క్షణక్షణం ఉత్కంఠ | Project Zed movie will be released in September. | Sakshi
Sakshi News home page

క్షణక్షణం ఉత్కంఠ

Published Thu, Aug 17 2017 12:24 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

క్షణక్షణం ఉత్కంఠ - Sakshi

క్షణక్షణం ఉత్కంఠ

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా, హిందీ నటుడు జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రలో సీవీ కుమార్‌ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మాయావన్‌’. ఈ సినిమాను ‘ప్రాజెక్ట్‌ జెడ్‌’ పేరుతో ఎస్‌.కె. బషీద్‌ సమర్పణలో ఎస్‌.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సెప్టెంబర్‌ తొలివారంలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ఆసక్తి తగ్గదు. సందీప్‌ కిషన్‌ నటన హైలైట్‌. లావణ్యా త్రిపాఠి ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, కెమెరా: గోపి అమర్నాథ్, డైలాగ్స్‌: శశాంక్‌ వెన్నెలకంటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement