
సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం ఆమిర్ ఖాన్ ఎలా అయినా మారిపోతారు. ‘పీకే’లో ఏలియన్‌లా, ‘దంగల్’లో మల్లయోధుడిగా.. ఇలా పాత్రకు అనుగుణంగా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. ఇప్పుడు రియల్‌గానూ అదే చేశారు. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారాయన. కొడుకు ఆజాద్ కోసం ‘ఆస్ట్రిక్ థీమ్’ పార్టీని అరేంజ్ చేసిన ఆమిర్ డిఫరెంట్ లుక్‌లో సందడి చేశారు. ఆ ఫొటోలను ఆమిర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే.
ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన 300కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఈ విషయం గురించి ఆమిర్ మాట్లాడుతూ– ‘‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం ఫెయిల్యూర్‌కు బాధ్యత వహిస్తున్నాను. చాలా కష్టపడి చేశాం. కానీ ఎక్కువమంది ఆడియన్స్‌కు సినిమా నచ్చలేదు. ఎక్కడో తప్పు జరిగింది. ఏ తప్పు జరిగింది అనే విషయంపై పబ్లిక్‌లో మాట్లాడలేను’’ అని పేర్కొన్నారు. అటు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమిర్ ఖాన్, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ కలెక్షన్లతో బాధ పడ్డారనమాట.