Know Reason Behind Why Vijay Deverakonda Went Mumbai, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda : ముంబైకు వెళ్లిన విజయ్‌ దేవరకొండ.. కారణమిదే!

Published Fri, Nov 25 2022 12:22 PM | Last Updated on Fri, Nov 25 2022 12:38 PM

Vijay Devarakonda Is In Mumbai Due To This Reason - Sakshi

ఈ ఏడాది లైగర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో విజయ్‌ దేవరకొండ. పాన్‌ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫలితం అనంతరం ఇంతవరకు కొత్త ప్రాజెక్టులేవీ సైన్‌ చేయలేదు విజయ్‌. ప్రస్తుతం శివనిర్వాణ డైరెక్షన్‌లో ఖుషీ అనే లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు.

సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ పడింది. దీంతో ఖుషీ కొత్త షెడ్యూల్‌ కోసం రౌడీ హీరో ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్‌ ముంబైలో ఉన్నట్లు టాక్‌ వినిపిసస్తుంది. ఇంతకీ ముంబైలో ఏం చేస్తున్నాడనే కదా మీ డౌటు.మెహబూబ్‌ స్టూడియోస్‌లో థంబ్స్ అప్‌ యాడ్‌ షూటింగ్‌ కోసం విజయ్‌ ముంబై వెళ్లాడట.

అంతేకాకుండా బాలీవుడ్‌ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు డిస్కషన్స్‌ అవుతున్నాయట. ఇప్పటికే బీటౌన్‌లో విజయ్‌కు యమ క్రేజ్‌ ఉంది. కాబట్టి బాలీవుడ్‌ల ఓ మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు విజయ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. మరి ఈ ప్రాజెక్ట్‌ ఏంటి? ఆ డైరెక్టర్‌ ఎవరన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement