
నయనతార
ఫిజియోథెరపీ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు నయనతార. షూటింగ్‌లో స్టంట్స్ చేస్తూ గాయపడి ఫిజియో వద్దకు వెళ్తున్నారని ఊహించేసుకోవద్దు. ఫిజియో క్లాసులకు వెళ్లేది పేషెంట్‌గా కాదట.. స్టూడెంట్‌గా అని సమాచారం. నయనతార హీరోయిన్‌గా విజయ్‌తో కలసి నటిస్తున్న చిత్రం ‘బిగిల్’. (విజిల్ అని అర్థం) అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన ఫిజియోథెరపీ స్టూడెంట్‌లా కనిపిస్తారట. విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌లా నటిస్తున్నారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో ఆటగాళ్లతోనే ఫిజియోథెరపిస్ట్‌లు ఉండే సంగతి తెలిసింది. ఈ విధంగా మిస్టర్ కోచ్‌కి, మిస్ ఫిజియోకి లవ్ ట్రాక్‌ని దర్శకుడు కలిపారని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment