రీల్ లైఫ్‌లో చెడ్డగా కనిపించేవాళ్లంతా రియల్ లైఫ్‌లో కూడా అంతే దుర్మార్గులుగా ఉండరు. అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. బాలీవుడ్‌లో తాజాగా రిలీజైన చిత్రం బేబీ జాన్ (Baby John Movie). ఇందులో జాకీ ష్రాఫ్ (Jackie Shroff) విలన్‌గా నటించాడు. కానీ నిజ జీవితంలో తానంత చెడ్డవాడిని కాదంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఎంత మంచి మనసో..
అందులో జాకీ తన కారు దగ్గరకు వెళ్తున్నాడు. అతడిని ఫోటోలు తీసేందుకు కెమెరామెన్లతో పాటు అభిమానులు కూడా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడ్డాడు. అయినా సరే తన ఫోన్‌లో ఫోటోలు తీయడం ఆపలేదు. అది చూసిన నటుడు కిందపడ్డ అతడికి చేయందించి పైకి లేపాడు. అనంతరం అక్కడున్నవారికి గుడ్‌నైట్ చెప్పి కారెక్కి వెళ్లిపోయాడు. ఇది చూసిన జనాలు మీపై గౌరవం మరింత పెరిగింది.. అంత హడావుడిగా వెళ్తున్నా కూడా ఆగి మరీ కిందపడ్డ వ్యక్తికి చేయందించారంటే గ్రేట్ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమా
ఇకపోతే జాకీ ష్రాఫ్.. కింగ్ అంకుల్, త్రిమూర్తి, దేవదాస్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం హౌస్‌ఫుల్ 5 మూవీలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 6న విడుదల కానుంది.
చదవండి: 'అంబానీ మామ.. నీకు వంద రీచార్జులు'.. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా టీజర్
Comments
Please login to add a commentAdd a comment