బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ మంచి మనసు చాటుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న సినిమా టెక్నీషియన్ రవి కుమార్‌కు ఆర్థిక సాయం చేశాడు. టైగర్ ష్రాఫ్ తొలి సినిమా 'హీరోపంతి'కి రవి కుమార్ ఫోకస్ పుల్లర్ (అసిస్టెంట్ కెమెరామన్)గా పని చేశాడు. తాజాగా రవి కుమార్ మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్‌తో మా అన్న ప్రసాద్ కలిసి పని చేశాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో మా అన్న చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆపరేషన్‌కు జాకీ సర్ సాయం చేశాడు.
అప్పుడు ఆయన.. ఇప్పుడు..
ఇప్పుడు ఆయన కుమారుడు నాకు సాయపడ్డాడు. నేను హీరోపంటి సినిమాకు వర్క్ చేశాను. అలా ఆయన నాకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. టైగర్ తల్లి ఆయేషా ష్రాఫ్ నాకు మంగళవారం ఫోన్ చేసి మాట్లాడింది. టైగర్ ఫస్ట్ సినిమాకు నేను పని చేశానని బహుశా తనకు గుర్తుండకపోవచ్చు. అయినా మంచి మనసుతో నన్ను ఆదుకున్నాడు అని తెలిపాడు.
దాచుకుందంతా అయిపోయింది
కాగా రవి కుమార్ పని చేస్తున్న పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి ఇంకా జీతం అందలేదని తెలుస్తోంది. ఓ పక్క రావాల్సిన డబ్బు ఆగిపోగా, మరోపక్క యాక్సిడెంట్ వల్ల ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితమైన పరిస్థితి! దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోవడంతో సాయం కోసం ఎదురు చూశాడు. ఇంతలోనే టైగర్ ష్రాఫ్ పెద్ద మనసుతో అతడి చికిత్సకు, ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బు సమకూర్చాడు. అది లక్షల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
చదవండి: ఆ స్టార్ హీరోల ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను కొట్టేసిన ప్రభాస్
Comments
Please login to add a commentAdd a comment