
ముంబై: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్ సర్హాది (87) ముంబైలో సోమవారం ఉదయం మరణించారు. నూరి, బజార్, కబీ కబీ, సిల్సిలా, చాందిని, దీవానా, కహో నా ప్యార్ హై చిత్రాలలో పనిచేసినందుకు ఆయన మంచి పేరును తెచ్చుకున్నారు. ఉర్దూ నాటక రచయితగా ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. సాగర్ సర్హాది 1976లో హిట్ అయిన కబీ కబీ కి డైలాగ్స్ రాసిన తరువాత భారీగా ప్రజాదరణ పొందారు. అతడు చేసిన కృషికిగాను ఉత్తమ డైలాగ్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. కబీ కబీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్, రాఖీ, వహీదా రెహ్మాన్, దివంగత నటుడు రిషి కపూర్, నీతు సింగ్ నటించారు.
దీనికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు. కబీ కబీ చిత్రం తరువాత , సాగర్ సర్హాది నూరి(1979), చాందిని(1989), సిల్సిలా(1981) సినిమాలకు డైలాగ్స్ రాశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాగర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జాకీ ష్రాఫ్ సంతాపం తెలుపుతూ... "విల్ మిస్ యు ... రిప్ సాగర్’ అంటూ..తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బ్లాక్ అండ్ ఫోటోను పోస్ట్ చేశారు. సర్హాది స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
(చదవండి: కోవిడ్ టీకా వేయించుకున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర! )
Comments
Please login to add a commentAdd a comment