వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)
'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!
ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment