ఆమిర్‌ను ఢీకొంటున్న ప్రభాస్! | prabhas versus aamir khan | Sakshi
Sakshi News home page

ఆమిర్‌ను ఢీకొంటున్న ప్రభాస్!

Published Tue, Feb 9 2016 10:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

prabhas versus aamir khan

ముంబై: గతేడాది సల్మాన్‌ ఖాన్‌ను ఢీకొట్టిన ప్రభాస్ ఈసారి ఆమిర్‌ఖాన్‌తో అమీతుమీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభాస్ 'బాహుబలి-2', ఆమిర్ 'దంగల్' ఈ ఏడాది ఒకేసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. ఒకే సమయంలో ఇవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. జాతీయంగా, అంతర్జాతీయంగా రికార్డుస్థాయి కలెక్షన్లు కొల్లగొట్టిన 'బాహుబలి' సినిమాకు ఇది సీక్వెల్. 'పీకే' సినిమాతో అత్యధిక వసూళ్లు రాబట్టి.. జోరుమీద ఉన్న ఆమిర్ ఖాన్ కూడా 'దంగల్' సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రెజిలింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'బాహుబలి-2', 'దంగల్' విడుదల గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇవి ఒకే సమయంలో విడుదలైతే సినీ ప్రియులకు డబుల్ ధమాకే అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement