
జాన్ అబ్రహాం, మునీ రాయ్
జనరల్‌గా ‘రా (ఆర్.ఏ.డబ్యూ)’ అంటే డిఫెన్స్ డిక్షనరీలో ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ అని అర్థం వస్తుంది. కానీ రీల్‌పై రా అంటే... ‘రోమియో అక్బర్ వాల్టర్’ అంటున్నారు హిందీ హీరో జాన్ అబ్రహాం. రోబీ గ్రేవాల్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రం షూటింగ్ మొదలైంది.
ఇందులో కథానాయికగా మునీ రాయ్ నటిస్తున్నారు. హిందీ చిత్రం జాకీష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ‘స్పై’ పాత్రలో నటిస్తున్న జాన్ అబ్రహాం డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. గుజరాత్, ముంబై, ఢిల్లీలో మేజర్ షూటింగ్ జరపాలనుకుంటున్నారు. ‘కొత్త సినిమా జర్నీ మొదలైంది’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం.