
హమ్, ఖుదాగవా, రంగీలా లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన లెజెండరీ టెక్నీషియన్ డబ్ల్యూబి రావు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబైలోని భారతీయ ఆరోగ్య నిథి హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. దాదాపు 40 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్న ఆయన రాజా హిందుస్తానీ, జుడ్వా, ధడకన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. 1987లో ముఖుల్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్సాఫ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు డబ్ల్యూబి రావు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.