బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఓ ఆసక్తికర అంశంపై మాట్లాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశంలో ఆయన తన మాటలతో కాసేపు నవ్వులు పూయించారు. యూపీలో షూటింగ్‌లు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాలీవుడ్ ప్రముఖులతో ముంబైలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు జాకీ ష్రాఫ్ సీఎం యోగిని అభ్యర్థించారు.
థియేటర్లలో పాప్‌కార్న్ ధరను తగ్గించాలని జాకీ ష్రాఫ్ యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. పాప్‌కార్న్ 500 రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. 'థియేటర్లలో పాప్‌కార్న్ కోసం రూ.500 తీసుకుంటున్నారు. దయచేసి పాప్‌కార్న్ ధర తగ్గించండి. సినిమా తీస్తున్నాం. స్టూడియోలు కడుతున్నాం. కానీ సినిమా టికెట్ కంటే ఎక్కువగా పాప్ కార్న్ ధరలు ఉంటే థియేటర్‌కు వచ్చేదేవరు?' అని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఉత్తరప్రదేశ్‌లోని సినిమాల షూటింగ్‌పై హిందీ చిత్రనిర్మాతలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు.
CM योगी से बोले जैकी श्रॉफ़- घर का खाना चाहिए तो मिल जाएगा. थिएटर में पॉपकॉर्न की कीमत कम करो. pic.twitter.com/dqXFXXhrPo
— UnSeen India (@USIndia_) January 6, 2023
Comments
Please login to add a commentAdd a comment