Jackie Shroff
-
ఫిట్నెస్ ఫ్రీక్,స్టార్ కిడ్ కృష్ణ ష్రాఫ్: క్రేజీ ఫోటోస్
-
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్‌వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లాగా సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
రజినీకాంత్ 'జైలర్' మూవీ స్టిల్స్
-
36 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న నటుడు!
సౌత్ స్టార్ హీరో రజనీకాంత్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్ నటించనున్నారని, ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారని యూనిట్ ప్రకటించింది. కాగా 1987లో వచ్చిన హిందీ చిత్రం ‘ఉత్తర్ దక్షిణ్’ తర్వాత రజనీకాంత్, జాకీష్రాఫ్ మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ‘జైలర్’ కావడం విశేషం. దాదాపు 36 ఏళ్ల తర్వాత రజనీ, జాకీష్రాఫ్ కలిసి నటిస్తున్నారన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ మేరకు తమన్నా ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజైంది. ఈ మూవీలో మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో పాటు కన్నడ హీరో శివరాజ్‌కుమార్, కమెడియన్ సునీల్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. Jackie Shroff from the sets of #Jailer 🔥 @rajinikanth @bindasbhidu @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/O9ees6RuJt— Sun Pictures (@sunpictures) February 5, 2023 చదవండి: బ్లాక్‌బస్టర్ గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ -
ప్రియమణి 'కొటేషన్ గ్యాంగ్' టీజర్ చూశారా?
నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కొటేషన్ గ్యాంగ్. ఇందులో బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, సన్నీలియోన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిల్మినెటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈయన దర్శకుడు బాల శిష్యుడు. డ్రమ్స్ శివమణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. 'కిరాయి హత్యలు చేసే గ్యాంగ్ కథే ఈ సినిమా. చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో కథ సాగుతుంది. అయితే ఈ మూడింటికి ఒక లింకు ఉంటుంది. మొదట చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని భావించాం. అయితే షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత విజువల్స్, మేకింగ్ ఆఫ్ కంటెంట్ చూశాక ఇది థియేటర్లో విడుదల చేయాల్సిన చిత్రమని భావించాం. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. ఏప్రిల్‌లో కొటేషన్ గ్యాంగ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. చిత్ర టీజర్ చూడగానే తాను ఆశ్చర్యపోయి దీనికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు డ్రమ్స్ శివమణి చెప్పారు. చదవండి: రివాల్వర్ రీటాగా కీర్తి సురేశ్ -
థియేటర్లలో పాప్ కార్న్ 500 రూపాయలా..?
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఓ ఆసక్తికర అంశంపై మాట్లాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశంలో ఆయన తన మాటలతో కాసేపు నవ్వులు పూయించారు. యూపీలో షూటింగ్‌లు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాలీవుడ్ ప్రముఖులతో ముంబైలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు జాకీ ష్రాఫ్ సీఎం యోగిని అభ్యర్థించారు. థియేటర్లలో పాప్‌కార్న్ ధరను తగ్గించాలని జాకీ ష్రాఫ్ యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. పాప్‌కార్న్ 500 రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. 'థియేటర్లలో పాప్‌కార్న్ కోసం రూ.500 తీసుకుంటున్నారు. దయచేసి పాప్‌కార్న్ ధర తగ్గించండి. సినిమా తీస్తున్నాం. స్టూడియోలు కడుతున్నాం. కానీ సినిమా టికెట్ కంటే ఎక్కువగా పాప్ కార్న్ ధరలు ఉంటే థియేటర్‌కు వచ్చేదేవరు?' అని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఉత్తరప్రదేశ్‌లోని సినిమాల షూటింగ్‌పై హిందీ చిత్రనిర్మాతలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. CM योगी से बोले जैकी श्रॉफ़- घर का खाना चाहिए तो मिल जाएगा. थिएटर में पॉपकॉर्न की कीमत कम करो. pic.twitter.com/dqXFXXhrPo — UnSeen India (@USIndia_) January 6, 2023 -
ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్
80వ దశకంలో కెరీర్ స్టార్ట్ చేసి తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కలిశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ రీయూనియన్ వేడుకకి బాలీవుడ్ నటుడు జాపీ ష్రాఫ్ ఆదిథ్యం ఇచ్చాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, భానుచందర్, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్, అనుపమ్ ఖేర్, శరత్ కుమార్, అర్జున్, అనిల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. గేమ్ ఆడుతూ..డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ సీనియర్ నటులు ప్రతి ఏటా రీయూనియన్ వేడుక నిర్వహిస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో హీరో ఈ వేడుకలను ఆతిథ్యం ఇస్తుంటారు. 2020లో జరిగిన రీయూనియన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: ‘రంగమ్మ..మంగమ్మ’ పాటకు అక్షయ్‌తో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్) -
ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా చేయని టబు! మారిషస్‌లో అప్పుడేమైంది?
భారత్‌లో అత్యున్నత నాలుగో అవార్డు పద్మ శ్రీ సాధించిన ఘనత. జాతీయ ఉత్తమ నటిగా రెండు అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డులు. చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు మరెన్నో పురస్కారాలు, విమర్శకుల ప్రశంసలు. 52 ఏళ్ల వయసులోనూ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ బిజీబిజీ. నేడు దిగ్గజ నటి టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు..! 1985లో ఎవర్గ్రీన్ నటుడు దేవానంద్ నవ్ జవాన్ సినిమాలో టీనేజర్ కేరెక్టర్ ద్వారా టబు సినీరంగ ప్రవేశం చేసింది. 1991లో విక్టరీ వెంకటేష్ హీరోగా కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసిన టబు తనకంటూ ప్రత్యేక గుర్తింపుపొందింది. 1994లో బాలీవుడ్ మూవీ విజయ్పథ్లో నటించి ఫిలింఫేర్ అవార్డు గెలుపొందింది. గుల్జార్, మాచీస్ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు, ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. నాగార్జున కెరీర్‌ని మరో మలుపు తిప్పిన నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు నటన యువతకు గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాకు కూడా ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. విరాసత్, అస్థిత్వ, చాందినీ బార్ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. తదనంతరం కాలంలో సపోర్టింగ్ కేరెక్టర్లతోనూ రాణిస్తోంది. అంధాధూన్, భూల్‌భులయ్యా-2, దృశ్యం-2 వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ టబు బిజీ అయింది. అయితే, తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోని ఆమె జీవితంలో ఓ చేదు ఘటన దాగుంది. (చదవండి: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న అందమైన భామలు వీళ్లే) టాప్ హీరోయిన్ చెల్లి టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. ఆమె సోదరి ఫరా నాజ్ అప్పట్లో టాప్ హీరోయిన్. సోదరి వెంట టీనేజర్‌గా ఉన్న టబు షూటింగ్ స్పాట్లకు వెళ్లేది. అలా వెళ్లిన సమయంలోనే 1980లో లైంగిక వేధింపులకు గురైంది. ఒరిస్సా పోస్టు 1986లో ఇచ్చిన కథనం ప్రకారం.. జాకీ ష్రాఫ్, ఫరా నాజ్ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా షూటింగ్ మారిషస్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు డేనీ డెంగ్జోపా అక్కడే తన ఇంట్లో చిత్ర యూనిట్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. పార్టీలో ఫరా నాజ్తోపాటు టబు కూడా పాల్గొంది. అయితే, ఫరా నాజ్ ఫూటుగా తాగి పడిపోయింది. సోదరి పరిస్థితి చూసి అప్పటికే భయంతో వణిపోయిన టబుకు మరో ఉపద్రవం వచ్చిపడింది. మద్యం మత్తులో ఉన్న జాకీ ష్రాఫ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన డేనీ డెంగ్జోపా ఆ స్థితిలో నుంచి టబును రక్షించాడు. తర్వాత ఈ విషయం కొద్దికాలం ఎక్కడా బయటకు పొక్కలేదు. కానీ, ఫరా నాజ్ తన సోదరి పట్ల జాకీ ష్రాఫ్ ప్రవర్తనను ఎండగట్టింది. లైంగికంగా తన చెల్లెలిని వేధించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంత జరిగినా టబు ఎక్కడా ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం. ఎందరో నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె జాకీ ష్రాఫ్‌తో మాత్రం లీడ్ రోల్స్‌లో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ చేయలేదు. గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరగడం మామూలైపోయింది. (చదవండి: చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా? ఆమె కామెంట్స్ వైరల్) -
టైగర్ ష్రాఫ్ చెల్లెలి హాట్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్
Tiger Shroff Sister Krishna Shroff Hot Photoshoot Goes Viral: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె తన తండ్రి జాకీ ష్రాఫ్, సోదరుడు టైగర్ ష్రాఫ్‌ల బాలీవుడ్ స్టార్ కాదు. కానీ ఆమెకు గణనీయమైన అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తన టోన్డ్ బికినీ బాడీ చిత్రాలతో ఇన్‌స్టా గ్రామ్‌లో హీట్ పెంచుతూ ఉంటుంది. ఇటీవలే ఆమె 'రాశీ సూద్' పంజాబీ సాంగ్ 'కిన్ని కిన్ని వారి'లో డెబ్యూగా నటించింది. అలాగే కృష్ణ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక ఫొటోషూట్‌కు కృష్ణ హాట్‌హాట్‌గా ఫోజులివ్వడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) కొన్ని మ్యాగజైన్ల కవర్‌పై వచ్చిన కృష్ణ ష్రాఫ్ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బోల్డ్ ఫొటోషూట్ కోసం 28 ఏళ్ల కృష్ణ మొత్తం బ్లాక్ డ్రెస్‌లో హాట్‌గా ఫొజులిచ్చింది. ఆమె రాకీస్టార్ బాడీసూట్ ధరించి మోకాళ్ల వరకు ఎత్తైన బూట్లను మ్యాచింగ్‌గా వేసుకుంది. ఈ ఫొటోపై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ 'వావ్' అని కామెంట్ చేసింది. దిశా పటానీకి, టైగర్ ష్రాఫ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు రావడం తెలిసిందే. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) కృష్ణ ష్రాఫ్ తన డ్రెస్సింగ్, ఫ్యాషన్, ఫొటోషూట్ల విషయంలో విభిన్న శైలీ కలిగి ఉంది. అందుకే ఆమె ఏం పోస్ట్ చేసిన ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కృష్ణకు ఆమె సోదరుడు, తండ్రిలా బాలీవుడ్‌లోకి వచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. అయినా ఆమె తాజా పోస్ట్‌లు, ఫొటోషూట్లతో తనకు విపరీతంగా అభిమానులు పెరిగారు. కృష్ణ ష్రాఫ్ ముంబైలోని ఎమ్ఎమ్ఎ మ్యాట్రిక్స్ ఫిట్నెస్ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తుంది. -
భయపడుతూనే నటుడి బనియన్ వేసుకున్నా: ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ మాటోండ్కర్, హీరో అమీర్ ఖాన్, నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగీలా' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఊర్మిళ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో తన్హ తన్హ యహా పె జీన్.. సాంగ్ కూడా ఎంతో పాపులర్. తాజాగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ఊర్మిళ. ఈ సాంగ్ ప్రారంభంలో ఊర్మిళ ఒక బనీన్ వేసుకుని బీచ్ ఒడ్డున పరిగెడుతూ ఉంటుంది కదా, ఆ బనీన్ నటుడు జాకీ ష్రాఫ్‌ది అన్న సీక్రెట్‌ను బయటపెట్టింది. 'ఈ పాట చాలా సహజంగా రావాలనుకున్నాం, దీంతో జాకీ తన బనియన్ ధరించమని చెప్పాడు. నేను కొంచెం భయపడుతూనే దాన్ని వేసుకుని సాంగ్ షూట్ చేశాం. మొత్తానికి ఈ పాట హిట్టై ప్రశంసలు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను' అని ఊర్మిళ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. -
పప్పులో కాలేసిన బాలీవుడ్ స్టార్.. మమ్ముట్టికి బదులు చిరుకు విషెస్
మలయాళ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి మంగళవారం (సెప్టెంబర్ 7న) 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది నటులు, రాజకీయవేత్తలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ పొరపాటున మలయాళ మెగాస్టార్‌కి బదులు టాలీవుడ్ మెగాస్టార్‌కి విషెస్ తెలిపాడు. మలయాళీ నటుడు రెహమాన్ ట్విటర్లో మమ్ముక్కతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పోస్ట్ కింద ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలి చిరు గారు’ అంటూ జాకీష్రాప్ కామెంట్ చేశాడు. తప్పును గుర్తించిన ఓ ట్విటర్ యూజర్ తెలిపిన్పటికీ జగ్గుదాదా ఆన్లైన్ లేకపోవడంతో డిలీట్ చేయలేదు. -
అప్పులపాలు, ఇల్లు కోల్పోయాను, కానీ..: జాకీ ష్రాఫ్
మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి 'హీరో' సినిమాతో వెండితెరపై కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు జాకీ ష్రాఫ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన హీరోగా, విలన్‌గా పలు హిందీ చిత్రాల్లో నటించాడు. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన జీవితంలో చవిచూసిన కష్టనష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "ఏదో ప్రయత్నించాను, కానీ ఇంకేదో జరిగి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది, అప్పులబారిన పడ్డాను. ప్రతి ఒక్కరికీ రుణాలను చెల్లించి కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తపడ్డాను. అయినా వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. కొన్నిసార్లు పై నుంచి కిందపడటం, కింద నుంచి మళ్లీ పైకి ఎదగడం జరుగుతూ ఉంటాయి. కానీ నా కొడుకు టైగర్ ష్రాఫ్ మాత్రం నేను కోల్పోయిన ఇంటిని తిరిగి నాకు అప్పజెప్తానని మాటిచ్చాడు. తన తల్లిదండ్రులకు ఇల్లు ఉండాలన్న వాడి ఆలోచనకు ముచ్చటపడిపోయాను. నా పిల్లలను చూస్తుంటే గర్వంగా అనిపించింది" "నిజానికి ఆ ఇంటిని తిరిగి తీసుకోవడం నా భార్యకు అస్సలు ఇష్టం లేదు. పోయిందేదో పోయింది.. ఇక దాని గురించి పట్టించుకోకు అని చెప్తూ ఉండేది. కానీ మాకిష్టమైన ఆ ఇంటిని తిరిగివ్వాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. మా పిల్లలెప్పుడూ మమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకున్నారు" అని చెప్పుకొచ్చాడు. కాగా అప్పులపాలైన సమయంలో జాకీ తన ఇంట్లోని ఒక్కో వస్తువును అమ్ముతూ ఆఖరికి తన బెడ్‌ను కూడా అమ్మేసి కటిక నేల మీద పడుకున్నాడు. తన జీవితంలో అవి అత్యంత దుర్దినాలని గతంలో ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ 'ఓకే కంప్యూటర్' అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఇందులో ఆయన ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా కనిపించాడు. సైన్స్‌ని వ్యతిరేకించే వ్యక్తిగా ఆకులు, పువ్వులను శరీరానికి కప్పుకునే పాత్రలో ఆకట్టుకున్నాడు. చదవండి: ఆ నటుడిని హాఫ్ బాయిల్ అన్న గూగుల్! -
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్ సర్హాది (87) ముంబైలో సోమవారం ఉదయం మరణించారు. నూరి, బజార్, కబీ కబీ, సిల్సిలా, చాందిని, దీవానా, కహో నా ప్యార్ హై చిత్రాలలో పనిచేసినందుకు ఆయన మంచి పేరును తెచ్చుకున్నారు. ఉర్దూ నాటక రచయితగా ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. సాగర్ సర్హాది 1976లో హిట్ అయిన కబీ కబీ కి డైలాగ్స్ రాసిన తరువాత భారీగా ప్రజాదరణ పొందారు. అతడు చేసిన కృషికిగాను ఉత్తమ డైలాగ్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. కబీ కబీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్, రాఖీ, వహీదా రెహ్మాన్, దివంగత నటుడు రిషి కపూర్, నీతు సింగ్ నటించారు. దీనికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు. కబీ కబీ చిత్రం తరువాత , సాగర్ సర్హాది నూరి(1979), చాందిని(1989), సిల్సిలా(1981) సినిమాలకు డైలాగ్స్ రాశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాగర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జాకీ ష్రాఫ్ సంతాపం తెలుపుతూ... "విల్ మిస్ యు ... రిప్ సాగర్’ అంటూ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బ్లాక్ అండ్ ఫోటోను పోస్ట్ చేశారు. సర్హాది స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Jackie Shroff (@apnabhidu) (చదవండి: కోవిడ్ టీకా వేయించుకున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర! ) -
సల్మాన్, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా, దిశా పటానీ, జాకీ ష్రాఫ్, జరీనా వహాబ్ కీలక పాత్రలు చేశారు. ‘‘సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాలు రంజాన్‌కు విడుదలై సూపర్‌హిట్ సాధించాయి. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కూడా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సల్మాన్, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్. ఈ ఫైట్‌ను ఓ కొరియన్ స్టంట్ టీమ్ డిజైన్ చేసింది. సల్మాన్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఓ యాక్షన్ ట్రీట్’’ అని చిత్రబృందం పేర్కొంది. నిజానికి ఈ సినిమా 2020 ఈద్‌కు విడుదల కావాల్సింది. కానీ కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్ల అభ్యర్థనల మేరకు సల్మాన్ ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో సల్మాన్ సినిమా థియేటర్స్‌లోకి వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. -
వెబ్ సిరీస్‌లో బట్టల్లేకుండా కనిపించనున్న హీరో
హీరోగా, విలన్‌గా జాకీ ష్రాఫ్‌కి హిందీలో మంచి గుర్తింపు ఉంది. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తుంటారు. ప్రస్తుతం ‘ఓకే కంప్యూటర్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారాయన. ఇందులో ఆయన పాత్ర పేరు పుష్పక్. ఈ సిరీస్ ట్రైలర్లో దుస్తులు లేకుండా చెట్లు, పొదల చాటున దాక్కుని కనబడతారు జాకీ. నాకు కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం లేదంటున్నారాయన. ‘ఓకే కంప్యూటర్’ గురించి జాకీ మాట్లాడుతూ – ‘‘ఇందులో సాంకేతికతను, సైన్స్‌ని వ్యతిరేకించే వ్యక్తిగా నటిస్తున్నాను. టెక్నాలజీతో పాటు యువతరం పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నా పాత్ర చెబుతుంటుంది. ఈ పాత్రకు తగ్గట్టుగా రాలిపోయిన ఆకులు, పువ్వులను నా శరీరానికి కప్పుకుంటాను. అందుకే కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం లేదన్నాను’’ అని చెప్పారు. చదవండి: శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా! -
ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ
‘హీరో’ సినిమా కోసం జాకీష్రాఫ్‌ను తీసుకున్నాక దర్శకుడు సుభాష్ ఘాయ్ ‘నీకు ఫ్లూట్ తెలుసా?’ అని అడిగాడు. ‘ఆ... దూరం నుంచి ఒకసారి చూశాను’ అన్నాడు జాకీష్రాఫ్. సుభాష్ ఘాయ్ గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ‘హీరో’ సినిమాలో హీరో ఫ్లూటిస్ట్. సినిమా సంగీతం అంతా ఫ్లూట్ మీదే ఆధారపడి ఉంది. జాకీ ష్రాఫ్‌కు ఫ్లూట్ పట్టుకోవడం కూడా రాదు. ఈ మైనస్‌ను తాను ఎలా ప్లస్ చేశాడో ‘ఇండియన్ ఐడెల్’ తాజా ఎపిసోడ్లో సుభాష్ ఘాయ్ విశేషంగా చెప్పారు. 1983లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘హీరో’. సుభాష్ ఘాయ్‌ని ‘షో మేన్’ను చేసిన సినిమా ఇది. దీనికి ముందు సుభాష్ ఘాయ్ రిషి కపూర్‌తో ‘కర్జ్’ ఇచ్చాడు. అయితే ఈసారి పూర్తిగా కొత్త వాళ్లతో సినిమా తీద్దామనుకున్నాడు. ఈ విషయం తెలిసిన జాకీ ష్రాఫ్ సుభాష్ ఘాయ్‌ని కలిశాడు. అతను అప్పటికి మోడల్‌గా పని చేస్తున్నాడు. ‘నీకు యాక్టింగ్ వచ్చా’ అని అడిగాడు సుభాష్ ఘాయ్. ‘రాదు’ అన్నాడు జాకీ. ‘ఏదీ... ఈ సీన్ చేసి చూపించు’ అనంటే సీన్‌పేపర్ తీసుకుని ‘ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ’ అన్నాడు. ఆ ఫ్రాంక్‌నెస్ సుభాష్‌కు నచ్చింది. ‘నువ్వే నా సినిమా హీరో’ అని అప్పటికప్పుడు చెప్పేశాడు. దానికి జాకీ ష్రాఫ్ ఆశ్చర్యపోయి ‘సార్... నేను నిజాలు మాట్లాడే మనిషిని. ఈ మధ్యే ఒక సినిమాలో శక్తికపూర్ అసిస్టెంట్‌కు అసిస్టెంట్‌గా నటించా. నన్ను మీరు హీరో అంటున్నారు. ఆలోచించుకోండి’ అన్నాడు. ఆ మాటలకు ఇంకా నచ్చేశాడు సుభాష్ ఘాయ్‌కు. ‘హీరో’ సినిమా షూటింగ్ మొదలైంది. అందులో హీరో ఫ్లూట్ వాయిస్తుంటాడు. ‘నాకు ఫ్లూట్ పట్టుకోవడం కూడా రాదు’ అన్నాడు జాకీ ష్రాఫ్. టేప్ రికార్డర్లో ఫ్లూట్ల బిట్ వస్తుంటే తెల్ల ముఖం వేసుకుని చూస్తున్నాడు. ‘సరే... నీకు మెడ ఊపడం వచ్చా?’ అని అడిగారు సుభాష్ ఘాయ్. ‘వచ్చు’ అన్నాడు జాకీ ఫ్రాఫ్. ‘అయితే ఫ్లూట్ పట్టుకుని దాని ధ్వని ఎలా పోతుంటే అలా తల ఊపు. అప్పుడు నీ తలను చూస్తారు. వేళ్లను కాదు’ అన్నారు సుభాష్ ఘాయ్. జాకీ ష్రాఫ్ అలాగే ఊపాడు. సినిమా చూస్తే అతను నిజంగా వాయిస్తున్నట్టు ఉంటుంది. ఈ విశేషాలు జనవరి 23న ప్రసారం అయిన ‘ఇండియన్ ఐడెల్’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుభాష్ చెప్పారు. ‘కర్జ్’లో ‘ఓం శాంతి ఓం’ పాట రికార్డు చేయడానికి కిశోర్ కుమార్ కోసం 4 నెలలు వెయిట్ చేశారట ఆయన. ‘నా కోసం ఎందుకు? వేరే ఎవరి చేతైనా పాడించవచ్చుగా’ అని కిశోర్ కుమార్ అడిగితే ’ఈ పాటకు నాకు పెర్ఫార్మర్ కావాలి. మీకు మించిన పెర్ఫార్మర్ ఎవరున్నారు’ అన్నారట సుభాష్. ‘ఆ పాట ఆయన వల్లే అంత బాగుంది’ అన్నారాయన. ‘తాళ్’ సినిమా కోసం రహమాన్ని బుక్ చేశాక రహమాన్ని తీసుకొని గీత రచయిత ఆనంద్ బక్షీ ఇంటికి వెళ్లారట. అక్కడ ఇద్దరికీ ఒకరినొకరిని పరిచయం చేసి 15 నిమిషాలు కూచుంటే ఇద్దరూ ఒక్క మాట మాట్లాడుకోలేదట. దానికి కారణం ఆనంద్ బక్షీకి ఇంగ్లిష్ రాదు. రహమాన్‌కు హిందీ రాదు. ‘సుభాష్ ఘాయ్ వల్లే నేను హిందీ నేర్చుకున్నాను’ అని రహమాన్ ఈ ఎపిసోడ్లో వీడియో సందేశంలో అన్నాడు. తాళ్ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిజంగా సుభాష్ ఘాయ్ పెద్ద షో మేన్. పామరుణ్ణి రంజింప చేసిన దర్శకుడు. జనవరి 24 ఆయన జన్మదినం. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ షో మ్యాన్ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఖల్నాయక్’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ చేసినది యాంటీ హీరో రోల్ అయినప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 27 ఏళ్ల తర్వాత దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ చిత్రం సీక్వెల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి భాగంలో సంజయ్ దత్ చేసిన విలన్ బల్లూ పాత్రను సీక్వెల్లో వేరే హీరో చేయబోతున్నారు. ‘ఖల్నాయక్’ చిత్రంలో హీరో పాత్రను చేశారు జాకీ ష్రాఫ్. ఇప్పుడు ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ మలి భాగంలో యాంటీ హీరో రోల్ చేయనున్నారు. ‘వార్’ సినిమా తర్వాత విలన్‌గా టైగర్ ష్రాఫ్‌కి మంచి మార్కులు పడటంతో మరో పవర్ఫుల్ విలన్ ‘ఖల్నాయక్’ పాత్రకు టైగర్ సై అన్నారట. జైలు నుండి బయటకు వచ్చే సంజయ్ దత్ పాత్రతో సినిమా కథ ప్రారంభమవుతుందని తెలిసింది. తొలి భాగంలో గంగ పాత్ర చేసిన మాధురీ దీక్షిత్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. కథానాయిక పాత్రకు ఓ ప్రముఖ నటిని అనుకుంటున్నారు. ‘ఖల్నాయక్’ని గ్యాంగ్‌స్టర్ కథగా తీశారు. సీక్వెల్‌ను డ్రగ్ మాఫియా నేపథ్యంలో చిత్రీకరించాలనుకుంటున్నారని సమాచారం. -
రజనీ వర్సెస్ జాకీ
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. -
పొలం పనుల్లో బిజీగా ఉన్న నటుడు
లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు, లొకేషన్లు అంటూ హడావుడిగా తిరిగే సినిమావాళ్లకు బోలెడంత ఖాళీ సమయం దొరికింది. అయితే చాలామంది ఇంటిపని, వంటపని చేస్తూ వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ నటుడు మాత్రం అవన్నీ కాదు కానీ అంటూ రైతు అవతారం ఎత్తాడు. నటుడు జాకీష్రాఫ్ తన ఫార్మ్‌హౌస్‌లో ఉన్న సమయంలోనే లాక్డౌన్ ప్రకటించారు. దీంతో జాకీ అక్కడే చిక్కుకుపోగా అతని కుటుంబం మాత్రం ముంబైలో ఉంది. అయితే కుటుంబసభ్యులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారీ నటుడు. (కరోనా: పాజిటివ్ వార్తను చెప్పిన హీరో) ఈ సందర్భంగా ఆయన భార్య ఐశా.. జాకీ అక్కడ ఏం చేస్తున్నారన్న విషయాలను వెల్లడించింది. ఒక్కడే ఉంటున్నందుకు ఏమాత్రం బోర్ ఫీల్ అవట్లేదని తెలిపింది. పొలంలోని మొక్కలే అతనికి మంచి కంపెనీ ఇస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రకృతి పైర గాలులను ఆనందంగా ఆస్వాదిస్తున్నాడని పేర్కొంది. కాగా జాకీ ష్రాఫ్‌కు మొక్కలంటే ఎంతో ఇష్టం. అతని గార్డెన్లో సేంద్రీయ కూరగాయలతో పాటు పంటలు కూడా పండిస్తారు. విరివిగా మొక్కలు నాటాలంటూ అభిమానులను సైతం ప్రోత్సహించేవాడు. అంతేకాకుండా అతని 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొంత భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (నాన్నతో కలిసి నటించను: టైగర్ ష్రాఫ్) -
మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి
ముంబై : తనకు రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు క్రిష్ణా ష్రాఫ్ అన్నారు. తన పెళ్లి గురించి క్రేజీ వార్తలు ఎందుకు ప్రచారం అవుతున్నాయో అర్థం కావడం లేదని వాపోయారు. ‘భాగీ’ ఫేం, తన అన్నయ్య టైగర్ ఫ్రాఫ్‌తో కలిసి క్రిష్ణా ఓ ఫిట్నెస్ సెంటర్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీల సందడితో ఈ స్టార్ కిడ్స్ జిమ్ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాకు బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్ పరిచయమయ్యాడు. ఇక అప్పటి నుంచి టైగర్ బెస్టీగా గుర్తింపు పొందిన ఇబాన్.. క్రిష్ణాతో ప్రేమలో పడ్డాడంటూ బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇబాన్ తన ఇన్‌స్టా స్టోరీలో క్రిష్ణ గురించి చెబుతూ ‘వైఫీ’ అని సంబోధించడంతో వారి పెళ్లి అయిపోందని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. సోదరుడు టైగర్‌తో క్రిష్ణా ష్రాఫ్ అదే విధంగా..‘మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్..ఇదే మేము కోరుకుంటున్న స్వర్గం..ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఇదే మా గమ్యం’ అంటూ తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోను క్రిష్ణ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఈ విషయంపై స్పందించిన క్రిష్ణ మాట్లాడుతూ...‘ బిగ్గరగా నవ్వాలని ఉంది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయి. మేము రహస్యంగా వివాహం చేసుకున్నామనడం క్రేజీ. ఇలాంటి వార్తలు విని మా అమ్మ కూడా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతోంది. అసలేం జరిగిందో చెప్పమంటూ పోరు పెడుతోంది. ఇబాన్, టైగర్ ఐదేళ్లుగా మంచి స్నేహితులు. అలా నాకు కూడా తను పరిచయం. వాళ్లిద్దరూ కలిసి బాస్కెట్ బాల్ ఆడటం నేను ఎంజాయ్ చేస్తా’ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపడేశారు. కాగా తన సోదరుడు టైగర్.. హీరోయిన్ దిశా పటానీతో కలిసి బాహాటంగానే చక్కర్లు కొడుతున్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదంటూ క్రిష్ణ తన సోదరుడి ప్రేమ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోదరుడితో పాటు తన రిలేషన్షిప్ గురించి కూడా క్రిష్ణ బాగానే కవర్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram Minding our own business like it’s our own company, this is destiny, we meant to be, something so special, like it’s heavenly. ♾ #justforyou @ebanhyams @doitall23 A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on Sep 3, 2019 at 9:50am PDT -
‘సాహో’ టాక్.. ఆ సెంటిమెంట్లే కారణమా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. యూవీ క్రియేషన్స్ సంస్థ సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి డివైడ్ టాక్ రావటంపై అభిమానులు రకరకాల కారణాలు చెపుతున్నారు. (మూవీ రివ్యూ : ‘సాహో’) రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు తదుపరి చిత్రాలు పెద్దగా కలిసి రావన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించాడు తారక్, అయితే ఆ సినిమాల తరువాత ఎన్టీఆర్‌కు వరుసగా సుబ్బు, ఆంద్రావాలా, కంత్రీ లాంటి భారీ డిజాస్టర్లు వచ్చాయి. మగధీర లాంటి భారీ హిట్ తరువాత రామ్‌చరణ్‌కు కూడా ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైంది. విక్రమార్కుడు సినిమా తరువాత రవితేజ కూడా ఖతర్నాక్ సినిమాతో నిరాశపరిచాడు. గతంలో రాజమౌళితో కలిసి ఛత్రపతి సినిమా చేసిన ప్రభాస్‌కు తరువాత పౌర్ణమి సినిమాతో షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తరువాత చేసిన సాహోకు కూడా నెగెటివ్ వస్తుండటంతో ఆ వాదనకు మరింత బలం చేకూరినట్టైంది. సాహో ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి, ప్రభాస్ అంతేకాదు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగులో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. అస్త్రం, శక్తి, పంజా లాంటి తెలుగు సినిమాల్లో నటించాడు జాకీ. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ కావటంతో ఈ నటుడిపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు. పంజా తరువాత తెలుగు సినిమాల్లో నటించని జాకీని సాహో కోసం తీసుకొచ్చారు చిత్రయూనిట్. జాకీ ష్రాఫ్ (ఫైల్ ఫోటో) దీంతో సినిమాకు నెగెటివ్ టాక్ రావటానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు టాలీవుడ్లో దర్శకులకు ద్వితీయ విఘ్నం అనే సెంటిమెంట్ కూడా ఉంది. దాదాపు టాలీవుడ్ దర్శకులంతా రెండో సినిమాతో నిరాశపరిచారు. అందుకే సుజీత్ విషయంలోనూ అదే సెంటిమెంట్ నిజమౌతుంది అన్న ప్రచారం జరుగుతోంది. -
‘సాహో’ మూవీ స్టిల్స్
-
ఒప్పుకో.. లేదా చచ్చిపో
అతని పేరు రాయ్. అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. ఒకటీ అతను చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదా చచ్చిపోవడం. సింపుల్. ‘సాహో’లో ఇలాంటి పాత్రనే పోషిస్తున్నారు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ‘సాహో’ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. గురువారం ‘రాయ్’ పాత్రధారి జాకీ ష్రాఫ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మించారు. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. -
నాన్నతో కలిసి నటించను
... అంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో, జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్. ఎవ్వరైనా తమ తల్లిదండ్రులతో యాక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ టైగర్ మాత్రం భయపడుతున్నాడు. ఆ భయానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘‘నాన్న, నేను కలసి నటించాలంటూ చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ సరైన స్క్రిప్ట్ రావాలి. అలాగే ప్రస్తుతానికి నాన్నగారితో నటించలేను. నాన్న, నేను ఒకే ఫ్రేమ్‌లో ఉంటే కచ్చితంగా నేను ఫ్రీజ్ అయిపోతాను. అందుకే ఇప్పట్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసు కోను’’ అన్నాడు. మరి మీ సినిమాలను గురించి నాన్నతో డిస్కస్ చేస్తారా? అని అడగ్గా – ‘‘నేను ఏ సినిమా చేస్తున్నాను, స్క్రిప్ట్ విషయాలు ఎప్పుడూ నాన్నతో డిస్కస్ చేయను. సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే నాన్నకు చూపిస్తాను. చూశాక, ‘బిందాస్. చాలా బావుంది. పాస్ అయ్యావు’ అని మాత్రం చెబుతారు. నాన్నే నా పెద్ద విమర్శకుడు అని భావిస్తాను’’ అని చెప్పారు.