇంకా భారత్‌ను కోరలేదు. తమ భూభాగంలో తమ పౌరుడిని(పన్నూ) హత్య చేయడానికి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోమని అమెరికా అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. -
పచ్చి కరివేపాకు నములుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి?
సోషల్ మీడియాలో రెసిపీలు, చిట్కాలకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూ ఉంటాయి. కానీ నిజానిజాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉండాలి.ఇటీవలి కాలంలో పచ్చి కరివేపాకు ఆకులను నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని బాగుపడుతుందనే వార్త హల్చల్ చేస్తుంది. దీంట్లోని నిజానిజాలేంటో చూద్దాం రండి.కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి , డి వంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్ వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే రోజువారీ కూరల్లో ప్రతీ దాంట్లోనూ కరివేపాకును విధిగా వాడుతూ ఉంటాం. దీంతో వంటకాలకు మంచి వాసన రావడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో అవసరమైన పోషకాలతో పాటు కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కరివేపాకును నమలడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులు వెంట్రుకలకు పోషణ , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయినేది గమనించాలి.బరువును నియంత్రిస్తుంది, చుట్టు మెరిసేలా చేస్తుందిచెడు కొలస్ట్రాల్‌కు చెక్ చెప్పాలన్నా కరివేపాకు బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, ఎక్కువ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు రోజూ కరివేపాకును అనేక రూపాల్లో తింటూ ఉండాలి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ కరివేపాకు తీసుకునే వారికి షుగర్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటిచూపు మెరుగుపడుతుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడంలాంటి సమస్యలను అధిగమించొచ్చు. ఇందులో లభించే కెరోటిన్‌తో జుట్టు నిగనిగలాడుతూ బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా రాకపోవడంలాంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారు కరివేపాకులను ఎక్కువగా తీసుకోవాలి. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది కరివేపాకు ఆకలిని బాగా పెంచుతుంది. అందుకే జబ్బు పడిన వారికి, జ్వరం వచ్చితగ్గిన వారికి ధనియాలు, కరివేపాకుతో చేసిన కారప్పొడిని తినిపిస్తారు. విరేచనాలు విరేచనాలతో బాధపడేవారు కరివేపాకును బాగా ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకుని కాస్త తేనె కలుపుకుని తాగుతారు.రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులనుతినవచ్చు. అయితే దానిమీద పురుగుమందుల అవశేషాలు లేకుండా జాగ్రత్తపడాలి. శుభ్రంగా కడిగి తింటే చాలా రకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. మరీ అతిగా తీసుకోకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చివి తినకుండా ఉంటే మంచిది. ఎలా తినాలి?కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, అన్ని రకాల కూరల్లో వాడటం ద్వారా దీని ప్రయోజనాలు పొందవచ్చు. -
పొంతన లేని వింత కథ!
కొన్నిసార్లిది తలకిందుల పిచ్చి మాలోకంగా అయిపోగలదు. ‘మ్యాడ్’ మేగజీన్లోని ఒక కార్టూన్ నిజరూపం లోనికి రూపాంతరం చెందినట్లే ఈ ప్రపంచం ఉంటుంది. ప్రస్తుతం పక్కింట్లో అదే జరిగిందని అనిపిస్తోంది. అయితే ఏ విధంగానూ అది అందరికీ జరిగినట్లు కాదు. కచ్చితంగా జరిగిందైతే అక్కడి ప్రభుత్వానికి, భయానకమైన ‘ఐఎస్ఐ’కి. నేను చెప్ప వలసి ఉన్నది అతి వింతైన కథ కనుక చాలామందికి అది కనీసం కల్పనగా కూడా నమ్మదగనిది. అయినప్పటికీ, నన్ను నమ్మండి... అది నిజంగా జరిగింది.పాకిస్తాన్‌లోని యూట్యూబర్లు, అక్కడి ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వంటి వార్తా పత్రికలు, ఆ దేశపు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఆఖరికి స్వయానా ఆ శాఖ మంత్రి కూడా నన్ను పాకిస్తాన్ వ్యతిరేకిననీ, మోదీ ప్రభుత్వానికి సన్నిహితుడిననీ, ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)తో చేతులు కలిపాననీ ప్రకటించటం జరిగింది. ఇప్పుడిది, చివరిసారి నేను చేసిన ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే లేచి బయటికి వెళ్లిపోయిన ప్రస్తుత ప్రధాన మంత్రికీ, దశాబ్దాలుగా నన్ను పాకిస్తాన్ పక్షపాతిగా నిందిస్తూ వస్తున్న విమర్శకులకూ నిస్సందేహంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే సరిహద్దు వెంబడి గస్తీ సైనికులు, వారి పౌర ప్రభుత్వాలు, నిఘా అధికారులకు ఇది... అవునా! నిజమా... అనిపించేలా ఉంటుంది.ఇదెలా జరిగిందో వివరించటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. కొన్ని వారాల క్రితం పాక్ అధికారులు తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) సమాచార కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన రవూఫ్ హసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై దేశద్రోహ నేరం మోపాలన్న కృతనిశ్చయంతో నిర్బంధించి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్‌ను, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించారు. అక్కడ వారికి రవూఫ్ నాతో పంచుకున్న – 2022 నవంబర్ వెనకటి – మెసేజ్‌లు కొన్ని కనిపించాయి. ఆహా! ఇకనేం, భారతదేశంలోని వ్యక్తులతో అతడు మాట్లాడుతున్నాడన్న నిర్ధారణకు వారు వచ్చేశారు. అది అత డిని దేశ వ్యతిరేకిని చేసేసింది. ఇంకా దారుణం, ఇమ్రాన్‌తో పాక్ ఎలా వ్యవహరిస్తోందో రవూఫ్ తన మెసేజ్‌లలో వ్యాఖ్యానిం^è టం, పాకి స్తాన్ రాజకీయాలపై చర్చించటం, చివరికి ఆర్మీ చీఫ్ గురించి కూడా మాట్లాడటం! ఇవన్నీ కూడా నిస్సందేహంగా పాక్ దృష్టిలో దేశ వ్యతి రేకమైనవే.ఇప్పుడిది రూఢీ అవ్వాలంటే పాక్‌ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా నన్ను చిత్రీకరించాలి. ఆ దేశంలోని ఎంతోమంది నియంతలు, ప్రధానులు నాకు తెలుసనీ, వారిని నేను ఇంటర్వ్యూ చేశాననీ, తరచు నేను ఆ దేశాన్ని సందర్శిస్తుంటాననీ; ఇస్లామాబాద్‌లో, లాహోర్‌లో, కరాచీలో నా సన్నిహిత మిత్రుల జాబితా పెద్ద చాంతాడంత ఉంటుందనీ గుర్తించటం వంటివేవీ పాక్ చిత్రీకరణ ఉద్దేశాన్ని నెరవేర్చేవి కావు. బేనజీర్ భుట్టో నాకు ఆప్త నేస్తం అనీ, నవాజ్ షరీఫ్ ఆఖరుగా 2014లో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలుసుకోవాలని కోరారనీ, షెహబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, నేను కలిసి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కూర్చొని స్నేహపూర్వకంగా లేదా, పిచ్చాపాటీగా కబుర్లు చెప్పుకున్నామనీ అంగీకరించటం కూడా పాక్ అనుమానాలను బలపరిచేందుకు ఉపయోగపడదు. అలా అంగీ కరించటం అన్నది రవూఫ్‌కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కేసును కుప్ప కూల్చి ఉండేది.కాబట్టి తన అధికారిక ప్రకటనలో పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ: ‘‘భారతదేశ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు రవూఫ్ హసన్ జాగ్రత్త లేకుండా పంపిన మెసేజ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. నిజా నికి ఈ మెసేజ్‌లు కరణ్ థాపర్‌కు మద్దతుగా ఉన్న ‘రా’ అధికారులకు అమూల్యమైన సంపద వంటి సమాచారం అని రక్షణశాఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మెసేజ్‌లను బట్టి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని రాజేసేందుకు పి.టి.ఐ. (పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్) ప్రతినిధి దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఒక భారతీ యుడికి చేరవేస్తున్నట్లు బహిర్గతం అయిందని వారు తెలిపారు’’ అని పేర్కొంది. పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్, ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ... ‘‘పాక్ వ్యతి రేక భావాలకు పేరుమోసిన ఒక భారతీయ జర్నలిస్టుతో హసన్‌కు ఉన్న సంబంధాలు స్వదేశం పట్ల పి.టి.ఐ. అవిధేయతను మరింతగా తేటతెల్లం చేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.పర్యవసానంగా, రవూఫ్ నాతో నెరిపిన సంక్షిప్తమైన, చాలా అరుదైన, ఏమాత్రం హానికరం కానివైన మెసేజ్‌లు – నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానన్న వాస్తవం కూడా – మార్మికమైన రీతిలో పాకిస్తాన్ సార్వభౌమాధికారతకు, సమగ్రతకు, భవిష్య త్తుకు ముప్పుగా పరి వర్తనం చెందాయి. నిస్సందేహంగా ఇది ఆయనపై విచారణ జరిపించేందుకు ఉపయోపడుతుంది. వారి దృష్టిలో అదే న్యాయం. మా మధ్య సాగిన ఉద్దేశపూర్వకం కాని వాట్సాప్ మెసేజ్‌లు, ఇంటర్వ్యూ లాంటి మాటామంతీ, ఇంకా చెప్పాలంటే ఓ రెండు సంభాషణలు... వీటన్నిటినీ దాటి అసలు నిజం ఏమిటంటే రవూఫ్ నాకు తెలియదు. అతడికీ నేను తెలియదు. మేము ఒకరికొకరం అపరిచితులం. కాబట్టి ఇదెప్పటికీ మారదు.వాస్తవానికి, వారు రవూఫ్ బాస్ అయిన ఇమ్రాన్ ఖాన్ నాతో మంతనాలు జరిపారని ఆరోపించినట్లయితే వారి కేసుకు మరింత బలం చేకూరి ఉండేది. ఇమ్రాన్‌ను నేను అనేకసార్లు ఇంటర్వ్యూ చేశాను. బని గలా (ఇస్లామాబాద్) లేదా ఢిల్లీలో మాత్రమే కాదు... ఒక సందర్భంలో నేను లండన్ వెళ్లి మరీ, అక్కడి రిచ్మండ్లో ఇమ్రాన్ మాజీ అత్తమామలు ఉండే భవనం లోపలి తోటల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పాకిస్తాన్ చార్జిషీట్లో అది నేరంగా కనిపించటం లేదా? అంతకుమించిన నేరం, తనెప్పటికైనా ప్రధాని అయితే ఆర్మీ చీఫ్ తనకు లోబడి పని చేయవలసి ఉంటుందని కూడా ఇమ్రాన్ అనటం. నవ్వుతూ ఏమీ ఆయన ఆ మాట అనలేదు. పాకిస్తాన్‌లోని నా ప్రియ స్నేహితుడు ఒకరు ఈ అస్థిమితం నుంచి నన్ను శాంతింపజేయటానికి ఇలా అన్నారు: ‘‘అలీస్ ఇన్ ది వండర్ల్యాండ్’తో నీకు పరిచయం ఉంది. ఇప్పుడిక, మాలిస్ (దుష్ట బుద్ధి) ఇన్ ది ఫౌజీలాండ్ (సైనికదేశం)కు స్వాగతం.’’– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే డైట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్. తనుంటే హీరోతో పనిలేదు అన్నట్లుగా సినిమా ఆశాంతా ఆమె చుట్టూనే తిరిగేలా ఆమె నటన ఉంటుంది. బ్యూటీ పరంగా ఇప్పటికీ యువ హీరోయిన్లను తలదన్నేలా గ్లామరస్‌గా ఉంటుంది. వయసు పెరుగుతుందా అన్న సందేహం వచ్చేలా ఆమె ఫిట్నెస్ ఉంటుంది. ఇంతలా గ్లామర్‌ని మెయింటెయిన్ చేసేందుకు విద్యా బాలన్ ఎలాంటి డైట్ ఫాలో అవుతుందంటే..బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆకట్టుకునే నటనా నైపుణ్యానికే గాక ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించడంలో కూడా పేరుగాంచింది. ఇటీవల ఒక ఇంటర్యూలో తను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని ఫాలో అవుతుందో షేర్ చేసుకుంది. తాను ఇంట్లో వండిన గ్లూటైన్ రహితమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాను "నో రా డైట్"ని ఫాలో అవుతానని చెప్పారు. 'నో రా డైట్' అంటే..పచ్చి ఆహారం కాకుండా వండినవి అని అర్థం. ఇక్కడ నటి విద్యా బాలన్ కూరగాయాలు, కొన్ని రకాల పండ్లు, మాంసం, పాల సంబంధిత ముడి ఆహారాలను పచ్చిపచ్చిగా తీసుకోనని చెబుతున్నారు. సురక్షితమైన పోషకాహారం కోసం చక్కగా వండిన వాటికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అనారోగ్యాలను నివారించడం కోసమే తాను ఇలాంటి డైట్‌ని అనుసరిస్తానని చెప్పారు. పచ్చి ఆహారాల్లో ముఖ్యంగా మాంసాలు, గుడ్లు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల్లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆహార వ్యాధులకు కారణమవుతాయి. ఈ ఆహారాలను పూర్తిగా ఉడికించడం వల్ల ఆయా వ్యాధికారకక్రిములు నశించి, ఇన్ఫెక్షన్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వండిన ఆహార పదార్థాల్లో సంక్లిష్ట ప్రోటీన్లు, ఫైబర్లు విచ్ఛిన్కన్నం అవుతాయి. దీంతో సులభంగా జీర్ణమయ్యి, ప్రేగు సిండ్రోమ్ లేదా జీర్ణశయాంతర రుగ్మతలు దరి చేరవు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ నో రా డైట్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉడికించి లేదా కుక్ చేసినవి తినడం వల్ల మన శరీరం పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలలోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్, క్యారెట్‌లోని బీటా కెరోటిన్‌ను కుక్ చేస్తే సులభంగా గ్రహించగలుగుతాం. ఎలా ఫాలో అవ్వాలంటే..కుక్ చేయడం వల్ల పోషక శోషణ మెరుగుపడుతుంది. పోషకాలను సంరక్షించే వంట పద్ధతులను ఉపయోగించడం ముఖ్యం. స్టీమింగ్, మైక్రోవేవ్, వంటి పద్దుతల్లో తక్కువ నీటితోనే ఉడికిపోతాయి. పోషకాల నష్టం కూడా జరగదు. అయితే ఉడకబెట్టడం వల్ల నీటిలో కరిగిపోయే విటమిన్ సీ, బీ వంటి వాటిని కోల్పోవచ్చు. అందువల్ల పోషక విలువలు కోల్పోకుండా ఉండే వంట పద్ధతులను అనుసరించడం ముఖ్యం. ఈ డైట్‌ని అనుసరించాలనుకున్నప్పుడూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. తగినంత పోషకాలు లభించేలా ఉడికించిన కూరగాయలు తోపాటు పండ్లు, ధాన్యాలు వంటివి కూడా చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వండటం వల్ల కోల్పోయిన పోషకాల నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారని అన్నారు. ఈ డైట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..కొన్ని రకాల కూరగాయాలు, పండ్లను కుక్ చేసి తీసుకోవాలి, అలాగే కొన్ని రకాల పోషకాల కోసం ఫైబర్‌తో కూడిన పప్పుధాన్యాలు పండ్లను పచ్చిగానే తీసుకోవాలని చెబుతున్నారు. వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా వండిన వాటి తోపాటు ముడి ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని అందించగలుగుతారు. దీనివల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?) -
లండన్‌లో వాలిపోయిన 'ఈగల్'
రవితేజ మోస్ట్ వాంటెడ్.. హీరోగా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. ‘ఈగల్’ సినిమాలో కూడా రవితేజ మోస్ట్ వాంటెడ్. సినిమాలో ఆయన్ను పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెతుకుతుంటుంది. కొందరు ఆయన్ను పెయింటర్ అనుకుంటారు.. మరికొందరు రైతు అనుకుంటారు.. ఇంకొందరు ఇంకోటి అనుకుంటారు. సో.. ఈ చిత్రంలో రవితేజ పలు గెటప్స్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. రవితేజ, అనుపమా పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఈ కూరగాయలు నేరుగా తింటున్నారా?ఇందులోని విషపూరిత బాక్టీరియా..
మనకు ఆహార పదార్థాలలో కొన్ని వండకుండా నేరుగా తినేయవచ్చు, మరికొన్నింటిని తప్పకుండా వండుకొనే తినాలి. మనలో చాలా మంది కొన్ని కూరగాయలను పచ్చిగా తినడమే ఆరోగ్యకరం అని నమ్ముతారు. అయితే అన్ని సందర్భాలలో.. అన్ని కూరగాయల విషయంలో అది మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా పచ్చిగా తినకూడని కూరగాయలేమిటో తెలుసుకుందాం. కొన్ని కూరగాయలలో సహజమైన విషపూరిత సమ్మేళనాలు, జీర్ణం కావడానికి కష్టతరమైన చక్కెరలు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు కలిగించడంతో పాటు గ్యాస్ట్రోనామికల్ వ్యాధులకు దారితీయవచ్చు. అంతేకాదు, కూరగాయలను పండించటానికి ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వాడుతున్నారు. మనం వాటిని ఎంత శుభ్రం చేసినా, వాటి లోపలి భాగంలో ఉండే హానికర సమ్మేళనాలు, బ్యాక్టీరియా వంటివి అలాగే ఉంటాయి. బాగా ఉడికించినపుడు మాత్రమే అవి క్రిమిసంహారం అవుతాయి, అప్పుడే అవి తినడానికి అనువైనవిగా ఉంటాయి. అయితే పచ్చిగా అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. చిలగడదుంప/ గెణుసుగడ్డ/ రత్నపురి గడ్డ వీటిని నేరుగా తిన్నా, రుచిగానే ఉంటుంది. అయితే ఇలా తినడం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఉండే పిండి పదార్థం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి వీటిని కాల్చడం లేదా ఉడికించడం మంచిది. బీన్స్ పచ్చిగా తినకూడని మరో వెజిటెబుల్ బీన్స్. కొన్నిరకాల బీన్స్ పచ్చిగా తింటే ప్రమాదకరం కూడా. బీన్స్ లోని కొన్ని రకాలు హానికరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలోని హానికరమైన టాక్సిన్ను తొలగించడానికి ముందు బీన్స్‌ను క్లీనర్ నీటిలో నానబెట్టండి. ఆపైన వండుకొని తినాలి. రెడ్ కిడ్నీ బీన్స్ ఉడికించని లేదా సరిగ్గా ఉడకని కిడ్నీ బీన్స్ (రాజ్మా) లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకో ప్రోటీన్ లెక్టిన్ ఉంటుంది. వీటిని తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. లక్షణాల తీవ్రత కూడా మీరు తిన్నపరిమాణంపై ఉంటుంది. ఎక్కువగా తినేస్తే ఎక్కువ మొత్తంలో టాక్సిన్స్ మీ శరీరంలోకి చేరతాయి. కాబట్టి కిడ్నీబీన్స్ని ఎప్పుడయినా ఉడకబెట్టి తినాలి. ఆకు కూరలు ఆకుకూరల్లో కొన్నింటిని పచ్చిగా తినకూడదు. క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, అలాగే మొలకలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు, అయితే ఎక్కువ పోషకాలను పొందడానికి ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది. కాల్చిన, వేయించిన లేదా ఉడికించిన పుట్టగొడుగుల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా వాటి రుచికూడా పెరుగుతుంది. కాబట్టి వండుకొని తినండి. శాకాహారాలు కాకుండా ఏ రకమైన మాంసాహారాన్ని అయినా పచ్చిగా తినడం చాలా ప్రమాదకరం. పచ్చి మాంసంపై రకరకాల హానికర బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. కాబట్టి మాంసాన్ని బాగా ఉడికించుకొని తినాలి. అలాగే కోడిగుడ్లను కూడా పచ్చిగా తినడం హానికరమే! -
చైనా గూఢచారికి హైదరాబాద్ తో లింకులు
-
రేర్ ఫోన్‌కాల్, రహస్య లేఖ.. అభినందన్‌ను వదిలేశారు
న్యూఢిల్లీ : 2019, ఫిబ్రవరి నెలలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగి పాక్ ఆర్మీకి చిక్కారు. దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలో ఉంచి జనీవా ఒప్పందం ప్రకారం పాక్ అభినందన్‌ను వదిలేసింది. అయితే అభినందన్‌ను వదిలేయటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆయన పాక్ చెరలో ఉన్న సమయంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) చీఫ్ అనిల్ ధస్మనా పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. అభినందన్‌కు ఏమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ సూచనల మేరకు.. ఐఎస్ఐ కౌంటర్ పార్ట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సయ్యద్ అసిమ్ మునిర్ అహ్మద్ షాకు రేర్ ఫోన్ కాల్, రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్ వెనక్కు తగ్గి అభినందన్‌ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది. 2019, ఫిబ్రవరి 28వ తేదీన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత సైనికుడ్ని వదిలేస్తున్నట్లు నేషనల్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చదవండి : నాడు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్.. నేడు కూలీ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
తాగి వాహనాలు నడిపితే..
శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ముఖ్య పాత్రలు చేస్తున్న చిత్రం ‘రా’. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని ‘రా’ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ‘రా’ సినిమాలో కంటెంట్ హారర్ కామెడీ, లవ్‌స్టోరీ ఉందని అర్థమవుతోంది. రాజ్ డొక్కర దర్శకత్వం వహిస్తూ, సినిమాని నిర్మించటం గ్రేట్ ’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇంట్రవెల్లో తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఉంటు ంది. 2 పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. -
ఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ రాజీవ్ జైన్, రీసెర్చ్ అండ్ అనాలిసిన్ వింగ్(రా) కార్యదర్శి అనిల్ ధస్మనాల పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు వారు పదవిలో ఉంటారు. ఎన్నికల ముంగిట వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పదవుల్లో మార్పులు చేయడం ఇష్టంలేకే ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధస్మనా డిసెంబర్ 29న, జైన్ డిసెంబర్ 30న విరమణ చేయాల్సి ఉంది. 1985 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అనిల్ శ్రీవాస్తవకు నీతి ఆయోగ్ సలహాదారు నుంచి ప్రధాన సలహాదారుగా పదోన్నతి కల్పించారు. 1988 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐపీఎస్ అధికారి రాంపాల్ పవార్‌ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డైరెక్టర్‌గా నియమించారు. -
కోవర్ట్ ఆపరేషన్...! ఆత్మాహుతి దాడి నిరోధానికి..
హాలివుడ్ సినిమా యాక్షన్ సీన్లు తలదన్నేలా పద్దెనిమిది నెలల పాటు అత్యంత రహస్యంగా ఊహకందని రీతిలో సాగిన భద్రతాదళాల ఆపరేషన్ విజయవంతమైంది. దేశ రాజధానిపై ఉగ్రమూక పంజా విసరకుండా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ దోహదపడింది. దీని కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐసీస్ (ఇస్లామిక్ స్టేట్) దాడులకు సిద్ధమైన ఉగ్రవాదుల ప్రణాళికలు కూడా బట్టబయలయ్యాయి. భారత భద్రతా సంస్థల కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఐసీస్‌లోకి మన ఏజెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తి ద్వారా ఐఎస్ ఉగ్రవాదికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించడంతో పాటు దాడులకు అవసరమైన పేలుడుపదార్థాలు (ట్రిగ్గర్స్ లేకుండా) కూడా సరఫరా చేశారు. ఆఫ్గనిస్తాన్, దుబాయ్, ఢిల్లీల్లో సుదీర్ఘకాలం పాటు ఈ సూక్ష్మ పర్యవేక్షణ సాగింది. ఛెస్ ఆటలో మాదిరిగా భద్రతా దళాల అధికారులు ఓ వైపు పకడ్బందీ నిఘా కొనసాగిస్తూనే, అనువైన సమయం కోసం ఓపికగా ఎదురుచూశారు. ఇందులో ఉత్కంఠను రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి... పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ తీవ్రవాదుల బందం భారత్, తదితర ప్రాంతాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు 50 వేల డాలర్ల మొత్తాన్ని ఐసీస్ కార్యకలాపాల కోసం అఫ్గనిస్తాన్‌కు పంపించడాన్ని అమెరికన్ నిఘా వర్గాల సహకారంతో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్ టాప్ చేశాక అఫ్గనిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి న్యూఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వస్తున్నట్టు వెల్లడైంది. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన తీవ్రవాదితో స్నేహసంబంధాలు పెంపొందించుకునేందుకు ఓ ఐఎస్ ఏజెంట్ అవతారంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఓ వ్యక్తిని పంపింది. ఈ వ్యక్తి ద్వారానే తీవ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో బసతోపాటు, పేలుడుపదార్థాలు సమకూర్చేలా చేశారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాదిపై నెలరోజుల పాటు నిరంతర నిఘా కోసం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఐఎస్ ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అఫ్గనిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేయగలిగాయి. ఇటీవల అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారం ఇతడి వద్దే సేకరించారు. ప్రస్తుతం మరింత సమాచారం కోసం అతడిని విచారిస్తున్నారు. 2017 మే 22న యూకేలోని మాంఛేస్టర్ (23 మంది ప్రాణాలు కోల్పోయారు) లో జరిగిన బాంబుదాడి ఇతడి 11 మంది సహచరుల్లోని ఒకడి పనేనని తేలింది. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తి ఏవైతే పేలుడు పదార్థాలు వినియోగించాడో అలాంటి వాటినే ఢిల్లీకి వచ్చిన ఉగ్రవాది కూడా డిమాండ్ చేయడాన్ని బట్టి ఇక్కడ కూడా అలాంటి ఆత్మాహుతిదాడికి తెగబడాలని భావించాడనేది స్పష్టమవుతోంది. గత సెప్టెంబర్‌లోనే ఈ అరెస్ట్ చోటుచేసుకున్నా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు బయటపెట్టారు. -
అర్థం మారింది
జనరల్‌గా ‘రా (ఆర్.ఏ.డబ్యూ)’ అంటే డిఫెన్స్ డిక్షనరీలో ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ అని అర్థం వస్తుంది. కానీ రీల్‌పై రా అంటే... ‘రోమియో అక్బర్ వాల్టర్’ అంటున్నారు హిందీ హీరో జాన్ అబ్రహాం. రోబీ గ్రేవాల్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో కథానాయికగా మునీ రాయ్ నటిస్తున్నారు. హిందీ చిత్రం జాకీష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ‘స్పై’ పాత్రలో నటిస్తున్న జాన్ అబ్రహాం డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. గుజరాత్, ముంబై, ఢిల్లీలో మేజర్ షూటింగ్ జరపాలనుకుంటున్నారు. ‘కొత్త సినిమా జర్నీ మొదలైంది’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. -
‘ది స్పై క్రానికల్’ రచయితకు పాక్ ఆర్మీ సమన్లు
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్) మాజీ చీఫ్ అసద్ దురాణి రచించిన ‘ది స్పై క్రానికల్: రా, ఐఎస్ఐ అండ్ ది ఇల్యూషన్ ఆఫ్ పీస్’ పుస్తకం వివాదస్పదమవుతోంది. ఈ నెల 28న పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరు కావాల్సిందిగా పాకిస్తాన్ ఆర్మీ అసద్‌కు సమన్లు జరిచేసింది. పుస్తకంలో ఆయన పొందుపర్చిన విషయాలు ‘వైలెటింగ్ ది మిలటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ కిందకు వస్తాయని పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ఈ నెల 28న జనరల్ హెడ్‌క్వార్టర్స్‌కు రావాల్సిందిగా అసద్‌కు గత శుక్రవారం సమన్లు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇండియాస్ రిసెర్చ్ అండ్ అనాలసీస్ వింగ్ మాజీ చీఫ్ ఏఎస్ దులట్తో కలిసి అసద్ ది స్పై క్రానికల్ పుస్తకాన్ని రచించారు. ఇద్దరు రచయితలు ఇండియా, పాకిస్తాన్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నట్టు పుస్తకంలో పొందుపర్చారు. అయితే పుస్తకంలో పేర్కొన్న విషయాలు ఆర్మీ నిబంధనలు ఉల్లఘించేలా ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అసద్‌కు సమన్లు జారీ చేసింది. పుస్తకంలో పేర్కొన్న ముఖ్యమైన, వివాదస్పదమైన అంశాలు ఇవి.. అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ అల్ ఖైయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చెందుకు చేసిన ఆపరేషన్ పాకిస్తాన్‌కు తెలిసే జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. భారత్‌కు చెందిన కులభుషన్ జాదవ్‌కు సంబంధించిన విషయాలను కూడా పేర్కొన్నారు. కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు కూడా పుస్తక సహా రచయిత అసద్ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. -
గూఢచర్యంలో తీపి గుర్తులు
భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించుకుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్కి కీలక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు. అలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోగల వనీ, మన ఊహకు అందని రీతిలో తరచూ అవి జరుగుతూ ఉంటా యనీ, ఆఖరికి ప్రచ్ఛన్న యుద్ధకాలంలోనూ అలాంటి ఘటనలు సాధ్యమేననీ చెప్పే విధంగా గూఢచర్యం చరిత్ర రుజువులతో సహా నిండి ఉంది. వైరి శిబిరాల ప్రతినాయకులు కలుసుకున్నారు, చర్చించుకున్నారు, పరస్పరం గౌరవాభిమానాలను పెంపొందించుకు న్నారు. కొన్ని సమయాలలో వ్యక్తిగతంగా ప్రేమాభి మానాలు కూడా కురిపించుకున్నారు. మన దాయాది దేశాల గూఢచర్య వ్యవస్థల అధిపతులు– రా అధిపతి ఏఎస్ దౌలత్, ఐఎస్ఐ అధినేత అసద్ దురానీల మధ్య నమ్మితీరవలసిన రీతిలో జరిగినట్టు చెబు తున్న ఉమ్మడి కృషి గురించి వెల్లడించిన సంద ర్భంలో భారత్ పాకిస్తాన్ మీడియా ఆనందోత్సాహా లలో మునిగి తేలుతున్నది. ఈ వారం ఈ అపూర్వ మైన అంశం గురించి చర్చించడానికి కారణం అదే. చెప్పుకోదగిన ఇలాంటి చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన వారు పత్రికా రచయిత ఆదిత్య సిన్హా. నిజానికి ఈ రెండు దేశాల గూఢచారి వ్యవస్థల అధిపతులు (లేదా ఎన్ఎస్ఏలు) వివిధ అంశాల గురించి చర్చించడానికి సుదూర ప్రాంతాలలో (థాయ్‌లాండ్ అయితే సౌకర్యంగా ఉంటుంది) కలుసుకుంటూ ఉంటారన్నది తెలిసిన విషయమే. ఈ పుస్తకంలో కదలించే కథనం ఒకటి ఉంది. వీసా నిబంధనలను ఉల్లంఘించి, ముంబై విమానాశ్ర యంలో పోలీసులకు దొరికిపోయిన అసద్ దురానీ కుమారుడికి రా ఎలా సహాయ సహకారాలు అందిం చినదీ ఆ కథనం చెబుతుంది. అతడు ఐఎస్ఐ మాజీ అధిపతి కుమారుడన్న వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం కూడా వారు ఎవరికీ దక్కనీయలేదు. అప్పటికి దురానీ పదవీ విరమణ చేసి చాలా కాలమే అయింది. కానీ దౌలత్‌కు దురానీ అంటే ఎంతో గుడ్ విల్ ఉంది. దౌలత్ ఆనాటి రా సంస్థ అధిపతి రాజిం దర్ ఖన్నాతో మాట్లాడారు. మన గూఢచారి వ్యవస్థ అధిపతులు కొందరు పదవులలో ఉండగానే రహస్య సంభాషణలు జరిగాయి. రాజీవ్‌గాంధీ హయాంలో రా సంస్థ సంచాలకునిగా పనిచేసిన ఆనంద్వర్మ చని పోవడానికి కొంచెం ముందు ‘ది హిందు’ అభిప్రా యవేదికలో విభ్రాంతికరమైన నిజాలను వెల్లడిం చారు. అవి పేరుమోసిన లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్‌తో ఆయన జరిపిన రహస్య చర్చల వివరాలే. గుల్ అప్పటి ఐఎస్ఐ అధిపతి. ఈ చర్చలు ఎక్కు వగా విదేశాలలో జరిగినవే. తరువాత పబ్లిక్ ఫోన్ల ద్వారా జరిపినవి. సంకేత భాష, సంకేతాల సాయంతో ఆ చర్చలు జరిగాయి. ఈ చర్చలలో సియాచిన్, కశ్మీర్ వివాదాలలోని తీవ్రతను తగ్గిం చాలని ఆ ఇద్దరు అభిప్రాయపడ్డారు. గుల్ తన పట్ల నమ్మకం కుదిరేటట్టు చేయడానికి ఒక కోవర్ట్ ఆపరే షన్ కూడా నిర్వహించాడు. సిక్కు సైనిక పటాలా లకు చెందిన నలుగురుని అతడు భారత్‌కు అప్ప గించాడు. ఈ నలుగురు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తరువాత పాకిస్తాన్ వైపు ప్లేటు ఫిరాయించి భారత్‌లో తిరుగుబాటుకు ప్రయత్నించి నవారు. నిజానికి ఈ ప్రక్రియ రాజీవ్‌గాంధీ ఆశీస్సులతో జనరల్ జియా ఉల్ హక్ చొరవతోనే ఆరంభమైంది. మొదటి సమావేశంలో రాజీవ్‌గాంధీ జోర్డాన్ యువ రాజు హసన్ పలుకుబడిని ఆశించారని కూడా వర్మ రాశారు. యువరాజు రాజీవ్ వ్యక్తిగత మిత్రుడు (ఆ కాలంలో రాయల్ జోర్డాన్ ఎయిర్ లైన్స్‌ను దేశంలోకి అనుమతిస్తూ హక్కు కల్పించారనీ, అందుకు యువ రాజు రాజీవ్‌కు ఒక ఫ్యాన్సీ కారు బహూకరిస్తున్నా రనీ వివాదం చెలరేగింది). హసన్‌కు పాకిస్తాన్లో కూడా చాలా పలుకుబడి ఉంది (ఆయన భార్య పాక్ సంతతికి చెందినవారు). అయితే ఇదంతా జనరల్ జియా హత్యకు గురి కావడంతో నిలిచిపోయింది. ఈ శాంతి ప్రక్రియ పట్ల వ్యతిరేకంగా ఉన్న కొందరు జియా సైనిక సహచరులే ఆ హత్యకు పాల్పడ్డారని వర్మ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కలసి ఒక కుట్ర సిద్ధాం తాన్ని మన ముందు ఉంచుతాయి. నిస్సందేహంగా వర్మ అత్యంత జాగరూకత కలిగిన అధికారి. దాదాపు మూడు దశాబ్దాలు వేచి ఉండి అప్పుడు బహిర్గతం చేశారు. గుల్ వెల్లడించిన వివరాలే వర్మను ఆ రహ స్యాలను బయటపెట్టడానికి ప్రేరణ కలిగించి ఉండ వచ్చు. వర్మ తన జ్ఞాపకాల విషయంలో నిజాయితీగా ఉంటూవచ్చారని నేను నమ్ముతున్నాను. వరుసగా జరిగిన అలాంటి ట్రాక్–2 సమావేశాలకు నేను హాజ రయ్యాను. వీటిలో బలూసా గ్రూప్ పేరిట జరిగిన సమావేశానికి అమ్మాన్లో రాజు హసన్ ఆతిథ్యమి చ్చారు. ఈ భేటీలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కె.కౌల్, ఆయన సోదరుడూ, కేబినెట్ మాజీ సెక్రటరీ, అమెరికాలో భారత రాయబారి పి.కె. కౌల్ పాల్గొనేవారు. లెఫ్టినెంట్ జనరల్ సతీష్ నంబియార్, పాకిస్తాన్ మాజీ ఆర్మీ వైస్–చీఫ్ జనరల్ కె.ఎమ్. అరిఫ్, పాక్ ప్రముఖ పారిశ్రామికవేత్త బాబర్ ఆలీ ఈ సమావేశాల్లో సందర్భానుసారం పాల్గొనేవారు. ఈ బృంద సభ్యుల్లో అత్యంత నిజాయితీపరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ మహ్మద్ దురానీ. అత్యంత వివేచన, ఆశావాది, సైనికతత్వం కలిగిన ఇలాంటి పాకిస్తానీ జనరల్‌ని మీరు ఎన్నడూ చూసి ఉండరు. పాకిస్తాన్ మీడియాలోని కమాండో–కామిక్ తరహా వ్యాఖ్యాతలు ఈయనను ‘జనరల్ శాంతి’ అని అభివర్ణించేవారంటే ఆశ్చర్యం కలిగించదు. తర్వాత 2008లో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతల్లో ఉన్నప్పుడు, కసబ్ పాకిస్తానీ జాతీయుడే అని అంగీకరించడంలో ఎంతో సాహసాన్ని, నిజాయి తీని ప్రదర్శించారు. ఈ నిజాన్ని వ్యతిరేకించలేమని కూడా చెప్పారు. దానికి ప్రతిఫలం ఆయన పదవి ఊడిపోయింది. మహ్మద్ దురానీ నిజంగానే పాకిస్తాన్ దేశ భక్తుడు, దృఢసైనికుడు అనడంలో సందేహమే లేదు. సియాల్ కోట్ సెక్టర్లో ప్రత్యేకించి ఫిలోరా, చావిందా సమరాల్లో ఫస్ట్ ఆర్మర్డ్ డివిజన్ నేతృ త్వంలో భారత మెరుపు దాడుల దళాలు భీకర పోరు సల్పుతున్నప్పుడు, దురానీ పాక్ తరపున యువ ట్యాంక్ కమాండర్‌గా పోరాడారు. ఆనాటి పోరాటాన్ని బుద్ధిహీనమైన తీవ్రపోరా టంగా ఆయన అభివర్ణించారు. భారత్ పక్షాన నిజంగా అద్భుతమైన, ఎత్తుగడల పరమైన సైనిక చర్య జరిగిందంటే దానికి లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపోర్ కారణమని చెప్పారు. తన సైనిక రెజిమెంట్‌ను తారాపోర్ అత్యంత దూకుడుగా ముందుకు నడిపించారని, కానీ ఆర్టిల్లరీ కాల్పుల్లో తాను మరణించాడని దురానీ చెప్పారు. ఆ యుద్ధంలో ప్రకటించిన రెండు పరమ వీర చక్ర అవార్డులలో ఒకటి తారాపోర్కే దక్కింది. నేలకొరి గిన తారాపోర్ మృతదేహాన్ని దురానీ యుద్ధ క్షేత్రంలో స్వయంగా చూశారు. ప్రత్యర్థికి చెందిన వాడైనా ఆ సాహస సైనికుడి పట్ల దురానీ నేటికీ అత్యంత గౌరవం ప్రదర్శిస్తారు. 1987–88లో భారత్ దాదాపు రెండుసార్లు విజ యానికి అతిచేరువలోకి వచ్చి వెనుకడుగు వేసిందని రక్షణ రంగ పరిశీలకులు తరచుగా చెబుతుంటారు. మొదటిది 1987లో బ్రాస్ట్రాక్స్లో జరిగిన యుద్దం కాగా, రెండోది 1988లో జరిగిన శాంతి ప్రక్రియ. బహిరంగంగా ఇరుపక్షాలూ అధికారికంగా ప్రకటించ కున్నా, నిర్ధారించకపోయినా, సియాచిన్ ఒప్పందం దాదాపు ఖరారైందని అందరికీ అవగతమైంది. అది కూడా తెర వెనుక ఇలాంటి ప్రయత్నాలు, ఉద్రిక్తతల మధ్య కుదిరిన ఒప్పందాల వల్లే ఇది సాద్యమైంది. వీటివల్లే యుద్ధం నుంచి శాంతివైపుగా జరిగిన నాట కీయ పరిణామాలు, మళ్లీ యథాతథస్థితి నెలకొ న్నాయి. భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించు కుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్కి అధిక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు. తాజా కలం : లండన్ కేంద్రంగా పనిచేసి ఇంట ర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజిక్ స్టడీస్ అధ్వ ర్యంలో మాల్దీవుల్లోని కురుంబా గ్రామ రిసార్ట్‌లో జరిగిన ట్రాక్–2 రకం భారత–పాక్ సదస్సులో నేను మొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ అసద్ దురానీని కలిశాను. అది 1988 శీతాకాలం. అటల్ బిహారీ వాజ్ పేయీ, నవాజ్ షరీఫ్ పాలనలో భారత్–పాక్ సంబంధాల్లో కాస్త ప్రశాంతత నెలకొన్న సమయ మది. ఆ సమయంలో భారత్ వైపు నుంచి వాగాడం బరం నాటకీయంగా ఎందుకు తగ్గుముఖం పట్టిం దని దురానీ ఆశ్చర్యం వ్యక్తపర్చారు. కశ్మీర్లో పూర్తిగా సాధారణ స్థితి, శాంతి నెలకోవడమే దీనికి కారణమని నేను చెప్పాను. ఆ సమయంలో నేను జన రల్ దురానీ నుదురు ముడత పడటాన్ని, తీవ్ర దృక్కులను చూశాను. అప్పుడు దురానీ ఇలా చెప్పారు. ‘ఆ పరిస్థితి మారిపోవడానికి ఎంతోకాలం పట్టదు.‘ పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో మొదటిసారి చొరబాటు జరపడం ద్వారా ఇది నిజమైంది కూడా. ఆరు నెలల తర్వాత లేక ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 19 ఏళ్ల క్రితం ఇరుదేశాల సైన్యాలు అక్కడ యుద్ధం చేశాయి. ఆ తర్వాత ఐదేళ్లకు దురానీ రిటైరయ్యారు. అయినా సరే ఐఎస్ఐ బాస్‌గా ఆయనకు అన్ని వివ రాలూ తెలిసి ఉంటాయి. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
ఐసిస్ కదలికలపై ఇంటిలిజెన్స్ అప్రమత్తం
-
దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతిలో..!
డెహ్రాడూన్: దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. మరేం లేదు.. దేశ రక్షణకు సంబంధించిన అత్యున్నత పోస్టులన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే కైవసం చేసుకున్నారు. సహజంగానే దైవ భూమి, వీరభూమి అనే పేరున్న పర్వతాలమయమైన ఉత్తరాఖండ్.. పౌరుషాలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి ఎంతోమంది భారత ఆర్మీలో, జాతీయ భద్రతా దళంలో, పోలీసు విభాగంలో ఉన్నారు. తాజాగా దేశ సైన్యాధ్యక్షుడిగా ఎంపికైన లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, రా బాస్ గా ఎంపికైన అలిల్ ధస్మానా కూడా ఉత్తరాఖండ్‌కు చెందిన వారే కావడం విశేషం. వీరిద్దరు కూడా పౌరీ గర్వాల్ జిల్లాకు చెందినవారు కావడం మరింత చెప్పుకోదగిన విషయం. ఇంకా జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ కూడా పౌరీ గర్వాల్లోని గిరి బానెల్సియన్ ప్రాంతానికి చెందినవారు. ఒక కోస్టు గార్డు చీఫ్ గా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ అనిల్ భట్ ఇలా చాలా మంది రక్షణ విభాగంలో ఉన్నతాధికారులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్డ్ అయిన మేజర్ జనరల్ బీసీ ఖండూరి స్పందిస్తూ ఇది తమ రాష్ట్రానికి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. -
భారత నేవీ అధికారిని అరెస్ట్ చేసిన పాక్
ఇస్లామాబాద్: భారత నిఘా విభాగానికి చెందిన అధికారిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇండియన్ నేవీలో కమాండర్ స్థాయిలో ఉన్న అధికారి కుల్ యాదవ్ భూషన్ 'రా' సంస్థలో నిఘా అధికారిగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్టు బలోచిస్తాన్ ప్రాంతానికి చెందిన హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బుగి వెల్లడించారు. అనుమతి లేకుండా అధికారి తమ దేశంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఆందోళన చేపట్టి నిరసన తెలిపినందుకు భారత హై కమిషనర్ గౌతమ్ బాంబవాలేకు సమన్లు జారీచేస్తున్నట్లు పాక్ అధికారులు చెబుతున్నారు. బలోచిస్తాన్ వేర్పాటువాదులు, టెర్రరిస్టులతో భారత అధికారికి సంబంధాలు ఉన్నాయని పాక్ అధికారి బుగ్టి అరోపించారు. భారత్ మాత్రం పాక్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నిప్పులు కక్కిన మౌంట్ ఎట్నా