'టైగర్పై నా ప్రభావం పడనివ్వను'
ముంబై: యువ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్పై తన ప్రభావం ఏమాత్రం ఉండబోదని అతడి తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ అన్నారు. టైగర్కు తాను సలహాలు ఇవ్వదలుచుకోలేదని, అతడి కెరీర్ సాఫీగా సాగుతోందన్నాడు. టైగర్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అని, అతడి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కుమారుడిని ప్రశంసించాడు. సాజిద్ నదియాడ్వాలా ప్రొడక్షన్లో గతేడాది విడుదలైన 'హీరోపంతి' మూవీతో టైగర్ ష్రాఫ్ బాలీవుడ్కు పరిచయం అయిన విషయం తెలిసిందే.
టైగర్ నటించిన బాఘి, ఏ ఫ్లైయింగ్ జాట్ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. అతడి కెరీర్లో తన పాత్రేమీ లేదని, సరైన పద్ధతిలో అతడ్ని పెంచినట్లు చెప్పుకొచ్చాడు. అతడి చదువు విషయంలోనూ తానేప్పుడు సలహాలు ఇవ్వలేదని, క్రమశిక్షణ ఉన్న ఆటగాడు అని అందుకే తన ఆలోచనల్ని టైగర్పై ప్రయత్నం చేయనన్నాడు. కూతురు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇస్తున్న విషయాన్ని ఎవరూ గుర్తుచేయడం లేదని, కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల గురించే ప్రస్తావిస్తున్నారని జాకీష్రాఫ్ అసహనం వ్యక్తం చేశాడు.