
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌కు మరో సీరియస్ వార్నింగ్ వచ్చి పడింది. ఈ మధ్య తరచూ సెక్సీ పోస్టులతో విమర్శలు ఎదుర్కుంటూ ఆమె వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే ఈసారి సోషల్ మీడియాలో కాకుండా.. ఆమె నటిస్తున్న చిత్ర యూనిట్ నుంచే కావటం విశేషం.
ఆమె ప్రస్తుతం అమీర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందొస్థాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అమీర్ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫాతిమా ట్రోలింగ్ ఎదుర్కుంటున్న నేపథ్యంలో మేకర్లు ఆమెకు గట్టి హెచ్చరికలు జారీ చేశారంట. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయొద్దని సూచించటంతోపాటు.. మరేయితర చిత్రానికి అంగీకారం తెలపొద్దని కూడా ఆమెకు చెప్పారంట.
అయితే ఆమె వాటికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని తెలుస్తోంది. మిడ్ డే కథనం ప్రకారం ఆమె ఒప్పుకున్న రెండు చిత్రాల అడ్వాన్స్‌ను కూడా వెనక్కి ఇచ్చేసింది. దంగల్‌లో అమీర్ కూతురి పాత్ర గీతా ఫోగట్ రోల్‌లో మెప్పించిన సనా.. ఇప్పుడు థగ్ ఆఫ్ హిందుస్థాన్స్‌లో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అమితాబ్ బచ్చన్‌తోపాటు కత్రినా కైఫ్ కూడా ఇందులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment