
ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ (Sonu Nigam) కుమారుడు నీవన్ (Neevan Nigam) గుర్తున్నాడా? తండ్రితో పాటు అనేక వేదికలపై, స్టూడియోలలో ముద్దుముద్దుగా పాడుతూ ఆకట్టుకునేవాడు. ఆన్‌లైన్ కన్సర్ట్‌లో తండ్రితో కలిసి షో కూడా చేశాడు. ఇప్పుడీ పిల్లవాడు చాలా పెద్దోడయ్యాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు. ఫస్ట్ పోస్ట్‌తోనే అందరినీ ఇన్‌స్పైర్ చేశాడు.
తన రెండేళ్ల ఫిట్‌నెస్ జర్నీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో మొదట బొద్దుగా, పొట్టతో ఉన్న నివాన్ ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో కనిపించాడు. రెండేళ్లలో నా జీవితాన్నే మార్చేసుకున్నా అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన సోనూ నిగమ్.. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టి ఫస్ట్ పోస్ట్ పెట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కామెంట్ చేశాడు. హీరో టైగర్ ష్రాఫ్.. గ్రేట్ వర్క్ బ్రో అని ఫైర్ ఎమోజీతో కామెంట్ పెట్టాడు. అతడి అంకితభావాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

చదవండి: నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
Comments
Please login to add a commentAdd a comment