Dangal
-
అతనితో డేటింగ్లో దంగల్ నటి.. ఫోటోలు వైరల్!
దంగల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటి సన్యా మల్హోత్రా(Sanya Malhotra). ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ చిత్రంలో మెరిసింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కథను అందించగా.. నిర్మాత ఆయన భార్య వ్యవహరించారు. ఈ మూవీ ద్వారానే కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉండగా అయితే దంగల్ నటి సన్యా మల్హోత్రాపై నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ వాద్యకారుడు రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల ఓ ఫోటో షూట్లో రిషబ్, సన్యా కలిసి ఓ అభిమానితో ఫోటోలకు పోజులిచ్చారు. ఓకే ఈవెంట్లో ఇద్దరు అదే వ్యక్తితో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట ఎంత అద్భుతంగా ఉంది.. సన్యా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇద్దరూ చాలా ప్రతిభావంతులు..మీరు డేటింగ్లో ఉంటే ఇంకా మంచిది' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.ఇక సన్యా మల్హోత్రా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సన్నీ సంస్కారీ కి తులసి కుమారి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, రోహిత్ సరాఫ్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18, 2025న థియేటర్లలోకి రానుంది.కాగా.. 2016లో వచ్చిన దంగల్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకు దంగల్ మూవీ కలెక్షన్స్‌ను ఏ సినిమా కూడా దాటలేకపోయింది. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సుహానీ భట్నాగర్, జైరా వాసీం,సాక్షి తన్వర్, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. -
పవర్ ఆఫ్ సాదియా
బాలీవుడ్ సినిమా ‘దంగల్’లో ఒక డైలాగ్... ‘పతకాలు సాధించే విజేతలు చెట్లపై పెరగరు. కష్టపడి ప్రేమతో, అంకితభావంతో వారిని తయారు చేయాలి’ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ గురించి తెలుసుకునే క్రమంలో ‘దంగల్’ గుర్తుకు వస్తుంది. మల్లయోధుడైన తండ్రి తన కూతుళ్లు రెజ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలలు కంటాడు. ఎన్నో కష్టాలు పడతాడు. సాదియా తండ్రి సందానీ కూడా అలాంటి కలల తండ్రే.‘పవర్ లిఫ్టింగ్’లో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన సమ్దానీకి తనలోని ఛాంపియన్‌ను కూతురిలో చూసుకోవాలనుకున్నాడు. జీవిక కోసం కొబ్బరి బొండాలు అమ్ముతూ కూతురిని పవర్ లిఫ్టింగ్‌లో తీర్చిదిద్దాడు. అతడి శ్రమ వృథా పోలేదు. సాదియా అల్మాస్ అంతర్జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తోంది. సాదియాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. కబడ్డీ బాగా అడేది. ‘యముడు’ ‘సింగం’ సినిమాలలో హీరో సూర్య సాహసాలు చూసిన సాదియాకు పోలిస్ ఆఫీసర్’ కావాలనే కల మొదలైంది. పోలీసు అంటే బలంగా ఉండాలి, ఫిజికల్ ఫిట్‌నెట్ కావాలి... అందుకే ‘పవర్ లిఫ్టింగ్’ లోకి వచ్చింది. తండ్రి సందానీ పవర్ లిఫ్టింగ్‌లో చేయి తిరిగిన ఆటగాడు. ‘నాన్న’ అనే స్కూలులో సాధన మొదలుపెట్టింది.ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఉదయం కాలేజీకి వెళ్లే సాదియా సాయంత్రం 5.30గంటల నుంచి 9గంటల వరకు ్రపాక్టిస్ చేస్తుంటుంది.‘నువ్వు అమ్మాయివి. ఇంత బరువులు ఎత్తే ఆటను ఎందుకు ఎంచుకున్నావని చాలామంది అడుగుతుంటారు. నా దృష్టి్టలో కష్టం లేని ఆట లేదు. ప్రతి ఆటలోనూ విజయం కోసం శ్రమించాల్సిందే. మా నాన్న కష్టం ముందు నా కష్టం చాలా చిన్నది. కుటుంబ పోషణ కోసం నాన్న కొబ్బరి బోండాలు అమ్మారు. నన్ను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టేందుకు ఎంతో కష్టపడ్డారు. మా అక్క కూడా నాన్నప్రోత్సాహంతో వరల్డ్ వర్సిటీ పవర్‌లిఫ్టర్ పోటీలకు వెళ్లింది. ఇప్పుడు హౌస్ సర్జన్‌గా చేస్తోంది’ అంటుంది సాదియా.సాదియా ట్రాక్ రికార్డు ఈ ఏడాది మల్టాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్లో మూడు విభాగాల్లో కలిపి 462.5 కిలోలు లిఫ్ట్ చేసిన సాదియా ‘57 కిలోల విభాగంలో ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన’ అని చెబుతుంది. జూనియర్ విభాగంలో రెండుసార్లు వరల్డ్ చాంపియన్ పతకాలు వచ్చాయి. 2023లో షార్జాలో జరిగిన ఏషియన్ వర్సిటీ క్లాసిక్ చాంపియన్ షిప్లో బంగారు పతకంతో పాటు ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏషియన్ వర్సిటీస్’ టైటిల్ సాధించింది. కేరళలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో విజేతగా, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏషియాగా నిలిచింది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ కామన్వెల్త్గా, టర్కీలో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో వెండి పతకం, 2018, 2021, 2022లో ఏషియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. జాతీయస్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్లో స్వాట్‌లో 185 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 180 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 95 కిలోలు బరువులెత్తి మొత్తంగా 460 కిలోలు లిఫ్ట్ చేసి బంగారు పతకాలు సాధించింది. ‘సాదియా’ అనే పేరుకు ఉన్న అర్థాలలో విజయం, అదృష్టం అనేవి కూడా ఉన్నాయి. అయితే ఆమె విజయం కోసం అదృష్టంపై ఎప్పుడూ ఆధారపడలేదు. తండ్రిలా కష్టాన్నే నమ్ముకుంది. అందుకే తండ్రి కలను నిజం చేయగలిగింది.– వరదా ఎస్వీ కృష్ణకిరణ్, సాక్షి, అమరావతి ఫొటోలు: కందుల చక్రపాణిఆటలాడితే చదువు బాగా వస్తుంది!నా చిన్నప్పుడు స్కూల్లో సరిగా చదవని వారిని ‘స్పోర్ట్స్‌లోకి తీసుకోండి’ అనేవారు. అది నా దృష్టిలో తప్పు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. బాగా చదివే విద్యార్థి అయినా, చదువులో వెనుకబడిన వాళ్లైనా స్పోర్ట్స్‌లో ఉంటే శారీరకంగా, మానసికంగా మంచిది. తొమ్మిదో తరగతి వరకు నాకు 60 శాతం మార్కులు వచ్చేవి. ఇప్పుడు 85 శాతంపైగా మార్కులు వస్తున్నాయి. దీనికి ఆటలే కారణం అని చెబుతాను. ఆటల్లో పడి చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారోనని భయపడి ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను ఆటల వైపుప్రోత్సహించడం లేదు. ఇది మారాలి. ఎంబీఏ తర్వాత పీహెచ్డీ చేయాలని ఉంది. ‘అథ్లెట్స్ మైండ్ సెట్స్ ఎడ్యుకేషన్’పై పరిశోధన చేస్తాను.– సాదియా ఆల్మాస్ -
'దంగల్' నటి ఇంట్లో విషాదం.. ట్వీట్ వైరల్
'దంగల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి జైరా వాసిం ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె తండ్రి జహిద్ వాసిం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా జైరా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?)ఇకపోతే జమ్ము కాశ్మీర్లో పుట్టి పెరిగిన జైరా వాసిం.. ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో గీతా ఫొగట్ పాత్రలో బాలనటిగా ఆకట్టుకుంది. దీని తర్వాత ఆమిర్ ఖాన్‌తో 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే మూవీలో మరోసారి కలిసి నటించింది. 'స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ 2019లో తాను ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. ఇకపై నటించనని క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)My father, Zahid Wasim, has passed away. Please remember him in your prayers and ask Allah to forgive his shortcomings, make his grave peaceful, protect him from its torment, ease his journey from here ahead and grant him the highest level of Jannah and Maghrirah.— Zaira Wasim (@ZairaWasimmm) May 28, 2024 -
దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమెకి కాలు విరగడంతో వాడిన మందులు సైడ్ ఇఫెక్ట్ ఇవ్వడంతో చనిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ కుటుంబల సభ్యులు అందువల్ల కాదంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మరణానికి అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధే కారణమన్నారు. ఆ వ్యాధితోనే పోరాడుతూ చనిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇంతకీ ఏంటా వ్యాధి. ఆ వ్యాధి వస్తే ఇక అంతేనా? అమీర్ ఖాన్ రెజ్లింగ్ మూవీ దంగల్‌లో యువ బబితా ఫోగట్‌గా నటించి మెప్పించిన సుహనీ భట్నాగర్ శనివారం ఢిల్లీలో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ కలిచివేసింది. అయితే ఆమె కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధి అయిన డెర్మాటోమయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగానే ఆమెను ఫిబ్రవరి 7న ఎయిమ్స్‌కి తరలించినట్లు తెలిపారు. చివరికి ఆ వ్యాధి విషమించడంతో ఫిబ్రవరి 16న తుది శ్వాస విడించిందని అన్నారు. నిజానికి పదిరోజుల క్రితమే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ కాగా, రెండు నెలల క్రిత అందుకు సంబధించిన లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితం సుహాని రెండు చేతులపై ఎర్రటి మచ్చలు వచ్చినట్లు తెలిపారు. అయితే తాము వివిధ ఆస్పత్రులు సంప్రదించాం. కానీ అది ఏం వ్యాధి అనేది నిర్ధారణ కాలేదని సుహాని తల్లి పూజ భట్నాగర్ కన్నీటిపర్యంతమయ్యారు. రోజురోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చేర్పించినట్లు చెప్పుకొచ్చారు పూజ. అలాగే ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని, పైగా ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి అదనపు ద్రవాలు ఊపిరితిత్తుల్లో చేరడంతో అవి కూడా దెబ్బతిన్నాయని సహాని తండ్రి సుమిత్ భట్నాగర్ చెప్పారు. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిచారు కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదని ఆవేదనగా చెప్పుకొచ్చారు సుమిత్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నవారు ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు సహాని తండ్రి. డెర్మాటోమియోసిటిస్ అంటే.. డెర్మాటోమియోసిటిస్ అనేది బంధన కణజాలం, కండరాలు, చర్మం అంతర్గత అవయవాల వాపుతో కూడిన పాథాలజీ. సకాలంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి రోజు రోజుకి తీవ్రతరమవుతుంది. ఈ డెర్మాటోమియోసిటిస్ అనేది ఆటో ఇమ్యూన్ పాథాలజీ. అంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఆటంకాలు కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయిత, పాథాలజీ అభివృద్ధి విధానం.. శరీరం దాని స్వంత కణాలను విదేశీగా గ్రహించడం ప్రారంభిస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత కండరాలు బంధన కణజాలంపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత నెమ్మమదిగా వారిలో వాపుకు గురయ్యే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థే రోగి అంతర్గత అవయవాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. లక్షణాలు: అలసట, జ్వరం బరువు తగ్గడం కండరాల నొప్పి భుజం కటి ప్రాంతంలో బలహీనత బహుశా కనురెప్పలు లేదా మెల్లకన్ను పడిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మింగడంలో ఇబ్బంది చర్మం పొలుసులుగా ఎరుపు రంగులోకి మారడం, వాయడం వంటివి. కంటి ప్రాంతంలో వాపు, ఎరుపు. చికిత్స: మందులు (కార్టిసోన్ వంటివి) కండరాల శిక్షణ. ఫిజియోథెరపీ వంటి వాటితో అదుపులో ఉంచగలరు. పూర్తి స్థాయిలో క్యూర్ అవ్వడం అంటూ ఉండదు. (చదవండి: అమెరికాలో ప్రాణాంతక బుబోనిక్ ప్లేగు వ్యాధి కలకలం) -
సినిమాలకి గుడ్ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్ మీడియాలో ‘దంగల్’ నటి
ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అందులో చిన్నప్పటి గీతా ఫోగట్‌గా నటించిన జైరా వసిమ్ అంతకంటే ఎక్కువ పాపులారిటీ సాధించింది. సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా మంచి అవకాశాలు సైతం ఆమె తలుపుతట్టాయి. వాటిన్నింటినీ కాదంటూ సినిమాలకి గుడ్‌బై చెప్పింది ఈ నటి. అయితే రెండేళ్ల తర్వాత తాజాగా జైరా వసిమ్ మళ్లీ సోషల్ మీడియాలో అభిమానులను పలకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బుర్ఖాలో ఉన్న తన ఫోటో ఒకటి షేర్ చేసింది జైరా. పోస్ట్ చేసిన గంటలోనే ఈ పిక్కి 60వేలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే తన విశ్వాసాలకి ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో, నెట్టింట్లో ఉన్న తన ఫోటోలన్నింటినీ తొలగించాలని ఫ్యాన్స్‌ని కోరింది. కాగా చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చదవండి: కొడుకు కోసం మళ్లీ కలిసిన బాలీవుడ్ మాజీ జంట View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) -
జాపాన్‌లో రికార్డు సృష్టిస్తోన్న సాహో
‘బాహుబలి’తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు సాహో సినిమా జపాన్‌లో రికార్డు బద్దలుకొడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేశారు. అయితే జపాన్‌లో కరోనా ప్రభావం తగ్గడంతో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. అక్కడ విడుదలైన ఏకైక జపానేతర సినిమా సాహో. ఈ ఏడాది జనవరిలో జపాన్ డబ్బింగ్ వెర్షన్లో ‘సాహో’ విడుదలైన విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడంతో అక్కడ ‘సాహో’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకూ జపాన్ థియేటర్లలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ వచ్చిన మొదటి భారతీయ సినిమాగా ‘సాహో’ రికార్డు సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డును బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’ పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డును ‘సాహో’ సొంతం చేసుకుంది. (చదవండి: ప్రభాస్ సినిమా కోసం వెయిటింగ్: కీర్తి) సాహో, దంగల్‌తో పాటు జపాన్‌లో విడుదలై భారతీయ సినిమాలు ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘త్రీ ఇడియట్స్’, ‘ముత్తు’, ‘బాహుబలి- 2’ చిత్రాలు ఉన్నాయి. జపాన్‌లో ఈ రికార్డులు సాధించిన టాప్-5 చిత్రాల్లో రెండు ప్రభాస్ సినిమాలే ఉండటం అతడి స్టామినాను తెలియజేస్తోంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్ ఫేమ్’ సుజీత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ తన 20వ చిత్రం ‘రాధే శ్యామ్’ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ప్రభాస్ తన 21వ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్లో చేస్తున్నాడు. ‘మహానటి’తో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది. (చదవండి: ‘రాధేశ్యామ్’ సంచలనం!) -
‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’
ముంబై: ‘దంగల్’ సినిమాలోని తన సహనటి సన్య మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వదంతులపై నటి ఫాతిమా సనా షేక్ స్పందించారు. ఓ ఇంటర్యూలో ఫాతిమాను దీనిపై ప్రశ్నించగా.. ‘ఆ వార్తలు చూడగానే మాకు నవ్వొచ్చింది. మేము మంచి స్నేహితులం. కానీ అందరూ మా స్నేహాన్ని తప్పుగా భావించారు’ అని చెప్పారు. ఇక సన్యాలో తనకు నచ్చిన విషయాలు ఏంటని అడగ్గా.. ‘‘తనలో నాకు మూడు విషయాలు బాగా నచ్చాయి. తన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. సన్య ప్రతీది శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడుతుంది. పని పట్ల ఆమె అంకితభావంతో ఉంటుంది. తనలో అది నాకు బాగా నచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చారు. (సుశాంత్ ఆత్మహత్య : ఫేక్ సంతాపాలు అవసరమా?) కాగా సన్య మల్హాత్రా, ఫాతిమాలు ‘దంగల్’లో అక్కాచెల్లెళ్లుగా నటించారు. తన విభిన్న మతపరమైన నేపథ్యం, పెంపకం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది లౌకిక భారతదేశానికి అనువైనది. మన దేశం ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మనం చాలా వైవిధ్యంగా ఉంటాము. ఎవరికీ నచ్చినంటూ వారు ఉండొచ్చు. మన స్వంత మతాన్ని అనుసరిస్తూనే మనకు నచ్చిన వారిని ఎంచుకోవచ్చు’’ అన్నారు. -
దంగల్..కండల్..
మట్టిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ నష్టం రాదన్నట్టే... మట్టిలో వ్యాయామ చేసేవారి ఆరోగ్యం ఎన్నటికీ చెక్కుచెదరదు అంటున్నారు పాతకాలం నాటి వ్యయామ ప్రియులు. ఇక్కడ వ్యాయామం చేసేందుకు ఉంచే దంగల్ మట్టిలో వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను కలుపుతారు. జల్లెడ పట్టిన చెక్కపొట్టు, నూనె, గంధం పౌండర్, పచ్చ కర్పూరం, నిమ్మకాయ రసం, నెయ్యి వంటి పదార్థాలను కలుపుతారు. దీని ద్వారా మట్టి సుగంధభరితమై అలసటను దూరం చేస్తోంది. ఈ మట్టిలో వ్యాయామాలు చేయడం ద్వారా చర్మవ్యాధులు కూడా దూరమవుతాయని ట్రైనర్స్ చెబుతున్నారు. సనత్‌నగర్: నగరంలో దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన వ్యాయమశాలలకు ఆదరణ పూర్తిగా తగ్గలేదు. సరికొత్తగా పుట్టుకొస్తున్న జిమ్‌ల పోటీని ఎదుర్కొంటున్న స్వదేశీ వ్యాయామానికి మరేదీ సాటి లేదు.. రాదు.. అంటున్నారు పాతకాలం నాటి వ్యాయామశాల నిర్వాహకులు. నాలుగ్గోడల మధ్య ఏసీల మధ్య మెత్తని కార్పెట్స్ మీద చేసే వర్కవుట్స్ సిసలైన శారీరక ఫిట్నెస్ను అందివ్వలేవని, దంగల్ మట్టిలో చేసే వ్యాయామానికి తిరుగులేదని అంటున్నారు. బలం.. అ‘పార’ం.. కాయం కష్టిస్తేనే ఆరోగ్యం సిద్దిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇసుక లారీలపై పారలతో పనిచేసే వారిని గమనిస్తే ఆ కాయాకష్టం వారి దేహాన్ని ఏవిధంగా మలుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆనాటి వ్యాయామశాలల్లో మట్టిని నేలపై పోసి పారలతో తవ్వడం, కాళ్లతో దున్నడాన్ని వ్యాయమ ప్రక్రియగా చేర్చారు. పారలతో మట్టిని తవ్వడం ద్వారా కాలి చిటికెన వేలు నుంచి మెదడు వరకు నరాలు ఉత్తేజితమవుతాయి. అలాగే పారకు ఉన్న కర్రను సడలకుండా పట్టుకోవడం అంటే మల్లయుద్ధంలో ప్రత్యర్థిని పట్టుకోవడంలో గ్రిప్‌ను సాధించడమే అన్నమాట. ఈ పారతో వ్యాయామం చేసే మట్టి ప్రాంతాన్ని దంగల్గా పేర్కొంటారు. ఆధునిక వ్యాయామ పద్ధతులకు భిన్నంగా ఇక్కడ కేవలం లంగోటిల మీదనే వ్యాయామం చేస్తారు. దీని ద్వారా శరీరంలో ప్రతి అవయానికి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. పాతొక వింత.. ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఫిట్నెస్ సెంటర్ల ద్వారా ఫిజిక్ షేపులే తప్ప సిసలైన శారీరక దృఢత్వం రాదని, పాతకాలపు వ్యాయామ స్ట్సైల్స్ ద్వారా సిసలైన ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా సంతరించుకోవచ్చన్నది నాటి వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. నగరంలో బల్కంపేట, ఫతేనగర్, బేగంబజార్, గౌలిగూడ, మూసాపేట్, సనత్‌నగర్, కింగ్‌కోఠి, చిలకలగూడ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్ బీకేగూడ తదితర ప్రాంతాల్లో పాతకాలపు శైలిని కొనసాగిస్తున్న వ్యాయామశాలలు ఇంకా రద్దీగానే ఉన్నాయి. దీనికి కారణం వీటి ద్వారా వచ్చే లాభాలే అంటున్నారు వ్యాయామప్రియులు. మట్టిలో చేసే పలు రకాల వ్యాయామాల గురించి ఇలా చెబుతున్నారు. ముగ్దార్.. భుజబలం.. పొడవాటి దుంగ మాదిరిగా గుండ్రంగా ఉండే బరువైన ముగ్దార్ను రెండు చేతులతో తల వెనుక వైపుగా చుట్టూ తిప్పడం ద్వారా మోచేతులు, భుజ కండరాలు బలోపేతం అవుతాయి. ఈ కసరత్తు కూడా దంగల్ మట్టిలో గానీ, నేలపై తమకు అనుకూలమైన ప్రదేశంలో ఎక్కడైనా చేయవచ్చు. అస్లీ.. సత్తా.. రింగ్ ఆకృతిలో దాదాపు 40 కిలోల బరువున్న రాయి(అస్లీ) మెడలో వేసుకుని దంగల్ మట్టిని కాళ్లతో దున్నుతారు. దీనిని మెడకు గర్దన్ వ్యాయామంగా కూడా పేర్కొంటారు. ఈ ప్రత్యేకమైన కసరత్తుతో మెడ భాగంలోని నరాలు చైతన్యమవుతాయి. అలాగే మెడలో అంతటి బరువుతో దంగల్ను దున్నడం ద్వారా కాళ్ల జాయింట్స్ బలంగా మారతాయి. కాలి కండరాల సామర్థ్యం పెరుగుతుంది. క్లైంబ్..రోప్ పాతకాలం నాటి వ్యాయామ ప్రక్రియలో రోప్ క్లైంబింగ్ ఒకటి. తాడును ఎక్కి, దిగడం ద్వారా తన బరువును తాము మోసుకుంటూ పైకి వెళ్లడమే కసరత్తు. దీని ద్వారా చేతుల నరాలు రాటుదేలుతాయి. రోప్ ఎక్కి దిగే క్రమంలో సమయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. వయస్సును బట్టి నిర్దేశిత టైమ్‌లో రోప్ క్లైంబింగ్ చేయాల్సి ఉంటుంది. దమ్ బై టక్ (సపాయ్).. పాతకాలం వ్యాయామంలో దమ్ బైటక్ ఒకటి. నేలపై అరచేతులు ఉంచి కాలి మునివేళ్లపై నుంచి మొత్తం బాడీని లేపడమే ఈ కసరత్తు. బైటక్(బస్కీలు కొట్టడం) ద్వారా కూర్చొని, లేవడం మరో కసరత్తు. ఇక ‘అతా’ (రెండు వైపులా హ్యాండిల్ కలిగిన పరికరం)పై చేతులు ఉంచి దమ్ బై టక్ చేయడం ఇంకోరకమైన కసరత్తు. ఇది చెస్ట్‌కు మంచి వ్యాయామం. ఆహారమూ.. సహజమే.. ఈ తరహా వ్యాయామశాలల్లో వర్కవుట్ చేసేవారు నేచురల్ డైట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. శెనగలు, బెల్లం, ఎండుకొబ్బరి, మినపప్పు తదితర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అది కూడా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే. బార్ బార్ దేఖో.. సమాంతరంగా ఉన్న రెండు రాడ్ల ఆధారంగా బార్ కసరత్తు జరుగుతుంది. వెనుక వైపుగా సింగిల్ రాడ్‌ను రెండు చేతులతో పట్టుకుని మొత్తం బాడీని మెలితిప్పి రెండో రాడ్‌కు కాళ్లను తాకించడమే ఈ కసరత్తు ప్రత్యేకం. ఇది ఛాతీ కండరాలను బలంగా మారుస్తుంది. ఇదే ఆరోగ్యకరం.. ఆధునిక జిమ్‌ల్లో షూస్, చెప్పులతో చేయిస్తారు. ఇక్కడ చెప్పులకు కూడా అనుమతి ఉండదు. అంతా సహజమైన పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ వస్తాదుగా ఉన్న లక్ష్మయ్య ఇదే వ్యాయామం చేసి 98 ఏళ్లు జీవించాడు. – రాజు, ఖలీఫ్, శ్రీవీర హనుమాన్ వ్యాయామశాల శరీరం ఉత్తేజితం.. శరీరాన్ని మొత్తం ఉత్తేజితం చేసే వ్యాయాయ పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అందుకే పాతకాలం పద్ధతులైనా ఇలాంటి జిమ్‌ను ఎంచుకున్నాను. నాతో పాటు ఎంతోమంది ఈ జిమ్‌కు వస్తున్నారు. – కార్తీక్, శిక్షకులు -
‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’
ముంబై: బాలీవుడ్ నటి జైరా వసీమ్ అత్యంత ప్రతిభావంతురాలని, దంగల్‌లో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చిందని గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా అన్నారు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలలో జైరా నటన అమోఘమని కొనియాడారు. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే సత్తా తనకు ఉందని ప్రియాంకా ప్రశంసించారు. తన మత ఆచారాలకు ఆటంకం కలుగుతున్న కారణంగా.. ఇక మీదట బాలీవుడ్లో నటించబోనని జైరా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయాన్ని బాలీవుడ్లో పలువురు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం జైరా, ప్రియాంక కాంబినేషనల్లో ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ప్రియాంక సమాధానమిచ్చారు. మోటివేషనల్ స్పీకర్ ఈషా చౌదరి తల్లిదండ్రుల ప్రేమకథగా ఈ చిత్రం రూపొందిందని అన్నారు. ఇక ఈ సినిమాలో ఈషాగా జైరా నటిస్తుండగా..ఆమె తల్లిదండ్రులుగా ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. కూతురు ఈషాకు రోగనిరోదక వ్యవస్థ లోపం కారణంగా వచ్చే పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించగా, కూతురు కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో ప్రియాంకా కనిపించనున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం.. అందులోనూ కూతురికి అనారోగ్యం వంటి దుస్థితిని ఎదుర్కొనే అదితి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇక నటుడు రోహిత్ శరీఫ్ ఈ సినిమాలో జైరాకు అన్నగా నటిస్తున్నాడు. -
ఆర్జేడీ ఆఫీస్‌లో ‘దంగల్’
పట్నా : ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పార్టీ కార్యాలయాన్ని రెజ్లింగ్ రింగ్‌గా మార్చారు. ఈనెల 26న పట్నాలోని పార్టీ కార్యాలయంలో తేజ్ ప్రతాప్, ఆయన సన్నిహితులు దంగల్ (కుస్తీ పోటీ)ను నిర్వహించారు. కుస్తీ పోటీల సంగతి బయటకు పొక్కడంతో స్ధానిక రెజ్లర్లు సైతం ఆయనను కలిసేందుకు ఆర్జేడీ కార్యాలయానికి చేరుకున్నారు. తేజ్‌ప్రతాప్ కోరిక మేరకు ఆయన మద్దతుదారులు పార్టీ కార్యాలయంలో అప్పటికప్పుడు కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పోటీల సందర్భంగా ఐదుగురు స్ధానిక రెజ్లర్లు ఒకరి తర్వాత మరొకరు కుస్తీలో తమ నైపుణ్యాలను ఆర్జేడీ నేత ఎదుట ప్రదర్శించారు. రెజ్లర్స్‌తో తలపడాలని ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ తన మద్దతుదారులను, ఆర్జేడీ కార్యకర్తలను కోరడం విశేషం. అయితే స్ధానిక రెజ్లర్ల సవాల్‌ను స్వీకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. రెజ్లర్ల దంగల్ను ఆసాంతం ఆస్వాదించిన తేజ్ ప్రతాప్ వారిని రూ 5000 నగదు బహుమతితో సత్కరించారు. రెజ్లర్లు తమ కుటుంబాలను పోషించుకునేందుకు వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తేజ్ ప్రతాప్ గతంలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించడంతో పాటు పట్నా వీధుల్లో సైకిల్‌పై సవారీ చేస్తూ కెమెరామెన్ల కంటపడ్డారు. -
మేరా బాలీవుడ్ మహాన్
నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.. ఖడ్గం ఉండకపోవచ్చు కానీ మన చప్పట్లతో వీర జవాన్ల గుండెల్లో ధైర్యం నింపే సైనికులం మనం కుర్చీ అంచున కూర్చుని దేశభక్తిని ధ్వనించే గుండె మనది. సినిమా థియేటర్లో వినిపించే హోరు మనది స్వాతంత్య్రం వచ్చింది. ‘క్విట్ ఇండియా’, ‘వందేమాతరం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జైహింద్’, ‘స్వరాజ్ మేరా జన్మ్ సి«ద్ అధికార్ హై’ వంటి నినాదాలతో నాయకులు ప్రజలను ఉర్రూతలూగించి, లెక్కలేనన్ని త్యాగాలతో స్ఫూర్తి నింపి భారతమాత దాస్యశృంఖలాలను పెళ్ళగించి అవతల పారేయగలిగారు. దేశం ఉత్సాహంగా అడుగు ముందుకేసింది. ‘ఆరామ్ హరామ్ హై’ అంటూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విరామమెరగక దేశ నిర్మాణంలో పడ్డారు. మరోవైపు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెట్టిన హిందీ సినిమా ఆ స్ఫూర్తిని, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శనాన్ని, ఆనాటి త్యాగాలను వీలువెంబడి వెండితెర మీద ప్రత్యక్షం చేస్తూ తాను నింప గల ఉత్సాహం తనూ నింపింది. ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని మేలిమి ముత్యాలుగా నిలిచాయి. మదర్ ఇండియా... నయా దౌర్ భారతదేశం అంటే రైతు. భారతదేశం అంటే పంటచేను. భారతదేశం అంటే పల్లెసీమ. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ గ్రామీణ చిత్రం ఎలా ఉందో చూపుతూ, భారతీయ రైతు స్త్రీ విముక్తే అసలైన దాస్య విముక్తి అని ప్రతిపాదిస్తూ ‘మదర్ ఇండియా’ (1957) సినిమా వచ్చింది. నర్గిస్ నట జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సినిమా సంఘ వ్యతిరేకం అయితే ఈ దేశం కోసం సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి భారత మాతృమూర్తి వెనుకాడదని చెప్పి తేజస్సుతో నిండిన సందేశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘నయా దౌర్’ (1957) దేశంలో జరుగుతున్న యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ చర్చించింది. దేశీయ మూలాలను పదిలంగా ఉంచుతూ మార్పును స్వాగతించాలని సూచించింది. దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో ఓపి నయ్యర్ చేసిన ‘సాథీ హాత్ బఢానా’... అనే పాట కలిసి మెలిసి ముందుకు అడుగువేసేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప బృందగీతం. హకీకత్.. బోర్డర్... లక్ష్య యుద్ధక్షేత్రం ఎలా ఉంటుందో తెలియకపోతే అసలైన దేశభక్తి ఎలా ఉంటుందో అర్థం కాదు. దేశం కోసం లేశమాత్రంగా ప్రాణం త్యాగం చేయడం ఎలా ఉంటుందో అర్థం కాదు. అందుకే బాలీవుడ్ మన దేశం ఎదుర్కొన్న యుద్ధాలను తన కథలుగా చేసుకుంది. 1962 వార్‌ను కథాంశంగా ‘హకీకత్’ (1964) తీసింది. ఇందులోని ‘కర్ చలే హమ్ ఫిదా’... పాట ఇవాళ్టికీ పర్వ దినాలలో మొగుతూ నరనరాల ఉద్వేగం నింపుతూనే ఉంటుంది. ఆ తర్వాత 1971 భారత–పాకిస్తాన్ల యుద్ధ నేపథ్యంగా ‘బోర్డర్’ (1997) వచ్చింది. సన్నిడియోల్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాలో ‘సందేశే ఆతేహై’.. పాట కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వేదనను అశ్రువుల్లో చుట్టి వినిపిస్తుంది. ఇక దేశం చూపిన అతి గొప్ప సాహసం ‘కార్గిల్’ యుద్ధం. మన సైనికుల వీరత్వాన్ని చూపే ఈ యుద్ధం నేపథ్యంలో ‘లక్ష్య’ (2004) సినిమా వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ ఇందులో హీరో. భగత్‌సింగ్... సుభాష్... మంగళ్‌పాండే దేశం దేశనాయకులను ఎలా మర్చిపోదో బాలీవుడ్ కూడా మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులను బాలీవుడ్ తన శక్తిమేరకు చూపించే సగటు ప్రేక్షకుడికి వారిని మరింత చేరువ చేసింది. భగత్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) అజయ్ దేవగణ్‌కు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. సుభాస్ చంద్రబోస్ సమగ్ర జీవితాన్ని శ్యామ్ బెనగళ్ ‘బోస్: ది ఫర్గాటెన్ హీరో’ (2005)గా తీశాడు. ఇక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ హీరో అయిన మంగళ్‌పాండే జీవితాన్ని అదే పేరుతో 2005లో కేతన్ మెహతా ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు. సర్దార్ పటేల్ జీవితాన్ని పరేశ్ రావెల్ అభినయిస్తే దేశీయ భాషల్లో అంబేద్కర్ జీవితం వచ్చింది. హిందూస్తానీ... వెడ్నెస్ డే ఇక దేశంలోని అంతర్గత సమస్యలైన అవినీతి ఉగ్రవాదం వంటి సమస్యలను కూడా బాలీవుడ్ చర్చించింది. శంకర్ తీసిన ‘హిందూస్తానీ’ (1996), నసీరుద్దీన్ షా నటించిన ‘వెడ్నెస్ డే’ (2008) చాలా ప్రతిభావంతంగా ఆ సమస్యలను చర్చించి ప్రేక్షకులను ఆలోచింప చేశాయి బాలీవుడ్ ఇంతటితో ఆగలేదు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా కథాంశంగా తీసుకుని ‘ఉడి’ (2019) వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాబోయే రోజులలో మరెన్నో బయోపిక్‌లో గత కాలపు దేశ ఘనతలు వెండితెరను అలంకరించనున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ మనం మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఇండియా జిందాబాద్ అని గట్టిగా నినాదం ఇవ్వగలగాలి. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం. ఉప్కార్... పూరబ్ ఔర్ పశ్చిమ్ ఆ తర్వాత నటుడు మనోజ్ కుమార్ వచ్చి రెండు మూడు ముఖ్యమైన సినిమాలు తీశాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు కిసాన్, అటు జవాన్ ఇద్దరూ శక్తిమంతంగా ఉండాలనే లాల్‌బహదూర్ శాస్త్రి నినాదాన్ని ఊతంగా తీసుకొని ‘ఉప్కార్’ (1967) సినిమా తీశాడు. ‘ఏ దేశ్ కీ ధర్తీ’... పాట ఈ మట్టిలో మణులూ మాణిక్యాలు పండించడానికి స్వేదజలాన్ని చిందించే రైతుకు చేసిన శాల్యూట్ అని చెప్పవచ్చు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమా కూడా తీశాడు. స్వాతంత్య్రం వచ్చిందనే అత్యుత్సాహంలో ఇబ్బడి ముబ్బడిగా పాశ్చాత్య ప్రభావానికి లోనై మన సంస్కృతిని దెబ్బ తీయడానికి యువత ప్రభావితం కావద్దని చెబుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా నచ్చింది. చక్ దే ఇండియా.. భాగ్ మిల్కా భాగ్... దంగల్ మరో వైపు క్రీడల ద్వారా దేశభక్తిని నింపే ప్రయత్నం కూడా బాలీవుడ్లో జరిగింది. మహిళా హాకీ జట్టులో స్ఫూర్తి నింపే ‘చక్ దే ఇండియా’ (2007) సినిమా ఘన విజయం సాధించింది. షారుక్ ఖాన్ నటించడంతో ఈ సినిమా యువతను క్రికెట్ నుంచి ఆ ఆటవైపు చూసేలా చేసింది. ‘ఫ్లయింగ్ సిక్’గా పేరుగాంచిన మిల్కాసింగ్ జీవితం ‘భాగ్ మిల్కా భాగ్’ (2013)గా రావడం ఒక ముఖ్య సన్నివేశం. ఫర్హాన్ అక్తర్ ఈతరం ప్రేక్షకులకు తెలియని మిల్కాసింగ్‌ను గొప్పగా తెర మీద చూపించగలిగాడు. ఇక ఏ దేశంలో అయితే స్త్రీలను వంటింటి పరిమితం చేస్తారనే పేరు ఉందో ఏ దేశంలో అయితే స్త్రీలను అణిచి ఉంచుతారనే ప్రచారం ఉందో ఆ దేశంలో నుంచి బాక్సింగ్ చేసే అమ్మాయిని ‘మేరీ కోమ్’ (2014)లో, కుస్తీ ఆడే ఆడపిల్లను ‘దంగల్’ (2016)లో చూపి దేశ మహిళల ఘనతకు ఒక నివాళి అర్పించగలింది. దంగల్ -
ప్రతిఫలం దక్కింది
షూటింగ్ లొకేషన్లో స్టార్స్‌కి ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్... ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అందిస్తుంటారు. ఇలాంటి సౌకర్యాలు దక్కించుకునే పొజిషన్‌కి రావడానికి చాలా కష్టాలు పడాలి. ‘‘ఇలా బ్రేక్స్ మధ్యలో తినే ఫ్రూట్స్ కూడా తినలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేదాన్ని’’ అంటూ హీరోయిన్గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు సన్యా మల్హోత్రా. ‘దంగల్’లో ఆమిర్ ఖాన్ చిన్నకూతురిగా నటించిన ఈ అమ్మాయి వెంటనే గుర్తుకురాక మానదు. ఆ సినిమా తర్వాత విశాల్ భరద్వాజ్ ‘పటాకా’, ‘బదాయ్ హో’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నటిగా తన స్ట్రగులింగ్ డేస్‌ని గుర్తు చేసుకుంటూ – ‘‘యాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఆ కల నెరవేర్చుకునే ప్రయత్నంలో మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసేవారు. కానీ మన కాళ్ల మీద మనం నిలబడాలనే మనస్తత్వం నాది. అందుకే వాళ్లని ఊరికే డబ్బులడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పుడంటే అన్ని లగ్జరీలు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో నా దగ్గర ఆపిల్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. డ్రై ఫ్రూట్స్ అనే ప్రసక్తే లేదు. ఆ స్ట్రగులింగ్ డేస్ అన్నీ గతం. ప్రస్తుతం నా లక్ష్యాన్ని చేరుకున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది’’ అని పేర్కొన్నారు సన్యా. -
ఆమిర్ లేకుంటే తన పరిస్థితి ఏమయ్యేదో..
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వల్లే తన సోదరుడు బతికాడంటూ సౌండ్ ఇంజనీర్ షాజిత్ కోయర్ సోదరి భావోద్వేగానికి గురయ్యారు. ఆయనే గనుక సమయానికి ఆదుకోకపోయి ఉంటే తన సోదరుడి పరిస్థితి ఏమయ్యేదో అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దంగల్’ కు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసిన షాజిత్ కోయర్(44) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గత మంగళవారం అతడిని ముంబైలోని లీలా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతడికి గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ సమయంలో లీలావతి ఆస్పత్రి వైద్యులెవరూ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమిర్ ఖాన్ సాయం కోరారు. వెంటనే స్పందించిన ఆమిర్.. షాజిత్ను కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అదే విధంగా అనిల్ అంబానీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వెంటనే వైద్యం అందేలా చేశాడు. ప్రస్తుతం షాజిత్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా 2006లో విడుదలైన ‘ఓంకార’ సినిమాకు గానూ షాజిత్ జాతీయ అవార్డు పొందాడు. రెండు ఫిల్మ్‌ఫేర్, రెండు ఐఫా అవార్డులు కూడా అతడి ప్రతిభకు గుర్తింపుగా లభించాయి. అయితే కళా రంగానికి సేవ చేస్తున్న తన సోదరుడి పట్ల లీలావతి ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని షాజిత్ సోదరి ఆరోపించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఆమిర్‌ను సాయం అడగాల్సి వచ్చిందని, ఆయన సరైన సమయంలో స్పందించినందువల్లే షాజిత్ బతికాడని అన్నారు. లీలావతి ఆస్పత్రి యాజమాన్యం ఆమె ఆరోపణలు ఖండించింది. -
జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు
నిన్నటితో ‘దంగల్’ ముగిసింది. దంగల్ అంటే.. తెలిసిందే, కుస్తీ! పతకం కోసం కుస్తీ.. పరువు కోసం కుస్తీ.ఊరికే కుస్తీ పడితే పతకం వస్తుందా? పరువు పతాకమై ఎగురుతుందా?! ప్రత్యర్థిని పడగొట్టాలి.. విజేతగా.. నిలబడాలి! ఈసారి ఏషియన్ గేమ్స్‌లో.. అమ్మాయిలదే దంగల్ అంతా! అది కాదు విషయం.. జీవితంతో కుస్తీ పడి వచ్చినవాళ్లే అంతా! లేమి లోంచి మెరిసిన ఈ మేలిమి బంగారాలు ఇప్పుడు మన దేశానికి.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్లను మించిన త్రివర్ణ ‘పతకాలు’!! 2018, జకార్తా ఏషియన్ గేమ్స్.. మన అమ్మాయిల దమ్ము చూపించింది. దుమ్ము రేపింది! ఈ ఆటల్లో మెడల్స్ సాధించిన చాలామంది అమ్మాయిలు కలిమిలోంచి వచ్చినవాళ్లు కాదు. మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఇంటి పరువునే కాదు, దేశ కీర్తినీ మోస్తున్న క్రీడాబలులు. జీవితంలోని హార్డిల్స్నూ అదే స్పిరిట్‌తో దాటుతున్న ఆ చిరుతలు తమ గెలుపుతో ప్రభుత్వ కర్తవ్యాన్నీ గుర్తుచేస్తున్నారు. మైదానంలో మాణిక్యాలు వినేశ్ ఫోగత్, చిత్రా ఉన్నికృష్ణన్, స్వప్నా బర్మన్, ద్యుతి చంద్, మలప్రభ జాధవ్, దివ్యా కక్రన్, హిమాదాస్, సరితాబెన్ లక్ష్మణ్ గైక్వాడ్, హర్షితా తోమర్, పింకీ బల్హారా.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం! వినేశ్ ఫోగత్.. ఈ గేమ్స్‌లో మనదేశ మహిళా రెజ్లర్ల బలం చూపించింది.. 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ సంపాదించి! ఆమె మహావీర్ సింగ్ ఫోగత్‌కు స్వయానా తమ్ముడి బిడ్డ. మహావీర్ కూతుళ్లు గీత, బబితాలతో సమానమైన కుస్తీ మెళకువలున్నా గ్లాస్గో, స్కాట్లాండ్ కామన్వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించినా పెద్దనాన్న పంచన నీడగానే ఉండిపోయింది. ఈసారే ఫోగత్ అనే ఇంటిపేరుతోనే కాక వినేశ్ అనే బంగారం కాంతితో మీడియాలో బ్యానర్ అయింది. వినేశ్ ఫోగత్‌కు అయిదేళ్లున్నప్పుడే తండ్రి రాజ్‌పాల్ ఫోగత్ చనిపోయాడు. ఫోగత్‌కు ఒక చెల్లి, తమ్ముడు. తల్లే ఆ ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. తర్వాత వినేశ్‌ను మహావీర్ ఫోగత్ దత్తత తీసుకున్నాడు. తన బిడ్డలతోపాటుగా వినేశ్కూ కుస్తీ నేర్పాడు. పెళ్లి చేసి పంపకుండా ఆడపిల్లలకు కుస్తీపట్టడం నేర్పిస్తున్నాడు అంటే అత్తింట్లో జుట్టుపట్టుకొని పోట్లాడమనా అంటూ ఊరి (భివాణి, హర్యానా) పెద్దలు, కులస్థులు హేళన చేశారు, వెలివేశారు. అయినా ఫోగత్ పట్టుబట్టి ఆడపిల్లలను కుస్తీ వీరులుగా తయారు చేశాడు. అలా బతుకు యుద్ధాన్నీ నేర్చుకుంది వినేశ్. వాటిన్నిటినీ రింగ్‌లో ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రయోగిస్తోంది వినేశ్! చిత్రా ఉన్నికృష్ణన్ స్టోరీ సింపులేం కాదు.. కేరళలోని పాలక్కాడ్ జిల్లా, మందూరు ఆమె స్వస్థలం. చిత్రకు ఊహ తెలిసేటప్పటికే ఆకలి కడుపుతోనే ఆడుకోవడం అలవాటైంది. ఆమె తల్లిదండ్రులు కూలీలు. ఇద్దరూ కష్టడితేనే ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి రెండు పూటలా తిండి దొరికేది. అర్ధాకలితో నిద్ర పోయిన రోజులే ఎక్కువ. పొట్టలో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకొని రాత్రంతా కంటికి మీద కునుకుకు దూరం చేసినా పొద్దున్నే అయిదున్నరకల్లా తను చదువుకునే సర్కారు బడిలోని గ్రౌండ్‌కు పరుగెత్తేది. ఆ పట్టుదలే మొన్నటి ఏషియన్ గేమ్స్‌లో బ్రౌంజ్ మెడల్ వచ్చేలా చేసింది. ఆకలిని జయించింది. ఆత్మవిశ్వాసంతో విధిరాతను మార్చుకుంది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో జయమే ధ్యేయంగా ప్రాక్టీస్‌ను ట్రాక్‌లో పెడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న బర్మన్.. హెపథ్లాన్‌లో బంగారు పథకం సాధించింది. ఈ అమ్మాయి కూడా పేదరికం ఫ్రెండ్షిప్తోనే పెరిగింది. తండ్రి పంచన్ బర్మన్ ఆటోడ్రైవర్. తల్లి బసనా టీ జల్పాయ్గురిలోని టీ ఎస్టేట్‌లో కూలీ. స్వప్నకు గోల్డ్‌మెడల్ వచ్చిందని తెలియగానే ఒక విషయాన్ని తలుచుకొని ఆ అమ్మ కంటతడి పెట్టింది. ‘‘అథ్లెట్స్‌కి బలమైన తిండి పెట్టాలి. పౌష్టికాహారం కాదు కదా నా బిడ్డకు కడుపునిండా కూడా తిండిపెట్టలేదు నేను’’ అంటూ! అయినా ఆ అమ్మాయి అమ్మ మీద అలగలేదు. నాకీ పరిస్థితి ఏంటీ అని కాళ్లు నేలకేసి కొట్టలేదు. ఆకలితో పరుగుపందెం పెట్టుకుంది. దానికి ఎప్పటికీ దొరకనంత దూరానికి వచ్చేసింది. ఒడిషా అమ్మాయి ద్యుతి చంద్‌కు హండ్రెడ్ మీటర్స్ రేస్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. మెడల్స్కన్నా టఫ్గేమ్ అయిన ఆత్మబలాన్ని దెబ్బతీసే సమస్యతో పోరాడి గెలిచింది ఆమె ఆ సక్సెస్ ముందు ఈ పథకాలు చిన్నవే. కాని ఆడడానికే ఆ పోరు నెగ్గింది కాబట్టి ఈ విజయం ద్యుతికి అమూల్యమైనదే. చేనేత కార్మికుల ఇంట ఏడుగురు సంతానంలో మూడో అమ్మాయిగా పుట్టింది ద్యుతి. ఆమె బాల్యమూ గొప్పగా ఏమీ గడవలేదు. అక్క సరస్వతి.. నేషనల్ లెవెల్ అథ్లెట్. ఆమె స్ఫూర్తితోనే ద్యుతి కూడా అథ్లెట్ అయింది. పదిహేడేళ్లకే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విజయపరంపరతో దూసుకెళ్తున్న ద్యుతి లండన్ ఒలింపిక్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్యుతి మీద వైద్య పరీక్షలు మొదలుపెట్టింది కారణం ఆమెకు చెప్పకుండానే. చివరకు ‘జెండర్ టెస్ట్’లో ఫెయిల్ అయినందుకు ఒలిపింక్స్‌లో పాల్గొనే చాన్స్ లేదని, నేషనల్ ఛాంపియన్షిప్ కూడా వదులుకోవాలని చెప్పారు ఆమెతో. ఆ మాట ఆమెను అచేతనం చేసింది. జెండర్టెస్ట్లో ఫెయిలవడానికి దారితీసిన ఆమె శారీరక పరిస్థితిని హైపర్ఆండ్రోనిజమ్ అంటారు. సాధారణ మహిళల్లో ఉండే కంటే ఎక్కువ పాళ్లలో ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హర్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆమె స్త్రీలకు సంబంధించిన అథ్లెట్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఆమెకు రెండే దారులు. ఒకటి.. ఆటలకు శాశ్వతంగా దూరం కావడం, రెండు.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్లి ఆండ్రోజెన్ హర్మోన్ లెవెల్స్‌ను తగ్గించుకోవడం. అయితే ద్యుతి మూడో ఆప్షన్‌ను ఎన్నుకుంది. అలాంటి టెస్ట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని. తనకు ఎదురైంది ఇంకే అమ్మాయికి ఎదురు కావద్దని. గెలిచింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఆమెది గెలుపు దారే! మలప్రభా జాధవ్.. రైతు బిడ్డ. కర్ణాటకలోని తుర్మూరు ఆమె జన్మస్థలం. జూడో కేటగిరీ కురాష్లో కాంస్య పథకం సాధించింది. ‘‘కురాష్ అనే ఒక ఆట ఉంటుందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలకు ఈ ఆట వస్తే చాలా మంచిది. మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉంది. నేర్పించండి అని కోచ్ చెబితే సర్లే స్కూల్లోనే కదా నేర్పిస్తున్నారు అని చేర్పించా’’ అన్నాడు మలప్రభ తండ్రి యెల్లప్ప జాధవ్. ఇప్పుడు కూతురు మెడల్ కొట్టిందని తెలియగానే ఆయన ఆనందానికి అంతులేదు. అన్నట్టు మలప్రభ తుర్మూరు పక్కనుంచే పారే ఒక నది. ఆ పేరే కూతురికి పెట్టుకున్నాడు యెల్లప్ప. తగ్గట్టుగానే ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది మలప్రభ. దివ్యాకక్రన్.. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల రెజ్లింగ్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్యా దిగివ మధ్యతరగతి కుటుంబం. నాయి సామాజికవర్గం. తల్లి లంగోటాలు కుడితే.. తండ్రి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర వసతులతో అడ్జస్ట్ అవుతూ స్పోర్ట్స్‌లో సత్తా చూపుతోంది దివ్యా. స్పోర్ట్స్కోటాలోనే నోయిడా కాలేజ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచలర్స్ డిగ్రీ చేస్తోంది. హిమాదాస్.. జకార్తా ఏషియన్ గేమ్స్ కన్నా ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన అథ్లెట్. అస్సాంలోని నాగోన్ జిల్లా, కంధులిమరి అనే ఊళ్లో పుట్టింది. తండ్రి రొంజిత్ దాస్, జొనాలి దాస్ తల్లిదండ్రులు. రైతులు. అయిదుగురు పిల్లల్లో ఆఖరు సంతానం హిమాదాస్. ఈశాన్య రాష్ట్రాలంటే మిగతా దేశానికి ఉన్న చిన్నచూపు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంది హిమా. ముందు ఫుట్‌బాల్ అంటే ఆసక్తి చూపింది. బాగా ఆడేది కూడా. కాని మన దగ్గర ఫుట్‌బాల్ పట్ల అనాదరణ, అసలు మహిళా టీమ్ అన్న జాడే లేకపోవడంతో అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. విజయాల ట్రాక్ మీద ఉరుకుతూ మొన్నటి ఏషియన్ గేమ్స్‌లో మహిళల 400 మీటర్స్ డెస్టినేషన్‌లో సిల్వర్ సాధించింది. సరితాబెన్ లక్ష్మణ్‌భాయి గాయక్వాడ్.. గుజరాత్‌కు చెందిన ట్రైబల్ గర్ల్. దుగా జిల్లాలోని ఖరాది అంబ స్వగ్రామం. పేదింటి పిల్ల. ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొనేందుకు అరకొర డబ్బుల్తోనే జకార్తా వచ్చింది. డబ్బు సరిపోవట్లేదని గుజరాత్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్లు డబ్బు పంపారు. ఈ గేమ్స్‌లో 4 ఇంటూ 400 రిలేలో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. పింకీ బల్హారా... ఢిల్లీ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. జూడో అంటే ఇష్టం. ఈ ఏషియన్ గేమ్స్‌లో కురాష్లో రజత పథకం సాధించింది. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచీ హార్డిల్సే. ఉమ్మడి కుటుంబంలో కజిన్ చనిపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ విషాదాన్ని పిడికిలిలో బిగించి రింగ్‌లోకి వచ్చింది. కొడుకు పోయాడన్న దిగులుతో పింకీ తాత (తండ్రి తండ్రి) చనిపోయాడు. ఈ విషయాన్ని పింకీకి చెప్పకుండా దాచారు ఇంట్లోవాళ్లు. ఆమె పోటీలో నెగ్గాక విషయం చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువన పెట్టి పథకం తెచ్చింది. కూతురికి తోడుగా జకార్తా వెళ్లాలనుకున్నాడు పింకీ వాళ్ల నాన్న. ఆమె గెలుపు చూడకుండానే వెళ్లిపోయాడు. కండబలంతో మైదానాన్ని ఓడిస్తూ .. గుండెబలంతో జీవితాన్ని విన్ అవుతున్నారు వీళ్లంతా! బతుకు పోడియం ఎక్కి సమాజం సృష్టించిన తారతమ్యాలు తలదించుకునేలా చేస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించొద్దు. ఈ ప్రతిభకు ఇంకా పోటీలు పెట్టొద్దు. ఎన్ని అడ్డంకులున్నా దీక్షకు అడ్డురావని చూపారు. ఆటలు అనగానే ఒక సానియా, ఒక సైనా.. ఒకే ఒక సింధు కాదు.. ఏషియన్ గేమ్స్‌లో ఇండియా జెండా ఎగరేసిన చాలామంది క్రీడాకారిణులున్నారు. స్పాన్సర్షిప్స్కు ఒక టెన్నిస్.. ఇక స్వా్కషే కాదు.. అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఆటలను గ్లామర్ హంగులతో కాదు... స్పోర్టివ్ స్పిరిట్‌తో చూద్దాం! వీళ్ల జీవితాలను ట్రాక్ మీదకు తెద్దాం! – సరస్వతి రమ -
విమానంలో నటికి వేధింపులు.. అరెస్ట్
కొన్ని నెలల క్రితం విమానంలో బాలీవుడ్ మైనర్ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణికున్ని సహారా పోలీసులు అరెస్ట్ చేశారు. నటి చేసిన ఫిర్యాదు మేరకు వికాస్ సచ్దేవ్ (39) అనే వ్యక్తి మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దిన్దోషి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పోలీసలు తెలిపారు. వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ ఫేం ‘దంగల్’ నటి ఢిల్లీ - ముంబై విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె పక్కన కూర్చున్న తోటి ప్రయాణికుడు వికాస్ సచ్దేవ్ తనతో తప్పుగా ప్రవర్తించాడని, తనను అసభ్యరీతిలో తాకడానికి ప్రయత్నించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సదరు నటి తనకు జరిగిన అనుభవాన్ని గురించి చెప్తూ వీడియో తీసి, తన సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారటమే కాక సదరు నటికి దేశవ్యాప్తంగా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి సచ్దేవ్ ఆ సమయంలో తాను అలసిపోయి గాఢనిద్రలో ఉన్నానని.. ఏం చేశానో తనకు తెలియదని తెలిపాడు. అంతేకాక ఆమె కావాలనే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. సచ్దేవ్ లీగల్ టీం కూడా అతనికి మద్దతూ ఇస్తూ నిజంగా అలాంటి పరిస్థితే ఎదురయితే సదరు నటి విమానంలో ఉన్న అలారంను మోగించాల్సింది అంటున్నారు. అంతేకాక ఈ విషయం గురించి కోర్టులోనే పోరాడతామని తెలిపారు. -
దటీజ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌పై వసూళ్ల దాడితో రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలోనే కాక చైనా మార్కెట్లో ఇండియన్ సినిమాలకు గుర్తింపును తీసుకొచ్చింది దంగల్ మూవీ. చైనాలో దంగల్ సినిమా దాదాపు 1300కోట్ల కలెక్షన్లు సాధించింది. గత మూడు సంవత్సరాలుగా చైనాలో 8 ఇండియన్ సినిమాలు విడుదలవ్వగా.. అవి దాదాపు 2784కోట్ల కలెక్షన్లను సాధించాయి. వాటిలో కేవలం దంగల్ సినిమానే సగానికి పైగా వసూళ్లను రాబట్టింది. సీక్రెట్ సూపర్‌స్టార్, బజరంగీ భాయిజాన్ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయి. -
బాహుబలి లైఫ్ టైం వసూళ్లు ఒక్క రోజులోనే..!
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ అయ్యింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించినట్టున్నాయి. బాహుబలి 2 తొలి రోజు 2.85 మిలియన్ డాలర్లు (19 కోట్లు) కలెక్ట్ చేసింది. కేవలం తొలి షోతోనే మిలియన్ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించటం విశేషం. అంతేకాదు చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డ్లను సైతం చెరిపేసిన బాహుబలి 2, అక్కడ తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమాలు ఉన్నాయి. -
‘బాహుబలి 2’ భారీ రిలీజ్
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి 2. దాదాపు అన్ని భాషల్లో టాప్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో రిలీజ్ అవుతోంది. చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతున్న తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న బాహుబలి 2కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా చైనాలో 7000లకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. దంగల్ సినిమా 7000 వేల స్క్రీన్స్ మీదే రిలీజ్ కాగా బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దంగల్ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2.. 8000 స్క్రీన్లపై రిలీజ్ అయిన భజరంగీ బాయ్‌జాన్ రికార్డ్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి బాహుబలి 2 అయినా సత్తా చాటుతుందేమో చూడాలి. -
అదేంటి.. ఆ నటి కనుబొమ్మపై గాటు!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో వరుస సినిమాలు చేస్తున్న భామ సనా ఫాతిమా షైక్. ‘దంగల్’ లో రెజ్లర్ గీతా ఫొగట్‌గా నటించి మెప్పించిన ఈ అమ్మడు తాజాగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఆమిర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సనా తాజాగా ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ వద్ద దర్శనమిచ్చింది. సీరియస్‌గా పుస్తకం చదువుతూ కనిపించిన ఈ అమ్మడిని ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. అదేంటి ఆమె కనుబొమ్మ ఒకటి అలా ఉంది అని ఆరా తీస్తున్నారు. ఒక కనుబొమ్మపై గాటులాగా ఉండటంతో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా లుక్కు కోసం అలా అయ్ బ్రోను షేవ్ చేసుకుందా? అని కామెంట్ చేస్తున్నారు. -
‘దంగల్’ సరసన ‘కాలా’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 75 కోట్లకు స్టార్ సంస్థ ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్‌ను సొంతం చేసుకుందట. దీంతో శాటిలైట్ రైట్స్ రూపంలో అత్యధిక మొత్తం సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఈ సినిమా. అంతేకాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దంగల్ సినిమా రైట్స్ కూడా ఇదే మొత్తానికి అమ్ముడవ్వటం విశేషం. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న 2.ఓ, సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ లిస్ట్‌లో కాలా కన్నా ముందున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ కరికాలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతీనాయకుడిగా నటిస్తుండగా హ్యూమా ఖురేష్ రజనీకాంత్‌కి జోడిగా నటిస్తోంది. రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. -
ఆ నటిని కావాలని తాకలేదు!
సాక్షి, ముంబై: దంగల్ నటి జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరికి చెందిన వికాస్ సచ్దేవ్ అనే 36 ఏళ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. జైరా వసీం మైనర్ అయినందున నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే, నిందితుడు మాత్రం తాను ఉద్దేశపూర్వకంగా జైరా వసీంను తాకలేదని పోలీసులకు తెలిపాడు. తన కాలివేలు ఆమెను తాకిందని చెప్పగానే.. ఆమెకు క్షమాపణ కూడా చెప్పానని వివరణ ఇచ్చాడు. ఢిల్లీలో అంత్యక్రియలకు హాజరైన తాను నిద్రలేక చాలా అలసటతో ఉన్నానని, అందువల్ల తనను డిస్టర్బ్ చేయవద్దని క్యాబిన్ సిబ్బందిని కోరానని, విమాన ప్రయాణంలో పూర్తిగా పడుకోవాలని భోజనం కూడా చేయలేదని అతను తెలిపాడు. ఈ ఘటనపై విస్తారా ఎయిర్‌లైన్స్ వాదన కూడా కొంతమేరకు నిందితుడి వాదనతో ఏకభవించడం గమనార్హం. తమ విమానంలో జరిగిన ఘటనపై విస్తారా ఎయిర్‌లైన్స్ ఇప్పటికే డీజీసీఏకు నివేదిక అందించింది. శనివారం రాత్రి విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళుతుండగా.. జైరాపై వికాస్ వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగగానే బాధితురాలు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టింది. కన్నీటిపర్యంతమవుతూ.. తనను అసభ్యంగా తాకాడని ఆమె తెలిపింది. అయితే, వికాస్ భార్య దివ్య కూడా జైరా వసీం వాదనను తప్పుబడుతోంది. "ఢిల్లీ నుంచి ఆయన తిరిగొచ్చారు. ఆయన మామ చనిపోయాడు. దీంతో ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ స్థితిలో ఆయన బ్లాంకెట్ అడిగి తీసుకొని పడుకున్నారు. ఆమె ఆరోపణలు నన్ను షాక్‌కు గురిచేశాయి' అని దివ్య తెలిపారు. -
దంగల్ బాటలో సీక్రెట్ సూపర్ స్టార్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్‌తో పాటు ఓవర్సీస్ లో మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమాను త్వరలో చైనాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నటుడు ఆమిర్ ఖాన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వెల్లడించారు. ఆమిర్ హీరోగా తెరకెక్కిన దంగల్ గతంలో చైనాలో రిలీజ్ అయి అక్కడ కూడా వసూళ్ల సునామి సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో సీక్రెట్ సూపర్ స్టార్ కూడా మరోసారి సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాకు అద్విత్ చందన్ దర్శకుడు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతోపాటు రికార్డ్ కలెక్షన్లతో సత్తా చాటింది. ఇప్పుడు మరిన్ని రికార్డ్ ల మీద కన్నేసిని ఆమిర్ టీం సీక్రెట్ సూపర్‌స్టార్ ను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
దంగల్ రికార్డ్ బ్రేక్, స్పైడర్ రికార్డ్ సేఫ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విజయ్ కెరీర్ లోనే తొలిసారిగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన మెర్సల్ ఓవర్సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది. అమెరికాలో 132 చోట్ల రిలీజ్ అయిన మెర్సల్.. దంగల్, రాయిస్ లాంటి బాలీవుడ్ చిత్రాలను రికార్డ్ లను బద్దలు కొట్టినట్టుగా ఫోర్బ్స్ తెలిపింది. మంగళవారం రిలీజ్ అయిన మెర్సల్ తొలిరోజు ఏకంగా 3,57,925 డాలర్ల వసూళ్లు సాధించింది. దీంతో తొలి రోజు 3,28,227 డాలర్లు సాధించిన దంగల్ ను వెనక్కు నెట్టి రికార్డ్ సృష్టించింది మెర్సల్. అయితే ఇటీవల విడుదలైన మహేష్ బాబు స్పైడర్ ను మాత్రం మెర్సల్ బీట్ చేయలోకపోయింది. అమెరికాలో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజే స్పైడర్ 10 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలేవి బాహుబలి 2 దారిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాహుబలి 2 తొలిరోజు ఓవర్ సీస్ లో 55 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. -
కట్టప్ప ఎందుకు చంపాడో నేనే తెలుసుకుంటా...
ఆమిర్ ఖాన్ ఓ సూపర్‌స్టార్. అందులో నో సీక్రెట్స్! ఆమిర్ నటించిన ఏ చిత్రమైనా సూపర్‌హిట్టే. అందులో నో డౌట్స్. కానీ, ఆయన్ను మించిన ఓ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఉన్నారని ఆమిర్ చెబుతున్నారు. ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమిర్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు.... ► ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ తెలుగు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు! నిజమే. ‘మంచి కథ దొరికితే’ అని కూడా చెప్పాను కదా! తెలుగులో నటించడానికి నాకు ఎలాంటి సమస్యా లేదు. తెలుగు దర్శకులతో నా కోసం మంచి కథలు, క్యారెక్టర్లు రాయమని చెప్పండి. ఐ యామ్ రెడీ! ► ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీలోనూ (డబ్బింగ్) మంచి హిట్టవుతున్నాయి. వాటిని మీరు చూస్తారా? టైమ్ దొరికినప్పుడు చూస్తుంటా! ‘బాహుబలి’ చూశా. ప్రభాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అద్భుతంగా చేశాడు. తెలుగులో మంచి మంచి నటులు, దర్శకులు ఉన్నారు. మంచి సిన్మాలు వస్తున్నాయి. ‘బాహుబలి 2’ హిందీలో ‘దంగల్’ కంటే ఎక్కువ వసూలు చేసింది. కానీ, నేనింకా ఆ సినిమా చూడలేదు. ► అవునా!? పోనీ, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకున్నారా? తెలియదు. పొరపాటున కూడా ఆ సీక్రెట్ చెప్పవద్దు. నేనే తెలుసుకుంటా. త్వరలో ‘బాహుబలి–2’ చూస్తా. ► ఓకే! మీరేంటి? చెవులకు పోగులు, ముక్కుపుడక... ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సర్ప్రైజ్ లుక్‌లో కనిపిస్తారా? లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న లుక్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం! ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సంగీత దర్శకుడు శక్తి కుమార్‌గా కనిపిస్తా. మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సింగర్ కావాలనే ఓ 14 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనేది చిత్రకథ. ► ఈ సినిమాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఎవరు? చాలామంది ఉన్నారు. సింగర్ కావాలనే అమ్మాయిగా ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్, ఆమె తల్లిగా మెహర్ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరి కథే ఈ సినిమా. నేను స్టార్స్‌తోనే సినిమాలు చేయాలనుకోను. కథకు ఎవరు సూటైతే వాళ్లతో చేయాలనుకుంటా. ‘దంగల్’లో నలుగురు కొత్తమ్మాయిలు ఎంత బాగా చేశారో చూశారు కదా! కొత్త టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ నాకు వస్తుండడం హ్యాపీగా ఉంది. ఈ సిన్మాతో దర్శకుడు అద్వైత్ చందన్, కొత్త సింగర్స్, పలువురు టెక్నిషియన్స్‌ని పరిచయం చేస్తున్నా. ► 2 వేల కోట్లు కలెక్ట్ చేసిన ‘దంగల్’ తర్వాత మీరు నటించిన చిత్రమిది. ప్రేక్షకుల్లో బోల్డన్ని అంచనాలు ఉన్నాయి. మీరేమో ఓ చిన్న సినిమా చేశారేంటి? ఇండియాలోనే కాదు... చైనా, హాంకాంగ్‌లతో పాటు పలు దేశాల్లో ‘దంగల్’ సూపర్‌హిట్. ఆ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు. ‘దంగల్’ నచ్చినోళ్లకు కచ్చితంగా ఈ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కూడా నచ్చుతుంది. ఇందులోనూ మనసుల్ని కదిలించే కథ, కథనాలు ఉన్నాయి. సమాజంలో కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాం. ► ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ట్రైలర్లో ‘అవార్డులు తీసుకుని తీసుకుని విసుగొచ్చింది’ అనే డైలాగ్ చెప్పారు. మీరు అవార్డు వేడుకలకు అటెండ్ అవ్వరు కదా? అందుకే దర్శకుడు కథ చెప్పగానే.. ‘శక్తి కుమార్ పాత్రలో నాకు నేను కనిపించడం లేదు’ అన్నాను. అద్వైత్ మాత్రం నేనే నటిస్తే బాగుంటుందన్నాడు. ‘ఓ పని చేద్దాం. నేను ఆడిషన్ ఇస్తా. బాగుంటే చేద్దాం’ అన్నాను. చివరికి, నన్నే సెలక్ట్ చేశాడు. ► అవార్డుల గురించి వచ్చింది కాబట్టి... ఆస్కార్స్ వచ్చే ప్రతిసారి మన దర్శకులెవరికీ ఆ అవార్డు అందుకునే అర్హత లేదా? అనే ప్రస్తావన వస్తుంది. మీ దృష్టిలో ఆస్కార్స్ సాధించగల దర్శకుడు ఎవరు? ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులు మన దగ్గరున్నారు. వెరీ టాలెంటెడ్. మంచి సినిమాలు తీస్తున్నారు. ఇండియాతో పాటు చైనా, హాంకాంగ్‌లలో భారీ హిటై్టన ‘దంగల్’ను తీసింది మన నితీశ్ తివారీనే కదా! వరల్డ్ క్లాస్ సినిమాలు మనమూ తీస్తున్నాం. సో, ఎవరో (అమెరికన్స్) ఇచ్చే అవార్డు కన్నా... ప్రేక్షకులు ఇచ్చే ప్రశంసలు, ఆదరణే ముఖ్యమని భావిస్తా. ► మీరు రొమాంటిక్ సిన్మా చేసి చాలా రోజులైంది. ఏ హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలనుంది? ఓ అమ్మాయితో రొమాన్స్ చేయాలనుంది. తను మంచి యాక్టర్. అందంగానూ ఉంటుంది. కానీ, నాతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. తన పేరు కిరణ్‌రావ్ (ఆమిర్ భార్య) అని నవ్వేశారు. -
రూపాయి కూడా ముందు తీసుకోను : ఆమిర్
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆమిర్ ఖాన్ దంగల్ రికార్డ్ సృష్టించింది. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికీ పలు దేశాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ఆమిర్ రెమ్యూనరేషన్ గా ఎంత డిమాండ్ చేస్తాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే తన రెమ్యూనరేషన్ కు సంబంధించి ఆమిర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను హీరోగా నటిస్తున్నందుకు చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అడ్వాన్స్ ఆమిర్ తీసుకోడట. కేవలం సినిమాల లాభాల్లో వాటా తీసుకునేట్టుగా తన సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు ఆమిర్. అందుకే తన సినిమాల్లో ఆఖరున పారితోషికం అందుకునేది నేనే అంటూ కామెంట్ చేశాడు. ' పాత పద్దతులనే పాటిస్తున్నాను. నేను ఓ కళను ప్రదర్శిస్తున్నా.. ప్రేక్షకులకు నచ్చితే డబ్బులిస్తారు. లేదంటే నాకు రూపాయి కూడా రాదు. అయితే అదృష్టం కొద్ది నా సినిమాలన్నీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయన్నా'రు. అంతేకాదు అన్ని ఖర్చులు, అందరి పారితోషికాలు ఇచ్చేసిన తరువాత మిగిలిన దాంట్లోనే తాను వాటా తీసుకుంటానని తెలిపాడు ఆమిర్. అయితే ఆమిర్ ఖాన్ చిత్రాలన్ని భారీ లాభాలు సాధిస్తుండటంతో భారీ మొత్తాన్నే వాటాగా అందుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్. తన సినిమాల లాభాల్లో 60 నుంచి 70 శాతం వరకు తన పారితోషికంగా అందుకుంటున్నాడు ఆమిర్. ఈ లెక్కన దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో ఆ సినిమా లాభాల్లో వాటాగా ఏకంగా 300 కోట్లకు పైగా ఆమిర్ అందుకున్నాడట. -
అంధుల కోసం దంగల్ స్పెషల్ షో!
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంధుల కోసం దంగల్ ప్రత్యేక షోను వేస్తున్నారు. అంధుల కోసం సినిమాను ఎలా ప్రదర్శిస్తారనే కదా..? సాధారణంగా ఇతర భాషా చిత్రాలు చూసేటప్పుడు ఆ సినిమాను అర్థం చేసుకోవడం కోసం కింద మనకు పరిచయమున్న భాషలో సబ్ టైటిల్స్ వేస్తారు. అచ్చంగా అంధుల కోసం కూడా ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. అయితే సబ్‌టైటిల్స్ టెక్స్ట్ రూపంలో కాకుండా ఆడియో రూపంలో వేస్తున్నారు. దీనివల్ల అంధులు కూడా సినిమాను సులభంగా అర్థం చేసుకుంటారు. నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ మల్లయోధుడిగా ప్రధానపాత్ర పోషించగా సాక్షి తన్వర్, ఫాతిమా సనా షేఖ్, జైరా వాసిమ్ ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ రెజ్లర్ మహావీర్‌సింగ్ ఫోగట్, గీతాసింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. ఆడపిల్లల్లో ఎంతో స్ఫూర్తిని నింపిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న జీ సినిమాలో ప్రసారం చేయనున్నారు. -
ఆ కలెక్షన్లు నిజం కాదు : ఆమిర్ టీం
చైనాలో రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న దంగల్ కలెక్షన్లపై వినిపిస్తున్న వార్తలపై ఆమిర్ టీం స్పందించింది. ఇటీవల సంస్థ దంగల్ 2000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటినట్టుగా ఇచ్చిన వార్తలను దంగల్ టీం తోసిపుచ్చింది. ఇప్పటికీ చైనా భారీ వసూళ్లను సాధిస్తున్న దంగల్, ఇప్పటి వరకు 1864 కోట్ల వసూళ్లు సాధించిట్టుగా క్లారిటీ ఇచ్చింది. అయితే 2000 కోట్ల మార్క్‌ను తమ సినిమా చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. భారత్‌లో రెండో హయ్యస్ట్ గ్రాసర్‌గా సినిమాగా నిలిచిన దంగల్ చైనాలో సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హాలీవుడ్ సినిమాల లిస్ట్‌లో ఐదో స్థానం సాధించిన దంగల్, మరిన్ని రికార్డ్‌లు సాధించే దిశగా దూసుకుపోతోంది. -
దంగల్ ఖాతాలో మరో రికార్డ్
ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన దంగల్ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌లో భారీ వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా ఓవర్ సీస్ లోనూ హవా చూపించింది. తరువాత చైనా రిలీజ్‌తో ఇండియన్ సినిమా కలెక్షన్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. తాజా రికార్డ్ తో ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించి నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ వారాంతానికి 301 మిలియన్ డాలర్ల(1930 కోట్ల రూపాయల)తో సరికొత్త చరిత్ర సృష్టించనుంది దంగల్. భారత్ లో 84.4 మిలియన్ డాలర్లు వసూళు చేసిన దంగల్, చైనాలో 179.8 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇతర ప్రాంతాలతో కలుపుకొని 300 మిలియన్ డాలర్లకు పైగా వసూళు చేసిన దంగల్, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం రికార్డ్ సృష్టించడమే కాదు 300 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటిన ఐదో నాన్ ఇంగ్లీష్ సినిమా నిలిచింది. దంగల్ కన్నా ముందు చైనా కు చెందిన ది మెర్మైడ్ ($533 మిలియన్స్), మాంస్టర్ హంట్($ 386 మిలియన్స్) ఫ్రాన్స్ సినిమా ది ఇంటచబుల్స్ ($ 427 మిలియన్స్), జపాన్ మూవీ యువర్ నేమ్($ 354 మిలియన్స్) మాత్రమే ఉన్నాయి. -
ప్రమాదం నుంచి బయటపడ్డ నటి
శ్రీనగర్ : బాలీవుడ్ చిత్రం 'దంగల్'లో తన సహజ నటనతో మెప్పించిన నటి జైరా వాసిమ్ తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైరా వాసిమ్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి గురువారం బౌలేవార్డ్ రోడ్ సమీపంలో దాల్ లేక్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. జైరా వాసిమ్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నఓ వ్యక్తికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. అయితే జైరాకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. కాగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్విమ్‌సూట్ ధరించడంతో నటిపై ఆగ్రహం!
‘దంగల్’ సినిమాలో ఆమిర్‌ఖాన్ కూతురు గీతా ఫోగట్‌గా ఆకట్టుకున్న ఫాతిమా సనా షైక్ గుర్తుంది కదా. ఆమె అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. స్విమ్‌సూట్ ధరించిన కొన్ని అందమైన ఫొటోలను ఈ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. మాల్దీవుల్లోని నీలిసముద్రపు తీరాల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన వీటిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగానే.. కొందరు మతరక్షకులు రంగంలోకి దిగారు. పవిత్ర మాసమైన రంజాన్‌లో ఇలా ‘అసభ్యకరమైన’ ఫొటోలు పోస్టుచేస్తావా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆమెను కించపరుస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. దానికి అభ్యంతరం చెప్పడం, కించపరచడం సరికాదని ఆమె అభిమానులు పలువురు ఫాతిమాకు అండగా నిలుస్తున్నారు. -
దంగల్
-
‘దంగల్’కు చైనాలో వెయ్యి కోట్లు
బీజింగ్: భారత్‌లో వసూళ్ల రికార్డు సృష్టించిన ఆమిర్ ఖాన్ చిత్రం ‘దంగల్’.. చైనాలోనూ దుమ్ము రేపుతోంది. చైనాలో వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తం చైనా సినీ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన సినిమాల్లో 33వదిగా మరో రికార్డునూ సొంతం చేసుకుంది. చైనా కరెన్సీలో ఒక బిలియన్ ఆర్‌ఎంబీలను దంగల్ వసూలు చేసిందని ‘మయన్’ వెబ్సైట్ తెలిపింది. చైనాలో ‘మయన్’ ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్సైట్. చైనాలో దంగల్ను మే 5న విడుదల చేశారు. అప్పటి నుంచి 15 రోజుల పాటు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 5’ పొందింది. -
తెలుగు నేలపై దంగల్ డైరెక్టర్
రికార్డ్ కలెక్షన్లతో ఇండియాలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా అవతరించిన దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ కోనసీమలో సందడి చేశారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఓ లఘుచిత్రం కోసం నితీస్ ఆంద్రప్రదేశ్ కు వచ్చారు. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న షార్ట్ ఫిలింను తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిసరప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తివారీ పచ్చదనంతో కూడిన ఇక్కడి ప్రకృతి తనకు ఎంతగానో నచ్చిందన్నారు. వ్యాపార వేత్త భాస్కర్ రెడ్డి ఈ లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
భాషకాదు.. కథాంశమే ముఖ్యం
దంగల్ డైరెక్టర్ నితిష్ తివారీ అమలాపురం : ‘భాష ఏదన్నది కాదు.. కథాంశమే ముఖ్యం. బాలీవుడ్లో మాత్రమే సినిమా తీయాలనే ప్రత్యేక నియమం ఏదీ నేను పెట్టుకోలేదు. మంచి కథాంశం దొరికితే ఏ భాషలోనైనా సినిమా తీస్తాను’ అని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ రైటర్ నితిష్ తివారి. కోనసీమలో ‘మీ నిజమైన సంపద’ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణకు వచ్చిన ఆయన తన భావాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. కథకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. కథను బట్టే ఏ భాషలో తీయాలనేది నిర్ణయించుకుంటాను. ఇప్పుడు తీస్తున్న షార్ట్‌ఫిల్మ్ హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు కథలను సిద్ధం చేస్తున్నాను. కథలు పూర్తయ్యాకా ఏ కథాంశం బాగుంటే దానినే తెరకెక్కించే సన్నాహాలు చేస్తాను. – ఇప్పటి వరకు మూడు సినిమాలు తీశాను. దంగల్ సినిమా తీసేందుకు రూ.70 కోట్ల వరకు ఖర్చయితే.. దేశంలో రూ.850 కోట్ల వరకు వసూలు చేసింది. సినిమాలకు ముందు నేను చాలా షార్ట్‌ఫిల్మ్స్, యాడ్‌ఫిల్మ్ ్స చేశాను. మూడు గంటల సినిమా అయినా.. మూడు నిమషాల షార్ట్‌ఫిల్మ్ అయినా నేను ఒక విధంగా కష్టపడతాను. – రెండు,మూడు నిమషాల షార్ట్‌ఫిల్మ్ తీయడం చాలా సులువు అని అందరూ అనుకుంటారు. కానీ అదే చాలా కష్టం. రెండున్నర గంటల్లో చెప్పాల్సింది రెండున్నర నిమిషాల్లో ప్రేక్షకులకు చెప్పడం అంత సులువేం కాదు. కథతోపాటు నటీనటుల హావభావాలు, సున్నితాంశాలను చాలా తక్కువ సమయంలో ఎక్కువ చూపించాలి. – బాహుబలి పార్ట్–1, పార్ట్–2 చూశాను. చాలా అద్భుతంగా ఉంది. కెమెరాతో మొదట తీసేదానికి గ్రాఫిక్స్‌లో విజువలైజేషన్‌కు చాలా తేడా ఉంటుంది. ఇది దర్శకుని ప్రతిభమీద, అతని ఊహాశక్తిపైన ఆధారపడుతుంది. ఈ విషయంలో రాజమౌళి చాలా అద్భుత ప్రతిభ చూపారు. అందుకే బాహుబలికి అంతక్రేజ్ వచ్చింది. – బాహుబలి వసూళ్లను మించిన సినిమా తప్పకుండా వస్తుందనే నేను నమ్ముతున్నాను. రావాలి కూడా.. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తుంది. – టాలీవుడ్‌కు.. బాలీవుడ్‌కు చాలా తేడాలున్నాయి. సినిమా మేకింగ్ విషయంలో కూడా తేడా ఉంది. అయితే రెండుచోట్లా ప్రేక్షకులు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు ఇండస్ట్రీలలోను సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. దీని వల్ల నిర్మాణ వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. – కోనసీమ చాలా బాగుంది. ఇంత మండు వేసవిలో కూడా పచ్చదనమే కనిపిస్తోంది. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ ప్రజలు చూపుతున్న ఆదరణ, వారు పలుకుతున్న స్వాగతం మనస్సుకు చాలా హాయినిస్తోంది. పచ్చని ప్రాంతంలో పనిచేయడం మరిచిపోలేను. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నాలుగు రోజులుగా పనిచేస్తున్నాను. మరో రెండు రోజులు పనిచేయాల్సి ఉంది. -
బాహుబలి సినిమా ఇంకా చూడలేదు: హీరో
ఇప్పటికే 1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాహుబలి-2 సినిమాను బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఇంతవరకు చూడలేదట! ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ ఇంగ్లీషు కాకుండా వేరే సినిమాలలో రూ. 750 కోట్ల వసూళ్లు దాటిన మొట్టమొదటి సినిమాగా ఇది నిలిచింది. వీటి పుణ్యమాని దేశంలో వెయ్యికోట్ల వసూళ్లు దాటిన రెండో సినిమాగా దంగల్ రికార్డులకెక్కింది. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి -2 సినిమా ఇప్పటికే 1500 కోట్లు దాటేసింది. దీన్ని కూడా చైనాలో విడుదల చేసేందుకు సినిమా వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటివరకు ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు గానీ, వీలైనంత త్వరలోనే దాన్ని విడుదల చేసి, మానియాను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలకు పోలిక లేదని మిస్టర్ పెర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ అంటున్నాడు. దంగల్ సినిమా ఒకరకం అయితే బాహుబలి మరో రకం అని, ఈ రెండూ భారతీయ సినిమాలే కావడం, రెండూ బ్రహ్మాండమైన విజయాలు సాధించడం మాత్రం గర్వకారణంగా ఉందని చెప్పాడు. బాహుబలి సినిమాను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానన్నాడు. తాను ఇంతవరకు ఆ సినిమా చూడలేదు గానీ, దాని గురించి చాలా బాగా విన్నానని చెప్పాడు. రాజమౌళితో పాటు మొత్తం బాహుబలి టీమ్‌ను అభినందిస్తున్నానని అన్నాడు. -
బాహుబలి 2.. ఆ రెండు దాటితే క్లీన్ స్వీప్
బాహుబలి 2 బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్ లను బాహుబలి అవలీలాగా చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియేటర్ల రిలీజ్, అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ లాంటి రికార్డ్‌లు బాహుబలి పేరు మీదకు మారిపోయాయి. అయితే ఓవర్ సీస్లో బాహుబలి ముందున్నవి కేవలం రెండు రికార్డ్‌లు మాత్రమే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే ఓవర్ సీస్లో 10.56 మిలియన్ డాలర్లు వసూళు చేయగా, దంగల్ సినిమా 12.36 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అయితే పీకే రికార్డ్‌ను సోమవారం దాటేయనున్న బాహుబలి 2, దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు రికార్డ్లను చెరిపేసి బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డ్లను క్లీన్ స్వీప్ చేయటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఫుల్ రన్లో బాహుబలి 2, 20 మిలియన్ల మార్క్‌ను సైతం అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రిలీజ్ అవుతుండటంతో బాహుబలి 2 థియేటర్లకు కోత పడనుంది. కానీ తరువాత మరో నెలన్నర పాటు పెద్ద సినిమాలేవి లేక పోవటం బాహుబలి 2కి కలిసొచ్చే అంశం. మరి ముందు ముందు ఈ విజువల్ వండర్ ఓవర్ సీస్లో ఇంకెన్నీ రికార్డ్‌లు సెట్ చేస్తుందో చూడాలి. -
ఇదీ ఆమిర్‌ఖాన్.. ఇప్పటికైనా ఒప్పుకొంటారా!
గొప్ప దేశభక్తి గల నటుడిగా బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్‌కు పేరుంది. అసహనం వివాదంలో చిక్కుకున్నా.. ఆయన తాజా సినిమా 'దంగల్' సినిమా దేశభక్తి చాటేదిగా.. క్రీడాలను ప్రోత్సహించేదిగా విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆయన వ్యక్తిత్వాన్ని చాటే మరో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో భారత సినిమాల విడుదలను పాకిస్థాన్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ నటులపై భారత్‌లో నిషేధం విధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లను బాలీవుడ్ సినిమాల విడుదలను అడ్డుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ నిషేధాన్ని ఎత్తివేసి.. భారత సినిమాలు పాకిస్థాన్‌లో ప్రదర్శించేందుకు అనుమతించారు. పలు భారతీయ సినిమాలు అక్కడ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశానికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ 'దంగల్' సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేసేందుకు ముందుకొచ్చాడు. ఇందుకు ఆమిర్‌ఖాన్, చిత్ర యూనిట్ సైతం ఆనందంగా ఓకే చెప్పింది. పాక్‌లో బాలీవుడ్ నటుల సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని భావించారు. అయినా, ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. అందుకు కారణం.. దాయాది దేశం నుంచి వచ్చిన ఓ 'ఆశ్చర్యకరమైన డిమాండే'. అదేమిటంటే.. 'ఈ సినిమా పాక్ సెన్సార్ బోర్డు పరిశీలనకు వెళ్లగా .. సినిమా అంతా బాగుంది కానీ, క్లైమాక్స్‌లో వచ్చే రెండు సీన్లపై మాత్రం కత్తెర వేయాలని సెన్సార్ బోర్డు చెప్పింది. క్లైమాక్స్‌లో రెజ్లర్ గీతా ఫోగట్ (ఫాతిమా సనా షేక్ ఈ పాత్రను పోషించింది) గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత భారత త్రివర్ణ పతకాన్ని చూపించి సీన్‌ను, జాతీయగీతాన్ని వినిపించే సీన్‌ను తొలగించాలని పాక్ సెన్సార్ బోర్డు కోరింది' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ డిమాండ్ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఆమిర్‌కు చిత్రంగా తోచిందట. 'ఇది క్రీడల నేపథ్యంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ పాకిస్థాన్ ప్రస్తావన లేదు. కేవలం భారత జాతీయవాద మనోభావాలను మాత్రమే సినిమా చూపించాం. అలాంటప్పుడు అలాంటి సీన్లను తొలగించడమెందుకు?' అన్న భావనతో ఈ డిమాండ్‌కు ఆమిర్ ఖాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్' సినిమా దేశంలో రూ. 385 కోట్ల వసూళ్లతో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాక్‌లో విడుదలైతే.. మరో రూ. 10 నుంచి 12 కోట్లు నిర్మాతలకు సమకూరేవి. అంతేకాకుండా ఈ సినిమా పాక్‌లో అధికారికంగా విడుదల కాకపోతే..అక్కడ పైరసీరూపంలో విచ్చలవిడిగా దొరికే అవకాశముంది. అయినా, ఈ విషయంలో నష్టమొచ్చినా పర్వాలేదు కానీ, సినిమాలో ఆ సీన్లకు కత్తెర వేసేందుకు ఆమిర్ ఒప్పుకోలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమిర్ ఈ విషయమై అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. ఆయన అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. -
స్టార్ కోచ్
-
నా భార్యకు మాత్రమే కింగ్‌ను: హీరో
ముంబై: బాలీవుడ్లో, ముఖ్యంగా ఖాన్ త్రయంలో కలెక్షన్ల వేటలో ముందున్నది ఆమిర్ ఖాన్. తన రికార్డులను తనే బద్దలు కొడుతూ ఆమిర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. వందల కోట్ల క్లబ్‌లు ఒక్కోటి దాటేస్తూ పోతున్నాడు. ఆమిర్ తాజా చిత్రం దంగల్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే తాను ఈ బాక్సాఫీసు రికార్డుల గురించి ఆలోచించనని, బాక్సాఫీసు కింగ్ కాదని వినమ్రంగా చెబుతున్నాడు. తాను బాక్సాఫీసు కింగ్ కాదు, కిరణ్ (భార్య కిరణ్ రావు)కు మాత్రమే కింగ్‌ను అని ఆమిర్ చమత్కరించాడు. దంగల్ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో ఆమిర్ పాల్గొన్నాడు. ఈ పార్టీలో ఆమిర్ మాట్లాడుతూ.. ఎంత బిజినెస్ చేయగలదు అనే ఆలోచనతో తాను సినిమాలను అంగీకరించనని, తన హృదయానికి దగ్గరగా ఉన్న కథలనే ఎంచుకుంటానని చెప్పాడు. తారే జమీన్ పర్, ఇడియట్స్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ సినిమాల్లో నటించినపుడు తానెప్పుడూ ఇవి భారీ బిజినెస్ చేస్తాయని ఆలోచించలేదని అన్నాడు. ఇందుకు దంగల్ ఉదాహరణ అని చెప్పాడు. ఈ సినిమాలో వయసు మీరిన, ఎక్కువ బరువున్న రెజ్లర్ పాత్రలో నటించానని, బ్లాక్ బస్టర్ కావడానికి రోమాంటిక్ సాంగ్స్ లేవని, అలాగే ప్రత్యేక ఫార్ములా అంటూ లేదని, ఇలాంటప్పుడు భారీ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదని అన్నాడు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్ విదేశీ మార్కెట్లో 200కు పైగా కోట్ల రూపాయలు, దేశంలో దాదాపు 400 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసింది. హరియాణ కుస్తీవీరుడు మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కూతుళ్లను ఛాంపియన్లుగా మలచడాన్ని కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. -
దంగల్ సక్సెస్ పార్టీ
-
విదేశాల్లోనూ ఆ మూవీకి రికార్డు కలెక్షన్లు!
హైదరాబాద్: బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కూతళ్లను ఛాంపియన్లుగా మలచడాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన దంగల్ మూవీ ఆరో వారం మంచి కలెక్షన్లను వసూలుచేస్తోంది. ఈ నెల 27నాటికి ఓవర్సీస్లో 29.69 మిలియన్ డార్లు (భారత కరెన్సీలో రూ.202.21 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. నిన్న (శుక్రవారం) 28 లక్షలు వసూలు చేసిన దంగల్ మూవీ భారత్‌లో రూ.384.15 కోట్లతో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. భారత్‌లో, విదేశాలలో చూస్తే ఓవరాల్‌గా రూ.586.36 కోట్లు వసూళ్లు రాబట్టి మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ మ్యాజిక్‌ను మరోసారి నిరూపించిన మూవీ దంగల్. భారత్‌లో కలెక్షన్లు ఇదే తీరుగా కొనసాగితే దేశంలో రూ.400 కోట్లు వసూలుచేసిన తొలి చిత్రంగానూ మరో రికార్డును చేరుకుంటుంది. -
దంగల్ నేమ్ ప్లేట్
ఎఫెక్ట్ దంగల్ సినిమాలోని ఎఫెక్ట్స్ది ఏముందీ! దంగల్ సినిమా ఎంత ఎఫెక్టివ్‌గా పని చేస్తోందో బయట చూడాలి. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. దంగల్ రిలీజ్ అయ్యాక, ఆ సినిమాలోని జైరా వసీమ్ స్ఫూర్తితో హర్యానాలోని కమోద్ గ్రామంలోని ప్రతి ఇంటి బయటా తలుపులకు ఆ ఇంటి పెద్దమ్మాయి పేరు కనిపిస్తోంది! సాధారణంగా ఇంటి యజమాని పేరు తలుపు మీద ఉంటుంది. ఆ నేమ్ ప్లేట్ల స్థానంలో అక్కడ పెద్దకూతురు నేమ్‌ప్లేట్ తగిలిస్తున్నారు! కమోద్లో 450 వరకు ఇళ్లు ఉంటాయి. ఈ గ్రామం ఫొగట్ సిస్టర్స్ ఉండే ఊరికి 15 కి.మీ. సమీపంలో ఉంటుంది. (ఫొగట్ సిస్టర్స్ ఇన్స్పిరేషన్తోనే ‘దంగల్’ సినిమా వచ్చింది). ఇప్పుడంటే ఇంటి బయట ఆడకూతురి నేమ్ ప్లేట్ తగిలించి కమోద్ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంది కానీ, ఈ ఊరికి అసలైన ప్రత్యేకత వేరే ఉంది. దేశమంతా అమ్మాయిల సంఖ్య కన్నా, అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఇక్కడ మాత్రం అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది.1300 అమ్మాయిలు. 1000 మంది అబ్బాయిలు. బాలికల సంరక్షణకు మన దేశం మంచి మంచి పథకాలు చేపడుతోంది. ప్రజలు కూడా ఎవరి పరిధిలో వాళ్లు ఆడపిల్లకు ప్రాధాన్యం ఇస్తే మన సమాజంలో లైంగిక వివక్ష త్వరలోనే తొలగిపోతుంది. చూడాలి... కమోద్ను దేశంలోని ఎన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటాయో! ఈ నేమ్ ప్లేట్ ఐడియా నుంచి మన ప్రధానికి ఇంకేదైనా ఉమెన్ ఎంపవర్మెంట్ ఐడియా వస్తుందేమో! -
రూ. 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి
ముంబై: కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ఆమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా దంగల్ మరో ఘనత సాధించింది. ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్ల రూపాయల మార్క్ దాటింది. ఈ నెల 22 నాటికి విదేశీ మార్కెట్లో దంగల్ 200.65 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించిన దంగల్ మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా ఆదివారం నాటికి 381.07 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తుండటంతో 400 కోట్ల రూపాయల మార్క్ బిజినెస్‌ను దాటుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే 400 కోట్ల రూపాయల కలెక్షన్లు (దేశంలో) సాధించిన తొలి భారతీయ సినిమాగా దంగల్ చరిత్రలో నిలిచిపోతుంది. -
దంగల్ మరో ఘనవిజయం
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డీమానిటైజేషన్ ప్రతికూల ప్రభావంతో నష్టాలపాలైన థియేటర్ యజమానుల పాలిట వరప్రసాదంలా ఆదుకుంది ఈ చిత్రం. విలక్షణ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అమీర్ తాజా చిత్రం దంగల్ రూ.375 కోట్ల వసూళ్లను అధిగమించింది. దీంతో థియేటర్ యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 5వ వారానికి మొత్తం రూ.376.14 కోట్లను ఆర్జించింది. ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకులు తరన్ ఆదర్శ్ దంగల్ వసూళ్ల పరంపరను ట్వీట్ చేశారు. క్రిస్మస్ బొనాంజాగా థియేటర్లను పలకరించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం దంగల్ కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో గత రెండేళ్లుగా (2015,2016) నష్టాలను మూట గట్టుకుంటున్న సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు లాభాల పంట పడింది. సింగిల్ స్ర్కీన్ థియేటర్ల యజమానులు అమీర్ కు కృతజ్ఙతలు తెలుపుతూ లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం. సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానుల భావోద్వేగ ఉత్తరంపై బాక్స్ ఆఫీస్ కింగ్ అమీర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రేమించే.. ఇష్టపడే పనిని చేసే అవకాశం అందరికీ రాదనీ, కానీ తనకు అలాంటి అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. కెరీర్ లో అన్నీ అసాధారణ,మైన రిస్కీ మూవీలనే చేసానని చెప్పుకొచ్చారు. అందుకు తాజా ఉదాహరణ 'దంగల్' సినిమానే అన్నారు. కాగా 2016 కలెక్షన్ల పరంగా బోసిపోయిన బాలీవుడ్ కు దంగల్ కలెక్షన్ల వర్షం కురిపించింది. డిసెంబర్ 23 న విడుదల నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన దంగల్ ఇండియన్ బాక్స్ ఆఫీసులను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్రతిహతంగా కొనసాగుతున్న కలెక్షన్లు ఏకంగా రూ 523.47 కోట్లు వసూలు కావడం విశేషం. #Dangal [Week 4] Fri 1.94 cr, Sat 4.06 cr, Sun 4.24 cr, Mon 1.37 cr, Tue 1.27 cr, Wed 1.16 cr, Thu 1.04 cr. Total: ₹ 374.95 cr. India biz. — taran adarsh (@taran_adarsh) January 20, 2017 #Dangal crosses ₹ 375 cr mark... Creates HISTORY... [Week 5] Fri 1.19 cr. Total: ₹ 376.14 cr. India biz. ATBB. — taran adarsh (@taran_adarsh) January 21, 2017 #Dangal records Crossed ₹ 50 cr: Day 2 100 cr: Day 3 150 cr: Day 5 200 cr: Day 8 250 cr: Day 10 300 cr: Day 13 350 cr: Day 19 375 cr: Day 29 — taran adarsh (@taran_adarsh) January 21, 2017 #Dangal crosses $ 29 million internationally... OVERSEAS - Till 20 Jan: $ 29.04 million [₹ 197.70 cr]... USA-Canada crosses $ 12 million 👍👍👍 — taran adarsh (@taran_adarsh) January 21, 2017 -
ఈ పాపులర్ నటిని గుర్తుపట్టగలరా..!
ఈ ఫొటోలో ఉన్న పాపులర్ నటి చిన్ననాటి ఫొటో చూసి ఆమె ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే మూవీలో ఆమె గెటప్.. రియల్ లైఫ్‌లో ఆమెను చూస్తే పోల్చుకోవడం అంత తేలికకాదు. అయితే ఆమె ఎవరో చెబితే మాత్రం నటి ఏ మూవీలో నటించిందో, ఏ పాత్ర పోషించిందో ఇట్టే చెప్పేస్తారు. ఇటీవల ఆమె నటించిన ఓ మూవీ భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా కోసం ఆమె ఆహార్యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ నటి మరెవరో కాదు ఫాతిమా సనా షేక్. ఇంకా గుర్తుకురాలేదా.. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ తన కూతుళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దిన తీరును కథాంశంగా తీసుకుని తీసిన దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది. దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ చిన్నప్పటి పాత్రలో కశ్మీరీ నటి జైరా వసీం నటించగా, కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న పెద్ద గీతా ఫోగట్ పాత్రలో ఫాతిమా సనా షేక్ నటించింది. రెజ్లర్ పాత్ర కోసం ఫాతిమా ఎంతో శ్రమించిందని చెప్పవచ్చు. రెజ్లింగ్ మ్యాట్‌పై అద్భుతం చేసి భారత్‌కు స్వర్ణాన్ని సాధించిన గీతా ఫోగట్ పాత్రలో నటించి క్యారెక్టర్‌కు జీవం పోసింది ఫాతిమా. అయితే దంగల్‌లో హెయిర్ కట్ చాలా చిన్నగా ఉండటంతో ఆమె రియల్ ఫొటోలను చూసి అంత తేలికగా ఆమెను గుర్తించలేరు. -
జైరాకు అండగా నిలిచిన ఆమిర్ ఖాన్
-
జైరాకు అండగా నిలిచిన ఆమిర్ ఖాన్
దంగల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్న కశ్మీరీ నటి జైరా వసీం, అంతే వేగంగా వివాదాల్లోనూ చిక్కుకుంది. తను నటించిన దంగల్ ఘనవిజయం సాధించిన తరువాత కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసిన జైరాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జైరా, ముఖ్యమంత్రిని కలవడాన్ని కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు ముడిపెడుతూ కొందరు ఆమెను రోల్ మోడల్‌గా చిత్రీకరిస్తూ ప్రచారం చేశారు. అదే సమయంలో ఆమె చర్యను తప్పు పడుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. తన పై వస్తున్న కామెంట్స్‌కు వివరణ ఇచ్చిన జైరా వసీం, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. అయినా కామెంట్స్ ఆగకపోవటంతో బాలీవుడ్ ఆమెకు అండగా నిలిచింది. ఇప్పటికే పలువరు బాలీవుడ్ ప్రముఖులు జైరాకు మద్దతుగా ట్వీట్ చేయగా తాజాగా దంగల్ హీరో ఆమిర్ కూడా జైరాకు అండగా నిలిచాడు. 'జైరా.. నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మేమంతా నీతోనే ఉన్నాం. నీలాంటి బాలలు ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలలకు ఆదర్శం. నువ్వు నాకు కూడా ఆదర్శం'. అంటూ ట్వీట్ చేశాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో జైరా పై విమర్శలు చేస్తున్న వారికి కూడా ఓ విజ్ఞప్తి చేశాడు ఆమిర్. 'పదహారేళ్ల వయసులో జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న జైరాకు తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకావమివ్వండి'. అంటూ ట్వీట్ చేశాడు. pic.twitter.com/Ynu3VvdRs0 — Aamir Khan (@aamir_khan) 17 January 2017 -
ఏ సినిమాలకు సాధ్యంకాని రికార్డుకు చేరువలో..
ముంబై: దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించిన దంగల్ మరో అరుదైన రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఆమిర్‌ఖాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకూ 365.87 కోట్ల రూపాయలను వసూలు చేసింది. శనివారం 4.06 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ రోజు (ఆదివారం) సెలవు దినం కావడంతో ఇదే స్థాయిలో కలెక్షన్లు రావచ్చు. ఇదే జోరు కొనసాగితే దంగల్ 400 కోట్ల రూపాయల మార్క్ బిజినెస్‌ను దాటుతుంది. ఇదే కనుక జరిగితే 400 కోట్ల రూపాయల కలెక్షన్లు (దేశంలో) సాధించిన తొలి భారతీయ సినిమాగా దంగల్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంతకుముందు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా పీకే, భజరంగీ భాయిజాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆమిర్ నటించిన పీకే 340.8 కోట్లు, సల్మాన్ ఖాన్ సినిమా భజరంగీ భాయిజాన్ 320.34 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. తాజాగా దంగల్ ఈ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దేశంలో 300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమా పీకే కాగా, 400 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా దంగల్ నిలిచే అవకాశముంది. ఈ రెండు ఆమిర్ ఖాన్ నటించినవి కావడం విశేషం. ఇక ఓవర్సీస్లోనూ దంగల్ భారీ కలెక్షన్లు రాబడుతోంది. శనివారం నాటికి 190.94 కోట్ల రూపాయలు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పాడు. విదేశాల్లో ఈ సినిమా కలెక్షన్లు 200 కోట్ల మార్క్ దాటే అవకాశముంది. -
మరో 'భారీ' రికార్డు సృష్టించిన ఆమిర్ 'దంగల్'!
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన రెజ్లింగ్ డ్రామా 'దంగల్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆడబిడ్డల్లోని శక్తిని చాటి ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్లో 'దంగల్' రూ. 350 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సినిమా మూడు వారాల్లో రూ. 345.30 కోట్లు వసూలు చేసింది. అయినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 'దంగల్' కలెక్షన్ల జోరు తగ్గలేదు. గత వారాంతంలో శుక్రవారం రూ. 10.80 కోట్లు, శనివారం రూ. 14.33 కోట్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 345 కోట్లు సాధించిన ఈ సినిమా అంతర్జాతీయంగా మరో 180.58 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మరో కొత్త క్లబ్‌కు తెరతీసిన ఆమిర్.. 'దంగల్' సినిమాతో మరో కొత్త క్లబ్బుకు ఆమిర్ ఖాన్ తెరతీశారు. అదే రూ. 350 కోట్ల క్లబ్బు. ఇప్పటివరకు వందకోట్ల క్లబ్బును 'గజనీ'తో, రెండువందల కోట్ల క్లబ్బును 'త్రీ ఇడియట్స్', రూ. 300 కోట్ల క్లబ్బును 'పీకే'తో మొట్టమొదట ప్రారంభించిన ఆమిర్ తాజాగా రూ. 350 కోట్ల క్లబ్బులోనూ మొదట తానే అడుగుపెట్టాడు. మరో విశేషమేమిటంటే గత ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా 'దంగల్', హాలీవుడ్ సినిమా 'ద జంగల్ బుక్' డిస్నీ ఇండియా నిర్మించినవే కావడం గమనార్హం. తన కూతుళ్లను అంతర్జాతీయ మెడళ్లను సాధించగలిగే రెజ్లింగ్ ధీశాలిలుగా తీర్చిదిద్దిన రెజ్లర్ మహవీర్‌సింగ్ ఫోగాట్ జీవితచరిత్ర ఆధారంగా అత్యంత హృద్యంగా 'దంగల్' సినిమాను దర్శకుడు నితేష్ తీవారి తెరకెక్కించారు. -
కలెక్షన్స్‌లో ‘దంగల్’ రికార్డుల మోత
-
కలెక్షన్స్‌లో ‘దంగల్’ రికార్డుల మోత
ముంబై: ఆమిర్‌ఖాన్ నటించి, నిర్మించిన ‘దంగల్’ సినిమా భారీ వసూళ్లతో బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ‘పీకే’ సినిమా రికార్డులను బద్దలుకొడుతూ స్వదేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ‘దంగల్’ అవతరించిది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.341.96 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 2014లో వచ్చిన ‘పీకే’ సినిమా భారతదేశంలో మొట్టమొదటిసారి 300 కోట్ల మైలురాయిని దాటిన చిత్రంగా నిలిచింది. రూ.340.8 కోట్ల కలెక్షన్లతో పీకే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నలవగా, భజరంగీ భాయిజాన్- రూ.320.34 కోట్లు, సుల్తాన్- రూ.300.67 కోట్లు తర్వాతి స్థానాల్లో నలిచాయి. ఇప్పుడు దంగల్ రూ.341.96 కోట్ల వసూళ్లతో టాప్ పొజిషన్‌కు చేరింది. ఇప్పటివరకు దేశీయంగా 300 కోట్లపైచిలుకు కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాలు 4. వాటిలో రెండు ఆమిర్వికాగా, మరో రెండు సల్మాన్సినిమాలు. ‘దంగల్’ రోజువారీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.. నలుగురు ఆడపిల్లలు 300 కోట్లు 'దంగల్'లో ఆ సీన్ చూసి ఏడ్చేశాను! WEEK 1 Day 1 (Friday) - December 23: Rs 29.78 crore Day 2 (Saturday) - December 24: Rs 34.82 crore Day 3 (Sunday) - December 25: Rs 42.35 crore Day 4 (Monday) - December 26: Rs 25.48 crore Day 5 (Tuesday) - December 27: Rs 23.07 crore Day 6 (Wednesday) - December 28: Rs 21.20 crore Day 7 (Thursday) - December 29: Rs 20.29 crore WEEK 2 Day 8 (Friday) - December 30: Rs 18.59 crore Day 9 (Saturday) - December 31: Rs 23.07 crore Day 10 (Sunday) - January 1: Rs 31.27 crore Day 11 (Monday) - January 2: Rs 13.45 crore Day 12 (Tuesday) - January 3: Rs 12 crore Day 13 (Wednesday) - January 4: Rs 9.23 crore Day 14 (Thursday) - January 4: Rs 9.12 crore WEEK 3 Day 15 (Friday) - January 4: Rs 6.66 crore Day 16 (Saturday) - January 4: Rs 10.80 crore Day 17 (Sunday) - January 4: Rs 11 crore Total collection (18 days) - Rs 341.96 crore -
ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొడుతుందా?
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను సాధిస్తోంది. గతేడాది విడుదలైన సినిమాలలో ఇదే అత్యధిక వసూళ్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 23న విడుదలైన దంగల్‌కు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 313.50 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తొలివారం 197.54 కోట్లు, రెండోవారం 115.96 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆమిర్ నటించిన పీకే సినిమా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించింది. దంగల్‌కు ఇలాగే నిలకడగా కలెక్షన్లు వస్తే పీకే రికార్డును బ్రేక్ చేసే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమీర్ తన రికార్డును తానే బద్దలు కొడతాడో లేదో చూడాలి. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
'దంగల్' ఎఫెక్ట్: స్పందించిన సీఎం!
ఛండీగఢ్: బాలీవుడ్ 'మిస్టర్ ఫర్ఫెక్ట్' ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో పాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చింది. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ ఆయన కూతుళ్లకు రెజ్లింగ్ శిక్షణ ఇచ్చి ఎలా సక్సెస్ సాధించారన్న కథాంశం ఆధారంగా దంగల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ కారణంగా హర్యాణా ప్రభుత్వం రెజ్లింగ్ క్రీడాకారులకు సహాకారం అందిస్తోంది. అకాడమీలకు వంద రెజ్లింగ్ మ్యాట్లను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న మ్యాట్లను అకాడమీలకు అందజేస్తే.. రెజ్లర్ల ప్రాక్టీస్ ఇబ్బందులు కాస్తయినా తగ్గే అవకాశం ఉంది. గీతా ఫోగట్, బబితా ఫోగట్‌లతో పాటు, వారి తండ్రి, కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్‌ను సీఎం మరోహర్ లాల్ ఖట్టర్ కలుసుకుని వారిని అభినందించారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించడానికి, రాష్ట్రంలో క్రీడలను మెరుగు పరిచేందుకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు. కమిటీ సిఫారసుల మేరకు కొత్త పాలసీని తీసుకొస్తామన్నారు. రాష్ట్ర అత్యుత్తమ ప్లేయర్స్‌కు తగిన ఉద్యోగం, ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం ధీమా ఇచ్చారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన 'దంగల్' మూవీలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఓవరాల్‌గా రూ.411 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. -
రూ. 400 కోట్లు మార్క్ దాటిన కలెక్షన్లు
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా దంగల్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దేశ వ్యాప్తంగా 270 కోట్లు, ఓవర్సీస్లో 141 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మొత్తం 411 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. డిసెంబర్ 23న విడుదలైన దంగల్ తొలివారం దేశీయ మార్కెట్లో 197.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 2016లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. గతేడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసింది. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆ నటుడు దేశానికి గర్వకారణం
ప్రేక్షకులను పవన్‌కల్యాణ్ సర్ప్రైజ్ చేశారు. సర్ప్రైజ్ కాకుంటే మరేంటి? ఎప్పుడూ సోషల్ మీడియాలో రాజకీయ సామాజిక అంశాలపై స్పందించే పవన్‌కల్యాణ్ తొలిసారి ఓ సినిమా గురించి మాట్లాడారు. అదీ కొత్త ఏడాది కానుకగా ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఆయన కొత్త సినిమా ‘కాటమరాయుడు’ గురించి కాదు. ఓ హిందీ సినిమా చూసి ట్విట్టర్లో స్పందించారాయన. ఆమిర్‌ఖాన్ ‘దంగల్’పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘శనివారం (డిసెంబర్ 31న) ‘దంగల్ సినిమా చూశా. నా అభిప్రాయం ఏమిటో అందరికీ చెప్పకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. మన తరంలో ఆమిర్‌ఖాన్ లాంటి నటుడు ఉన్నందుకు దేశమంతా గర్వపడాలి. ‘దంగల్’లోని ఆయన నటన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మనసుల్ని దోచుకుంది. దర్శకుడు నితీశ్ తివారీ, మిగతా ప్రధాన పాత్రధారులకు నా శుభాకాంక్షలు. మన దేశంలో కొరవడిన మహిళల సాధికారిత దిశగా పని చేయాల్సిన అవసరం ఉందని ఈ చిత్రం మనందరికీ గుర్తు చేసింది’’ అన్నారు పవన్. అన్నట్టు... ‘దంగల్’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమిర్‌ఖాన్ హైదరాబాద్ వచ్చి నప్పుడు ‘‘తెలుగులో మల్టీస్టారర్ చేయవలసి వస్తే.. చిరంజీవి లేదా పవన్‌కల్యాణ్‌లతో చేస్తా’’ అన్న సంగతి తెలిసిందే. -
దంగల్ టీంకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
తన సోషల్ మీడియా పేజ్‌లో ఎక్కువగా రాజకీయాలపైనే స్పందించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దంగల్ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై పవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ' ఇటీవల దంగల్ సినిమా చూసిన నేను నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేకపోయాను. ఆమిర్ ఖాన్ తన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. అంత గొప్ప నటుడు భారతీయుడు కావటం మనకు గర్వకారణం. సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. దర్శకుడు నితీష్ తివారీ.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా సినిమాను తెరకెక్కించారు. గీతా ఫొగట్ పాత్రలో నటించిన జైరా వసీం, ఫాతిమా సనా షేక్, బబితా ఫొగట్‌గా నటించిన సుహానీ భట్నాగర్, సన్యా మల్హోత్రాలకు నా ప్రత్యేక అభినందనలు. దంగల్ సినిమా స్త్రీ సాధికారత గురించి మనందరం మరోసారి ఆలోచించేలా చేసింది'. అంటూ ట్వీట్ చేశాడు. pic.twitter.com/xIm8Oys2o4 — Pawan Kalyan (@PawanKalyan) 1 January 2017 pic.twitter.com/dAQhUhaVOd — Pawan Kalyan (@PawanKalyan) 1 January 2017 pic.twitter.com/gghI8J6EfW — Pawan Kalyan (@PawanKalyan) 1 January 2017 -
'దంగల్'లో ఆ సీన్ చూసి ఏడ్చేశాను!
ముంబై: హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ 'దంగల్' వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. మరోసారి ఆమీర్ మ్యాజిక్ చేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీలో ఓ సీన్ తనకు అంతగా నచ్చలేదని, తన మనసు నొచ్చుకుందని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు. ఆ సీన్ ఏంటంటే.. కొన్ని అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఓటమిపాలైన గీతా వ్యవహారం మహావీర్ ఫోగట్ కు నచ్చదు. ఈ విషయంపై గురువుగా గీతను మందలించగా, తండ్రితో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుంది. తన పాత్రలో కనిపించిన ఫాతిమా సనా షేక్, ఆమీర్ మధ్య జరిగిన కుస్తీ సీన్ తో తాన మనసు ఎంతో వేదనకు గురైందన్నారు. ఆ సీన్ చూసి తాను ఏడ్చేశానని రెజ్లర్ గీతా వెల్లడించారు. వాస్తవానికి తాను తన తండ్రి మహావీర్ తో ఒక్కసారి మాత్రమే తలపడ్డానని అంతటితో విషయం ముగిసిపోయింది. కానీ, మూవీలో తండ్రితో కాస్త కఠినంగా ప్రవర్తించినట్లు చూపించారంటూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఓవరాల్‌గా మూవీని తాను ఎంతో ఎంజాయ్ చేశానని, సహజరీతిలో అఖారాలో కుస్తీ ప్రాక్టీస్ సీన్లను చిత్రించడంపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు. జీవిత కథాంశాన్ని తెరపై చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని రెజ్లర్ గీతా ఫోగట్ అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. -
ఏడాది చివర్లో దంగల్ రికార్డు కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా "దంగల్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ ఏడాది తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఈ నెల 23న విడుదలైన దంగల్ నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. ఈ రోజుకు (శుక్రవారం) 200 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా. ఈ వీకెండ్‌కు ఈ సినిమా 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించవచ్చని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు. హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
బాలీవుడ్‌తో పాటు, ఖాన్‌లపై వర్మ ఏమన్నారంటే..
ముంబై: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బస్తీమే సవాల్ అంటూ.. వంగ వీటి సినిమా వివాదాన్ని చాలెంజ్ చేసిన వర్మ ఈ సారి బాలీవుడ్ ఖాన్ లపై విరుచుకుపడ్డారు. అమీర్ ఖాన్ తాజా మూవీ దంగల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటుగా అటు సినిమా ఇండస్ట్రీపై , ఇటు ఇతర ఖాన్ లపై వరుస ట్వీట్లలో రెచ్చిపోయి కమెంట్ చేశారు. భారతీయ ప్రేక్షకుల తెలివితేటలపై అమిర్ ఖాన్ నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. సూపర్ స్టార్లు ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. 50ల తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లు చేసి చూపిస్తుంటారు. అమిర్ కూడా అదే చేశాడు. అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తాడు.అలా ఎదగడంలో అమీర్ సిన్సియారిటీని చూస్తే.. ఆయన పాదాలను తాకాలని ఉంది. అమిర్ కారణంగా ప్రపంచం అంతా ఇండియాను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. బాలీవుడ్ లో ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. అమిర్ మాత్రం ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను నమ్ముతాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతటితో సరిపెట్టలేదు వర్మ... 'దంగల్' చూశాక మొత్తం చిత్ర పరిశ్రమతోపాటు మిగిలిన ఖాన్లు కూడా జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తీరాలని తాను ఫీల్ అవుతున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. Seeing Dangal I feel all us in entire industry including other khans should learn gymnastic martial arts and kick ourselves on our asses — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2016 Which Star of Bollywood since Alam Ara would have taken a decision of putting on weight to look like a father of grown up daughters ? — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2016 -
'దంగల్'లో ఆ సీన్లతో నివ్వెరపోయిన కోచ్!
రెజ్లర్ మహవీర్‌సింగ్ ఫోగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్' సినిమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇటు ప్రశంసలు, అటు కలెక్షన్లతో దూసుకుపోతుండగా.. తాజాగా ఈ చితానికి అనుకోని షాక్ ఎదురైంది. ఈ సినిమాలో తన పాత్రను చూపించిన తీరుపై గీత, బబిత ఫోగట్ల నిజజీవిత కోచ్ పీఆర్ సోంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహవీర్‌సింగ్ తన కూతుళ్లు గీత, బబితలను రెజ్లర్లుగా తీర్చిదిద్దిన తీరు ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో గీత, బబితల కోచ్‌గా పీఆర్ కదం పాత్రను నెగిటివ్ ఇమేజ్‌తో రూపొందించడంపై పీఆర్ సోంధీ మండిపడుతున్నారు. 70 ఏళ్ల సోంధి 2010 కామన్వెల్త్ క్రీడల్లో గీతకు, బబితకు జాతీయకోచ్గా వ్యవహరించాడు. అయితే, సినిమాలో కామన్వెల్త్లో గీత ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మహవీర్ను ఒక గదిలో బంధించి ఆమె మ్యాచ్ చూడకుండా కోచ్ కుట్రపన్నినట్టు చూపించే సీన్ ఉంది. ఈ సీన్ గురించి తెలిసి తాను నివ్వెరపోయినట్టు కోచ్ సోంధి చెప్పారు. 'మహవీర్జీ నాకు ఒకప్పటి మిత్రుడే. ఫోగట్ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను సినిమా చూడలేదు కానీ, నా పాత్ర ఆధారంగా తీసిన కొన్ని సీన్ల గురించి నా శిష్యులు చెప్పడంతో నేను నివ్వెరబోయాను. సినిమాలో మసాలా జోడించడానికి ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం సరికాదు. నా పేరును నేరుగా ఉపయోగించకపోయినా.. నన్ను ఉద్దేశించే ఆ పాత్రను తీర్చిదిద్దారు. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా జాతీయ కోచ్ ఒకరిని గదిలో బంధించి ఉంటే దాని గురించి మీడియాకు, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. దీని గురించి అడిగితే.. గీత కూడా ఈ ఆరోపణలను ఖండిస్తుంది' అని సోంధీ పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్మాతపై లీగల్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నానని, మొదట భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్శరణ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. -
లోకల్ సినిమాలకు 'దంగల్' షాక్
తమిళనాడు, కేరళలోనూ మెరుపులు ఊహించినట్టుగానే ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తర్వాత అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తొలి మూడురోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 106.95 కోట్లు సాధించింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ రూ. 60.99 కోట్లు (9మిలియన్ డాలర్లు) కొల్లగొట్టింది. మొత్తంగా మొదటి వీకెండ్ లో 167.94 కోట్లను ఆమిర్ 'దంగల్' తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఎవరూ ఊహించనిరీతిలో తమిళనాడు, కేరళలోనూ 'దంగల్' కలెక్షన్లలో మెరుపులు మెరిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో హిందీ సినిమాలకు దేశంలోనే అత్యంత తక్కువ మార్కెట్ ఉంది. తమిళనాడులో ఈ సినిమా తమిళ డబ్బింగ్ వర్షన్ 153 థియేటర్లలో, హిందీ వెర్షన్ 24 థియేటర్లలో విడుదలైంది. తమిళనాడు బీ, సీ కేంద్రాల్లోకి చొచ్చుకుపోయి మరీ ఈ సినిమా తొలి మూడు రోజుల్లో అనూహ్య వసూళ్లు సాధించింది. తొలి వీకెండ్ ఏకంగా రూ. 3.27 కోట్లు వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ లో విడుదలైన కేరళలోనూ తొలి వీకెండ్ రూ. 2.10 కోట్లు వసూలుచేసింది. ఇక తమిళనాడులో 'దంగల్' లోకల్ సినిమాలకు ఓపెనింగ్ వసూళ్లతో షాక్ ఇచ్చింది. తమిళంలో నేరుగా విడుదలైన విశాల్ 'కత్తి సందై', శశికుమార్ 'బల్లే వెలైయ థెవ్వా' సినిమాల కన్నా 'దంగల్'కు మంచి వసూళ్లు దక్కడం సినీ పరిశీలకులను విస్మయ పరుస్తోంది. ఆమిర్ 'దంగల్' ను బిగ్ స్ర్కీన్లలో ఎక్కువగా ప్రదర్శించడం కూడా వసూళ్లు పెరగడానికి కారణమని, కానీ, చిన్న పట్టణాలలోనూ ఈ సినిమా తమిళ డబ్బింగ్ బాగా ఆడుతోందని, దీంతో ప్రారంభ వసూళ్లలో విశాల్ సినిమాపై 'దంగల్' ఆధిపత్యం చూపించినట్టు అయిందని ఎగ్జిబీటర్లు చెప్తున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - దంగల్
-
‘దంగల్’ కు పన్ను మినహాయింపు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్న చిత్రం ‘దంగల్’ . విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రానికి యూపీలో వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సినియా ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి మరింత శక్తిని ఇచ్చిందని, అందుకే వినోదపు పన్నును మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హర్యనా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. కాగా హర్యానాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. ఈ చిత్రంలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దంగల్'
ముంబై: ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్‌కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే భారత్‌లో 100 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. నోట్ల రద్దుతో చిల్లర దొరక్క చాలా సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం వెనకబడ్డాయి. ఇలాంటి సమయంలో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే తొలి రోజు కలెక్షన్లలో మాత్రం సుల్తాన్ రికార్డులను తిరగరాయలేకపోయింది. సుల్తాన్ తొలి రోజు రూ.33.34 కోట్లు సాధించగా, దంగల్ మాత్రం 29.78 కోట్లు రాబట్టింది. దంగల్ పై వచ్చిన రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగా రావడంతో ఆ తర్వాత రోజు నుంచి వసూళ్ల వేగం మరింతగా పెరిగింది. శనివారం 34.25 కోట్లు, ఆదివారం రూ.42.35 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులను కలుపుకొని కేవలం భారత్‌లోనే రూ. 106.95 కోట్ల వసూళ్లును కొల్లగొట్టిందని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆమిర్ ఖాన్ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ హిట్ మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది. #Dangal Fri 29.78 cr, Sat 34.82 cr, Sun 42.35 cr. Total: ₹ 106.95 cr [incl Tamil and Telugu]. India biz. FANTABULOUS! — taran adarsh (@taran_adarsh) 26 December 2016 -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దంగల్'
-
ఫేస్బుక్లో దంగల్ లీక్.. కలకలం!
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం శుక్రవారమే విడుదలైంది. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. భారీ రికార్డులపై కన్నేసిన ఈ చిత్రం అంతలోనే సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం సృష్టించింది. ఓ ఫేస్బుక్ యూజర్ సోషల్ మీడియాలో దంగల్ పూర్తి సినిమాను ఉంచగా ఇప్పటికే 4 లక్షల మంది వీక్షించారు, 50 మందికి పైగా దీనిని షేర్ చేశారు. ఆధునిక పైరసీకి ఉదాహారణగా మారిన ఈ ఘటనకు పాల్పడింది ఓ పాకిస్తానీ ఫేస్బుక్ యూజర్‌గా గుర్తించారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తొలగించారు. సోషల్‌మీడియాలో ఈ తరహా పైరసీలు చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు మేవెదర్, పకియావ్ల మధ్య జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌ను సైతం పెరిస్కోప్‌లో యూజర్లు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ ఘటనతో పెరిస్కోప్ యూజర్లకు కఠినమైన నియమనిబంధనలు తీసుకొచ్చింది. -
'అంత ప్రశాంతమైన డైరెక్టర్‌ను చూడలేదు'
ముంబై: మరాఠీ నటుడు గిరీష్ కులకర్ణి.. దంగల్ దర్శకుడు నితీష్ తివారిపై పొగడ్తల వర్షం కురిపించాడు. అసలు అంత ప్రశాంతంగా పనిచేసుకుపోయే దర్శకుడిని తాను ఇంతవరకు చూడలేదని వెల్లడించాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కోచ్ పాత్రలో నటించిన కులకర్ణి శనివారం చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ.. ఇంత భారీ ప్రాజెక్టును దర్శకుడు విజయవంతంగా చేపట్టడానికి స్పష్టమైన విజన్‌తో పనిచేయడమే కారణం అని పేర్కొన్నాడు. తన నటుల వద్ద నుంచి సలహాలు తీసుకోవడంలో సైతం నితీష్ ముందుంటారని వెల్లడించారు. -
'మూడు రోజుల్లో వందకోట్లు'
ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్‌కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన దంగల్ డిమోనిటైజేషన్ ఎఫెక్ట్‌ను దాటి భారీ వసూళ్లను రాబడుతోంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా 29.78 కోట్లు సాధించింది. శని, ఆది వారాల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉండటంతో తొలి మూడు రోజుల్లోనే దంగల్, వంద కోట్ల క్లబ్లో చేరుతుందని తెలిపారు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్. సూపర్ హిట్ మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది. #Dangal wrestles demonetisation... Sets the BO on fire... Ends the lull phase... Fri ₹ 29.78 cr [incl ₹ 59 lacs from Tamil and Telugu]. — taran adarsh (@taran_adarsh) 24 December 2016 #Dangal Sat and Sun biz will be higher... Word of mouth is terrific... Expected to cross ₹ 100 cr mark in first 3 days... India biz. — taran adarsh (@taran_adarsh) 24 December 2016 -
ఆమిర్ మరోసారి మ్యాజిక్ చేశాడు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా కోసం శారీరకంగా మానసికంగా ఎంత శ్రమకైనా రెడీ అయ్యే ఆమిర్.. క్వాలిటీ సినిమాను అందించటం కోసం ఎంత సమయాన్నైనా కేటాయిస్తాడు. తనకున్న స్టార్ డమ్‌ను క్యాష్ చేసుకోని ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయటం ఆమిర్‌కు నచ్చదు. ఒక్క సినిమా చేసినా అది అభిమానులు గొప్పగా చెప్పుకునేది అయి ఉండాలి అన్నదే ఆమిర్ ఫిలాసఫీ. ఆ బాటలో ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం దంగల్. హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్‌తో ఉన్న ఆమిర్. 50 ఏళ్ల వ్యక్తిగా నలుగురు అమ్మాయిలకు తండ్రిగా నటించటం అంటే సాహసం అనే చెప్పాలి. ప్రముఖ భారత రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన దంగల్ సినిమాతో ఆ సాహసం చేశాడు ఆమిర్. రెజ్లర్‌గా ఎంతో సాధించిన ఫోగట్ తన వారసులుగా కూతుళ్లనే బరిలో దించటం అందుకు వారిని ఎలా సిద్ధం చేశాడన్నదే దంగల్ కథ. నితీష్ తివారి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కథ విషయానికి వస్తే హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫోగట్. రెజ్లింగ్‌లో భారత్ కు బంగారు పతకం అంధించాలన్నదే అతని కల. ఆ కలను తాను సాకారం చేసుకోలేకపోవటంతో తన వారాసుల ద్వారా అయినా అది సాధించాలనుకుంటాడు. కానీ తనకు నలుగురు కూతుళ్లే పుట్టడంతో నిరుత్సాహపడతాడు. అయితే ఒక రోజు స్కూల్లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్, బబితా కుమారీలను చూసిన మహావీర్, తన కూతుళ్లు ఏ మగాడికన్నా తక్కువ కాదని భావిస్తాడు. తాను సాధించలేని బంగారు పతకాన్ని కూతుళ్ల ద్వారా భారత్‌కు అందించాలని నిశ్చయించుకుంటాడు. తానే శిక్షకుడిగా మారి కూతుళ్లను దేశకీర్తి పతాకాన్ని ఎగురవేసే రెజ్లర్లుగా తయారు చేస్తాడు. చిల్లర్ పార్టీ, భూత్నాథ్ రిటర్న్స్ లాంటి కామెడీ చిత్రాలను తెరకెక్కించిన నితీష్ తివారీ, తొలిసారిగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాడు. సినిమా తొలి సీన్ నుంచే ప్రేక్షకున్ని కథలో లీనం చేసిన దర్శకుడు, పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ప్రీతమ్ అందించిన సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో భావోద్వేగాలను తన సంగీతంతో మరింత రక్తికట్టించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నింటికీ మించి ఆమిర్ నిర్మాణ విలువలు సినిమాను ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాగా ప్రేక్షకులముందుంచాయి. అందుకే ఈ అద్భుత చిత్రానికి ప్రేక్షకులు భాషా బేదాలను మరిచి బ్రహ్మరథం పడుతున్నారు. -
ఆమిర్... నువ్వంటే ద్వేషం!
సల్మాన్! నీ ‘ద్వేషం’లో నేను ‘ప్రేమ’నే చూశా. నిన్ను ద్వేషిస్తున్నంతగానే... ప్రేమిస్తున్నాను – ఆమిర్ యాభై ఏళ్ల వయసులో బాడీ మేకోవర్ అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంతో కృషి, తపన ఉంటేగానీ సాధ్యం కాదు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ యాభైఏళ్లలోనూ బాడీ మేకోవర్ చేసి అందర్నీ ఔరా! అనిపించారు. సల్మాన్, ఆమిర్ మల్లయోధులుగా చిత్రాలు ప్రకటించినప్పటి నుంచే వాళ్ల ఫిజిక్, పెర్ఫార్మెన్స్పై అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ‘సుల్తాన్’ విడుదలై ఘనవిజయం సాధించి మాంచి వసూళ్లు రాబట్టింది. ‘సల్మాన్ సూపర్’ అని అందరూ అన్నారు. ఇప్పుడు విడుదలైన ఆమిర్ ‘దంగల్’ చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆమిర్ మేకోవర్కి ప్రశంసలు లభిస్తున్నాయి. అభినందించిన వాళ్లల్లో సల్మాన్ కూడా ఉన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ‘దంగల్’ చూశా. ‘సుల్తాన్’ కన్నా ఇదే బాగుందన్నారు. ఆమిర్.. వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టం. అయితే వృత్తిపరంగా మాత్రం ద్వేషం’’ అని సల్మాన్ సరదాగా చమత్కరించారు. సల్మాన్ చేసిన ఫన్నీ ట్వీట్‌కి అంతే ఫన్నీగా ఆమిర్ కూడా ట్విట్టర్ ద్వారా పై విధంగా సమాధానం ఇచ్చారు. -
ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’ సర్వర్ డౌన్!
మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ తాజా సినిమా ‘దంగల్’ శుక్రవారం విడుదల అవుతుండటంతో ఈ సినిమా టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవడానికి జనం పోటెత్తారు. దీంతో ఒక దశలో బుక్ మై షో.కామ్ వెబ్సైట్ సర్వర్ డౌన్ అయి.. క్రాష్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కొంతసేపు వెబ్సైట్ సర్వర్ మొరాయించినట్టు తెలుస్తోంది. దీంతో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కొంతమంది వినియోగదారులకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సినిమాలు, ప్రత్యేక షోల ఈ-టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకొనే సదుపాయన్ని బుక్‌మైషో వెబ్సైట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఇతివృతంతో వస్తున్న ఆమిర్ తాజా చిత్రం ’దంగల్’కు సానుకూల రివ్యూలు పోటెత్తడం, మంచి మౌత్‌టాక్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముంబై, పుణె వంటి నగరాల్లో ఇప్పటికే చాలా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అయిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రారంభ వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ మంచి టాక్‌తో ఈ సినిమా థియేటర్లు ఫుల్ అవుతున్నాయని తెలుస్తోంది. తెలుగులోనూ ’దంగల్’ సినిమా ’యుద్ధం’ పేరిట డబ్ అయింది. -
నీ సినిమానే బాగుంది.. అందుకే ద్వేషిస్తున్నా!
రెజ్లింగ్ నేపథ్యంతో సినిమాలు తీసున్నామని, అవి 2016లో విడుదల చేస్తామని ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రకటించినప్పుడు ఒకింత ఆసక్తితోపాటు ఆశ్చర్యపరిచింది. సల్మాన్ ’సుల్తాన్’, ఆమిర్ ’దంగల్’ చిత్రాల్లో ఎవరి సినిమా విజేతగా నిలుస్తుందన్న చర్చ జరిగింది. సల్మాన్ ’సుల్తాన్’ మొదట విడుదలైంది. భారీ కలెక్షన్లతో ఊహించినట్టుగానే ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సుల్తాన్ అలీఖాన్ అనే వ్యక్తి ఉత్థానపతనాలు ఇతివృతంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ పూర్తిగా కల్పితం. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ’దంగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ఫూర్తిదాయకంగా మలిచిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రివ్యూలు రావడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ ఏడాది వచ్చిన సుల్తాన్, దంగల్ సినిమాల్లో ఏది అత్యుత్తమ సినిమా అన్న చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఈ చర్చపై ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. తన సుల్తాన్ సినిమా కన్నా దంగల్ ఎంతో బాగుందని కితాబిచ్చాడు. ఆమిర్ వ్యక్తిగతం ప్రేమించినా.. వృత్తిపరంగా ఆయనను ద్వేషిస్తానంటూ ట్విస్టు ఇచ్చాడు. ’మా కుటుంబం ఈ రోజు దంగల్ సినిమా చూసింది. ఇది సుల్తాన్ కన్నా ఎంతో బాగుంది. ఆమిర్, నిన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నా.. కానీ వృత్తిపరంగా ద్వేషిస్తున్నా’ అంటూ సల్మాన్ చేసిన ట్వీట్ నెటిజన్లను అలరిస్తోంది. My Family saw #Dangal today evening and thought it was a much better film than #Sultan. Love u personally Aamir but hate u professionally ! pic.twitter.com/sJlDG7u95c — Salman Khan (@BeingSalmanKhan) 22 December 2016 -
'దంగల్' మూవీ స్టిల్స్
-
'దంగల్' సెలబ్రిటీ రివ్యూ వచ్చేసింది..
ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం 'దంగల్'. ఏడాదికి ఒకే సినిమా .. అది కూడా పూర్తి మనస్సుపెట్టి త్రికరణ శుద్ధిగా తీస్తాడని ఆమిర్‌ఖాన్‌కు పేరు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్.. రెజ్లింగ్యోధుడు మహవీర్‌సింగ్ ఫోగట్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన 'దంగల్' సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్లకు థియేటర్లో ప్రత్యేక షో వేయించి ఆమిర్‌ఖాన్ మంగళవారం చూపించారు. ఈ షోకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మహవీర్‌సింగ్ ఫోగట్ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఈ సినిమాను కరణ్ జోహార్, షబానా ఆజ్మీ వంటి ప్రముఖులు చూసేశారు. మహిళా సాధికారిత, క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో తీసిన ఈ సినిమాలో రెజ్లింగ్ క్రీడాకారుడిగా, తన కూతుళ్లకు మల్లయుద్ధం నేర్పించే తండ్రిగా రెండు విభిన్నమైన పాత్రలో ఆమిర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాను చూసి బాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో గొప్ప చిత్రంగా 'దంగల్' నిలిచిపోతుందంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమిర్ నటనను, సినిమాను వేనోళ్ల కొనియాడారు. ఇంతకు వారు ఏమన్నారంటే.. 'నేను చాలాకాలం నుంచి చూస్తున్న సినిమాల్లో ఉత్తమ సినిమా 'దంగల్'. మున్ముందు కూడా ఒక గొప్ప సినిమాగా ఇది నిలిచిపోతుంది. సెల్యూట్ ఆమిర్ సర్- శిరీష్ కుందర్, ప్రముఖ దర్శకుడు ఎంత అద్భుతమైన సినిమా దంగల్! దేశ క్రీడలకు, మహిళలకు ఈ సినిమా ఒక ముఖ్యమైన ఈవెంట్. ఆమిర్‌ఖాన్ మరోసారి మనలో స్ఫూర్తి నింపుతారు- అర్జున్ కపూర్, బాలీవుడ్ హీరో దంగల్ చిత్రబృందానికి తలవొంచి ప్రమాణం చేస్తున్నా. అద్భుతమైన స్ర్కీన్‌ప్లే. సంగీతం. ఆమిర్‌ఖాన్ ఇతర నటులు అద్భుతంగా నటించారు- మిలింద దేవరా, రాజకీయ నాయకుడు దంగల్‌లో ఆమిర్ ల్యాండ్‌మార్క్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇద్దరు అమ్మాయిలు కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు నితీశ్ తివారీ బహుముఖ భావోద్వేగాలతో సినిమాను రూపొందించారు- ప్రసూన్ జోషి -
దంగల్‌పై ఆ వార్తల్లో నిజం లేదు
ముంబై: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం పాకిస్తాన్లో విడుదలవుతుందంటూ వచ్చిన వార్తలను ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ఖండించారు. దంగల్ చిత్రాన్ని పాకిస్తాన్లో విడుదల చేయడం లేదని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఉడీ ఉగ్రదాడుల అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ చిత్రాలను ప్రదర్శించబోం అని పాకిస్తాన్ థియెటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. ఇలా భారతీయ చిత్రాలను నిలిపివేయడం మూలంగా రెండు నెలల్లో వారు సుమారు రూ. 15 కోట్లు నష్టపోయారు. దీంతో.. సోమవారం నుంచి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు థియెటర్ల యజమానులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దంగల్ చిత్రం పాకిస్తాన్లో కూడా విడుదలవుతుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడులవుతుంది. -
అతడు హానికారక తండ్రి
రాబోవు చిత్రం అమ్మాయిలు మానసిక సమస్యలతో పోరాటంలో విజయ సాధించగలరు అని ఇటీవల విడుదలైన ‘డియర్ జిందగీ’ సినిమా నిరూపిస్తే శారీరక బలం పురుషులతో సమానంగా ప్రదర్శించగలరు అని నిరూపించడానికి రేపు శుక్రవారం ‘దంగల్’ వస్తోంది. ‘దంగల్’ అంటే ‘గోదా’ అని ‘కుస్తీ పోటీ’ అని అర్థాలున్నాయి. ఈ కథ నిజజీవిత సంఘటనలతో ప్రభావితమై తీశారని తెలిసిందే. హర్యాణాకు చెందిన మహావీర్ ఫోగట్ అనే మల్లయోధుడు అంతర్జాతీయ పోటీలలో గోల్డ్‌మెడల్ సాధించలనుకున్నాడు. అది సాధించలేకపోయాడు. తన కుమార్తెలకు కుస్తీ యుద్ధం నేర్పించి ఆ కలను నెరవేర్చుకున్నాడు. అతని కుమార్తెలు గీతా ఫోగట్, బబిత కుమారి కామన్వెల్త్ పోటీలలో పతకాలు సాధించారు. గీతా ఫోగట్ అయితే ఒలంపిక్స్ యోగ్యత పొందిన తొలి భారతీయ మహిళా మల్లయోధగా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని సినిమాగా మలిస్తే బాగుంటుందని ఆలోచన చేసిన డిస్నీ స్టూడియో ఇది వరకే ‘చిల్లర్ పార్టీ’, ‘భూత్నాథ్ రిటర్న్ ్స’ సినిమాలు తీసిన దర్శకుడు నితిష్ తివారీని కథ తయారు చేయమంది. నితిష్ తివారి దీనిని జాక్‌పాట్‌గా భావించి కథ మీద కూర్చున్నాడు. పదేళ్ల తర్వాత అనుకొని... కథ పూర్తయ్యాక దీనిని మొదటగా ఆమిర్ ఖాన్‌కు వినిపించాడు డిస్నీ స్టూడియో తరఫున నితిష్ తివారీ. ఆమిర్‌కు వెంటనే నచ్చేసింది. అప్పుడతడు ‘ధూమ్ 3’ షూటింగ్ ముగించి ‘పికె’ సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. ఈ కథ వినగానే చాలా బాగుంది, కాని ఇది చేయాలంటే నాకు ఇంకాస్త వయసు రావాలి, మరికాస్త ముసలివాణ్ణి కావాలి ఒక పదేళ్లు ఆగి చేద్దాం అన్నాడు ఆమిర్ ఖాన్. కాని ఆరునెలల తర్వాత ఏమనుకున్నాడో ఏమో మళ్లీ కథ విని తానే చేస్తానని ముందుకొచ్చాడు. దానికి ఎంత కష్టపడ్డాడో ఎన్ని కేజీల బరువు పెరిగాడో మళ్లీ తగ్గి ఎలా మామూలు మనిషి అయ్యాడో అవన్నీ పత్రికల్లో అందరూ చూస్తూనే ఉన్నారు. హానికారక్ బాపు ఈ సినిమాలో తన నెరవేరని కలను తనకు పుట్టబోయేవాడు నెరవేర్చాలని అనుకుంటాడు ఆమిర్‌ఖాన్. కాని భార్య కాన్పు వెంట కాన్పులో వరుసగా నలుగురు ఆడపిల్లలను ప్రసవిస్తుంది. ఆడపిల్లలంటే ప్రేమే అయినా వాళ్లు కుస్తీకి పనికి రారు కదా అని బాధపడతాడు. అయితే వీధి కొట్లాటల్లో తన ఇద్దరు కూతుళ్లు అబ్బాయిలను చితకబాదటం చూసి ‘వీళ్లిద్దరూ కుస్తీకి పనికొస్తారు. బంగారు పతకం బంగారు పతకమే... అది అబ్బాయి తెస్తే ఏమిటి అమ్మాయి తెస్తే ఏమిటి’... అని వాళ్లకు కుస్తీలో శిక్షణ ప్రారంభిస్తాడు. కాని ఆ ఇద్దరి అమ్మాయిలకు ఇది చాలా కష్టమైన పని. పైగా అది తిను ఇది తినకు అలా పరిగెత్తు ఇలా ఎక్సర్సైజ్ చెయ్ అని తండ్రి విసిగిస్తుంటే ‘హానికారక్ బాపు’ అని తిట్టుకుంటారు. అంటే తండ్రి తమ పాలిట హానికారకంగా తయారయ్యాడు అని అర్థం. దంగల్ ప్రోమోలలో ఈ హానికారక్ బాపు అనే పాట ఉన్న ప్రోమో పెద్ద హిట్ అయ్యింది కూడా. ఆడవాళ్లకు జేజేలు బాలీవుడ్లో ఆడవాళ్ల సై్థర్యానికి వ్యక్తిత్వానికి విలువనిచ్చే సినిమాలు వరుసగా వస్తున్నాయి. ‘సాలా ఖడూస్’, ‘పింక్’, ‘డియర్ జిందగీ’... ఇప్పుడు ‘దంగల్’. మంచి కథ ఉంటే బాక్సాఫీస్ దగ్గర కూడా లేడీస్ ఫస్ట్ అని నిరూపిస్తున్న సినిమాలు ఇవి. -
పాక్ సినిమా హాళ్ల అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని సినిమా థియేటర్ల యజమానులు అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు భారతీయ చిత్రాలపై వారికి వారుగా విధించుకున్న నిషేధాన్ని ఎత్తివేయబోతున్నారు. ఈ వారం ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి భారత సైనికులపై రాత్రికి రాత్రి పాక్ ముష్కరులు దాడులు చేసి పలువురిని పొట్టన బెట్టుకున్న అనంతరం భారత్‌లో పనిచేస్తున్న పాక్ సినిమా వాళ్లంతా దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తమ వారిని అవమానిస్తారా అని పాక్ లోని సినిమా సంఘాల వాళ్లు, థియేటర్ల యజమాన్యాలు ఎవరికి వారుగా భారత సినిమాలపై నిషేధం విధించారు. అయితే, ఈ చిత్రాలపై బ్యాన్ విధించినప్పటి నుంచి వారి పరిస్థితి అద్వానంగా మారింది. ఈ నేపథ్యంలో దంగల్ సినిమాను ఆశ్రయంగా చేసుకొని భారతీయ చిత్రాల విడుదలపై ఉన్న నిషేధాన్ని సోమవారం రద్దు చేయాలని నిర్ణయిస్తున్నారు. అదీ కాకుండా ఆమిర్ ఖాన్ కు భారత్ లో ఎంత క్రేజ్ ఉందో.. పాక్ లో కూడా అంతే క్రేజ్ ఉంది. -
హైదరాబాద్‌లో ఆమిర్ సందడి
-
చిరంజీవిగారితో కుదరకపోతే పవన్‌తో..!
‘మంచి కథ, పాత్రలు లభిస్తే... చిరంజీవిగారితో కలసి తెలుగులో మల్టీస్టారర్ సినిమా చేస్తా! ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ చిరంజీవిగారితో కుదరపోతే... పవన్‌కల్యాణ్‌తో మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే’’ అన్నారు ఆమిర్‌ఖాన్. మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఆమిర్ చేసిన హిందీ సినిమా ‘దంగల్’ తెలుగులో ‘యుద్ధం’గా అనువాదమైంది. ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారం నిమిత్తం ఆదివారం ఆమిర్ హైదరాబాద్ వచ్చారు. స్ట్రయిట్ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా... ‘‘భాష రాకుండా సినిమా చేస్తే పాత్రలో భావోద్వేగాలు ఆవిష్కరించ డం కష్టమని నా అభిప్రాయం. ఒకవేళ మంచి కథతో ఎవరైనా వస్తే నటిస్తా. తెలుగులో నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. మరి, మల్టీస్టారర్ చేయవలసి వస్తే ఎవరితో నటిస్తారు? అని అడగ్గా.. ‘‘తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్.. తమిళంలో రజనీకాంత్‌లతో చేస్తా. కథలో ఇద్దరు హీరోల పాత్రలూ అద్భుతంగా ఉండాలి’’ అన్నారు. ఆమిర్ హీరోగా సినిమా చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. ‘‘అవన్నీ పుకార్లు మాత్రమే. ‘బాహుబలి’ తర్వాత ఆయన్ను ఓసారి కలిశానుl. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదు’’ అన్నారు. రాజమౌళి కలల సినిమా ‘మహాభారతం’లో ఛాన్స్ వస్తే నటిస్తారా? అనడిగితే... ‘‘మహాభారతంలో కర్ణుడు, కృష్ణుడు పాత్రలు ఇష్టం. కర్ణుడు ఆరడుగుల ఆజాను బాహుడు. ఆ పాత్రకు సూటవను కనుక కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు. -
ఆమిర్‌కు రజనీ ఎందుకు నో చెప్పాడు?
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ తాజా సినిమా 'దంగల్'. రెజ్లింగ్ నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'దంగల్'లో ఆమిర్ ఖాన్ పాత్రకు తమిళంలో డబ్బింగ్ చెప్పాలని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చిత్రయూనిట్ ఆశ్రయించిందట. మరి, ఆయన ఎందుకు నో చెప్పాడంటే.. ఆ విషయాన్ని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. 'దంగల్ను తమిళంలో, తెలుగులో డబ్ చేశాం. నేనే స్వయంగా రజనీ సర్‌ను అప్రోచ్ అయ్యాను. ఆయన సినిమా ఎంతగానో నచ్చింది. తమిళంలో సినిమాను డబ్ చేయడాన్ని ఆయన ప్రోత్సహించారు. అయితే, తమిళంలో నా పాత్రకు రజనీ సర్ డబ్బింగ్ చెప్పే విషయమై ఇద్దరం వివరంగా చర్చించాం. నా పాత్రకు రజనీ గొంతు అందిస్తే.. దానిని ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆయన చాలా పాపులర్. అంతేకాకుండా ఆయన గొంతు నాకు సరిపోదు. మేం ఇద్దరం ఇదే భావించాం. అయితే, సినిమా ఆయనకు ఎంతగానో నచ్చింది. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు' అని ఆమిర్ తెలిపారు. హర్యానా రెజ్లర్ మహవీర్‌సింగ్ ఫొగట్ పాత్రలో రెండు అవతారాల్లో ఆమిర్ ఈ సినిమాలో అలరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.