Suhel Seth
-
‘ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు’, ప్రిన్స్ ఛార్లెస్ ఫంక్షన్‌కు ‘రతన్ టాటా’ డుమ్మా!
అత్యధిక కాలం బ్రిటన్ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 అస్తమయం కావడంతో యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ నియమితులు అయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజుగా ప్రిన్స్ ఛార్లెస్, రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75)లు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన నెటిజన్లు, వ్యాపార దిగ్గజాలు బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్, దేశీయ దిగ్గజం రతన్ టాటా'ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పెంపుడు కుక్కల విషయంలో రతన్ టాటా - ప్రిన్స్ ఛార్లెస్‌తో జరిగిన సంభాషణల్ని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. రతన్ టాటా దాతృత్వానికి గుర్తింపుకు గాను ఆయనను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలని 2018 ఫిబ్రవరి 6న ప్రిన్స్ ఛార్లెస్.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? రెండు పెంపుడు కుక్కల వల్ల. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఇది అక్షరాల నిజం. ఇదే అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన కాలమిస్ట్, వ్యాపార వేత్త సుహెల్ సేథ్ నాటి మధుర స్మృతుల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతన్ టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. రతన్ టాటాకు లైఫ్ టైమ్ అవార్డును ప్రధానం చేసేందుకు లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌ను సర్వం సిద్ధం చేశారు. ‘‘ 2018 ఫ్రిబవరి 2,3 తేదీలలో బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ కోసం నేను లండన్‌కు చేరుకున్నాను. లండన్ ఎయిర్ పోర్ట్ దిగిన తర్వాత టాటా నుండి సుమారు 11 మిస్డ్ కాల్లు రావడంతో షాకయ్యా. వెంటనే నా బ్యాగ్‌లను తీసుకొని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఆయనకు కాల్ చేశా. టాంగో, టిటో (రతన్ టాటా కుక్కలు ) అనారోగ్యానికి గురయ్యాయి. తిండి తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. నేను వాటిని వదిలి రాలేను అని’’ తనతో చెప్పినట్లు సుహెల్ సేథ్ గుర్తు చేసుకున్నారు. ప్రిన్స్ చార్లెస్ ఈవెంట్‌కు టాటా వచ్చేలా నేను ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. టాటా తన అవార్డును స్వీకరించేందుకు రాలేదు. ఈ సందర్భంగా అవార్డుల కార్యక్రమానికి రతన్ టాటా ఎందుకు రాలేదో తెలుసుకున్న ప్రిన్స్ ఛార్లెస్.. టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు.‘‘మనసున్న మారాజు..అతడే రతన్ టాటా ” అని ప్రిన్స్ చార్లెస్ అన్నట్లు సేథ్ తెలిపారు. -
మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! మత్తు చల్లుతున్నారు ఇదే కాశీ కారిడార్ నిర్మాణం అయిన ఉత్తరప్రదేశ్‌లో వేలాది మంది ప్రభుత్వ వైఫల్యం వల్ల కోవిడ్‌తో చనిపోయారు. ఈ సత్యాన్ని ఏ మత మత్తుమందు కూడా అణిచివేయలేదు. మనం మతానికంటే పాలనకు ప్రాధాన్యత ఇచ్చివుంటే ఇందులో చాలా జీవితాలను కాపాడగలిగేవాళ్లం. – అర్ఫా ఖానమ్ షేర్వానీ, జర్నలిస్ట్ అందుకే చూశారా? విశ్వసుందరి పోటీదారులు ఇచ్చినవి మూర్ఖపు జవాబులని చాలామంది ట్రోల్ చేస్తున్నారు; వీళ్లేదో నిజంగానే జ్ఞాన సముపార్జనకు ఆ కార్యక్రమం చూసినట్టు. అది అందాల పోటీ నాయనా, క్విజ్ ప్రోగ్రామ్ కాదు. – అహ్మద్ షరీఫ్, కమెడియన్ వెనుకడుగులు ప్రధానమంత్రి చురుగ్గా ఉండే మెజారిటీ వర్గపు వారి పూర్తి మతపరమైన కార్యక్రమాలను ఇంకే దేశాలైనా ఇలా ప్రసారం చేస్తాయా? రోజురోజుకీ మనం ప్రజాస్వామ్యం, లౌకికవాదాల పరంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాం. – అజయ్ కామత్, నేత్ర వైద్యుడు టీకా వివక్ష ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ బూస్టర్ డోసుల వెయ్యడానికి సిద్ధమవుతున్నాయి. కానీ మాలావీ (ఆఫ్రికా దేశం)లో కేవలం సుమారు ఆరు లక్షల మందికే ఇప్పటివరకూ పూర్తి టీకాలు పడ్డాయి. 1.8 కోట్ల జనాభాలో ఇది ఏపాటి? ఒమిక్రాన్‌తో నాలుగో వేవ్ వ్యాపిస్తున్న సమయంలో ఇది అన్యాయం కాదా? టీకాలు ప్రపంచంలో అందరికీ సమానంగా అందాలి. – కిసోమో కలింగా, పరిశోధకురాలు రంధ్రాన్వేషకులు జనంలో నిజంగానే ఏదో భాగం కుళ్లిపోయింది. ఒక విషయాన్ని సుసాధ్యం చేసిన ప్పుడు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మనం ఇలా ఎందుకు తయారవుతున్నాం? కాశీ కారిడార్ అనేది ప్రగతి. దీన్నెందుకు జీర్ణించుకోరు? ప్రతిదానిలోనూ తప్పు పట్టాలని ఎందుకు చూస్తారు? చేసినదానికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వండి. – సుహేల్ సేఠ్, రచయిత అవే అందం ఒక విదేశీయుడిగా నేను చెప్పగలను. సంప్రదాయాలు, ఆచారాలే భారత్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. నాకు చాలా నచ్చాయి. – కోబీ శోషానీ, ఇజ్రాయిల్ ఉన్నతాధికారి అసలు అర్థం ఒక నాయకుడు తరచుగా గతాన్ని రెచ్చగొడుతున్నాడంటే, భవిష్యత్ దిశగా అతడి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని అర్థం. – సంజయ్ ఝా, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి -
#మీటూ : ‘మీ భార్య కూడా ఇలాగే చేశారు కదా’
తనుశ్రీ- నానా పటేకర్ వివాదంతో భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పెద్ద మనుషుల ముసుగులో చెలామణీ అవుతున్న పలువురు వ్యక్తుల అసలు సిసలు వ్యక్తిత్వాన్ని ఈ ఉద్యమం బహిర్గతం చేస్తోంది. అయితే ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారు కొందరైతే.. మరికొందరు మాత్రం కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో మీటూ ఉద్యమంపై బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు. ‘ చాలా ఏళ్ల క్రితం జరిగిన ఏవో కొన్ని విషయాలను పట్టుకుని ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారు. కొందరైతే ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి బజారుకెక్కి రచ్చ చేస్తున్నారు’ అంటూ రాయడానికి వీల్లేని అసభ్య పదజాలాన్ని వాడారు. కాగా జాకీ ష్రాఫ్ వ్యాఖ్యలపై.. బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్(55)పై ఆరోపణలు చేసిన మోడల్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ డయాండ్రా సోర్స్ తీవ్రంగా స్పందించారు. ‘ ఈ వ్యాఖ్యలతో జాకీ ష్రాఫ్‌పై ఉన్న గౌరవం పోయింది. మీరు చేసిన పిచ్చి పనుల తాలూకు మకిలి బజారుకెక్కి శుభ్రం చేసుకోవాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీ భార్య కూడా గతంలో ఇలాంటి పనులు చేశారు కదా. మరి దానికి ఏం అంటారో’ అంటూ ప్రశ్నించారు. ఇక జాకీ ష్రాఫ్ భార్య అయేషా మాజీ మోడల్ అన్న సంగతి తెలిసిందే. తన కంటే చిన్నవాడైన ఓ యువ మోడల్‌తో అయేషా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. -
# మీటూ : మరో వికెట్ ఔట్
న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్ (55)కు భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో పలువురి గోముఖ వ్యాఘ్రాల బండారం బట్టబయలవుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనుషులపై సంబంధిత చర్యలకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం విశేషం. ఈ క్రమంలో టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్ చర్యలకు దిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుహేల్ సేథీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. టాటా గ్రూపులో ప్రధాన భాగామైన టాటా సన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోసించిన సేథ్తో కలిసి పనిచేయమని తేల్చి చెప్పింది.నవంబర్ 30, 2018 నముగియనుంది కానీ, నెల రోజుల నోటీసుతో నెలముందే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టాటా సన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే ఆరోపణలు వెల్లువెత్తిన సమయం నుంచి టాటా సన్స్ కౌన్సెల్జీ అతనితో సంబంధాలను నిలిపివేసినట్టు చెప్పారు. కాగా ఇటీవల ఇండియాలో సోషల్ మీడియా ద్వారా మీడియా రంగంలో మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్ని రంగాల్లోని ‘పెద్దమనుషు’ల బండారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే సుహేల్ సేథ్‌పై కూడా వరుస ఆరోపణల వెల్లువ కురిసింది. మోడల్,మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ డియాండ్రా సోర్స్, చిత్రనిర్మాత నటాషా రథోర్, జర్నలిస్టు మందాకిని గెహ్లాట్, రచయిత ఇరా త్రివేదిలతో సహా ఆరుగురు మీటూ పేరుతో సేథ్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
ఆహ్వానిస్తేనే వెళ్లాను: విజయ్ మాల్యా ట్వీట్
లండన్: పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానిస్తేనే వెళ్లాలని, అంతేకాని అక్రమంగా సభలోకి చొరబడలేదని కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా స్పష్టం చేశారు. బ్రిటన్‌లో భారత రాయబారి నవ్‌తేజ్ సర్ణ హాజరైన గత గురువారం నాటి పుస్తకావిష్కరణ సభకు భారత కోర్టు దోషిగా నిర్ధారించిన విజయ్ మాల్యా హాజరు కావడం కలకలం సృష్టించింది. ఆహ్వానితుల జాబితాలో విజయ్ మాల్యా పేరులేదని శనివారం విదేశీ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అయితే తన జీవితంలో ఎన్నడూ అక్రమంగా అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోనని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. ఏ పుస్తకం కోసం అయితే ఆవిష్కరణ సభ జరిగిందో ఆ పుస్తకాన్ని రాసింది తన మిత్రుడైనందున, ఆయన కోసం ఆ సభకు వెళ్లానని మాల్యా చెప్పారు. తగిన సాక్ష్యం లేదని, చార్జ్‌షీట్ లేదని. తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని, ఇది అత్యంత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుహెల్ సేథ్ రాసిన కొత్త పుస్తకావిష్కరణ సభను గత గురువారం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించింది. -
భారత రాయబారి, మాల్యా.. ఓ వివాదం
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యా లండన్ లోని ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కూడా హాజరుకావడం వివాదాన్ని రేకెత్తించింది. సహ రచయిత, పాత్రికేయుడు సన్నీ సేన్ తో కలసి సుహేల సేథ్ రచించిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్' అనే పుస్తకాన్ని ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గురువారం ఆవిష్కరించారు. మీడియా నివేదికల ప్రకారం భారత హై కమిషనర్ నవతేజ్ సార్నా పాల్గొన్న సభకు మాల్యా కూడా హాజరయ్యారు. దీంతోపాటు అనంతరం జరిగిన ప్యానెల్ డిస్కషన్ సెషన్లో కూడా మాల్యా పాల్గొన్నాడని తెలిసింది. ఆ సమయంలో సార్నా అక్కడ ఉండడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.ఇది భారత దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాల్యాను చూసిన మరుక్షణమే నవ్ తేజ్ ఆ వేదికనుంచి, ఆ సభనుంచి బయటకు వచ్చేసారని ప్రకటించింది. అలాగే తాము మాల్యాను ఆహ్వానించలేదనీ.. ఈ పుస్తకావిష్కరణ సభ గురించి సోషల్ మీడియా ప్రకటించడం, ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ఈ పరిణామం చోటు చేసుకుందని నిర్వాహకులు చెప్పారని ప్రభుత్వం తెలిపింది. అయితే తన పుస్తకావిష్కరణ సభకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని రచయిత సేథ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మిగతా ప్రేక్షకుల్లాగానే మాల్యా కూడా పాల్గొన్నారని తెలిపారు.