ముంబై: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురుగానే గాకుండా జిమ్ యజమానిగా తనకంటూ గుర్తింపు దక్కించుకున్నారు క్రిష్ణా ష్రాఫ్. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్నారు. ఇక తన వృత్తిగత అంశాలతోనే గాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఆమె తరచూ వార్తల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్‌తో ప్రేమలో పడిన ఆమె.. తమ పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇందుకు బదులుగా ఇబాన్, క్రిష్ణను వైఫీ అని సంబోధిస్తూ కామెంట్లు చేయడంతో వీరిద్దరు రహస‍్యంగా పెళ్లి చేసుకున్నారంటూ అప్పట్లో బీ-టౌన్‌లో టాక్ వినిపించింది. క్రిష్ణ ఈ వార్తలను ఖండించినప్పటికీ ఇబాన్‌తో ప్రేమలో ఉన్నట్లు మాత్రం ధ్రువీకరించారు.(చదవండి: నోరు పారేసుకున్న హీరో: ఐదుగురు అవుట్!)
ఈ క్రమంలో కొన్ని వారాల క్రితం తాము విడిపోయినట్లుగా ప్రకటించిన క్రిష్ణ.. తాజాగా ఇన్‌స్టా వేదికగా తన కొత్త రిలేషన్‌షిప్‌ను బయటపెట్టారు. టర్కిష్ చెఫ్ సాల్ట్ బేను ముద్దాడిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘బే టైమ్’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఇక ఇందుకు స్పందించిన ఇబాన్.. ‘‘ఇంత త్వరగా మూవ్ అయిపోయావా’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీనికి బదులుగా.. ‘‘నువ్వు కూడా తనను ఆదర్శంగా తీసుకో’’ అని నెటిజన్లు అతడికి సలహా ఇవ్వగా, ‘‘నాకు అంత తొందరేం లేదు.. అయినా మీకు థాంక్స్’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా ఇబాన్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయవద్దవంటూ క్రిష్ణ ఇటీవల తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇకపై తామిద్దరం కలిసి ఉండబోయేది లేదని పేర్కొన్నారు. తమ బంధం గురించి అందరికీ తెలుసునని, ఇప్పుడు అది ముగిసిపోయిందని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment