భయపడుతూనే నటుడి బనియన్‌ వేసుకున్నా: ఊర్మిళ | Urmila Matondkar: I Wore Jackie Shroff Ganjee In Rangeela Tanha Tanha song | Sakshi
Sakshi News home page

Urmila Matondkar: అతడి బనియన్‌ వేసుకోమన్నాడు, భయపడుతూనే...

Published Sat, Oct 2 2021 5:47 PM | Last Updated on Sat, Oct 2 2021 5:47 PM

Urmila Matondkar: I Wore Jackie Shroff Ganjee In Rangeela Tanha Tanha song - Sakshi

బాలీవుడ్‌ నటి ఊర్మిళ మాటోండ్కర్‌, హీరో అమీర్‌ ఖాన్‌, నటుడు జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగీలా' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఊర్మిళ క్రేజ్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో తన్హ తన్హ యహా పె జీన్‌.. సాంగ్‌ కూడా ఎంతో పాపులర్‌. తాజాగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ఊర్మిళ. ఈ సాంగ్‌ ప్రారంభంలో ఊర్మిళ ఒక బనీన్‌ వేసుకుని బీచ్‌ ఒడ్డున పరిగెడుతూ ఉంటుంది కదా, ఆ బనీన్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ది అన్న సీక్రెట్‌ను బయటపెట్టింది.

'ఈ పాట చాలా సహజంగా రావాలనుకున్నాం, దీంతో జాకీ తన బనియన్‌ ధరించమని చెప్పాడు. నేను కొంచెం భయపడుతూనే దాన్ని వేసుకుని సాంగ్‌ షూట్‌ చేశాం. మొత్తానికి ఈ పాట హిట్టై ప్రశంసలు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను' అని ఊర్మిళ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌ చేయగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement