Casting Director Aarti Mittal Arrested for Allegedly Running a Prostitution Racket - Sakshi
Sakshi News home page

Aarti Mittal : మోడల్స్‌తో వ్యభిచార దందా.. నటి ఆర్తీ మిట్టల్‌ అరెస్ట్‌

Published Tue, Apr 18 2023 6:50 PM | Last Updated on Tue, Apr 18 2023 7:13 PM

Casting Director Aarti Mittal Arrested for Allegedly Running a Prostitution Racket - Sakshi

ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్‌ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు.

పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్‌ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్‌ను అరెస్ట్‌ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.

నిందితురాలు ఆర్తి మిట్టల్‌ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ సుతార్‌ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement