రెచ్చిపోతున్న హీరో కూతురు
ముంబై: బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. తన హాట్ హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఇటీవల తన టాప్లెస్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కృష్ణా ష్రాఫ్.. తాజాగా బికినీలో ఉన్న ఫొటోను ఉంచింది. టూ పీస్ బికినీ ధరించిన ఈ అమ్మాయి రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నట్టుగా ఉంది. మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తన ఫొటోపై కామెంట్ రాసింది.
హాట్ హాట్ ఫొటోల వల్లేమో కానీ ఇన్స్టాగ్రామ్లో హీరోగారి అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆమెకు లక్షా 85 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. కృష్ణా తన సోదరుడు టైగర్ ష్రాఫ్ మాదిరిగా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. కాగా కూతురి బోల్డ్ పిక్చర్స్పై మీడియా సమావేశంలో జాకీ ష్రాఫ్ స్పందిస్తూ.. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. తన పిల్లలు టైగర్, కృష్ణా ఇద్దరూ తెలివైనవారని, ఏం చేయాలో వాళ్లకు అవగాహన ఉందని అన్నారు. వాళ్ల ప్రవర్తనపై తనకు అభ్యంతరం లేదని, ఈ విషయం గురించి మాట్లాడనని చెప్పారు.