‘బాహుబలి’తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు సాహో సినిమా జపాన్లో రికార్డు బద్దలుకొడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేశారు. అయితే జపాన్‌లో కరోనా ప్రభావం తగ్గడంతో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. అక్కడ విడుదలైన ఏకైక జపానేతర సినిమా సాహో. ఈ ఏడాది జనవరిలో జపాన్ డబ్బింగ్ వెర్షన్‌లో ‘సాహో’ విడుదలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడంతో అక్కడ ‘సాహో’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకూ జపాన్ థియేటర్లలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ వచ్చిన మొదటి భారతీయ సినిమాగా ‘సాహో’ రికార్డు సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డును బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’ పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డును ‘సాహో’ సొంతం చేసుకుంది. (చదవండి: ప్రభాస్ సినిమా కోసం వెయిటింగ్: కీర్తి)
సాహో, దంగల్‌తో పాటు జపాన్‌లో విడుదలై భారతీయ సినిమాలు ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘త్రీ ఇడియట్స్’, ‘ముత్తు’, ‘బాహుబలి- 2’ చిత్రాలు ఉన్నాయి. జపాన్‌లో ఈ రికార్డులు సాధించిన టాప్-5 చిత్రాల్లో రెండు ప్రభాస్ సినిమాలే ఉండటం అతడి స్టామినాను తెలియజేస్తోంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్ ఫేమ్’ సుజీత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ తన 20వ చిత్రం ‘రాధే శ్యామ్’ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ప్రభాస్ తన 21వ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో చేస్తున్నాడు. ‘మహానటి’తో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. (చదవండి: ‘రాధేశ్యామ్’ సంచలనం!)
Comments
Please login to add a commentAdd a comment