Thugs of Hindostan
-
ఆ ఫ్లాప్ సినిమాల్లో ఎందుకు నటించావ్?
‘జీరో’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రాల్లో హీరో పక్కన నటించిన మహ్మద్ జీషన్.. ఎప్పటికైనా ఓ లీడ్ రోల్లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. 2011లో ‘నో వన్ విల్ కిల్డ్ జెస్సిక’ సినిమా ద్వారా మహ్మద్ బాలీవుడ్లో అడుగుపెట్టారు. అటుపై ‘తను వెడ్స్ మను’, ‘రాయిస్’, మణికర్ణిక వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చారు. అయితే బాలీవుడ్‌లోషారూక్ ఖాన్, అమీర్ ఖాన్లు నటించిన బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలైన జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాల్లో నటించినా అవి తనకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని, దీనిపై తనను అందరూ ప్రశ్నిస్తుంటారని తెలిపారు. అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై చర్చిస్తూ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తనను ఇప్పటీకి కొంతమంది జీరొ, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలు ఎందుకు చేశావని అడుగుతుంటారని.. అయితే గెలుపోటములు జీవితంలో ఒక భాగమని అన్నారు. వైఫల్యాలు వచ్చినంత మాత్రాన ప్రయత్నం చేయడం మానోద్దని, తప్పుల నుంచి నేర్చుకుని గెలుపు వైపు పయనించాలని మహ్మద్ అన్నారు. ఎలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నానో అలాంటి పాత్రలే తనకు వస్తున్నాయని, నటనకి ప్రాధాన్యం ఉండే పాత్రలు మాత్రమే చేయలనుకుంటున్నానని అన్నాడు. ప్రస్తుతం అనుభవ్ సిన్హా డైరెక్షన్లో రాబోతోన్న ఆర్టికల్ 15 చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. -
‘వారికిప్పుడు పగ తీర్చుకునే అవకాశం దొరికింది’
చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు తన మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనని ఆమిర్ గతంలో వెల్లడించారు. తాను రూపొందించిన షార్ట్ ఫిల్మ్ రూబురూ రోషిణి షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు ఆమిర్. ఈ సందర్భంగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ పరాజయం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా విడుదలైన తర్వాత చాలా మంది సినిమా తమకు చాలా బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అయినా సినిమాల పరంగా ఫెయిల్ అయ్యి చాలా కాలమయ్యింది. నా మీద పగ తీర్చుకోవడానికి ప్రజలకు ఇప్పుడొక అవకాశం దొరికింది. వారి కోపాన్నంతా ఇలా చూపించార’ని చమత్కరించారు ఆమిర్. అంతేకాక ‘ప్రతి దర్శకుడు మంచి చిత్రం తీయాలనే భావిస్తాడు. కానీ సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు విజయం సాధిస్తాం.. కొన్ని సార్లు ఓడిపోతాం. దర్శకులు తప్పు చేస్తే.. నేను కూడా తప్పు చేసినట్లే. ఆ తప్పులనుంచి మేం ఎంతో నేర్చుకుంటాం. ప్రేక్షకులు నా పేరు చూసి సినిమా చూడ్డానికి వస్తారు. కాబట్టి ఒక సినిమా ఫెయిలైతే అది పూర్తిగా నా బాధ్యతే’ అన్నారు ఆమిర్ ఖాన్. -
కుర్ర హీరోల జోరు ఖాన్‌దాన్‌కి చుక్కెదురు
బాలీవుడ్ ఖాన్దాన్లో ముగ్గురు ఖాన్స్ (సల్మాన్, షారుక్, ఆమిర్) బాక్సాఫీస్‌ను కింగ్స్‌లా రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాదిలో ఎవరో ఒక ఖాన్ సినిమా మిస్‌ఫైర్ అయినా మిగతా ఇద్దరిలో ఎవరో ఒకరి గురి తప్పేది కాదు. కానీ ఈ ఏడాది ముగ్గురు ఖాన్స్ సినిమాలు ఢమాల్ అన్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా రాబట్టలేకపోవడం విశేషం. సల్మాన్ ‘రేస్ 3’, ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’, షారుక్ ‘జీరో’ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు అన్నింట్లో బాలీవుడ్ పెద్దది. మిగతా ఇండస్ట్రీలకు పెద్దన్నయ్యలాగా. రీజినల్ సినిమాలు... తమ్ముళ్లు, చెలెళ్లు. సంవత్సరం పూర్తయ్యాక ఇంట్లో పిల్లలందరి ప్రోగ్రెస్ కార్డులు నాన్నారు సమీక్షించినట్టు.. అన్ని ఇండస్ట్రీలు బాలీవుడ్‌తో పోల్చి చూసుకుంటుంటాయి. వాళ్ల సబ్జెక్ట్‌లు (స్క్రిప్ట్‌లు), వాళ్ల క్లాస్ రూమ్‌లు (థియేటర్స్, ఆడియన్స్) వేరైనా అంతిమంగా ఎవరెంత శాతం సక్సెస్ సాధించారన్నది ముఖ్యం. కానీ ఈ ఏడాది పెద్దన్నయ్య అనుకున్న రేంజ్లో పెర్ఫామ్ చేయలేదనే అనుకోవాలి. కొంత కాలంగా అన్ని ఇండస్ట్రీలకు కథలకు కొరత ఉందనే చెప్పాలి. బాలీవుడ్‌కు కథల కొరత సంభవించినప్పుడల్లా సౌత్ నుంచి కథలను అరువు తెచ్చుకుంటుంది. ఒకవేళ సౌత్ నుంచి ఏమీ లేకపోతే? అలా ఈ ఏడాది వాళ్లకు దొరికిన బంగారు గని ‘బయోపిక్స్’. సుమారు అరడజను బయోపిక్స్‌ను రిలీజ్ చేసింది బాలీవుడ్ ఈ ఏడాది. హార్డ్ హిట్టర్స్ అయిన సీనియర్ బ్యాట్స్మెన్లు (హీరోలు) అందరూ డబుల్, ట్రిపుల్ సెంచరీలు కొడతారనుకుంటే స్లిప్‌కి క్యాచ్ ఇచ్చి వెంటనే పెవీలియన్ చేరుకున్నారు. కానీ.. అండర్ 19 నుంచి ప్రమోషన్ మీద వచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ అందరూ రఫ్ ఆడించేయడమే ఈ ఏడాది బాలీవుడ్ స్పెషాలిటీ. సక్సెస్ కావాలంటే ఫార్ములానే అవసరం లేదు అని యంగ్‌స్టర్స్ తామందుకున్న రిజల్ట్‌తో నిరూపించారు. ఎవరు కొడితే ఏంటి? గ్యాలరీ (థియేటర్)లో ఉన్న ఆడియన్స్ పాప్‌కార్న్‌కు నంజుగా మంచి అనుభూతిని అందించామా? లేదా? అన్నదే కదా ముఖ్యం. ఈ ఏడాది బాలీవుడ్ ఎలా గడిచిందంటే... మన సౌత్ ఇండియన్ మార్కెట్లలో సినిమాల పండగ సంక్రాంతికి మొదలైతే బాలీవుడ్ వాళ్లకు రిపబ్లిక్ వీకెండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవ్వకముందే హిట్ సినిమాలేం వదులుతాములే అన్నట్టు రిపబ్లిక్ వీకెండ్ వరకూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ ఏడాదిని విక్రమ్ భట్ హారర్ చిత్రం ‘1921’తో మొదలుపెట్టారు. ప్రేక్షకులు దడుచుకోలేదు. ఏం ఫర్వాలేదు.. హారర్ పోతే పోయింది.. యాక్షన్, లవ్ సినిమాలున్నాయి కదా.. ఈ ఏడాదిని ధైర్యంగా దాటేయొచ్చు అనే దీమా బాక్సాఫీస్‌కి ఏర్పడింది. తర్వాత సైఫ్ అలీఖాన్ ‘కళాకండీ’, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘ముక్కాబాజ్’ సినిమాలు రిలీజయ్యాయి. ‘ముక్కాబాజ్’లో హీరో వినీత్ తన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే ప్రదర్శనైతే కనబరిచారు. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ మంచి హిట్ సాధించింది. 2018లో వచ్చిన ఫస్ట్ హిట్. చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకులన్నీ దాటి థియేటర్స్ వరకూ చేరుకోగలిగిందీ సినిమా. మంచి హిట్. 300 కోట్ల కలెక్షన్స్. పద్మావతిని దక్కించుకోవాలన్న ఖిల్జీ (రణ్వీర్) ప్రయత్నం విఫలమైంది. ‘పద్మావతి’ దక్కకపోయినా బాధపడకంటూ ఈ ఏడాది ఉన్న బెస్ట్ యాక్టర్ పురస్కారాలు రణ్‌వీర్‌ని సముదాయించాయి. అన్నట్లు.. సినిమాలో దక్కని దీపికా రియల్ లైఫ్‌లో రణ్‌వీర్‌కు దక్కారు. దీపికా పదుకోన్ సందేశానికి పట్టం ‘పద్మావత్’ రిలీజ్ రోజే రిలీజ్ కావల్సిన అక్షయ్ కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’ క్లాష్ వద్దు సింగిల్ రిలీజే ముద్దు అంటూ ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. తక్కువ ఖర్చుతో శానిటరీ న్యాప్కిన్ తయారు చేసిన అరుణాచలం మురుగనాథన్ ఆశయానికి ‘ప్యాడ్‌మ్యాన్’ ద్వారా స్క్రీన్ రూపమిచ్చారు దర్శకుడు బాల్కీ. సందేశాత్మక సినిమా అయినా కాసుల వర్షం కురిపించింది. డిజిటల్ మార్కెట్ రానుందని హింట్ ఇస్తూ ఆ తర్వాతి వారంలో విక్కీ కౌశల్ ‘లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్’ థియేటర్స్‌లో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై, మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌కు పెట్టింది పేరు నీరజ్ పాండే. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్, మనోజ్ బాజ్‌పాయ్‌లతో ముంబైలో జరిగిన ఓ స్కామ్ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘అయ్యారే’. థ్రిల్లర్‌తో వచ్చే చిక్కేంటంటే ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టకపోతే అసహనం అడగకుండానే వస్తుంది. ఈ సినిమాకి అలానే వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్ ‘సోనూ కీ టీటు కి స్వీటీ’. కమర్షియల్‌గా వంద కోట్లు చేసేసింది. ‘సాగర సంగమం’లో భంగిమ అంటూ కమల్ హాసన్‌ని ఇబ్బంది పెట్టిన బుడతడు పెరిగి పెద్దయి బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతూ తీసిన ‘వెల్కమ్ టు న్యూయార్క్’ ఫ్లాప్‌గా నిలిచింది. నిర్మాతగా మారిన అనుష్కా శర్మ తన మూడో ప్రయత్నంగా నిర్మించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ‘పరీ’. అనుష్క పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డా సినిమాకు ఎక్కువ మార్కులేయడంలో పిసినారితనం చూపించారు ప్రేక్షకులు, విమర్శకులూ. హాట్ చిత్రాల సిరీస్ ‘హేట్ స్టోరీ 4’ దారుణంగా మిస్‌ఫైర్ అయింది. ఇలియానాతో కలసి అజయ్ దేవగణ్ థియేటర్స్ మీద జరిపిన ‘రైడ్’ మంచి అనుభూతినిచ్చింది. కమర్షియల్‌గా బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత రాణీ ముఖర్జీ ‘హిచ్కీ’తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఎన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా మీరంటే అంతే పిచ్చి అని ‘హిచ్కీ’కి మంచి సక్సెస్ అందించారు. కేవలం ఇండియాలోనే కాకుండా చైనా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది ‘హిచ్కీ’. తెలుగులో హిట్ వస్తే చాలు క్షణం ఆలోచించకుండా రీమేక్ చేయాలనుకుంటారు టైగర్ ష్రాఫ్. మన అడవి శేష్ ‘క్షణం’కి గన్లు, యాక్షన్ సీన్లు భారీగా జోడించి ‘భాగీ 2’గా విడుదల చేశారు. డబ్బులొచ్చినా కూడా అనుకున్నని అభినందనలు రాలేదు. మళ్లీ ‘భాగీ 3’గా 2020లో వస్తున్నాను అని ఆల్రెడీ టైగర్ ష్రాఫ్ అనౌన్స్ చేశారు కూడా. ఈ పార్ట్ 3 కోసం ఏ తెలుగు సినిమాను ఎంపిక చేసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో మజా లేదు ఇర్ఫాన్‌ఖాన్ ‘బ్లాక్మెయిల్’ కామెడీకు బాగానే నవ్వుకున్నారు. మనోజ్ భాజ్‌పాయ్, టబుల ‘మిస్సింగ్’లో ఏదో మిస్సయిందన్నారు. సూజిత్ సర్కార్ తెరకెక్కించిన సున్నితమైన లవ్‌స్టోరీ ‘అక్టోబర్’. ఈ పరిమళం భలే ఉందే అంటూ మంచి హిట్ చేశారు ప్రేక్షకులు. వరుణ్ ధావన్ నటుడిగా ఒక మెట్టు ఎదిగారంటూ రాసుకొచ్చింది బాలీవుడ్ మీడియా. ‘బియాండ్ క్లౌడ్స్’ కొన్ని వర్గాల ఆడియన్స్‌కు మాత్రమే అనిపించుకుంది. సుధీర్ మిశ్రా ‘దాస్ దేవ్’ను ఫర్వాలేదన్నారు. సో.. మార్చి నెల పెద్ద మజా లేకుండానే ముగిసింది. టాప్‌లో సంజు తండ్రీకొడుకులుగా ‘102 నాటౌట్’లో అమితాబ్, రిషీ కపూర్ చేసిన హంగామా ఆకట్టుకుంది. జీవితం పట్ల నిరాశలో ఉన్న కొడుకుకి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పారు అమితాబ్. ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కు పరిగెట్టి మరీ నేర్చుకున్నారు ఈ పాఠాలు. ఈ ఏడాది బెస్ట్ చిత్రాల్లో ఒకటైన ‘రాజీ’ మే 11న రిలీజైంది. మేఘన్ గుల్జార్ తెరకెక్కించిన ఈ పాకిస్థాన్– ఇండియన్ స్పై డ్రామా విపరీతంగా ఆకట్టుకుంది. ఆలియా భట్ నటనకు బాక్సాఫీస్ వంద కోట్లు ఇవిగో అంటూ ఆమె ఒళ్లో పోసింది. ఇందాక మాట్లాడుకున్న విక్కీ కౌశల్ ఈ సినిమాలోనూ మెరిశాడు. జాన్ అబ్రహామ్ పేట్రియాటిక్ డ్రామా ‘పరమాణు’ సూపర్ హిట్‌గా నిలిచింది. న్యూ ఏజ్ సినిమా అంటూ కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్ చేసిన ప్రయత్నం ‘వీరే ది వెడ్డింగ్’ ఎక్కువ నెగటీవ్ ఫీడ్‌బ్యాక్‌నే అందించింది. ఫస్ట్ డే అనుహ్య కలెక్షన్స్ సాధించినప్పటికీ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. అక్క సోనమ్‌తో పాటు అదే రోజు తమ్ముడి హర్షవర్థన్ కపూర్ ‘బవేష్ జోషీ’ రిలీజైంది. పాజిటీవ్ రివ్యూస్‌ని పైసలుగా మార్చుకోవడంలో ఇబ్బంది పడింది ఈ సినిమా. హిందీలో రేస్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ మూడో పార్ట్‌ను సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు అనేసరికి ఫ్యాన్స్ ఆశలు, బాక్సాఫీస్ ఆకలినీ పెంచేసుకుంది. రెంటినీ తీర్చడంలో దారుణంగా విఫలమైంది ‘రేస్ 3’. ఆ తర్వాత మోస్ట్ వెయిటెడ్ బయోపిక్ ‘సంజు’ రిలీజైంది. సంజయ్ దత్లా రణ్‌బీర్ కపూర్ నటించి కాదు జీవించి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. రాజ్‌కుమార్ హిరాణీ సినిమా స్టైల్లోనే నవ్వులు పూయిస్తూ చివర్లో ముక్కులూ తుడిపించారు. సంజయ్‌కు క్లీన్ ఇమేజ్ తీసుకొచ్చే భాగమే ఈ బయోపిక్ అని కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. ఈ ఏడాది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లిస్ట్‌లో టాప్ స్థానం మాత్రం సంజుదే. తాప్సీకి రెండు విజయాలు స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మ’లో తాప్సీ పర్ఫార్మెన్స్ సూపరమ్మా అని కితాబులిచ్చారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పరిచయమైన చిత్రం ‘ధడక్’. మరాఠీ బ్లాక్‌బస్టర్ హిట్ ‘సైరాట్’ రీమేక్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. జాన్వీ నటన గురించి మంచి విషయాలే చెప్పారు ప్రేక్షకులు. సంజయ్ దత్ ‘సాహెబ్ బీవీ అవుర్ గ్యాంగ్‌స్టర్’ ఫ్లాప్. అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘ఫ్యాన్నీ ఖాన్’ మంచి ఫలితమే ఇచ్చింది. తాప్సీ, రిషీ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘ముల్క్’. విమర్శకులు అద్భుతంగా ప్రశంసించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి హిట్‌నే నమోదు చేసుకుంది. ఓ స్త్రీ మళ్లీ రా మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కర్వాన్’. ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పార్కర్లతో కలిసి దుల్కర్ చేసిన ఈ రోడ్ మూవీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. బాలీవుడ్‌కు మరో ఇంపార్టెంట్ వీక్ ఇండిపెండెన్స్ వీక్. అక్షయ్ కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహామ్ ‘సత్యమేవ జయతే’ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఫుట్‌బాల్ టీమ్ సాధించిన తొలి గోల్డ్ మెడల్ కథ ఇది అంటూ తెరకెక్కిన ‘గోల్డ్’ చిత్రం బాగానే ఆడింది. ‘దిల్ బర్’ సాంగ్‌తో స్పెషల్ క్రేజ్ సాధించిన ‘సత్యమేవ జయతే’ కూడా డీసెంట్‌గా రన్ అయింది. సోనాక్షి ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’, డియోల్స్ (సన్నీ, బాబీ, ధర్మేందర్) చేసిన కామెడీ ‘యమ్లా పగ్లా దీవానా’ ఫ్లాప్స్‌గా నిలిచిచాయి. ‘ఓ స్త్రీ రేపు రా’ అనే చిన్న వాక్యానికి సంబంధించిన హారర్ స్టోరీని మనం చాలా సార్లే విన్నాం. ఇప్పుడు ఇదే లైన్‌తో దర్శక ద్వయం రాజ్–డీకే రచించిన ‘స్త్రీ’ చిత్రం పెద్ద హిట్. సినిమా హాళ్లలో కిందా మీదా పడి మరీ నవ్వుతూ తెచ్చుకున్న పాప్‌కార్న్‌ను వొలికించేశారు ఆడియన్స్. ఈ ఏడాది వసూళ్లలో టాప్‌లో నిలిచిన చిత్రాల్లో ఇది ఒకటి. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ప్లాన్స్‌లో ఉన్నారు దర్శక–నిర్మాతలు. రీమేక్ కుదరలేదు ఇంతియాజ్ అలీ సమర్పణలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’ ఫర్వాలేదనిపించుకుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాల చుట్టూ డార్క్ సినిమాలు తెరకెక్కించే అనురాగ్ కశ్యప్ తొలిసారి రూపొందించిన లవ్‌స్టోరీ ‘మన్మర్జియా’. విక్కీ కౌశల్, తాప్సీ, అభిషేక్ పోటీపడి మరీ నటించారు. సూపర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ‘లవ్ సోనియ’, మిత్రోన్, బట్టీ గుల్ మీటర్ చాలు’ వచ్చినవి వచ్చినట్టుగా వెళ్లిపోయాయి. ‘పెళ్లి చూపులు’ రీమేక్‌గా రూపొందిన ‘మిత్రోన్’ రీమేక్‌ను చెడగొట్టారనే కామెంట్‌ను కూడా మూటగట్టుకుంది. రచయిత మంటో లైఫ్ ఆధారంగా నందితా దాస్ తెరకెక్కించిన చిత్రం ‘మంటో’. మంటోగా నవాజుద్ధిన్ సిద్ధిఖీ నటనకు డిస్టింక్షన్ మార్కులు పడ్డాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కాన్సెప్ట్‌తో వరుణ్, అనుష్కా శర్మ చేసిన చిత్రం ‘సూయి ధాగా’. శరత్ కాత్రియా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. పాకిస్థాన్, ఇండియా లాంటి అక్కాచెల్లెళ్లు అంటూ ఒకరంటే ఒకరికి పడని సిస్టర్స్ కథతో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ‘పటాకా’ యావరేజ్‌గా నిలిచింది. గుడ్డిగా డబ్బులిచ్చేశారు సల్మాన్ ఖాన్ తన బావమరిది ఆయుష్ శర్మను పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘లవ్యాత్రి’. నవరాత్రులు అయ్యేలోపు సినిమాను కూడా తీసేశారు. అదే రోజు రిలీజైన ఆయుష్మాన్ ఖురాన్ ‘అంధాధూన్’ వందకు వంద మార్కులు వేయించుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకి గుడ్డిగా డబ్బులిచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లర్‌ని చూడలేదన్నారు. హాలీవుడ్ లాంటి అసంబద్ధ థ్రిల్లర్లు, అర్థమయ్యేట్టు స్పూన్ ఫీడింగ్ కూడా చేయక్కర్లేదు అని హీరోను గుడ్డివాణ్ణి చేసి మరీ ఇంకా ఫార్ములా ఛట్రంలోనే కొట్టుమిట్టాడుతున్న కొందరి కళ్లైనా తెరిపించారు చిత్రదర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘కాజోల్ హెలీకాఫ్టర్ ఈల’ సరిగ్గా ఆడలేదు. హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్’ మంచి రివ్యూస్‌ని అందుకున్నా క్యాష్ చేసుకోలేకపోయింది. అర్జున్ కపూర్ ‘నమస్తే ఇంగ్లాండ్’ దారుణంగా విఫలమైంది. ఆల్రెడీ ‘అంధాధూన్’ వంటి సూపర్ హిట్‌తో ఫామ్‌లో ఉన్న ఆయుష్మాన్ ఖురానా ‘బదాయి హో (శుభాకాంక్షలు)’కు మరోసారి బదాయి హో అన్నారు ఆడియన్స్. నీనా గుప్తా, గజ్రాజ్ పాత్రలు పోషించిన తీరుకు మంచి రెస్పాన్స్ లభించింది. మళ్లీ ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ వరకూ చెప్పుకునే సినిమాలే రాలేదని చెప్పాలి. దొంగలు కొల్లగొట్టలేకపోయారు అమితాబచ్చన్, ఆమిర్‌ఖాన్ తొలిసారి కలసి రావడం, అదీ.. దొంగల్లా అనేసరికి ప్రేక్షకులంతా ఆమితానంద పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుందాం అనుకున్నారు. కానీ ఎందుకో ఈ థగ్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టుకోవడంలో తడబడ్డారు. సినిమా విపరీతంగా నిరాశపరిచింది. సన్నీ డియోల్ ‘మొహల్లా అస్సీ’ కూడా సరిగ్గా ఆడలేదు. రిషీ కపూర్ ‘రాజ్మా చావ్లా’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. చావ్లా రుచి బాగుంది అన్నారు ఆడియన్స్. మళ్లీ నిరాశ సైఫ్ అలీఖాన్ తనయ సారాని పరిచయం చేస్తూ అభిషేక్ కపూర్ తీసిన ‘కేధార్నాథ్’ నిరాశపరిచింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ ‘జీరో’ విడుదలైంది. ఎప్పుడో ‘అపూర్వ సహోదరులు’లో కమల్‌హాసన్ మరుగుజ్జు పాత్ర చేశారు. వీఎఫ్ఎక్స్ ద్వారా షారుక్ ఖాన్‌ను మరుగుజ్జును చేశారు దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్. ఈ మధ్య సరైన హిట్స్ ఇవ్వలేదు షారుక్. ఈసారి కచ్చితంగా హిట్ సాధిస్తాడని ఆశలు పెంచుకున్న అభిమానులకు చుక్కెదురైంది. ఈ ఏడాదికి ‘సింబా’తో గుడ్‌బై చెప్పారు రణ్వీర్ సింగ్. ‘టెంపర్’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్స్‌లో నడుస్తోంది. సినిమా ఫలితాల్ని ముందే పసిగట్టలేం. కానీ మంచి ఫలితాలు అందుకోవాలనే అందరూ శ్రమిస్తారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని కోరుకుందాం. 2017కన్నా 2018 బాగుంది. 2019 మరింత పసందుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. యంగ్ స్టార్స్‌దే హవా ఈ ఏడాది బాలీవుడ్ యంగస్టర్స్దే. విక్కీ కౌశల్ (లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్, రాజీ, సంజు), ఆయుష్మాన్ ఖురానా (అంధాధూన్, బదాయి హో), రాజ్‌కుమార్ రావ్ (స్త్రీ)లదే హవా. వీళ్ల సినిమాలు విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టాయి. ఖాన్‌లను కాదని మరీ ఈ యంగ్ హీరో సినిమాల టికెట్స్‌ను తెంపారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ల సినిమాలు ఎలా ఉన్నాయో. ఆయుష్మాన్ ఖురానా,రాజ్‌కుమార్ రావ్, విక్కీ కౌశల్ బిజినెస్ బావుంది! గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది బాలీవుడ్ బిజినెస్ 15 నుంచి 20 శాతం వరకూ పెరిగిందన్నారు ట్రేడ్ విశ్లేషకులు. 2017లో బాలీవుడ్ సినిమాల బిజినెస్ సుమారు 4,096 కోట్లు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 4,800 కోట్లకు చేరుకుంది. ముగ్గురి ఖాన్ల సినిమాలు రిలీజ్ అయినా కూడా కంటెంట్‌తో ఉన్న చిన్న సినిమాలే ఈ ఏడాది జాక్‌పాట్ అన్నారు. ‘సోనూకే టీటుకే స్వీటీ, స్త్రీ, అంధాధూన్, బదాయి హో’ వంటి చిన్న చిత్రాలు సర్ప్రైజ్ హిట్స్‌గా నిలిచాయి. కలెక్షన్స్‌లో ‘సంజు’ టాప్‌లో ఉన్నాడు. రణ్‌బీర్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమవకుండా ఈ ఏడాది స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కనిపించాయి. దీపికా పదుకోన్ (పద్మావత్), ఆలియా భట్ (రాజీ), రాణీ ముఖర్జీ (హిచ్కీ), తాప్సీ (ముల్క్, మన్మర్జియా), అనుష్కా శర్మ (సూయి ధాగా). అలాగే.. టబు (అంధాధూన్), నీనా గుప్తా (బదాయి హో) లాంటి పాత్రలన్నీ గుర్తుండటానికి కారణం గ్లామర్ మోతాదే కాకపోవడం విశేషం! ఆలియా భట్ ట్రెండేంటి? బయోపిక్స్‌తో పాటు ఈ ఏడాది కనిపించిన మరో ట్రెండ్ రీమిక్స్. పాత సూపర్ హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి సినిమాలకు క్రేజ్ తెచ్చుకోవాలనుకున్నారు. పాత పాట మ్యాజిక్ ఏ పాటా రిపీట్ చేయలేదన్నది మాత్రం వాస్తవం. అలాగే దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా పెళ్లిలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. – గౌతమ్ మల్లాది -
మంచి సినిమా చేయాలనుకున్నాం.. కానీ..!
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫలితం చిత్రయూనిట్‌కు గట్టి షాకే ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈసినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్ ఫాతిమా సనా షేక్ సాహసాలు, కత్రిన అందాలు కూడా సినిమాను కాపాడలేకపోయాయి. దీంతో చిత్రయూనిట్ కూడా సినిమా ఫ్లాప్ అన్న విషయం బహిరంగంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి ఫాతిమా సనా షేక్. ‘అవును.. నిజంగానే థగ్స్‌ఆఫ్ హిందుస్థాన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఫలితం తెలిసి గుండె పగిలినంత పనైంది. మేమంత ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని చాలా కష్టపడ్డాం. కానీ మా ప్రయత్నం ఫలించలేదు. ప్రేక్షకులకు మా సినిమా నచ్చలేదు’ అన్నారు. -
మహేష్ మల్టీప్లెక్స్ లాంచ్ మరింత ఆలస్యం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ సినిమాతో కలిసి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం మరింత ఆలస్యం కానుందట. ముందుగా ఈ థియేటర్స్‌ను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా రిలీజ్ రోజే ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే పనులు పూర్తి కాకపోవటంతో ప్రతిష్టాత్మక చిత్రం 2.ఓ రిలీజ్ సందర్భంగా నవంబర్ 29న ఓపెన్ చేయాలని భావించారు. కానీ ఇప్పటికీ లేజర్ స్క్రీనింగ్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభోత్సవం మరింత ఆలస్యం కానుందట. అధునాలతన సౌకర్యాలతో రూపొందించిన ఈ థియేటర్స్‌ను డిసెంబర్ 2న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నిర్వహకులు మాత్రం ఇంత వరకు ఓపెనింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. -
తప్పు నాదే, క్షమించండి: ఆమిర్ ఖాన్
బాలీవుడ్‌కు ఈ ఏడాది కచ్చితంగా గుర్తుండిపోతుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. బాహుబలి రికార్డులను వేటాడటానికి బరిలోకి దిగిన ఈ సినిమా.. పెట్టిన దాంట్లో కనీసం సగంవరకు కూడా రాబట్టలేక చతికిలబడిపోయింది. ఇంతటి పరాభవాన్ని ఆమిర్ మునుపెన్నడూ ఎదుర్కోలేదు. గత కొంతకాలంగా ఆమిర్ తన సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తుండగా.. ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రం పరాజయం కావడానికి తానే కారణమని, ఆ తప్పును తనమీదే వేసుకున్నాడు ఆమిర్ ఖాన్. అయితే ఏదైనా సినిమా ఫెయిల్ అయితే హీరోలు బయటకురావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆమిర్ మాత్రం అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకులను అలరించలేపోయినందుకు క్షమాపణలను కోరారు. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. ఈ ఆటలో గెలుపోటములు సహజమని ఆమిర్ తప్పక మళ్లీ తన స్టామినా ఏంటో చూపిస్తారనే నమ్మకం మాకుందని.. ఓటమిని ఒప్పుకోవడం చాలా కొద్దిమంది స్టార్స్లోనే చూశానని ఆమిర్‌కు ఎంతో ధైర్యం ఉందని.. అందుకే ఈ మూవీ ఫెయిల్యూర్‌ను తన భుజాన వేసుకున్నారని అన్నారు. Hits and flops are a part of the game... You win some, you lose some... Am sure, Aamir and YRF will bounce back with renewed vigour... #TOH is akin to a wake up call for everyone in the industry... Never take the audience for granted! — taran adarsh (@taran_adarsh) November 27, 2018 That moment when the audience delivers its verdict and the BO numbers start crumbling, I have seen the biggest of actors and film-makers break into a cold sweat... Fridays can make or break a film and change the fortunes - that’s the reality… #TOH — taran adarsh (@taran_adarsh) November 27, 2018 Very brave and courageous of Aamir Khan to admit #TOH is a failure and take the onus on himself... Very few people associated with a dud would accept that *on a public platform*... In the past, I have seen actors/filmmakers come up with hazaar excuses... — taran adarsh (@taran_adarsh) November 27, 2018 -
కొంచెం సంతోషం... కొంచెం బాధ
సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం ఆమిర్ ఖాన్ ఎలా అయినా మారిపోతారు. ‘పీకే’లో ఏలియన్లా, ‘దంగల్’లో మల్లయోధుడిగా.. ఇలా పాత్రకు అనుగుణంగా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. ఇప్పుడు రియల్‌గానూ అదే చేశారు. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారాయన. కొడుకు ఆజాద్ కోసం ‘ఆస్ట్రిక్ థీమ్’ పార్టీని అరేంజ్ చేసిన ఆమిర్ డిఫరెంట్ లుక్‌లో సందడి చేశారు. ఆ ఫొటోలను ఆమిర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన 300కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఈ విషయం గురించి ఆమిర్ మాట్లాడుతూ– ‘‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం ఫెయిల్యూర్‌కు బాధ్యత వహిస్తున్నాను. చాలా కష్టపడి చేశాం. కానీ ఎక్కువమంది ఆడియన్స్‌కు సినిమా నచ్చలేదు. ఎక్కడో తప్పు జరిగింది. ఏ తప్పు జరిగింది అనే విషయంపై పబ్లిక్‌లో మాట్లాడలేను’’ అని పేర్కొన్నారు. అటు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమిర్ ఖాన్, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ కలెక్షన్లతో బాధ పడ్డారనమాట. -
సినిమా డిజాస్టర్.. బయ్యర్ల ఆందోళన!
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మిష్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ లాంటి భారీ తారాగణంతో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ దీపావళికి విడుదలైన ఈ చిత్రం ఘోరపరాజయాన్ని చవిచూసింది. బాలీవుడ్ చరిత్రలో ఇలాంటి ఫెయిల్యూర్‌ను చూడాలేదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం హైబడ్జెట్ అంటూ సినిమాకు ఎక్కడ లేని హైప్‌ను తీసుకొచ్చారు మేకర్స్. దీనికి తోడు అమిర్, అమితాబ్, కత్రినా లాంటి స్టార్లు నటించేసరికి ఈ సినిమాపై అందరూ ఆశలు పెంచుకున్నారు. దాదాపు 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని అందరూ ఎగబడికొన్నారు. కానీ తీరా ఫలితం చూస్తే వారి గుండె పగిలేంత పనైంది. మొదటి రోజు ఓపెన్సింగ్ దృష్ట్యా రికార్డు క్రియేట్ చేసినా.. అసలు ఆట తరువాత మొదలైంది. రెండో రోజు నుంచి ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. వంద కోట్లు దాటడానికి వారం రోజులు పట్టింది. ఇప్పటికీ ఈ చిత్రం 150కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యజమానులకు లాభం కాదు కదా.. కొన్నదాంట్లో సగం కూడా వెనక్కివచ్చే పరిస్థితిలేదని వాపోతున్నారు. అయితే ఈ విషయంపై తమకు సహాయం చేయాలని యష్‌రాజ్ ఫిలిమ్స్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం. అమితాబ్, ఆమిర్‌లు కూడా ఈ విషయంలో కలగజేసుకుని సహాయం చేయాలని కోరారు. గతంలో కొందరు హీరోలు ఇలా తమ సినిమాలు ఊహించని పరాజయం ఎదురైనప్పుడు వారిని ఆదుకున్నారు. ‘జబ్ హ్యారి మెట్ సజల్’, ‘దిల్వాలే’ సినిమాల విషయంలో షారుఖ్ ఖాన్, ‘ట్యూబ్‌లైట్’ సమయంలో సల్మాన్ ఖాన్ ఆదుకున్నారు. ఇంత నష్టాల్లో ఈ సినిమాను నడిపించలేమంటూ థియేటర్స్ యజమానులు తేల్చిచెప్పారు. మరి ఈ విషయంలో నిర్మాతలు, హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఫ్లాప్ అన్న షారూఖ్
బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్లు కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులను అలరించలేకపోయింది. కథా కథనాలతో పాటు టేకింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ థగ్స్ టీంకు షాక్ ఇచ్చాడు. సాధారణంగా సినిమా టాక్ ఎలా ఉన్నా థియేటర్లలో ఉన్నన్ని రోజులు చిత్రయూనిట్ సినిమా ఫ్లాప్ విషయాన్ని అంగీకరించరు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ టీం కూడా ప్రస్తుతం కలెక్షన్లను చూపిస్తూ సినిమాను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన షారూఖ్‌కు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాకు వచ్చిన రిజల్ట్ కు సంబంధించి ప్రశ్న ఎదురైంది. వెంటనే షారూఖ్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫ్లాప్ అవ్వటం తనకు ఎంతో బాధకలిగించిందన్నాడు. అంతేకాదు ‘అమితాబ్, ఆమిర్‌లు చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సేవ చేస్తున్నారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన వారిని తక్కువ చేయలేం. గతంలో రావన్ సినిమా సమయంలో నాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నా అభిప్రాయం మాత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అద్భుతమైన చిత్రం, ఇలాంటి సినిమా ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో రాలేదు’ అన్నారు. షారూఖ్ థగ్స్ టీంకు మద్దతుగానే మాట్లాడినా అప్పుడే ఫ్లాప్ అని ప్రకటించటం చిత్రయూనిట్‌కు మింగుడు పడటం లేదు. -
ఆమిర్ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?
మిస్టర్ పర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా ఫేల్యూర్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయొచ్చని ఆశపడ్డ ఆమిర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో.. భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. సినిమా విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. కలెక్షన్లకు గండిపడింది. బాహబలి రికార్డులను తిరగరాయడం మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు 100 కోట్ల మార్కును మాత్రమే దాటిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత నాలుగు రోజులుగా ఈ సినిమా కలెక్షన్లు ఎంత దారుణంగా పడిపోయాయో వెల్లడించారు. (‘థగ్స్’కు అంత సీన్ లేదు..!) హిందీ పరిశ్రమ వసూళ్లు (కోట్లలో) : గురువారం- 50.75; శుక్రవారం- 28.25; శనివారం- 22.75; ఆదివారం- 17.25; సోమవారం- 5.50 మొత్తం : 124.50 కోట్లు తెలుగు+తమిళం వసూళ్లు (కోట్లలో) : గురువారం- 1.50 కోట్లు; శుక్రవారం- 1 కోటి; శనివారం-75 లక్షలు; ఆదివారం- 75 లక్షలు; సోమవారం- 50 లక్షలు మొత్తం : 4.5 కోట్లు ఇక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కథ, కథనం సీరియల్ తరహాలో సాగడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారని సినీ విమర్శకులు రివ్యూలు రాశారు. విమర్శకుల రివ్యూలు పక్కనబెడితే.. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై అభిమానులు చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ట్విటరటీలు చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్లు మీకోసం.. ఈ సినిమా మొదలైన 20 నిముషాల తర్వాత.. ఓ యువతి ‘నన్ను వెళ్లనీయండి ప్లీజ్.. నేను వెళ్లాలి’ అంటూ దీనంగా అర్థించే వీడియో ఒకరు పోస్టు చేయగా.. టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని మరొకరు ట్వీట్ చేశారు. సినిమా చూసొచ్చిన అభిమానులంతా కట్టగట్టుకుని బావిలో దూకే వీడియో పెట్టి మరొకరు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సినిమాకు షారుఖ్‌ఖాన్ తాజా మూవీ... ‘జీరో’ రేటింగ్ ఇస్తున్నామని ఇంకొకరు వ్యంగ్యాస్త్రం వేశారు. ఇంకోవైపు.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అద్భుతంగా ఉందనీ, ఆమిర్, అమితాబ్ నటనకు జేజేలు పలుకుతున్నారు కొందరు అభిమానులు. కాగా, విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, దంగల్ ఫేం.. ఫాతిమా సనా షేక్ నటించారు. -
‘థగ్స్’కు అంత సీన్ లేదు.. బాహుబలి రికార్డ్స్ సేఫ్
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ భారీ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. బాహుబలి సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇండియాలో ఆ సినిమా రికార్డ్ లను దాటే హిట్ ఇవ్వాలని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కలలు కంటున్నాడు. దంగల్ సినిమాతో వసూళ్ల విషయంలో బాహుబలిని దాటినా భారత మార్కెట్లో మాత్రం బాహుబలిని రికార్డ్లను దాటలేకపోయాడు. దీంతో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌తో బాహుబలి రికార్డ్లను బద్ధలు కొట్టొచ్చన్న ఆశతో ఉన్నాడు ఆమిర్. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. దీంతో బాహుబలి రికార్డ్‌లకు ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని కన్ఫామ్ అయిపోయింది. అయితే తొలి రోజు రికార్డ్ విషయంలో మాత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాహుబలిని దాటేసింది. ఈ సినిమా తొలి రోజు దాదాపు 52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. బాహుబలి 2 తొలి రోజు 40.73 కోట్ల వసూళ్లు సాధించింది. సినిమా టాక్‌తో డీలా పడిపోయినా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ టీంకు ఇది కాస్త ఊరట నిచ్చే వార్తే అని భావిస్తున్నారు విశ్లేషకులు. -
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మూవీ రివ్యూ
టైటిల్ : థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ జానర్ : అడ్వంచరస్ యాక్షన్ డ్రామా తారాగణం : అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ సంగీతం : అజయ్ అతుల్ నేపథ్య సంగీతం : జాన్ స్టువర్ట్ దర్శకత్వం : విజయ్ కృష్ణ ఆచార్య నిర్మాత : ఆదిత్య చోప్రా బాహుబలి సక్సెస్ తరువాత భారతీయ సినీ దర్శక నిర్మాతలు భారీ చిత్రాల మీద దృష్టి పెట్టారు. పీరియాడిక్, ఫాంటసీ డ్రామా తరహా కథలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. అదే బాటలో తెరకెక్కిన బాలీవుడ్ మల్టీస్టారర్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. తొలిసారిగా బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 1800ల కాలంలో భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఆజాద్, ఫిరంగీలు ఎలా ఎదుర్కొన్నారు అన్న కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాస్తుందన్న నమ్మకంతో ఉన్నారు బాలీవుడ్ సినీ జనాలు. మరి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌కి బాహుబలి రికార్డ్లను బద్దలు కొట్టే సత్తా ఉందా..? కథ : 1795 వర్తకం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటీష్ పాలకులు సంస్థానాలను, రాజ్యాలను ఆక్రమించుకుంటున్న సమయం. అప్పటికీ స్వతంత్రంగా ఉన్న రాజ్యం రోనక్‌పూర్. ఈ రాజ్యం పై బ్రిటీష్ అధికారి జాన్ క్లైవ్ కన్నుపడుతుంది. రోనక్‌పూర్ రాజు, కొడుకును బంధించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు క్లైవ్. తరువాత యువరాజుతో పాటు రాజు, రాణి కూడా చంపేస్తాడు. యువరాణి జఫీరా (ఫాతిమా సనా షేక్) మాత్రం రాజ్య రక్షకుడైన ఖుదాబక్ష్(అమితాబ్ బచ్చన్) సాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. రాజ్యం నుంచి వెళ్లిపోయిన ఖుదాబక్ష్, ఆజాద్ పేరుతో సైన్యాన్ని తయారు చేసి బ్రిటీష్ అధికారులపై తిరుగుబాటు చేస్తుంటాడు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆజాద్‌ను దోపిడీ దొంగగా ప్రకటిస్తుంది. బ్రిటీష్ పాలకులకు కొరకరాని కొయ్యగా మారిన ఖుదాబక్ష్ ను పట్టుకునేందుకు జిత్తులమారి ఫిరంగి(ఆమిర్ ఖాన్)ని నియమిస్తారు. మోసం చేయడం అలవాటైన ఫిరంగీ మంచి వాడిగా ఎలా మారాడు..? ఫిరంగీ, ఆజాద్‌ల సాయంతో జఫీరా తన రాజ్యాన్ని తిరిగి ఎలా సొంతం చేసుకుంది? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా ముఖ్యంగా అమితాబ్, ఆమిర్‌ల పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ మరోసారి తనదైన నటనతో మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. రిస్కీ స్టంట్స్‌లోనూ అంతే పర్ఫెక్షన్ చూపించాడు. సీనియర్ నటుడు అమితాబ్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బరువైన కాస్ట్యూమ్స్ ధరించి ఆయన చేసిన యాక్షన్ సీన్స్ అభిమానులను అలరిస్తాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా ఈ సినిమాతో యాక్షన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. పోరాట సన్నివేశాల్లో ఫాతిమా, ఆమిర్‌తో పోటి పడి నటించారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆమె నటన ఆకట్టుకుంటుంది. కత్రినా కైఫ్ కేవలం రెండు పాటలకు మాత్రమే పరిమితమైంది. రెండు పాటల్లోనూ కత్రిన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. విశ్లేషణ : ధూమ్ లాంటి అల్ట్రా మోడ్రన్ కథలను అందించిన విజయ్ కృష్ణ ఆచార్య ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి పీరియాడిక్ స్టోరి కూడా బాగానే తయారు చేసుకున్నాడు. కానీ కథనం విషయంలోనే కాస్త తడబడ్డాడు. భారీ తారగణం ఉన్నా సినిమాలో వేగం లోపించినట్టుగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ తప్ప మిగతా కథ అంతా సీరియల్ తరహాలో నెమ్మదిగా సాగుతుంది. పీరియాడిక్ డ్రామా అయినా పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అభిమానులను అలరిస్తాయి. ఫాంటసీ తరహా కథాంశం కావటంతో లాజిక్ల కోసం వెతకటం అనవసరం.భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. నేపథ్యం సంగీతం సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించటం కష్టమే. సినిమాటోగ్రఫి సూపర్బ్ అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: ఆమిర్, అమితాబ్‌ల నటన యాక్షన్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ దివాలీ గిఫ్ట్
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటింగ్ బాలీవుడ్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మరో మేకింగ్ వీడియో అభిమానులను కట్టి పడేస్తోంది. అమితాబ్- ఆమీర్‌ఖాన్- కత్రినా- ఫాతిమా కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను పలకరించనున్న తరుణంలో విడుదలైన ఈ వీడియో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నాలుగు నిమిషాల నిడివిగల మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్‌కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రకరకాల వీడియోలు సినీలవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తాజా వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ సినిమా టికెట్ల ధరలను దాదాపు 10శాతం పెంచేశారట. ఇది రణబీర్ కపూర్ నటించిన బయోపిక్ ‘సంజూ’ సినిమా టికెట్ల కంటే 10శాతం ఎక్కువట. అంటే సుమారు 300కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రాబడిని కేవలం 15రోజుల్లోనే రాబట్టాలని చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
పాత్ర కోసం కుట్లు
పాత్ర పరిపూర్ణత కోసం ఎంత దూరమైనా వెళ్తారు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్. అందుకే ఆయన్ను ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అంటుంటారు. ‘గజిని’ పాత్రకోసం గుండు చేయించుకోవడం, ‘దంగల్’ కోçసం బరువు పెరిగి, తగ్గిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆమిర్ తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’. ఈ సినిమాలో ఆయన ఫిరంగి అనే పాత్ర పోషించారు. పలు షేడ్స్ ఉన్న పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ కోసం ఆమిర్‌ఖాన్ నిజంగానే ముక్కు కుట్టించుకున్నారు. ‘‘ఈ పాత్ర అనుకుంటున్నప్పటి నుంచి ఈ పాత్రకు ముక్కు పుడక, చెవి పోగు ఉండాలి అనుకున్నాను. ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌లోనే ఉండాలనుకుంటాను. అప్పుడే ఆ పాత్రను సరిగ్గా చేయగలుగుతాను’’ అని పేర్కొన్నారు ఆమిర్. -
దీపావళి.. టాలీవుడ్‌కు అన్‌సీజన్
సాధారణంగా పండుగ సెలవులను టాలీవుడ్ ఇండస్ట్రీ మిస్ చేసుకోదు. అందుకే ఏ పండుగ వచ్చినా సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తుంది. కానీ ఒక్క దీపావళికి మాత్రం టాలీవుడ్లో పెద్దగా సందడి కనిపించదు. స్టార్ హీరోలెవరు ఈ సీజన్‌కు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించరు. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా దీపావళి బరిలో కనిపించటం లేదు. విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా సర్కార్, బాలీవుడ్ ప్రస్టీజియస్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లు తెలుగు లో రిలీజ్ అవుతున్న మన సినిమాలు లేకపోవటం వెలితే. నవంబర్ 2న రిలీజ్ అవుతున్న సవ్యసాచి ఒక్కటే ఈ ఏడాది దీపావళి సినిమా అనిపించుకోనుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ రాజా ది గ్రేట్ ఒక్కటే దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవటంతో పెద్దగా పోటి లేకపోవటంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో రాజా దిగ్రేట్ బాక్ల్ బస్టర్ సక్సెస్ సాదించింది. 2016లో దీపావళికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంతకు ముందు ఏడాది అక్కినేని యువ కథానాయుడు హీరోగా పరిచయం అయిన అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా డిజాస్టర్ టాక్‌తో నిరాశపరిచింది. అప్పుడే దసరా సెలవులు ముగించుకోని అందురూ బిజీ అవుతారన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ ఈ సీజన్ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం దీపావళి సందడి గట్టిగానే కనిపిస్తుంది. టాప్ స్టార్స్, భారీ చిత్రాలు ఈ సీజన్లో పోటి పడుతుంటాయి. -
‘ఆ విషయంలో ప్రభుదేవా నాకు చాలా సాయం చేశారు’
సాధరణంగా ఏదైనా డ్యాన్స్ చేసేటప్పుడు అది జాజ్ డ్యాన్సా, ఫోకా లేకా మరేదైనా అనే విషయం ముందే తెలుస్తుంది. కానీ ప్రభుదేవాతో డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం ఎంజాయ్ చేయడం తప్ప దానికి పేరు పెట్టలేం అంటున్నారు కత్రినా కైఫ్. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందోస్థాన్. ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం సురయ్యా టైటిల్‌తో ఉన్న పాట ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో కత్రినా డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేశారు. శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ కత్రినా చేసిన మూవ్మెంట్స్ అభిమానులను ఫిదా చేశాయి. అయితే ఈ క్రేడిట్ అంతా కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకే చేందుతుందంటున్నారు కత్రినా. ఈ పాట రిహార్సిల్స్‌లో భాగంగా తీసిన వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవాను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రభుదేవా స్టైల్‌ను నిర్వచించడం చాలా కష్టం. ఆయన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభుదేవా తన కొరియోగ్రఫీతో ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. నేను ఆయన అనుకునే స్టైల్లో డ్యాన్స్ చేయడానికి చాలా సహాయం చేశారు. కొన్ని సార్లు కోపంతో కన్నీళ్లు వచ్చాయి. కానీ చివరకూ చాలా ఎంజాయ్ చేశాం’ అంటూ కత్రినా వీడియోను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోను దాదాపు 19 లక్షల మందికిపైగా చూశారు. View this post on Instagram When I first saw the choreo for suraiyya, I was like is it jazz ,is it ballet, is it folk ,,, but that’s dancing with prabhudeva ... u cannot define his style it’s so unique ,he gives the song such a unique personality with his choreography. He spent a lot of time with me in rehearsals helping me figure the style , I loved it all (apart from a few moments of tears of frustration ☺️)but in the end it was the hook step which we had so much fun with . #ThugsOfHindostan @_aamirkhan | @ajayatulofficial | @vishaldadlani1 | @shreyaghoshal | #AmitabhBhattacharya | @prabhudheva | @yrf A post shared by Katrina Kaif (@katrinakaif) on Oct 25, 2018 at 10:14pm PDT -
పదేళ్లు ప్రాక్టీస్ చేసినా ఆమెలా డ్యాన్స్ చేయలేను
నేను పదేళ్లు ప్రాక్టీస్ చేసినా కత్రినాలా డ్యాన్స్ చేయలేనంటున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. వీరిద్దరు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందోస్థాన్. ఈ చిత్రంలో కత్రినా సురయ్యా అనే డ్యాన్సర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా నిన్న సురయ్యా టైటిల్‌తో ఉన్న పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో కత్రినా కైఫ్ మరోసారి తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ పాటలో కత్రినా చేసిన హిప్ మూవ్మెంట్ స్టెప్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ సైతం కత్రినా మీద ప్రశంసల వర్షం కురిపించారు. నేను పదేళ్లు ప్రాక్టీస్ చేసినా సురయ్యాలాగా డ్యాన్స్ చేయలేనని తెలిపారు. చిత్రంలో తమ ఇద్దరి మధ్య వచ్చే ఈ పాట తనకెంతో ఇష్టమని ఆమిర్ వెల్లడించారు. ఈ సాంగ్‌ని ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా కంపోజ్ చేశారు. ఈ స్టెప్స్ అన్ని చాలా కష్టం. కానీ కత్రినా వాటిని చాలా ఇష్టంగా, ఎంతో ఈజ్‌తో చేశారంటూ ప్రభుదేవా కూడా కత్రినాను మెచ్చుకున్నారు. స్టార్ రైటర్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం దీపావళి సందర్భంగా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మార్పుకి ముందడుగు
‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ నుంచి వికాస్‌ని తప్పిస్తున్నాం అని అమేజాన్ సంస్థ పేర్కొంది. అలాగే ‘స్టాండప్ కామెడీ’ టీమ్ ఏఐబీ మీద వచ్చిన ఆరోపణల వల్ల హాట్‌స్టార్ తమతో వాళ్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా తర్వాత దర్శకుడు సుభాష్ కపూర్‌తో కలసి ఆమిర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించే సరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమిర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఆ సారాంశం ఏంటంటే... ‘‘క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడానికి నటులుగా మేం ప్రయత్నిస్తుంటాం. మా నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను అస్సలు సహించకూడదనే పాలసీ ఉంది. అంతే సమానంగా తప్పుడు ఆరోపణలను కూడా ప్రోత్సహించం. మేం త్వరలో మొదలుపెట్టబోయే ఓ ప్రాజెక్ట్‌లో ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అని మాకు తెలిసింది. కేసు లీగల్‌గా నడుస్తున్నందు వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. పాత తప్పులన్నీ సరిచూసుకొని మార్పువైపు అడుగు వేయడానికి ఇదో ముందడుగు. చాలా ఏళ్లుగా స్త్రీలు లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇది ఆగాలి’’ అని ఆమిర్ భార్య కిరణ్ రావ్, ఆమిర్ పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి’ అని ఆయన పేర్కొన్నది సుభాష్ కపూర్ గురించే అని బాలీవుడ్ టాక్. -
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ట్రైలర్ లాంచ్
-
అదిరిపోయేలా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ట్రైలర్..!
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ట్రైలర్ వచ్చేసింది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కైత్రినా కైఫ్, ఫాతిమా సనా షైక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను విజయ్‌కృష్ణ ఆచార్య తెరకెక్కించారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను.. ప్రఖ్యాత ఫిల్మ్‌మేకర్ యశ్ చోప్రా జయంతి సందర్భంగా విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి యాక్షన్ ప్యాకెడ్ పిరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. 1795లో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరిట భారత్‌లోకి ప్రవేశించి.. ఆ తర్వాత అధికారం చెలాయించేందుకు తెగబడుతున్న నేపథ్యంలో ఆంగ్లేయులను ఒక థగ్స్ (బందీపోటు) ముఠా ఎలా ఎదుర్కొంది? అన్నది సినిమా ఇతివృత్తంగా కనిపిస్తుండగా.. థగ్స్ ముఠా అధిపతి ఆజాద్‌గా అమితాబ్.. థగ్స్‌ను దెబ్బతీసేందుకు బ్రిటిషర్లతో చేతులు కలిపి.. నమ్మకద్రోహం చేసే ఫిరంగిగా ఒకింత కామెడీ తరహా పాత్రలో ఆమిర్ కనిపించనున్నారు. యాక్షన్ స్టంట్స్‌తో ఫాతిమా ట్రైలర్లో కనిపించగా.. కత్రినా తన అందాలతో మెరుపులు మెరిపించింది. మొత్తానికి ట్రైలర్ అదిరిపోయేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లోనూ ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్లు ఇక్కడ చూడండి.. -
అమ్మమ్మ మీద ఒట్టు
‘‘నా పేరే ఫిరంగీ మల్హా. నా వంటి నిజాయతీ పరుడు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా దొరకడు. నిజం నా రెండో పేరు. నిజాయతీ నా పని తీరు. మా అమ్మమ్మ మీద ఒట్టు’’ అని తన పాత్ర విశేషాలు పంచుకున్నారు ఆమిర్ ఖాన్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. ఈ చిత్రంలోని ప్రతీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు చిత్రబృందం. సోమవారం ఆమిర్ ఖాన్ లుక్‌ను రిలీజ్ చేశారు. గాడిద మీద కూర్చొని, పచ్చని జాకెట్, ఎర్రటి కళ్లజోడు, టోపీతో విచిత్రమైన వేషధారణలో ఫిరంగీ పాత్రలో కనిపించనున్నారు ఆమిర్. ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 27న, సినిమా నవంబర్ 8న రిలీజ్ కానున్నాయి. -
‘నా కంటే మంచోడు ఈ భూమ్మీద దొరకడు’
మల్టిస్టారర్ సినిమాలు టాలీవుడ్లో మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. వరుస బెట్టి మల్టిస్టారర్లు తెరకెక్కుతున్నాయి. వీటన్నంటిలో రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రానికి ఇండియావైడ్ క్రేజ్ నెలకొంది. ఇక బాలీవుడ్లో ఇలాంటి భారీ మల్టిస్టారర్లకు కొదవే ఉండదు. అక్కడి స్టార్ హీరోలు తెరను పంచుకోవడానికి ఆసక్తి చూపడమే అందుకు కారణం. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి ఓ మల్టిస్టారర్ చిత్రానికి క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేస్తున్న మోషన్ పోస్టర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన ఆమీర్.. ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ‘నా పేరు ఫిరంగి మల్లాహ్. ఈ భూమిపై నాకంటే మంచి మనిషి మీకు ఎక్కడా కనిపించడు. నిజం నా మారు పేరు. నమ్మకం నా వృత్తి. దీదీ మీద ఒట్టు’ అని ట్వీట్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశాడు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్ ముఖ్య తారలుగా.. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ కానుంది. और इ हैँ हम, फिरंगी मल्लाह. हम से ज्यादा नेक इन्सान इस धरती पे कहीं नहीं मिलेगा आपको. सच्चाई तो हमरा दूसरा नाम है, और भरोसा हमरा काम. दादी कसम !!!https://t.co/GyIsrM2rNp#ThugsOfHindostan | @yrf | @TOHtheFilm | @SrBachchan | @fattysanashaikh | #KatrinaKaif — Aamir Khan (@aamir_khan) September 24, 2018 -
సురయ్యా.. ఆగయా
‘మల్లీశ్వరి, అల్లరి పిడుగు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్రంలో కీలక పాత్రలకు సంబంధించిన లుక్స్, మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం కత్రినా కైఫ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఈ పొడుగుకాళ్ల సుందరి సురయ్యా పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన అభిమానులు లుక్ అదుర్స్ అంటూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు. -
కెప్టెన్ ఖుదాబక్ష్
కెప్టెన్‌గా కొత్త అవతరాం ఎత్తారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. ఇందులో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని అమితాబ్ లుక్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. అలాగే అమితాబ్ ‘ఖుదాబక్ష్ ’ అనే క్యారెక్టర్లో నటిస్తున్నట్లు తెలిపారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సముద్ర దొంగల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఖుదాబక్ష్ కూడా అదేనండీ అమితాబ్ కూడా ఈ సినిమాలో ఓ షిప్ కెప్టెనే. ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ అనే నవల ఆధారంగాఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది. -
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మోషన్ పోస్టర్