హీరోలు కూడా అలవోకగా కామెడీ పండించగలరు అని నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నిరూపించాడు. తను నోరు విప్పితే చాలు ఏదో ఒక పంచ్ రావాల్సిందే.. ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే! నేడు (డిసెంబర్ 26న) నవీన్ పొలిశెట్టి బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా (Anaganaga Oka Raju Movie) నుంచి రాజుగారి ప్రీవెడ్డింగ్ వీడియో రిలీజ్ చేశారు.
ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే..
టీజర్ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్ పొలిశెట్టి.. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేశ్ అంబానీ ఫోన్ చేశాడట! ముకేశ్ మామయ్య... నీకు వంద రీచార్జులు.. ఇప్పుడే మన అనంత్ పెళ్లి క్యాసెట్ చూస్తున్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టాడు. తన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే! జస్టిన్ బీబర్, కిమ్ కర్దాషియన్, జాన్ సేన.. అందరితో తన సంగీత్‌లో స్టెప్పులేయిస్తాడంటున్నాడు. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్ కూడా చేయించారు.
ప్రీవెడ్డింగ్ వీడియో అదిరింది!
ఈ ప్రీవెడ్డింగ్ వీడియో బ్లాక్‌బస్టర్ అవడం గ్యారెంటీ! మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్ ఉంటే ఫుల్ సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇకపోతే... అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment