దక్షిణాది చిత్రాలపై హాట్‌స్టార్ సన్నీ లియోన్ ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె కొన్ని దక్షిణాది చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది హీరోయిన్‌గా తమిళంలో ‘వీరమాదేవి’ (తెలుగులో ‘వీరమహాదేవి’) అనే సినిమాకు సైన్ చేశారు సన్నీ. ఈ సినిమా తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు ‘రంగీలా’ అనే చిత్రం సన్నీని కేరళకు రమ్మంది. ‘వీరమాదేవి’ అనువాద చిత్రం కాబట్టి ‘రంగీలా’ ఆమెకు మలయాళంలో డైరెక్ట్ చిత్రం అవుతుంది.
ఈ సినిమా గురించి ఇప్పుడు సన్నీనే అధికారికంగా ప్రకటించారు. ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలోకి ‘రంగీలా’ అనే మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. సంతోష్ నాయర్ దర్శకత్వం వహిస్తారు. జయలాల్ మీనన్ నిర్మిస్తారు’’ అని సన్నీలియోన్ పేర్కొన్నారు. మలయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘మధుర రాజా’ చిత్రంలోనూ సన్నీ ఓ ప్రత్యేక పాట చేయనున్నాట.
Comments
Please login to add a commentAdd a comment