Tiger Shroff Sister Krishna Shroff Hot Photoshoot Goes Viral: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె తన తండ్రి జాకీ ష్రాఫ్, సోదరుడు టైగర్ ష్రాఫ్‌ల బాలీవుడ్ స్టార్ కాదు. కానీ ఆమెకు గణనీయమైన అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. తన టోన్డ్ బికినీ బాడీ చిత్రాలతో ఇన్‌స్టా గ్రామ్‌లో హీట్ పెంచుతూ ఉంటుంది. ఇటీవలే ఆమె 'రాశీ సూద్' పంజాబీ సాంగ్ 'కిన్ని కిన్ని వారి'లో డెబ్యూగా నటించింది. అలాగే కృష్ణ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక ఫొటోషూట్‌కు కృష్ణ హాట్‌హాట్‌గా ఫోజులివ్వడం చూడొచ్చు.
కొన్ని మ‍్యాగజైన్‌ల కవర్‌పై వచ‍్చిన కృష్ణ ష్రాఫ్ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బోల్డ్ ఫొటోషూట్ కోసం 28 ఏళ్ల కృష్ణ మొత్తం బ్లాక్ డ్రెస్‌లో హాట్‌గా ఫొజులిచ్చింది. ఆమె రాకీస్టార్ బాడీసూట్ ధరించి మోకాళ్ల వరకు ఎత్తైన బూట్లను మ్యాచింగ్‌గా వేసుకుంది. ఈ ఫొటోపై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ 'వావ్' అని కామెంట్ చేసింది. దిశా పటానీకి, టైగర్ ష్రాఫ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు రావడం తెలిసిందే.
కృష్ణ ష్రాఫ్ తన డ్రెస్సింగ్, ఫ్యాషన్, ఫొటోషూట్‌ల విషయంలో విభిన్న శైలీ కలిగి ఉంది. అందుకే ఆమె ఏం పోస్ట్ చేసిన ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. కృష్ణకు ఆమె సోదరుడు, తండ్రిలా బాలీవుడ్‌లోకి వచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. అయినా ఆమె తాజా పోస్ట్‌లు, ఫొటోషూట్‌లతో తనకు విపరీతంగా అభిమానులు పెరిగారు. కృష్ణ ష్రాఫ్ ముంబైలోని ఎమ్‌ఎమ్ఎ మ‍్యాట్రిక్స్ ఫిట్‌నెస్ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment