మరోసారి తమిళ తెరపైకి జాకీష్రాఫ్ | Jackie Shroff back in Kollywood | Sakshi
Sakshi News home page

మరోసారి తమిళ తెరపైకి జాకీష్రాఫ్

Published Thu, Mar 31 2016 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

మరోసారి తమిళ తెరపైకి జాకీష్రాఫ్

మరోసారి తమిళ తెరపైకి జాకీష్రాఫ్

 హిందీ స్టార్స్ కోలీవుడ్‌లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కాకపోతే తమ పాత్రలో కాస్త వైవిధ్యాన్ని ఆశిస్తున్నారంతే. బాలీవుడ్ స్టార్ హీరో జాకీష్రాఫ్ ఇప్పటికే అరణ్యం, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి కోచ్చడైయాన్ చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ముచ్చటగా మూడోసారి తమిళ తెరపై మెరవనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత సీవీ.కుమార్ ఇప్పుడు ఆ అనుభవంతో మెగాఫోన్ పట్టారు.
 
 మాయావన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న ఆ చిత్రంలో ముఖ్యపాత్రకు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ అయితే బాగుంటుందని సీవీ.కుమార్ భావించారట. దీంతో గత వారం ముంబై వెళ్లి ఆయనకు కథ వినిపించి నటించాలని కోరగా జాకీష్రాఫ్ మారు మాట మాట్లాడకుండా ఓకే అన్నారట.
 
  ఏప్రిల్ నాలుగు నుంచి ఆయన మాయావన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో జాకీష్రాఫ్ దాదాగా నటించనున్నారని సమాచారం. ఆయనకు పోరాట దృశ్యాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement