మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి | Krishna Shroff Comments On Secret Wedding Rumour | Sakshi
Sakshi News home page

‘రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు’

Sep 10 2019 7:47 PM | Updated on Sep 10 2019 7:57 PM

Krishna Shroff Comments On Secret Wedding Rumour - Sakshi

ముంబై : తనకు రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కూతురు క్రిష్ణా ష్రాఫ్‌ అన్నారు. తన పెళ్లి గురించి క్రేజీ వార్తలు ఎందుకు ప్రచారం అవుతున్నాయో అర్థం కావడం లేదని వాపోయారు. ‘భాగీ’ ఫేం, తన అన్నయ్య టైగర్‌ ఫ్రాఫ్‌తో కలిసి క్రిష్ణా ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీల సందడితో ఈ స్టార్‌ కిడ్స్‌ జిమ్‌ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాకు బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ ఇబాన్‌ హయమ్స్‌ పరిచయమయ్యాడు. ఇక అప్పటి నుంచి టైగర్‌ బెస్టీగా గుర్తింపు పొందిన ఇబాన్‌.. క్రిష్ణాతో ప్రేమలో పడ్డాడంటూ బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇబాన్‌ తన ఇన్‌స్టా స్టోరీలో క్రిష్ణ గురించి చెబుతూ ‘వైఫీ’ అని సంబోధించడంతో వారి పెళ్లి అయిపోందని గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.

 
                                        సోదరుడు టైగర్‌తో క్రిష్ణా ష్రాఫ్‌

అదే విధంగా..‘మైండింగ్‌ అవర్‌ ఓన్‌ బిజినెస్‌..ఇదే మేము కోరుకుంటున్న స్వర్గం..ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఇదే మా గమ్యం’ అంటూ తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోను క్రిష్ణ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఈ విషయంపై స్పందించిన క్రిష్ణ మాట్లాడుతూ...‘ బిగ్గరగా నవ్వాలని ఉంది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయి. మేము రహస్యంగా వివాహం చేసుకున్నామనడం క్రేజీ. ఇలాంటి వార్తలు విని మా అమ్మ కూడా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతోంది. అసలేం జరిగిందో చెప్పమంటూ పోరు పెడుతోంది. ఇబాన్‌, టైగర్‌ ఐదేళ్లుగా మంచి స్నేహితులు. అలా నాకు కూడా తను పరిచయం. వాళ్లిద్దరూ కలిసి బాస్కెట్‌ బాల్‌ ఆడటం నేను ఎంజాయ్‌ చేస్తా’ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపడేశారు. కాగా తన సోదరుడు టైగర్‌.. హీరోయిన్‌ దిశా పటానీతో కలిసి బాహాటంగానే చక్కర్లు కొడుతున్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదంటూ క్రిష్ణ తన సోదరుడి ప్రేమ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోదరుడితో పాటు తన రిలేషన్‌షిప్‌ గురించి కూడా క్రిష్ణ బాగానే కవర్‌ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement