ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అందులో చిన్నప్పటి గీతా ఫోగట్‌గా నటించిన జైరా వసిమ్ అంతకంటే ఎక్కువ పాపులారిటీ సాధించింది. సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా మంచి అవకాశాలు సైతం ఆమె తలుపుతట్టాయి. వాటిన్నింటినీ కాదంటూ సినిమాలకి గుడ్‌బై చెప్పింది ఈ నటి.
అయితే రెండేళ్ల తర్వాత తాజాగా జైరా వసిమ్ మళ్లీ సోషల్ మీడియాలో అభిమానులను పలకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బుర్ఖాలో ఉన్న తన ఫోటో ఒకటి షేర్ చేసింది జైరా. పోస్ట్ చేసిన గంటలోనే ఈ పిక్‌కి 60వేలకి పైగా లైక్స్ వచ్చాయి.
అయితే తన విశ్వాసాలకి ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో, నెట్టింట్లో ఉన్న తన ఫోటోలన్నింటినీ తొలగించాలని ఫ్యాన్స్‌ని కోరింది. కాగా చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
చదవండి: కొడుకు కోసం మళ్లీ కలిసిన బాలీవుడ్ మాజీ జంట
Comments
Please login to add a commentAdd a comment