ప్రభాస్‌ నమ్మాడు | Jackie Shroff joins the cast of Prabhas'saho | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ నమ్మాడు

Published Mon, Aug 21 2017 12:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

ప్రభాస్‌ నమ్మాడు

ప్రభాస్‌ నమ్మాడు

ఇప్పుడు ప్రభాస్‌తో ఫైట్లు–ఫీట్లు చేయడానికి ముచ్చటగా ముగ్గురున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా చేస్తున్న ‘సాహో’లో హిందీ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్, చంకీ పాండేలు విలన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోకి మరో హిందీ నటుడు చేరారు. ఆయనే... జాకీ ష్రాఫ్‌.

తెలుగులో ‘అస్త్రం, శక్తి, పంజా’ సినిమాల్లో విలన్‌గా చేసిన జాకీ, ‘సాహో’లో నటిస్తున్నట్టు కన్ఫర్మ్‌ చేశారు. ఈ సినిమా గురించి జాకీ ష్రాఫ్‌ మాట్లాడుతూ– ‘‘ఐయామ్‌ హ్యాపీ టు బి పార్ట్‌ ఆఫ్‌ ప్రభాస్‌ ‘సాహో’. సినిమాలో కీలక పాత్రను నేను చేయగలనని ప్రభాస్‌ నమ్మాడని తెలిసి ఇంకా సంతోషపడ్డా’’ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement