
ఏప్రిల్ ఆరున విడుదలౌతున్న బాలీవుడ్ చిత్రం ‘బ్లాక్‌మెయిల్’లో ఊర్మిళ కనిపించబోతున్నారు. అయితే, సుమారు పదేళ్ల తర్వాత స్క్రీన్ మీదకు వస్తున్న ఊర్మిళ ఆ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారు! మనసు చివుక్కుమనిపించే విషయమే ఇది. ‘ఆయ్ హాయ్, ఆయ్ హోయ్..’ అంటూ పావనీ పాండే గొంతులోంచి ప్రారంభమయ్యే ఈ పాటలో ఊర్మిళ అచ్చు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాగైతే ఉన్నారో, అలాగే ఉన్నారు! ఆ కళ్లు, హొయలు, అభినయం ఏ మాత్రం ఛేంజ్ కాలేదు. ‘బ్లాక్ మెయిల్’ చిత్రాన్ని అభినయ్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌కు ఊర్మిళనే ఎంచుకోడానికి ఆయన స్క్రీన్‌ప్లే ఆయనకుంది. పదేళ్ల అజ్ఞాతం తర్వాత దర్శనం ఇచ్చే ఒక స్టార్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంటుంది.
ఊర్మిళ తప్ప ఇంకెవరూ ఈ పాత్రకు సరిపోరని దేవ్ ముందే డిసైడ్ అయిపోయి, ఆమెను ఒప్పించారట. రామ్‌గోపాల్‌వర్మ ‘రంగీలా’తో వెలుగులోకి వచ్చిన ఊర్మిళ తొంభైలలో పెద్ద స్టార్. ఇప్పుడీ చిత్రంతో ఆమె మళ్లీ తన పూర్వపు అభిమానుల హృదయాలను ఊపిరితో నింపబోతున్నారు. ‘బ్లాక్‌మెయిల్’ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్, కీర్తీ కుల్హరి నటిస్తున్నారు. ఇదొక క్వర్కీ కామెడీ. కడుపు చెక్కలే. ఆ చెక్కల మధ్య బ్రేక్‌గా ఊర్మిళ వచ్చి పోతారు.
Comments
Please login to add a commentAdd a comment