physiotherapy doctor
-
చేతి కర్ర సాయంతో నడుస్తున్న మాజీ సీఎం కేసీఆర్
-
అది అదృష్టంగా భావిస్తున్నా
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’ అని చాలామంది నటీనటులు అంటుంటారు. అయితే అచ్చ తెలుగమ్మాయి చందన కొప్పిశెట్టి మాత్రం డాక్టర్ అయ్యాక నటి అయ్యారు. డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసిన చందన కథానాయిక కావాలన్న సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఆడిష¯Œ ్సలో విజేతగా నిలిచి కథానాయిక అవకాశాన్ని అందుకున్నారు. సత్యదేవ్ హీరోగా మహా వెంకటేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదౖలñ ంది. ఈ సందర ్భంగా చందన కొప్పిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో నటనకు బాగా అవకాశం ఉన్న స్వాతి పాత్రను ఇందులో చేశాను. తొలి చిత్రంలోనే అభినయానికి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరోయిన్గా రాణించాలన్న నా ఆశయానికి ఈ చిత్రం బంగారు బాట వేసింది. నా నటనను చూసిన కొందరు సినీ పెద్దలు.. పెద్ద హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయంటూ కితాబు ఇవ్వడం ఎప్పటికీ మరచిపోలేను. ప్రస్తుతం రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వాటి వివరాలు చెబుతాను’’ అన్నారు. -
మిస్ ఫిజియో
ఫిజియోథెరపీ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు నయనతార. షూటింగ్లో స్టంట్స్ చేస్తూ గాయపడి ఫిజియో వద్దకు వెళ్తున్నారని ఊహించేసుకోవద్దు. ఫిజియో క్లాసులకు వెళ్లేది పేషెంట్‌గా కాదట.. స్టూడెంట్‌గా అని సమాచారం. నయనతార హీరోయిన్గా విజయ్‌తో కలసి నటిస్తున్న చిత్రం ‘బిగిల్’. (విజిల్ అని అర్థం) అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన ఫిజియోథెరపీ స్టూడెంట్‌లా కనిపిస్తారట. విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌లా నటిస్తున్నారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో ఆటగాళ్లతోనే ఫిజియోథెరపిస్ట్‌లు ఉండే సంగతి తెలిసింది. ఈ విధంగా మిస్టర్ కోచ్‌కి, మిస్ ఫిజియోకి లవ్ ట్రాక్‌ని దర్శకుడు కలిపారని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచారం
-
ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచారం
హైదరాబాద్: చికిత్స చేసేందుకు ఇంటికి వచ్చిన మహిళా ఫిజియోథెరఫిస్ట్పై సాఫ్ట్వేర్ ఇంజినీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో ఈ దారుణం జరిగింది. మనోజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తుమందు కలిపిన నీళ్లు ఇచ్చాడని, ఆ తర్వాత లైంగిక దాడి చేశాడని చెప్పింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కాగా, నిందితుడు మనోజ్ రాజస్థాన్‌కు చెందినవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మనోజ్ పరారీలో ఉన్నాడు. -
డాక్టర్ పై ఎక్సైజ్ పోలీసుల దాడి