MeToo Movement: Model Diandra Soares Strong Counter to Jackie Shroff - Sakshi
Sakshi News home page

#మీటూ : ‘మీ భార్య కూడా ఇలాగే చేశారు కదా’

Published Wed, Oct 31 2018 10:57 AM | Last Updated on Wed, Oct 31 2018 11:34 AM

Diandra Soares Strong Counter To Jackie Shroff - Sakshi

తనుశ్రీ- నానా పటేకర్‌ వివాదంతో భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పెద్ద మనుషుల ముసుగులో చెలామణీ అవుతున్న పలువురు వ్యక్తుల అసలు సిసలు వ్యక్తిత్వాన్ని ఈ ఉద్యమం బహిర్గతం చేస్తోంది. అయితే ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారు కొందరైతే.. మరికొందరు మాత్రం కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో మీటూ ఉద్యమంపై  బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ స్పందించారు. ‘ చాలా ఏళ్ల క్రితం జరిగిన ఏవో కొన్ని విషయాలను పట్టుకుని ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారు. కొందరైతే ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి బజారుకెక్కి రచ్చ చేస్తున్నారు’ అంటూ రాయడానికి వీల్లేని అసభ్య పదజాలాన్ని వాడారు.

కాగా జాకీ ష్రాఫ్‌ వ్యాఖ్యలపై..  బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్(55)పై ఆరోపణలు చేసిన మోడల్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ డయాండ్రా సోర్స్ తీవ్రంగా స్పందించారు. ‘ ఈ వ్యాఖ్యలతో జాకీ ష్రాఫ్‌పై ఉన్న గౌరవం పోయింది. మీరు చేసిన పిచ్చి పనుల తాలూకు మకిలి బజారుకెక్కి శుభ్రం చేసుకోవాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీ భార్య కూడా గతంలో ఇలాంటి పనులు చేశారు కదా. మరి దానికి ఏం అంటారో’ అంటూ ప్రశ్నించారు. ఇక జాకీ ష్రాఫ్‌ భార్య అయేషా మాజీ మోడల్‌ అన్న సంగతి తెలిసిందే. తన కంటే చిన్నవాడైన ఓ యువ మోడల్‌తో అయేషా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement