
అతని పేరు రాయ్. అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. ఒకటీ అతను చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదా చచ్చిపోవడం. సింపుల్. ‘సాహో’లో ఇలాంటి పాత్రనే పోషిస్తున్నారు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ‘సాహో’ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. గురువారం ‘రాయ్’ పాత్రధారి జాకీ ష్రాఫ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మించారు. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది.