నా కొడుకు ఓ రేసుగుర్రం: నటుడు | Jackie Shroff praises his son Tiger Shroffs dedication | Sakshi
Sakshi News home page

నా కొడుకు ఓ రేసుగుర్రం: నటుడు

Aug 6 2017 4:38 PM | Updated on Apr 3 2019 6:34 PM

నా కొడుకు ఓ రేసుగుర్రం: నటుడు - Sakshi

నా కొడుకు ఓ రేసుగుర్రం: నటుడు

బాలీవుడ్ వెటరన్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా తెరంగ్రేటం చేసినా.. తనకంటూ పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్.

ముంబయి: బాలీవుడ్ వెటరన్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా తెరంగ్రేటం చేసినా.. తనకంటూ పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్. కుమారుడు సక్సెస్ అవుతున్నప్పుడు ఆ తండ్రి చూపే పుత్రవాత్సల్యాన్ని మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ అదే స్థితిలో ఉన్నారు. ఇటీవల ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన తన కొడుకు గురించి మాట్లాడుతూ..  టైగర్ ష్రాఫ్ ఓ రేసుగుర్రం లాంటి వాడన్నారు. ఎప్పుడూ పని మీద శ్రద్ధ చూపించే వ్యక్తులలో టైగర్ ఒకడని కొనియాడారు.

టైగర్ వ్యక్తిత్వం అందరికంటే కాస్త భిన్నమైనది. స్కూల్ రోజుల్లో వాడు బాస్కెట్ బాల్ ఆడేవాడు. ఎంతలా అంటే.. ప్రత్యర్ధి స్కూలు జట్లు కూడా టైగర్ ఆటను మెచ్చుకునేవి. ఏదైనా పని మొదలుపెడితే ఇతర వ్యాపకాలపైకి ఆకర్షితుడు కాడు. వాడు రేసుగుర్రంలా బరిలో దిగుతాడని నా అభిప్రాయం. తొలి మూవీ ‘హీరో పంతీ’లో రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకున్న టైగర్ .. 'భాఘీ'తో యాక్షన్ సీన్లతోనూ మెప్పించాడు. ఇలా రోజురోజుకూ నటనలో ఓ మెట్టు ఎదుగుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని' జాకీ ష్రాఫ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement