జాకీ ష్రాఫ్
బాలీవుడ్ నటులు తమిళంలో నటించడం కొత్తేం కాదు. ‘తుపాకీ’ సినిమాలో విద్యుత్ జమాల్ విలన్‌గా నటించారు. అజిత్ ‘వివేగమ్’ సినిమాలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ‘2.ఓ’లో అక్షయ్‌కుమార్ నటించారు. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్ ‘ఉయంర్ద మణిదన్’(తమిళం, హిందీ) అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా విజయ్ సినిమాలో జాకీ ష్రాఫ్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఫుట్‌బాల్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ఫారిన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా కనిపిస్తారట జాకీ ష్రాఫ్. ఇదివరకు ఆయన పలు తమిళ చిత్రాల్లో నటించారు. కాగా తాజా చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్ కమ్ కోచ్ మైఖేల్ పాత్రలో విజయ్ నటిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో వేసిన ఆరు కోట్ల భారీ సెట్‌లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment