Rangeela
-
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్‌ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్‌ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్‌ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
భయపడుతూనే నటుడి బనియన్ వేసుకున్నా: ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ మాటోండ్కర్, హీరో అమీర్ ఖాన్, నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగీలా' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఊర్మిళ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో తన్హ తన్హ యహా పె జీన్.. సాంగ్ కూడా ఎంతో పాపులర్. తాజాగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ఊర్మిళ. ఈ సాంగ్ ప్రారంభంలో ఊర్మిళ ఒక బనీన్ వేసుకుని బీచ్ ఒడ్డున పరిగెడుతూ ఉంటుంది కదా, ఆ బనీన్ నటుడు జాకీ ష్రాఫ్‌ది అన్న సీక్రెట్‌ను బయటపెట్టింది. 'ఈ పాట చాలా సహజంగా రావాలనుకున్నాం, దీంతో జాకీ తన బనియన్ ధరించమని చెప్పాడు. నేను కొంచెం భయపడుతూనే దాన్ని వేసుకుని సాంగ్ షూట్ చేశాం. మొత్తానికి ఈ పాట హిట్టై ప్రశంసలు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను' అని ఊర్మిళ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. -
అలా ఆమిర్ ఖాన్‌తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈ పేరే ఒక సంచలనం. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వ్యంగ్యంగా స్పందిస్తూ జనాల్లో హాట్ టాపిక్ కావడం ఒక్క వర్మకే చెల్లుతుంది. ఎదుటి వాళ్లు ఎంతటివారైన సూటిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. అలా కొందరితో వివాదం పెట్టుకుంటే మరికొందరితో సన్నిహితం పెంచుకుంటాడు వర్మ. కాగా ఆయన తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా పలు సనిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన తీసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. అందులో 1995లో వచ్చిన ‘రంగీలా’ మూవీ ఒక్కటి. జాకీ ష్రాఫ్, ఊర్మిళా మటోండ్కర్ కలిసి నటించిన ఈ మూవీలో ఆమిర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని అనేక అవార్డులకు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమిర్ ఖాన్‌కు, ఆర్జీవీకి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ సక్సెస్ తర్వాత ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో.. ఈ మూవీలో ఆమిర్ కంటే వెయిటర్ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడనే వ్యాఖ్యలు చేశాడని వార్తలు వెలువడ్డాయి. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అలా కొన్ని రోజుల పాటు తాము మాట్లాడుకోలేదని ఆర్జీవీ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలు ఓ మీడియాలో వచ్చిన వెంటనే నేను, అమిర్ షాట్అవుట్ చేసుకునేందుకు అప్పట్లో ఫోన్లు లేవు. ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వెంటనే పరిష్కరించుకోవచ్చు. కానీ ఫోన్లు లేకపోవడం వల్ల మేమిద్దరం వెంటనే పరిష్కరించుకోలేకపోయాం. అప్పటికే ఆ వార్త విన్న ఆమిర్ నన్ను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టసాగాడు. ఆ తర్వాత ఒకరోజు ఇద్దరం కలుసుకుని అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకున్నాం’ అని చెప్పాడు. ఈ సందర్భంగా ఆమిర్ మంచి నటుడని, అంకిత భావం ఎక్కువని, చాలా ఓపికగా ఉంటాడని, నటుడిగా ఆయనకు పతనం లేదంటూ ఆర్జీవీ కొనియాడాడు. ఇక అప్పుడు అసలు ఏం జరిగిందో చేబుతూ.. ‘నాకు ఆమిర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ మూవీలో ఓ కీలక సన్నివేశం దగ్గర టెక్నికల్ పాయింట్ ఇచ్చాను. ఆ సమయంలో కో-యాక్టర్ టైమింగ్ వల్ల ఆమీర్ డైలాగ్ డెలివరీ బాగా వచ్చిందని నేను భావించాను అని ఇంటర్వ్యూలో చెప్పాను. అది రాయకుండ ఆమిర్ కంటే వెయిటర్ ప్రదర్శన బెటర్ అనే శీర్షికతో ఆర్టికల్ వేశారు’ అంటూ అసలు విషయం వివరించాడు. -
కిందటి జన్మలో రంగీలా తీశా!
‘‘లవ్‌స్టోరీ చిత్రాల్లో నా పేరు జోడించి కొన్ని యుగాలు అయిపోతుంది. కిందటి జన్మలో ‘రంగీలా’ తీశాను. ‘బ్యూటిఫుల్’ చిత్రం ఒక విధంగా ‘రంగీలా’కి సీక్వెల్లా ఉంటుంది. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది కేవలం పబ్లిసిటీ కోసం పెట్టింది కాదు’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆర్జీవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ – ‘‘నాకు వచ్చిన ఆలోచనను మంజుతో పంచుకున్నాను. తను పూర్తి కథ చేసి సినిమా తెరకెక్కించాడు. సాధారణ కథల్లో మగవాళ్లు ఎదుగుతుంటారు. ఆడవాళ్లు ఇంట్లో ఉంటారు. కానీ ఇందులో రివర్స్‌లో జరుగుతుంది. హీరోయిన్ బాగా ఎదుగుతుంది. తన సక్సెస్‌ను చూసి హీరో తట్టుకుంటాడా లేదా అనేది కథాంశం. విలన్స్ ఉండరు. సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. నైనా ఈ పాత్ర చేయడానికే పుట్టింది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వర్మగారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాగా కష్టపడ్డాను. నా పరిచయ గీతాన్ని వర్మగారే షూట్ చేశారు. 3 రోజుల్లో 11 కాస్ట్యూమ్స్‌తో షూట్ చేశాం’’ అన్నారు నైనా. ‘‘ఇదో ఇంటెన్స్ లవ్‌స్టోరీ. అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా గురించి మాట్లాడినా, చూసినా వర్మగారు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంత ఎమోషనల్‌గా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు’’ అన్నారు సూరి. -
బ్యూటిఫుల్
రామ్‌గోపాల్ వర్మ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘బ్యూటిఫుల్’. ఆయన గతంలో తీసిన ఐకానిక్ మూవీ ‘రంగీలా’ కు ఇది ట్రిబ్యూట్. నైనా, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మతో కలసి దర్శకత్వం వహించారు అగస్త్య మంజు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్’ చిత్రం రామ్‌గోపాల్ వర్మ టైగర్ ప్రొడక్షన్‌పై నిర్మాణం జరుపుకుంది. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘మా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.. అందరూ వెరీ బ్యూటిఫుల్ అంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:రవి శంకర్, సాహిత్యం: సిరా శ్రీ. -
ట్రిబ్యూట్ టు రంగీలా
రామ్‌గోపాల్ వర్మ కెరీర్లో ‘రంగీలా’ సినిమా చాలా స్పెషల్. ఇప్పుడు ఆ సినిమాకు ట్రిబ్యూట్‌గా ‘బ్యూటిఫుల్’ సినిమా తెరకెక్కుతోంది. ‘ట్రిబ్యూట్ టూ రంగీలా’ అనేది క్యాప్షన్. రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు వర్మతో పాటుగా అగస్త్య మంజు దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 9న ‘బ్యూటిఫుల్’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకు పాటలు: సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్. -
రంగీలా రమ్మంది
దక్షిణాది చిత్రాలపై హాట్‌స్టార్ సన్నీ లియోన్ ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె కొన్ని దక్షిణాది చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది హీరోయిన్గా తమిళంలో ‘వీరమాదేవి’ (తెలుగులో ‘వీరమహాదేవి’) అనే సినిమాకు సైన్ చేశారు సన్నీ. ఈ సినిమా తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు ‘రంగీలా’ అనే చిత్రం సన్నీని కేరళకు రమ్మంది. ‘వీరమాదేవి’ అనువాద చిత్రం కాబట్టి ‘రంగీలా’ ఆమెకు మలయాళంలో డైరెక్ట్ చిత్రం అవుతుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు సన్నీనే అధికారికంగా ప్రకటించారు. ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలోకి ‘రంగీలా’ అనే మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. సంతోష్ నాయర్ దర్శకత్వం వహిస్తారు. జయలాల్ మీనన్ నిర్మిస్తారు’’ అని సన్నీలియోన్ పేర్కొన్నారు. మలయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘మధుర రాజా’ చిత్రంలోనూ సన్నీ ఓ ప్రత్యేక పాట చేయనున్నాట. -
మలయాళీ రంగీలా
ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు ఓ సందర్భంలో సన్నీ లియోన్ కొచ్చి వెళ్లినప్పుడు. ఆ తర్వాత సన్ని లియోన్ మలయాళంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలే నిజమయ్యాయి. సన్నీ మాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘మనీ రత్నం’ ఫేమ్ సంతోష్ నాయర్ దర్శకత్వంలో సన్నీ లియోన్ నటించనున్నారు. జయలాల్ మీనన్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రంగీల’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో సన్నీ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘‘పీరియాడికల్ సినిమా ‘వీరమహాదేవి’ ఫిజికల్‌గా చాలెంజింగ్‌గా ఉంది. నా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కరణ్‌జీత్ కౌర్’ వెబ్ సిరీస్‌కు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇవి కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న సినిమాల్లో నటించాలనుకుని మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలవుతుంది. సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే వర్క్‌షాప్స్ ప్లాన్ చేస్తున్నాం. రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాగూ హిందీ భాష వచ్చు. ఇప్పుడు మలయాళం నేర్చుకోవాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు సన్నీ లియోన్. అంతేకాదు ‘పాస్వర్డ్’ అనే నేపాలి ఫిల్మ్‌లో ఓ డ్యాన్స్ నంబర్‌కు చిందేయనున్నట్లు సన్నీ లియోన్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. -
ఆయ్ హాయ్.. ఆయ్ హోయ్
ఏప్రిల్ ఆరున విడుదలౌతున్న బాలీవుడ్ చిత్రం ‘బ్లాక్మెయిల్’లో ఊర్మిళ కనిపించబోతున్నారు. అయితే, సుమారు పదేళ్ల తర్వాత స్క్రీన్ మీదకు వస్తున్న ఊర్మిళ ఆ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారు! మనసు చివుక్కుమనిపించే విషయమే ఇది. ‘ఆయ్ హాయ్, ఆయ్ హోయ్..’ అంటూ పావనీ పాండే గొంతులోంచి ప్రారంభమయ్యే ఈ పాటలో ఊర్మిళ అచ్చు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాగైతే ఉన్నారో, అలాగే ఉన్నారు! ఆ కళ్లు, హొయలు, అభినయం ఏ మాత్రం ఛేంజ్ కాలేదు. ‘బ్లాక్ మెయిల్’ చిత్రాన్ని అభినయ్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌కు ఊర్మిళనే ఎంచుకోడానికి ఆయన స్క్రీన్‌ప్లే ఆయనకుంది. పదేళ్ల అజ్ఞాతం తర్వాత దర్శనం ఇచ్చే ఒక స్టార్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంటుంది. ఊర్మిళ తప్ప ఇంకెవరూ ఈ పాత్రకు సరిపోరని దేవ్ ముందే డిసైడ్ అయిపోయి, ఆమెను ఒప్పించారట. రామ్‌గోపాల్‌వర్మ ‘రంగీలా’తో వెలుగులోకి వచ్చిన ఊర్మిళ తొంభైలలో పెద్ద స్టార్. ఇప్పుడీ చిత్రంతో ఆమె మళ్లీ తన పూర్వపు అభిమానుల హృదయాలను ఊపిరితో నింపబోతున్నారు. ‘బ్లాక్మెయిల్’ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, కీర్తీ కుల్హరి నటిస్తున్నారు. ఇదొక క్వర్కీ కామెడీ. కడుపు చెక్కలే. ఆ చెక్కల మధ్య బ్రేక్‌గా ఊర్మిళ వచ్చి పోతారు. -
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి
హమ్, ఖుదాగవా, రంగీలా లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన లెజెండరీ టెక్నీషియన్ డబ్ల్యూబి రావు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబైలోని భారతీయ ఆరోగ్య నిథి హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. దాదాపు 40 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్న ఆయన రాజా హిందుస్తానీ, జుడ్వా, ధడకన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. 1987లో ముఖుల్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్సాఫ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు డబ్ల్యూబి రావు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత
సాక్షి, ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత నీరజ్ వోరా(54) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి (గురువారం) వేకువజామున ముంబైలో చనిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు. రచయితగా నటుడు ఆమిర్ ఖాన్ మూవీ 'రంగీలా'కు రైటర్‌గా పనిచేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నీరజ్. సినిమాలపై ఆసక్తితో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. ఆపై ఎన్నో సినిమాలకు రచయిగా సేవలు అందించిన అనంతరం 2000లో విడుదలైన కిలాడీ 420 మూవీతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తిన 'నీరజ్ వోరా ఫిర్ హెరా ఫెరి'కి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2016 అక్టోబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఇలా విభాగాల్లో విశేష సేవలందించిన నీరజ్ వోరా గురువారం వేకువజామున మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
గోల్డ్ అండ్ గ్లామరస్ మనీష్ మల్హోత్రా @ 50
మనీష్ మల్హోత్రా అనేవాడు ఇప్పటికిప్పుడు రిటైర్ అయితే బాలీవుడ్లో సగం మంది ఇళ్ల నుంచి బయటకు రారు. సగం మంది సినిమాలు ఒప్పుకోరు. చాలామంది ఇప్పుడు మనం చూస్తున్న దాని కంటే అంద విహీనంగా కనిపించి, అసలు రంగు బయటపెట్టేసుకుంటారు. అవును. మనీష్ మల్హోత్రా రెండు విధాలుగా బాలీవుడ్‌ను ప్రభావితం చేస్తున్నాడు. ఒకటి: ఫ్యాషన్ డిజైనర్‌గా, రెండు: కాస్ట్యూమ్ డిజైనర్‌గా. హిందీ సినిమాలను ‘రంగీలా’కు ముందు ‘రంగీలా’కు తర్వాత అని విభజిస్తారు కాస్ట్యూమ్ రంగంలో. ఎందుకంటే ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళా మాతోండ్కర్ కాస్ట్యూమ్స్‌ను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ బాలీవుడ్‌ని చాలా ఆకర్షించాయి. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు మనీష్ కాస్ట్యూమ్స్‌తో కొత్త అందాలను సంతరించుకున్నారు. ‘దిల్ తో పాగల్ హై’లో మాధురీ దీక్షిత్, ‘కుఛ్ కుఛ్ హోతాహై’లో కాజోల్, ‘కహో నా ప్యార్ హై’లో అమీషా పటేల్ వీళ్లంతా హిట్స్ సాధించారు. అయితే కరణ్ జోహార్ భారీ కాస్ట్యూమ్ డ్రామా ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాతో మనీష్ పేరు మార్మోగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మొన్నటి ‘బజ్రంగీ భాయ్‌జాన్’ వరకూ మనీష్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకే కాస్ట్యూమ్స్ సిద్ధం చేసే మనీష్ ‘మొహబ్బతే’ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు. ‘చిన్నప్పటి నుంచి నాకు రంగుల మంచి చెడ్డలు తెలుసు. మా అమ్మ ఏదైనా నప్పని చీర కట్టుకుంటే ‘అమ్మా... ఈ చీర కాకుండా వేరే చీర కట్టుకోవచ్చుగా’ అని ప్రాణం తీసేసేవాణ్ణి’ అంటాడు మనీష్. ‘చెట్టు, పుట్ట, ఆకులు, మనుషులు, ప్రకృతి - అన్నీ నన్ను బట్టల రూపకల్పనలో ప్రభావితం చేస్తాయి. ఎవరైనా కష్టపడాల్సిందే. నేనే ఇవాళ ఎంత కష్టపడి ఎంత మంచి డిజైన్‌ను తయారు చేశానా అనేదే చూస్తూ ఉంటాను’ అంటాడతను. ఫ్యాషన్ డిజైనర్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌కు పని తీరులో మార్పు ఏముంటుంది? అని అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్‌గా నా ఊహకు హద్దులు ఉండవు. ఆ స్త్రీ ఏ బట్టల్లో ఎంత అందంగా గొప్పగా ఉంటుందో ఆలోచిస్తాను. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌కు పరిధి ఉంటుంది. ఫలానా సినిమాలో ఫలానా పాత్రకు తగినట్టుగా ఆ హీరోయిన్ని అందంగా చూపించాలి. ‘చమేలీ’ సినిమాలో కరీనా కపూర్ వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రకు తగినట్టుగా, అంటే ఒక వేశ్యకు తగినట్టుగా ఆమె దుస్తులను సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఫలించి మంచి పేరు వచ్చింది’ అంటాడు మనీష్. ఈ తపన ఉండటం వల్లే మనీష్‌ను బాలీవుడ్లో అందరూ ఇష్టపడతారు. డిసెంబర్ 6న జరిగిన బర్త్‌డే పార్టీకి మహామహులు అందుకే తరలి వచ్చారు. షారుఖ్ ఖాన్, సయీఫ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, విరాట్ కోహ్లి, అనుష్కా శర్మ... ఇలా రానివాళ్లంటూ లేరు. ఆ రాత్రి ముంబాయి రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతూ మురిసిపోతూ ఉండిపోయింది.