A1 Express Ott Release Date: అప్పటి నుంచే ప్రసారం! - Sakshi
Sakshi News home page

ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్‌: అప్పటి నుంచే ప్రసారం!

Published Fri, Apr 30 2021 9:42 AM | Last Updated on Fri, Apr 30 2021 11:18 AM

A1 Express Movie Streaming On Sun NXT, Release Date Inside - Sakshi

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ హాకీ ఆటగాడుగా నటించిన చిత్రం "ఏ1 ఎక్స్‌ప్రెస్‌". లావణ్య త్రిపాఠి హీరోయిన్‌. కెరీర్‌ ప్రారంభంలో అలవోకగా హిట్లు కొట్టిన సందీప్‌కు ఈ మధ్య చేసిన ఏ సినిమాలు కూడా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ ఏ1 ఎక్స్‌ప్రెస్‌ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడటంతో నష్టాలను చవిచూడక తప్పలేదు.

మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సన్‌ నెట్‌వర్క్‌కు చెందిన సన్‌ నెక్స్ట్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు రిలీజ్‌ డేట్‌ను సైతం ప్రకటించింది. మే 1 నుంచి సన్‌ నెక్స్ట్‌ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

దీంతో థియేటర్‌లో ఈ సినిమాను మిస్‌ అయిన వాళ్లు ఓటీటీలో చూసే అవకాశం ఉంది. ఇదిలా వెంటు థియేటర్‌లో సరిగా ఆడని సినిమాలు ఓటీటీలో హిట్టు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్‌ కిషన్‌ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనైనా సక్సెస్‌ను సాధిస్తుందేమో చూడాలంటున్నారు సినీ ప్రేమికులు.

చదవండి: A1 Express Review: సందీప్‌ కిషన్‌ ‘స్పోర్ట్స్‌ డ్రామా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement