Dangal actress
-
త్వరలోనే అమీర్ ఖాన్ మూడో పెళ్లి? కూతురు వయసున్న ఆమెతో..
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టేసుకొని పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది. తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మరోసారి అమీర్ ఖాన్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి తోడు అమీర్ ఖాన్ త్వరలోనే దంగల్ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
హృతిక్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న బ్యూటీ
Sanya Malhotra Is Hrithik Roshan's New Neighbour: దీపావళి పండగకు తనకు తానే ఓ ఇంటిని గిఫ్ట్ ఇచ్చుకుందో బాలీవుడ్ భామ. ముంబైలో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది దంగల్ బ్యూటీ సన్య మల్హోత్రా. ఇది హీరో హృతిక్ రోషన్ ఇంటి పక్కనే ఉందట! పూర్తి వివరాల్లోకి వెళితే.. సన్య ముంబైలో జుహు ప్రాంతంలో నివసిస్తున్న సమీర్ భోజ్వానీ అనే వ్యక్తికి చెందిన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది జుహు- వెర్సోవా లింక్ రోడ్‌లోని బేవ్యూ బిల్డింగ్‌లో ఉంది. సన్య, సన్య తండ్రి సునీల్ కుమార్ మల్హోత్రా రూ.14.3 కోట్లు వెచ్చించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. గత నెల 14న ప్రాపర్టీ ఆమె పేరుకు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుస్తోంది. విశేషమేంటంటే గతేడాది హృతిక్ రోషన్ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇదే బిల్డింగ్‌లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. తాజాగా సన్యా కూడా ఈ భవంతిలోనే ఇల్లు కొనడంతో ఆమె హృతిక్‌కు పొరుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక దంగల్ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన సన్య తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు అందుకుంది. 'పటాకా', 'బదాయి హో', 'శకుంతల దేవి', 'లూడో', 'పగ్లైట్' వంటి పలు సినిమాల్లో నటించిన సన్య ప్రస్తుతం 'మీనాక్షి సుందరేశ్వర్' సినిమా చేస్తుంది. ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది. -
శృంగారం గురించి మాట్లాడాలంటే జనాలకి భయం: నటి
ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటించి యాక్ట్రెస్ సాన్యా మల్హోత్రా మంచి గుర్తింపు పొందింది. అనంతరం సినిమాలు, షోలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతోంది. ఈ బ్యూటీ తాజాగా ‘ససురల్ వండర్ ఫూల్’ అనే రొమాంటిక్ కామెడీ షోలో అషిమా అనే పాత్ర పోషిస్తోంది. ఇది అడిబుల్ ప్రసారమయ్యే ఓ పాడ్‌కాస్ట్. భారత్‌లో జనాలు శృంగారం గురించి మాట్లాడాలంటే భయపడతారని ఈ భామ తెలిపింది. షో గురించి ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ శృంగారమనే పదం భారత్‌లో నిషిద్ధం. కానీ ఇటీవల సినిమా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల వల్ల కొద్దిగా మార్పు వస్తోంది. అందుకే ‘ససురల్ వండర్ ఫూల్’ వంటి స్టోరీస్‌ని రూపొందించేందుకు క్రియేటర్స్ ముందుకు వస్తున్నార’ని తెలిపింది. సాన్యా తన షో గురించి మాట్లాడుతూ.. ‘ఇందులో నేను చేసే ‘అషిమా’ పాత్రకి శృంగారం అనే పదం వాడాలంటే ఇబ్బంది పడుతుంది. అలాంటిది తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లీనిక్ని నడుపుతుంటే.. ఆమె పరిస్థితి ఎంటానేది స్టోరీ’ అని చెప్పింది. మేం ఈ షోతో కొంత మందినైనా మార్చగలమని ఆశిస్తున్నామని తెలిపింది. దీని స్ఫూర్తితో కొందరైనా సరే ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడతారని అనకుంటున్నామని పేర్కొంది. చర్చిస్తారనుకుంటున్నాం. చదవండి: సినిమాలకి గుడ్ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్ మీడియాలో ‘దంగల్’ నటి -
సినిమాలకి గుడ్ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్ మీడియాలో ‘దంగల్’ నటి
ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అందులో చిన్నప్పటి గీతా ఫోగట్‌గా నటించిన జైరా వసిమ్ అంతకంటే ఎక్కువ పాపులారిటీ సాధించింది. సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా మంచి అవకాశాలు సైతం ఆమె తలుపుతట్టాయి. వాటిన్నింటినీ కాదంటూ సినిమాలకి గుడ్‌బై చెప్పింది ఈ నటి. అయితే రెండేళ్ల తర్వాత తాజాగా జైరా వసిమ్ మళ్లీ సోషల్ మీడియాలో అభిమానులను పలకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బుర్ఖాలో ఉన్న తన ఫోటో ఒకటి షేర్ చేసింది జైరా. పోస్ట్ చేసిన గంటలోనే ఈ పిక్కి 60వేలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే తన విశ్వాసాలకి ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో, నెట్టింట్లో ఉన్న తన ఫోటోలన్నింటినీ తొలగించాలని ఫ్యాన్స్‌ని కోరింది. కాగా చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చదవండి: కొడుకు కోసం మళ్లీ కలిసిన బాలీవుడ్ మాజీ జంట View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) -
ప్లీజ్, నా ఫొటోలు తీసేయండి: నటి విన్నపం
'దంగల్' సినిమాతో పదహారేళ్లకే ప్రేక్షకులకు దగ్గరైన నటి జైరా వసీమ్. అయితే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్లకే సినిమాలకు స్వస్తి పలుకుతూ గతేడాది అభిమానులకు షాకిచ్చారు. జాతీయ అవార్డు పొందిన జైరా చివరిసారిగా ప్రియాంక చోప్రా నటించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలో కనిపించారు. తాజాగా ఆమె మరోసారి అభిమానులకు షాకిచ్చారు. సోషల్ మీడియాలో తన ఫొటోలు తొలగించాలన్న నటి విన్నపంతో ఆమె అభిమానుల హృదయం మరోసారి ముక్కలైంది. (చదవండి: ఒకరి బాధకు మీరు కారణం కాకండి: బాలీవుడ్ హీరోయిన్) 'అందరికీ హాయ్!! నా మీద ప్రేమాభిమానాలు కురిపించి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరంతా నాకో సాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి నా ఫొటోలు తొలగించండి. అలాగే ఫ్యాన్ పేజీలకు కూడా ఇదే చెప్పండి. ఇంటర్నెట్ నుంచి నా ఫొటోలను తొలగించడం ఎలాగో అసాధ్యం. కాబట్టి ఇకపై నా ఫొటోలు ఏవీ షేర్ చేయకండి. అన్నింట్లో మద్దతుగా నిలిచిన మీరు ఈ విషయంలో కూడా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నా. మీరు చేసే సాయం వల్ల నాకు ప్రయోజనం దక్కుతుంది' అని జైరా వసీం అభ్యర్థించారు. 'తన ఫొటోలను వాడొద్దన్న విషయాన్ని ఏడాదిగా ఫ్యాన్ పేజీలకు చెప్తూ వస్తున్నానని, అయినా దాన్ని పట్టించుకోనివారు మరోసారి ఈ అభ్యర్థనను ఆలకించండి' అని చెప్పుకొచ్చారు. తరచూ వివాదాల్లో నిలిచే జైరా మే నెలలోనూ ట్రోలింగ్ బారిన పడ్డారు. మే నెలలో దేశంలోని పలు రాష్ట్రాలపై మిడతల దండు దాడి చేసింది. ఈ దాడిని సమర్థించేలా.. 'మానవ చర్యల పాపాల ఫలితమే మిడతల దాడి. వరదలు, ఇతరత్రా వాటికి కూడా మానవ చర్యల తప్పిదాలే అసలైన కారణం. ఖురాన్లో దీన్ని పేర్కొన్నట్లు'గా ఆమె పోస్ట్ పెట్టారు. దీంతో మతాన్ని ఉటంకిస్తూ కామెంట్లు చేయడం మీద నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోశారు. వెరసి.. ట్రోలింగ్ బెడద తట్టుకోలేక నటి ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తాత్కాలికంగా డిలీజ్ చేశారు. (చదవండి: ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను) -
మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులు: నటి ఆవేదన
ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా దంగల్‌లో నటించిన తరువాత ఈ సినిమా పేరు నటి ఫాతిమా సనా షేక్‌కు ఇంటి పేరుగా మారింది. బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన ఈ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు ఫాతిమా. ఇక ఈ నటి తన బాల్యం నుంచే యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. కాగా దంగల్ సినిమాలోని సహనటి సన్య మల్హోత్రాతో ఫతిమా డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. అనంతరం దీనిపై స్పందించిన ఫాతిమా తాము కేవలం మంచి స్నేహితులమని, తమ స్నేహాన్ని తప్పుగా భావించవద్దని కోరారు. తాజాగా ఈ నటి తన జీవితానికి సంబంధించి ఓ భయంకరమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనకు మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘నేను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపుల సమస్య చుట్టూ ఒక కళంకం ఉంది. అందుకే మహిళలు తమ జీవితాంతం ఈ గురించి బయటకు చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచం మారుతుందని ఆశిస్తున్నాను. చదువుకోవడం వల్ల లైంగిక వేధింపుల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రజలు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు’. అని చెప్పుకొచ్చారు. చదవండి: అభిమానులకు షాకిచ్చిన పున్నూ బేబీ అదే విధంగా తను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని వెల్లడించారు. సెక్స్ చేయడం ద్వారానే నాకు ఉద్యోగం లభించే ఏకైక మార్గం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. దానికి తను ఒప్పుకోకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు తన చేయి దాటి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా ప్రస్తుతం లుడో, సూరజ్ పే మంగల్ భరీ మూవీస్‌లో నటిస్తున్నారు. -
ప్రయోగాలకు సై
‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు సన్యా మల్హోత్రా. ఆ తర్వాత విశాల్ భరద్వాజ్ ‘పటాకా’ సినిమాతో హిట్ సాధించారు. కెరీర్లో ఎప్పుడూ ప్రయోగాలకు వెనుకాడను అంటున్నారు సన్యా. ‘‘నేను శిక్షణ తీసుకున్న ఆర్టిస్ట్‌ని కాదు. అందుకే చేసే ప్రతి పాత్ర కొత్తగా ఉండాలనుకుంటాను. అప్పుడే చాలెంజ్‌లు ఎదురవుతాయి, కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సినిమాకు ఇదే పద్ధతిని పాటిస్తున్నాను. ప్రయోగాలకు అస్సలు వెనుకాడను. ఒకే జానర్‌కి అంటూ ఆంక్షలు విధించుకోను’’ అన్నారు. సన్యా నటించిన ‘బదాయి హో’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
సెక్సీ పోస్టులు.. సీరియస్ వార్నింగ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌కు మరో సీరియస్ వార్నింగ్ వచ్చి పడింది. ఈ మధ్య తరచూ సెక్సీ పోస్టులతో విమర్శలు ఎదుర్కుంటూ ఆమె వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే ఈసారి సోషల్ మీడియాలో కాకుండా.. ఆమె నటిస్తున్న చిత్ర యూనిట్ నుంచే కావటం విశేషం. ఆమె ప్రస్తుతం అమీర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందొస్థాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అమీర్ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫాతిమా ట్రోలింగ్ ఎదుర్కుంటున్న నేపథ్యంలో మేకర్లు ఆమెకు గట్టి హెచ్చరికలు జారీ చేశారంట. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయొద్దని సూచించటంతోపాటు.. మరేయితర చిత్రానికి అంగీకారం తెలపొద్దని కూడా ఆమెకు చెప్పారంట. అయితే ఆమె వాటికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని తెలుస్తోంది. మిడ్ డే కథనం ప్రకారం ఆమె ఒప్పుకున్న రెండు చిత్రాల అడ్వాన్స్‌ను కూడా వెనక్కి ఇచ్చేసింది. దంగల్‌లో అమీర్ కూతురి పాత్ర గీతా ఫోగట్ రోల్లో మెప్పించిన సనా.. ఇప్పుడు థగ్ ఆఫ్ హిందుస్థాన్స్లో హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. అమితాబ్ బచ్చన్‌తోపాటు కత్రినా కైఫ్ కూడా ఇందులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో చిత్రం విడుదల కానుంది. -
దంగల్ నటికి బెదిరింపులు
న్యూఢిల్లీ : దంగల్ మేవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌కు కొద్దికాలంగా బెదిరింపులు వస్తున్నాయి. కొందరు పోకిరి వెధవలు.. ఏకంగా ఆమె ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అసభ్యకరంగా మెసేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పోస్ట్‌లకు ఫాతిమా కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. నాలుగైదు రోజులు కిందట సనా.. ఒక సెల్ఫీ తీసుకుని.. దానికి షేమ్‌లెస్ సెల్ఫీ అనే టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ ఫొటోపై విపరీతమైన, అభ్యంతరకర రీతిలో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కొందరైతే.. నీవు ధరించి దుస్తులు.. నీమీద గౌరవాన్ని తగ్గిస్తున్నాయని అంటే.. మరొకరు.. నువ్వు నిజంగా షేమ్‌లెస్ కాబట్టే ఇటువంటి ఫొటో పెట్టావు అని మరొకరు కామెంట్లు పెట్టారు. కాగా ఈ ఫొటోను ఇప్పటివరకూ 80 వేల మంది లైక్ కొట్టగా.. 1300 కామెంట్లు వచ్చాయి. గతంలో కూడా సనా ఇటువంటి ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. పలు విమర్శలు పాలైంది. Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘 A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Oct 8, 2017 at 7:49am PDT A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Jun 6, 2017 at 10:20pm PDT -
వివాదంలో దంగల్ నటి
‘దంగల్’ ఫేం ఫాతిమా సనా షేక్ ‘స్విమ్ సూట్’ వివాదంలో చిక్కుకుంది. చెయ్యకూడని పని చేశావంటూ నెటిజన్లు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె.. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా షూటింగ్ నిమిత్తం ద్వీపదేశం మాల్టాలో ఉంది. అక్కడి సముద్ర తీరంలో స్విమ్‌సూట్ ధరించి సనా ఓ ఫొటోషూట్ చేసింది. హీరోయిన్లు ఇలాంటి షూట్లు చేయడం సహజమే కానీ ఫాతిమా సనా ముస్లిం కావడం, అందులోనూ ఇది రంజాన్ మాసం కావడం వివాదానికి దారితీసిన అంశాలు. ‘ఇస్లాంను పాటించే నువ్వు(ఫాతిమా సనా) పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫొటోలు దిగి మమ్మల్ని బాధపెట్టావు. ఈ ఒక్క నెలైనా నువ్విలాంటి పని చేయకుండా ఉండాల్సింది’ అంటూ కొందరు ఆమెపై కామెంట్ల దాడిచేయగా, మరికొందరు మాత్రం ‘ఇందులో తప్పేముంది? నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉంది’అని సనాను సమర్థించే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై అటు సనాగానీ, ఇటు ‘ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ యూనిట్‌గానీ స్పందించలేదు. క్రేజీ ప్రాజెక్ట్ ఫాతిమా సనా షేక్ ప్రస్తుతం నటిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా ప్రఖ్యాత ‘కన్ఫెషన్ ఆఫ్ ఏ థగ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. దోపిడీదారులైన సయీద్ అమీర్ అలీ, అతని తండ్రి జీవితాల ఆధారంగా రచయిత ఫిలిప్ మిడోస్ 1839లో ఈ నవల రాశారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాలో అమితాబ, ఆమిర్‌లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. -
వివాదంలో చిక్కుకున్న ‘దంగల్’ నటి
-
వివాదంలో ‘దంగల్’ నటి
ముంబై: ‘దంగల్’ సినిమాలో నటించిన వసీం జైరా(16) వివాదంలో చిక్కుకుంది. కశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. జైరా వ్యాఖ్యలపై కశ్మీర్ వేర్పాటువాదులు మండిపడడంతో ఆమె క్షమాపణ చెప్పింది. ‘దంగల్’ సినిమాలో రెజ్లర్ గీత పొగట్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది జైరా. ఆమె సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్. జైరా తన తల్లిదండ్రులతో పాటు శనివారం కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీని కలిసింది. విద్యాభ్యాసం, కెరీర్, దంగల్ సినిమా షూటింగ్ అనుభవాలు ముఫ్తీతో పంచుకుంది. కశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని తర్వాత ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసింది. ఆమె వ్యాఖ్యలను వేర్పాటువాదులు తీవ్రంగా ఆక్షేపించారు. తన వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పింది. తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించివుంటే క్షమించాలని వేడుకుంది. తనను ఎవరూ ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘కశ్మీరీ యువతకు రోల్ మోడల్ గా నన్ను చూపించారు. నన్ను ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని స్పష్టం చెబుతున్నాను. రోల్ మోడల్ గా కూడా పెట్టుకోవద్దు. నేను 16 ఏళ్ల అమ్మాయిని. నా వయసును దృష్టిలో పెట్టుకుని నేను చేసిన వ్యాఖ్యలను చూడాల’ని జైరా కోరింది. కాగా, జైరాపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. 16 ఏళ్లతో అమ్మాయితో బలవంతంగా క్షమాపణ చెప్పించారని మండిపడ్డారు.