ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి ఆ తర్వాతి రోజుల్లో కూడా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఆరు రోజుల్లో రూ. 700 కోట్లు రాబట్టిన కల్కి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారత చిత్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్ కల్కి చిత్రం ఇప్పటికే పలు రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్, దళపతి విజయ్‌ల ఆల్‌టైమ్ రికార్డులను కల్కి బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 15 ఇండియన్ సినిమాల జాబితాలో కల్కి చేరిపోయింది.
రజనీకాంత్ హిట్ సినిమా జైలర్ లాంగ్ రన్‌లో రూ.650 కోట్లు రాబట్టితే.. విజయ్ నటించిన లియో మాత్రం రూ. 600 కోట్లు రాబట్టింది. ఇద్దరు సౌత్ ఇండియన్ టాప్ హీరోలకు చెందిన ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను ప్రభాస్ కేవలం ఆరు రోజుల్లోనే దాటేశాడు. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా కల్కి ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'హనుమాన్' రూ.350 కోట్లు, 'ఫైటర్' రూ. 327 కోట్లు, 'మంజుమ్మెల్ బాయ్స్ రూ. 242 కోట్లు, 'సైథాన్' రూ. 211 కోట్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్ వండర్ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. అందుకే కల్కి చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment