![Jackie Shroff Feels Immensely Proud To Be Called Tiger Shroffs Father - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/20/jackie-tiger-shroff.jpg.webp?itok=AO0a55yf)
సాక్షి, ముంబయి : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుమారుడు టైగర్ ష్రాఫ్ విజయాలను చూసి మురిసిపోతున్నారు. తనను టైగర్ తండ్రిగా పిలవడాన్ని గర్వంగా భావిస్తానని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. సినిమాల ఎంపికపై తాను టైగర్‌కు సలహాలు ఇవ్వనని, తన కెరీర్ గురించి ఏమాత్రం ఆందోళన చెందనని చెప్పారు. కఠోరశిక్షణతో టైగర్ ష్రాఫ్ తన శరీరాన్ని తీర్చిదిద్దుకున్నాడని, మానసికంగా ధృడంగా మారాడని కొడుకుకు కితాబిచ్చారు. తాజాగా బాఘీ 2తో టైగర్ ష్రాఫ్ సూపర్ హిట్ అందుకున్నారు.
టైగర్ ఎన్నో విజయాలు, పరాజయాలను చూస్తూ పెరిగాడని, రిస్క్ తీసుకోవడాన్ని సవాల్‌గా భావిస్తాడన్నారు. అందరికీ ప్రేమను పంచడం, అపజయాలను హృదయానికి తీసుకోకపోవడం అలవరుచుకున్నాడని అన్నారు. నటుడు కావాలని తానెన్నడూ కలలు కనలేదని అన్నారు.తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా బాలీవుడ్‌లో ఎదిగానని, ఏదిచ్చినా దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తానని చెప్పారు. నా సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు వస్తే తాను సంతృప్తిగా ఫీలవుతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment