
ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ కోసం ముంబై ఇండియన్స్(Mumba Indians) తమ సన్నాహకాలను ప్రారంభించింది. వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లు ఇప్పటికే ముంబై శిబిరంలో చేరారు. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ జట్టు స్పిరిట్ కోచ్' గా బాలీవుడ్ ఐకాన్ జాకీ ష్రాఫ్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం నియమించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ముంబై సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదల పెంచేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఐపీఎల్-2024లో గ్రూపు స్టేజికే పరిమితమైన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం సత్తాచాటాలని భావిస్తోంది.
భారీ షాక్..
అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బమ్రా గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో బుమ్రా ముంబై జట్టులో చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్-2025కు ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్‌ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, సీ బోచ్, విగ్నేష్ పుతుర్.
చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?
Saans le lamba & shaanti coz 𝙅𝘼𝙂𝙂𝙐 𝘿𝘼𝘿𝘼 - aapla Spirit Coach is here! 🧘♂️😎#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/md5fnlJKX9
— Mumbai Indians (@mipaltan) March 13, 2025