
జాన్ అబ్రహాం
వెండితెరపై ఓ ఆపద నుంచి దేశాన్ని రక్షించేందుకు ఓ మిషన్‌ను స్టార్ట్ చేశారు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం. గూఢచారిగా ఆ ఆపద నుంచి అతను దేశాన్ని ఎలా రక్షించాడు? అనే విషయం సమ్మర్‌లో తెలుస్తుంది. జాన్ అబ్రహాం హీరోగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘రోమియో అక్బర్ వాల్టర్’. రోబ్బీ గ్రేవాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గూఢచారిగా నటిస్తున్నారు జాన్. ఈ సినిమాకు సంబంధించిన రెండు లుక్స్‌ను విడుదల చేశారు. ‘ఒక వ్యక్తి. భిన్నముఖాలు. దేశాన్ని కాపాడటం కోసం చేసే ఓ మిషన్’ అంటూ ఈ లుక్స్‌ను రిలీజ్ చేశారు జాన్. ఇందులో జాన్ అబ్రహాం ఎనిమిది డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. మౌనీ రాయ్, జాకీ ష్రాఫ్, సుచిత్రా కృష్ణమూర్తి తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment