
ముక్కు కుట్టించుకున్న స్టార్ హీరో!
సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్ ఏం చేసినా అందులో పరిపూర్ణత ఉంటుంది. అందుకే ఆయనకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని కీర్తిస్తుంది. తాజాగా ఆయన ముక్కును కుట్టించిన ఓ చక్కని పుడకను పెట్టుకున్నారు. సరికొత్త లుక్‌లో ఉన్న ఆయన తాజా ఫొటోను ‘ధోనీ’ హీరో సుశాంత్ రాజ్‌పుత్ షేర్ చేశారు. ఆయన ముక్కుపుడకను చేసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ జనాలు, అభిమానులు ఈ కొత్త లుక్ వెనుక మర్మమేమిటని ఆరా తీస్తున్నారు.
ఆమిర్‌ఖాన్ ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే ఆమిర్ ముక్కు కుట్టించుకున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రతి సినిమాలోనూ పాత్రపరంగా లీనమయ్యే ఆమిర్ తాజా లుక్‌తోనూ కొత్త సినిమాలో అదరగొడతారని అంటున్నారు. అయితే, ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ కోసమే ఆమిర్ ముక్కుపుడక పెట్టుకున్నారా? లేక వేరే కారణముందా తెలియాల్సి ఉంది.