దటీజ్‌ ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ | Aamir Khan Dangal China Box Office Records | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 2:40 PM | Last Updated on Mon, Aug 13 2018 3:53 PM

Aamir Khan Dangal China Box Office Records - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ దంగల్‌ సినిమాతో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌పై వసూళ్ల దాడితో రికార్డులు క్రియేట్‌ చేసింది. కేవలం ఇండియాలోనే కాక చైనా మార్కెట్‌లో ఇండియన్‌ సినిమాలకు గుర్తింపును తీసుకొచ్చింది దంగల్‌ మూవీ.

చైనాలో దంగల్‌ సినిమా దాదాపు 1300కోట్ల కలెక్షన్లు సాధించింది. గత మూడు సంవత్సరాలుగా చైనాలో 8 ఇండియన్‌ సినిమాలు విడుదలవ్వగా.. అవి దాదాపు 2784కోట్ల కలెక్షన్లను సాధించాయి. వాటిలో కేవలం దంగల్ సినిమానే సగానికి పైగా వసూళ్లను రాబట్టింది. సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, బజరంగీ భాయిజాన్‌ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement