Two Men Break Into Shah Rukh Khan’s Home Mannat - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan : షారుక్‌ ఖాన్‌ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. కేసు నమోదు

Published Fri, Mar 3 2023 10:49 AM | Last Updated on Fri, Mar 3 2023 11:46 AM

Two Men Break Into Shah Rukh Khan Bungalow Mannat - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఇంట్లోకి దుండగలు చొరబడ్డారు. ముంబైలోని షారుక్‌ నివాసం మన్నత్‌లోకి గురువారం ఇద్దరు వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది దుండగులను పోలీసులకు అప్పగించారు. విచారణలో వారు గుజరాత్‌కి చెందిన వ్యక్తులని తేలింది.

కేవలం తమ అభిమాన నటుడు షారుక్‌ ఖాన్‌ను దగ్గర్నుంచి చూసేందుకే ఇలా ఇంట్లోకి వచ్చామని, వేరే దురాలోచనలు ఏమీ లేవని వారు వారు పోలీసులతో పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై ఏమైనా నేరచరిత్ర ఉందేమో అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. యువకులిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement